Thursday, October 31, 2013

మూత పడుతున్న జీ 24 గంటలు

గత ఏడాదే దాదాపు మూత పడే పరిస్థితికి వచ్చి బొత్స వారి వల్ల బతికి పోయిన  జీ 24 గంటలు తెలుగు ఛానెల్ తాజాగా మూత పడడానికి దాపు రంగం సిద్ధమయ్యింది. సుభాష్ చంద్రకు చెందిన జీ గ్రూప్ తో రెండేళ్ళ ఒప్పందం మీద బొత్స ఫామిలీ ఛానెల్ ను నడుపుతున్నది. ఉద్యోగులను తొలగించి, వినూత్నత్వం కోసం ప్రయత్నం చేసి.. అప్పటి డీ జీ పీ దినేష్ రెడ్డి మీద స్టోరీ ప్రసారం చేసి ఇరుక్కుని ఈ ఛానెల్  నానా రకాల తలనొప్పుల మధ్య ఉన్నది. డబ్బు పరంగా కూడా ఇబ్బందులు చుట్టు ముట్టాయని అంటున్నారు. 

ఈ నేపథ్యం లో ఉద్యోగులకు మూడు నెలల జీతాలు ఇచ్చి... దుకాణం బంద్ చేస్తారని చెబుతున్నారు. ఇదే జరిగితే... పలువురు జర్నలిస్టులు, టెక్నీషియన్లు, యాంకర్లు ఇబ్బంది పడతారు.  పాపం వారి పరిస్థితి ఊహిస్తే బాధగా ఉంది. తెలుగులో ఇన్ని ఛానెల్స్ ఉన్నాయి కానీ... ఎక్కడి కక్కడ ఎవరి సామ్రాజ్యం వారు నిర్మించుకున్నారు. ఇక్కడ నాణ్యమైన జర్నలిస్టుల కన్నా... కులపోళ్ళు, గులాం చేసే వాళ్ళకే పోజిషన్లు.. పెద్ద జీతాలు. 

ఇప్పుడు జీ 24 గంటలు నడుస్తున్న బిల్డింగ్ ఓనర్లకు కూడా జీ యాజమాన్యం మొన్నీ మధ్యన మూసేస్తున్న సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సరుకు, సరంజామా అన్నీ ఉన్న బిల్డింగ్ లో ఎవరైనా ఛానెల్ పెట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి... అలాంటి వాళ్ళు దొరుకుతారేమో అని బిల్డింగ్ ఓనర్లు కూడా వెతుకుతున్నారు. 
  

2 comments:

katta jayaprakash said...

According to the insiders some more channels might folllow ZEE news in AP.PERUGUTA VIRUGUTA KORAKE!
JP.

telugumedia said...

గతంలో ఉద్యోగులను నియమించుకొని వాళ్ళకు శాలరీస్ ఇవ్వకుండా మూడునెలలు గడిపి మళ్ళీ ఇప్పుడు సాక్షిపేపర్ లో ప్రకటన ఇచ్చారు...కనీసం చానల నిర్వహనకు డబ్బులు లేక ఫైనాన్సియర్స్ కోసం తిరుగుతున్నారు... ఇంతవరకు దొరకలేదు ఇప్పటికే ఉద్యోకుగులందరిని నియమించుకొని మళ్ళీ ఇప్పుడు పత్రికా ప్రకటన ఇచ్చారు .. పాత ఉద్యోగులను పెట్టుకుంటే శాలరి ఇవ్వాల్సి వస్తుందని మళ్ళో కొత్త నాటకం మొదలు పెట్టారు.. ..మీడియాలి జీ 24 గంటలు చానల్సే ముసివేసే పరిస్థితిలో మళ్ళీ ఏవరొ ఫైనాన్సియర్స్ ను తీసుకొచ్చి చానల్ మొదలు పెట్టి మద్యిలో మూసేయరని గ్యారెంటీ లేదు ఇప్పటికే నియమించుకున్న ఉద్యోగుల శాలరీస్ ఇవ్వకుండా మోసం చేసిన ఈ యాయమాన్యిం కొత్తగా నియమించుకొనే వారికి జీతాలు ఎలా చెల్లిస్తారు....మీడీయాలొ కాంపిటేషన్ పెరగడం లాబాలు రావనేది వాస్తవం మరి ఎవరి వద్దో డబ్బులు ఫైనాన్స్ తీసుకొని ఆ డబ్బులతో ఎలా చానల్ నడపగలరు..మద్యిలో చాల్ ఆగిపోతే వారి పరిస్థితి ఏంటి.. పాత ఉద్యోగస్తులకు కనీసం శాలరీస్ ఇవ్వకుండా కొత్తగా రిక్యుట్ మెంట్ డ్రామా మొదలు పెట్టారు ...కనీసం రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మళ్ళొ కొత్తగా ఉద్యోగస్తునలు చేర్చుకొని వాళ్ళకు ఏవిదంగా న్యాయంచేయగలరు కనీసం ఫొన్ బిల్లులు కట్టలేని పరిస్థితిల్లో ఉన్నా యాజమాన్యిం చానల్ ఎలా నడపగలదు . ఈ యాజమాన్యానికి కొందరు సంఘం నేతలుదగ్గరుంది ఫైనాన్స్ ఇప్పిస్తున్నారని దానికి యాజమాన్యిం కమీషన్ చెల్లిస్తామనడంతో సదరు నేతలు పెట్టుబడిదారులకోసం వెతికి చివరకు ఎవరి సహాయంతో చానల్ తీసుకు రావాలని చూస్తున్నారు ... అర్చన, AP9 లో చేరబోయే ఉద్యోగులు కాస్త ఆలోచించుకొండీ .. లేదంటే మీరు మళ్ళీ ఏదో రోజు రోడ్డూ మీదకు రావాల్సిందే