'ది హిందూ' హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ సుసర్ల నగేష్ కుమార్ గారి విషయంలో పోలీసుల తీరు ఏ మాత్రం బాగోలేదు. కోర్టు ఆర్డర్ తీసుకోకుండా తిప్పడం... ఇంటి మీదికి పోలీసులను పంపడం...నగేష్ గారి తల్లి గారిని గాబరా పెట్టడం మంచిది కాదు. కేసు పెట్టారు, కోర్టులో విషయం ఉంది కాబట్టి పోలీసు బాసులు కామ్ గా ఉంటే బాగుంటుంది. వ్యక్తిగత కక్ష సాధింపు దారుణం. ఇంతవరకూ.. పత్రికల మీద కేసులు పెట్టి, కోర్టులకు పోయి పెద్దగా సాధించింది ఏమీ లేదన్న నిస్పృహ నగేష్ విషయంలో పోలీసుల పరంగా కనిపిస్తున్నది.
ఇంకొక గమ్మత్తు ఏమిటంటే... నగేష్ గారి విషయంలో నా అనుమానం కరెక్టు అయ్యింది. నేను అనుమానించినట్లు ఇంతకూ ఆ వార్త రాసింది ఆయన కాదట. కానీ ఆయనే దాన్ని క్లియర్ చేసారట. అంటే తప్పులో పెద్ద భాగమే ఉన్నట్లు.
నేను నగేష్ గారి గురించి రాసిన పోస్టు చూసి పలువురు స్పందించారు. వార్త రాసే తీరు మాత్రం అది కాదని తామూ నమ్ముతున్నట్లు వాళ్ళు చెప్పారు. మారిన 'ది హిందూ' వైఖరి (అంటే టైమ్స్ లాగా సెన్సేషన్ గబ్బు లేపడం) ని పరిగణన లోకి తీసుకోకుండా పోస్టు రాసినందుకు ఒక సీనియర్ మిత్రుడు అభ్యంతరం తెలిపారు.
మొత్తం మీద రెండు రోజులుగా నగేష్ గారి ఫోటో చూసే భాగ్యం ఆంధ్ర ప్రజలకు కలిగింది. పోలీసుల ఓవర్ యాక్షన్, దానికి 'ది హిందూ' ఇస్తున్న విస్తృత ప్రచారం నగేష్ గారికి కచ్చితంగా మేలు కలిగిస్తుంది. ఆయనకు మేలు జరగాలని భగవంతుడ్ని ప్రార్ధించే వారిలో నేనూ ఉంటాను.
యాజమాన్యం తొత్తులుగా మారి సామాన్య జర్నలిస్టుల ఉద్యోగాలు పీకేసి వీధన పడేస్తున్న వీర ఎడిటర్లు, జర్నలిస్టు కష్టాలు పట్టని పైరవీ లీడర్లు కలిసి నగేష్ గారికి జరిగిన ఘోర అన్యాయానికి వ్యతిరేకంగా ఎలుగెత్తి అరవడం బాగుంది. అంత పెద్ద స్థాయి జర్నలిస్టుకు అంత అవమానం జరిగితే మాట్లాడకపోవడం నిజంగానే తప్పవుతుంది కదా!
నగేష్ గారి బాధితుల్లో ఒకరైన ఒక సీనియర్ జర్నలిస్టు, వారి సతీమణి కూడా నాతో ఫోన్ లో మాట్లాడారు. నగేష్ తమను, తమ కుటుంబాన్ని పెద్ద అభాండం వేసి చిత్రహింసలకు గురిచేసారని చెప్పారు. ఆ వివరాలు పరిశీలిస్తే నాకు నగేష్ గారి పట్ల ఉన్న వ్యక్తిగత అభిప్రాయం లో పెద్ద తప్పు లేదని తేలింది. అది వివరంగా రాద్దామంటే... ఇది సమయం, సందర్భం కాదని అనిపిస్తున్నది. కాదంటారా?
Note:పై ఫోటో లో బుర్ర గోక్కుంటున్న లాయర్ గారి కి కుడి వైపున కూర్చున్న వారే సుసర్ల నగేష్ కుమార్ గారు. ఈ ఫోటో కు సౌజన్యం 'ది హిందూ'
0 comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి