Friday, May 3, 2013

డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి జయంతి నేడు

తెలుగు జర్నలిజానికి అద్భుతమైన జర్నలిస్టులను అందించిన డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి జయంతి నేడు. 'ఈనాడు జర్నలిజం స్కూల్'  ప్రిన్సిపాల్ గా ఉన్న ఆయన దగ్గర కొన్ని నెలల పాటు మాత్రమే శిష్యరికం చేసినా జీవితంలో ఎన్నో అమూల్యమైన పాఠాలు నేర్చుకునే భాగ్యం దక్కింది నా లాంటి వాళ్లకు. జర్నలిజం మీద ప్రేమతో, గుండెల నిండా భయంతో రూరల్ ప్రాంతాల నుంచి వచ్చిన నా లాంటి అనామకులకు  ఆయన గుండె ధైర్యం ఇచ్చారు. బతుకు మీద భరోసా ఎలా తెచ్చుకోవాలో నేర్పారు... నాలుగు తెలుగు అక్షరాలతో పాటుగా. 



ఆయన ఎనభయ్యో జయంతి ని మేము గత ఏడాది ఇదే రోజున ఘనంగా నిర్వహించాం.  అప్పటి ఫోటోలు రెండు ఇక్కడ చూడవచ్చు.  కానీ... వివిధ కారణాల వల్ల ఈ సారి ఎలాంటి ప్రోగ్రాం నిర్వహించలేక పోయాము. గురూజీ... క్షమించండి. మీకిదే నా మౌన ప్రగాఢ శ్రద్ధాంజలి. 

4 comments:

Unknown said...

మనం మనం బరంపురం కదా

Unknown said...

మనం మనం బరంపురం అని నేను పంపించిన వ్యాఖ్యకు ఎందుకు ఆమోదం తెలుపలేదు సార్. ఒక కులం అంటే ద్వేషంతో మీరు ఎవైన రాయొచ్చుగాని, మీకుల పిచ్చి గురించి ఎవరైన రాస్తే వాటికి మీరు మాత్రం అమోదం తెలపరు. తమరు గొప్ప ప్రజాస్వామ్యవాది సార్.

Ramu S said...

కొత్తూరు గారు...
నేను ఒక పని మీద చెన్నై వచ్చాను ఒక నాలుగు రోజుల కిందట. మెయిల్ ఇప్పుడే ఓపెన్ చేసాను. మనం మనం బరంపురం అని రాసారు. ఎవరు ఏమిటో మీకు తెలిసినట్లు లేదు. మీ ఫోన్ నంబర్, అడ్రెస్స్ ఒక సారి రాయండి. మీకు పూర్తిగా వివరిస్తా. మీకు క్లారిటీ వస్తుంది.
రాము

Unknown said...

kotturu garu ee blog post pai comment chesthu meeru 'manam manam barampuram' ani raayadam lo aayana uddesam emito ardham kavadam ledu. Boodaraju brahmin, Ramu brahmin... ane uddesam tho aayana alaa raasi unte adi chaalaa ghoram.

Ramu garu, dayachesi ituvanti vyakthulni (aayana aa vuddesam tho raasi untene sumaa, ledante aayanni kshamaapana korutunna) bahishkarinchandi. Ilaanti dikkumaalina comments chadavaalsina dourbhagyaanni maaku kaliginchakandi.

Atleast Boodaraju gaari kosamaina...

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి