రాత్రి తొమ్మిదిన్నరకు V 6 ఛానెల్ లో వచ్చే 'తీన్మార్' వార్తలు చూడడం ఇప్పుడు నాకు అలవాటుగా మారింది. ఆ వార్తలు చదివే రచ్చ రాములమ్మ (అసలు పేరు రమ్య కృష్ణ) లాంటి వాక్సుద్ధి, ఎనర్జీ ఉన్న యాంకర్ ప్రస్తుతం ఏ ఛానెల్ లో లేరని నేను బల్ల గుద్ది మరీ చెప్పగలను. ఇలా కొత్త వాళ్లతో ప్రయోగాలు చేస్తున్నందుకు ఆ ఛానెల్ సూత్రధారి అంకం రవి గారిని అభినందించాలి. ఒక నాలుగు రోజుల కిందట 'తీన్మార్' వార్తల్లో మీడియా మీద ఒక బిట్ వచ్చింది. నాకు ఆ కాపీ నచ్చింది.
అంకం రవి గారి ఫోన్ నంబర్ సంపాదించి వారికి రెండు ఎస్ ఎం ఎస్ లు ఇచ్చాను ఒక సదుద్దేశంతో. మీడియా మీద రాసిన ఆ కాపీ పంపితే నేను బ్లాగులో పబ్లిష్ చేస్తా బ్రదర్... అని. రెండేళ్ళ కిందట కర్నూలులో విలేకరుల ల్యాండ్ డీలింగ్ పై నేనీ బ్లాగులో రాసినదానికి నొచ్చుకుని ఫోన్ చేసి సుదీర్ఘంగా మాట్లాడిన రవి గారు నా ఎస్ ఎం ఎస్ లకు స్పందించలేదు. అలా అందరి కాల్స్ కు, ఎస్ ఎం ఎస్ లకు స్పందిస్తే ఛానల్ హెడ్ ఎలా అవుతారులే... అని నేను అనుకుంటూ ఉండగానే...ఆదివారం రాత్రి ఆ బిట్ మళ్ళీ వచ్చింది. అది బాగుంది.
ఈ బిట్ లో మీడియా వాళ్ళ అతిని ఉతికి ఆరేసారు. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి సామెత వాడి...దంచుకున్నారు. ఒక కిడ్నాప్ కేసు, ఎం ఎల్ ఏ ఈలి నాని గారి అమ్మాయి ప్రేమ పెళ్లి ని నేపథ్యం గా చేసుకుని... కుటుంబ సమస్యలను ప్రపంచ సమస్యగా మీడియా ఎలా చిత్రీకరిస్తుందో చురకలు వేస్తూ వివరించారు. అదీ సంగతి. స్వీయ నియంత్రణ లేకపోయినా... స్వీయ విమర్శ అయినా చేసుకువాలి మీడియా.

7 comments:
ఆ ప్రోగ్రాం నేను కూడా చూసాను ,నిజం గా అలంటి జర్నలిస్ట్స్ తో పొలిస్తెయ్ కుక్కలు బెటర్ .
వ్యక్తిగత వ్యహరాల్లో తలదూర్చడం తప్పు అన్న కన్నేస స్పృహ కూడా లేని మీడియా చానల్స్ ని ఎం అనాలో ఎం చెయ్యాలో తెలియడం లేదు . కిడ్నాప్ లాంటి విషయల్ల్ని ప్రసారం చెయ్యడం కర్రెక్టేయ్.కాని అది కూడా ఎంత వరకు అనేది తెలియక పోవడం విచారకరం
కాని ఒక ఫ్యామిలీ మేటర్స్ ని పబ్లిక్ చెయ్యడుం జర్నలిస్ట్ చెయ్యాల్సిన పని కాదు ,వాలు సెలబ్రిటీ పొలిటికల్ పర్సన్ అయ్య్నంత్ర మాత్రాన అదీ పని గా వాళ్ళ కుటుంబ వ్యవహారాల్ని రచకీద్చడం తప్పు . టీ ఆర్ పీ రేటింగ్స్ కోసం ఇంత దిగ జరడుం దౌర్భాగ్యం. చిరు కవిత ల కూతురుల భాగోతం తెలుసుకున్నాక కూడా బుద్ధి తెచుకోక ,ఇంకా అదీ పని చెయ్యడం సిగ్గు చేటు .
ఇలాంటి విషయాలని అతిగా ప్రసారం చెస్తెయ్ విషం గా మారుతాయి .
Ramu garu,
Is it available in You Tube to view it? In Mumbai we do not get all the Telugu Channels.
చేప్తే ఓ అంతెత్తున లేస్తారు గాని తెలంగాణా గడ్డ కి నిజమైన శతృవు ఈ నిర్లక్ష్యవైఖరి ఇంకా,స్పందించడంలో (in a right time) సాచివేత వైఖరి అని చెప్పాలి.
Siva Ram Prasad Sir
Here is the youtube link
http://www.youtube.com/watch?v=-yi6ac3FsU4&playnext=1&list=PLqWR8kL7nAnVy4ZexYqsa8lYMUppCjzdv
Telugu channels are notorious for such meaningless and irrevelant coverages.Let them learn from TV18 CNN.Ee Telugu channellu yeppudu baagupadathayo devuda! Asalu baagu padey yogam vunda veellaku?
Chirag Ali jee,
Thank you for the information. I watched the "Teenmaar" and find it very crude.
Ramu garu, rachcha raamulamma thappa vere anchors ki vaaksuddhi, energy ledu ani anesaru... naalanti vaallu nochchukuntarandi...
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి