Thursday, March 18, 2010

సినిమాలు ఆడంది...అవి బాగోలేకనా? పైరసీ వల్లనా?

ఈ సినిమా అన్నయ్యలు ఉన్నట్టుండి పైరసీ మీద పడ్డారు. ఒకరేమిటి....చిరు, రాజశేఖర్, జీవిత, పరుచూరి, నాగార్జున, అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్...తదితరులంతా ఇప్పుడు పైరసీ మీద మండిపడుతున్నారు. 'పైరసీ భూతానికి' వ్యతిరేకంగా శుక్రవారం తెలుగు చలన చిత్ర పరిశ్రమ బంద్ చేస్తుందని ప్రకటించారు కూడా. 

ఒక్క హిట్టు కూడా లేని ఈ తరుణంలో ఈ సినీ జనం పైరసీ సమరం చేస్తున్నారేమిటి? ఇది ఫ్లాప్స్ ను కప్పిపుచ్చుకునే చచ్చు తెలివా? ఇంతకూ... వీళ్ళ సినిమాలు మూడు వారాలకు మించి ఆడకపోవడానికి కారణం పైరసీనా? నాణ్యతా లోపమా?  నాకైతే వీళ్ళు నానా హడావుడితో మనకు సినిమా కథ చెబుతున్నారనిపిస్తున్నది.

మొన్నామధ్య...ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తమ్మారెడ్డి భరద్వాజ చేసిన ప్రకటనతో చర్చ ప్రారంభించడం సముచితం. 'తారే జమీన్ పర్' లాంటి సినిమాలు తీసే మొగోళ్ళు మన తెలుగు చిత్ర పరిశ్రమలో లేరని ఆయన అన్నారు. అందులో ఈ భూమ్మీద పుట్టిన ఎవ్వడికీ అనుమానం ఉండాల్సిన పని లేదు. గత ఐదేళ్ళల్లో మన తెలుగు శూరులు తీసిన మంచి సినిమాలు ఒక ఐదింటి పేర్లు తడుముకోకుండా చెప్పండి. ట్రై చేయకండి, ఇది చాలా కష్టమైన ప్రశ్న. 

సముద్రం ఒడ్డు, బికినీలో అమ్మాయి, నడుము గిర్రుగిర్రున తిప్పడం, ద్వందార్ధపు బూతు డైలాగులు...హింస... లేని ఒక్క తెలుగు సినిమా చూపించండి. అందుకే తెలుగు సినిమాను మా అబ్రకదబ్ర మూడు మాటల్లో చెప్పాడు: "సముద్రపు ఒడ్డు...ముంబాయ్ భామ బొడ్డు...పోరంబోకుగా తిరిగే ఒక బడ్డు (అంటే చింపాంజీ మొహపు హీరో అన్నమాట)."

పైరసీ నిజానికి ప్రపంచ వ్యాప్త సమస్య. దానిపై పోరాడాలి గాని మనోళ్ళు ఇంత హడావుడి చేయాల్సిన పనిలేదు. ఒక పక్క ఇంగ్లిష్, హిందీ సినీ పరిశ్రమలు  ఏడాదికి కనీసం నాలుగైదు మంచి సినిమాలు తీస్తుంటే...మన 'బడ్లు' ఒకే కథను అటుతిప్పి, ముంబాయ్ భామతో తిప్పించి 'ఓహో...చిన్చేసాం' అని ఎవడి భుజం వాడు చరుచుకుంటున్నాడు. మూస కథ, మూస నటులు, మూస దర్శకులు. అంతా భావదారిద్ర్యం. ఇది నిజం కాదని....అక్కినేని, చిరు, రామానాయుడు తదితర సినిమా కుటుంబాలను గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పమనండి. 

ఒక్కడు వెళ్లి ఒక కత్తితో వంద మందిని ఇరుకైన ప్రదేశంలో ఎగిరెగిరి చంపుతాడు. అది గొప్ప సీనని వాళ్ళ అయ్య చెబుతాడు, ఓహో...'మగధీర' అని మనం చప్పట్లు కొట్టాలి. ఇంకొకడు...నువ్వు ఒప్పుకున్నా..లేకున్నా...నువ్వు ఎవ్వరని ప్రేమిస్తున్న...నేను నిన్నే ప్రేమిస్తా...ఫీల్ మై లవ్..అంటాడు. దాన్ని మనం పొగడాలి. మోహన్ బాబు కొడుకులు, రామానాయుడు కొడుకు, నాగార్జున మనమడు...అందరూ హీరోలే. 

పనికి మాలిన కథలు, దిక్కుమాలిన యాక్షన్. ఇవి సినిమా హాల్స్ లో ఆడడం లేదని...పైరసీ మీద ఏడుపు. ఆడలేక మద్దెలను దెప్పినట్లుంది. కమల హాసన్ సినిమాలు వస్తే టికెట్లు ఎందుకు దొరకవు సార్? రాష్ట్రంలో ధియేటర్స్ అన్నీ కొంత మంది చేతులలో ఉన్నాయని, ఇది చిన్న నిర్మాతలకు ఇబ్బందికరమని నటుడు-కం-కాంగ్రెస్ లీడర్ రాజా చెప్పిన కొన్ని రోజుల లోపే మనోళ్ళు పైరసీ మీద పడ్డారు. ఈ సినీ జనం సినిమాల మీద కాకుండా...రాజకీయాల మీద...తమ కులపోళ్ళ ప్రభుత్వం తేవడం మీద దృష్టి పెట్టబట్టి నాణ్యత చంకనాకిపోతున్నదని విశ్లేషకులు మొత్తుకుంటున్నారు కూడా.  


'త్రీ ఈడియట్స్' లాంటి కథను ఒక్కదాన్ని సృష్టించి...తీయమనండి మన తురుంఖాన్లను. నిజానికి ఈ 'వారస, వానర హీరో'ల వల్లనే మన రాష్ట్రంలో హిందీ సినిమాలు, డబ్ చేసిన ఇంగ్లిష్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. వాటికి లేని పైరసీ బెడద మీ తెలుగు సినిమాలకు ఎందుకొచ్చింది సార్?


మన తెలుగు సినిమా వాళ్ళు తెలివిగా ఒక పని చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి ప్లస్ ముంబాయ్ సుందరితో సినిమా తీస్తారు. కావాలని ఒక వివాదం అందులో ఉండేలా చేస్తారు. వివాదాలంటే పడిచచ్చే రవిప్రకాష్ మార్క్ టీ.వీ.వాళ్ళు ఈ సినిమా వాళ్ళను స్టూడియోలలో కూచోబెట్టి దాని మీద తెగ చర్చలు జరుపుతారు. లేకపోతే...హీరో, హీరోయిన్ (ఉదా: జగపతి బాబు, ప్రియమణి) లను రాసుకుపూసుకునేలా పక్కపక్క కూచోబెట్టి ఇంటర్ వ్యూ చేసి జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు.  'ఈనాడు' వంటి పేపర్లు కూడా సినిమా తాలూకు బూతు బొమ్మలు వేసి ప్రమోట్ చేసే పరిస్థితి. 

"మా మేధో హక్కును వాళ్ళు (పైరసీకార్లు) దొబ్బెస్తే ఎలా?" అని నోటికొచ్చింది మాట్లాడే తేజ అనే దర్శకుడు అమాయకంగా టీ.వీ.గొట్టాల ముందు అంటుంటే నవ్వు వచ్చింది. అరె అన్నయ్యా...మీ మేధో హక్కుతో మీరు సమాజాన్ని దొబ్బండి...పైరసీకార్లు వాళ్ళ అతి మేధోహక్కుతో మిమ్మల్ని బాగా..బాగా దొబ్బుతారు. Survival of the fittest అన్న మాట. 


ఈ మధ్య సినిమా వాళ్ళు...ఈ నీతి మాలిన టీ.వీ.యాజమాన్యాలను బుట్టలో వేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. సినిమా--టీ.వీ.పెద్దలు ఒకటై జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మంచి ఫిలిం రివ్యులు రాకపోవడానికి కారణం ఇదే. 'ఇండియా టుడే' లో ఆ రెంటాల జయదేవ వంటి వాళ్ళు రాసే సమీక్షలు తప్ప నిష్పాక్షిక సమీక్షలు మీకు కనిపిస్తే...చెప్పండి.

సినిమా ఆడకపోయినా...బాగా ఆడుతున్నట్లు జిల్లాల నుంచి రిపోర్టర్ లతో స్టోరీ చేయించి జనాలను దారుణంగా తప్పుదోవ పట్టిస్తున్నాయి...టీ.వీ.యాజమాన్యాలు. "అదుర్స్ సినిమా బాగా ఆడిందని స్టోరీ చేసి పంపమన్నారు. జనం లేకపోయినా...బాగా ఆడినట్లు చచ్చినట్లు స్టోరీ చేశా. రిపోర్టర్ లకు ఇలాంటి పనులు చెప్పడం గతంలో లేదు," అని ఒకానొక చౌదరి గారి చానెల్లో బతకలేక పనిచేస్తున్న ఒక విలేకరి చెప్పాడు.

కాబట్టి...సినీ పరిశ్రమ బాబులూ.... దొంగ మాటలొద్దు గానీ...మీరు పిలుపు ఇచ్చినట్లు..పరిశ్రమను ఒక వారానికి తగ్గకుండా మూసిపారేయ్యండి. ఇళ్ళలో కూర్చుని...రాగ ద్వేషాలు లేకుండా తప్పుల లిస్టు రాసుకోండి. మనోళ్ళను (అంటే...మీ కొడుకులు, బామ్మర్ది పిల్లలు గట్రా)...కొన్నిరోజులు ఇళ్లలోనే ఉండమని...రాష్ట్రంలో టాలెంట్ ఎక్కడ ఉందో చూడండి. 

మీకు భజన చేసే....తిక్క రచయితలకు రెస్టు ఇచ్చి...కొత్త రక్తాన్ని ప్రోత్సహించండి. కాసుల పిచ్చ మాని....కాస్తంత సృజనాత్మకంగా ప్లాన్ చేయండి. స్టార్డం కోసం కాకుండా....మంచి కథల కోసం తపన పడి వెతకండి. ఒక్క చాన్సివ్వండి...బైట జనానికి. పైరసీ ఉన్నా.....అప్పుడు గానీ ఆ మంచి సినిమాలకు హోస్ ఫుల్ కాదు. మిమ్మలను రక్షించేది నాణ్యతే. ఆల్ ది బెస్ట్. 

43 comments:

శ్రీరామ్ said...

రవి గారు,

నడుస్తున్న చరిత్రని వున్నది వున్నట్లు చెప్పారు. 'నటన ' మా వంశ రక్తం లొనే వున్నది, ' పుట్టుకతొనే మా అబ్బాయికి Dance చెయ్యడం వచ్హు ' అని పొసుకొలు కబుర్లు చెప్పే వాళ్ళ ముందు ఇలాంటి ఎన్ని 'శంఖారావాలు ' ఊదినా ఏమి ప్రయొజనం వుండదు.

వినొద రంగం లొ Alternatives తీసుకొని రాగలిగితే, సినిమాకి ఈ రంగానికి మీద వున్న పట్టు కాస్తన్న తగ్గుతున్నది. ఈ విషయంలొ టెలివిజన్ మాధ్యమం కూడా సినిమా కంటెంట్ వీలయినంత తగ్గించి చూపిస్తే జనాలకి మేలు చెసిన వాళ్ళవుతారు .

-శ్రీరాం.

KAMAL said...

మీరు చెప్పేది 100 % కరెక్ట్ . నాణ్యత అనేది కథలో నటనలో ఉండాలి అని వీళ్ళకు తెల్వనంత కాలం ఈ సినిమాలు ఇంతే.

KAMAL said...

మీరు చెప్పేది 100 % కరెక్ట్ . నాణ్యత అనేది కథలో నటనలో ఉండాలి అని వీళ్ళకు తెల్వనంత కాలం ఈ సినిమాలు ఇంతే.

అక్షర మోహనం said...

you are 100% correct..

Kathi Mahesh Kumar said...

పైరసీ ఒక సమస్య అనేది కాదనలేని నిజం. కానీ పైరసీవలనకన్నా పరిశ్రమ తమ ఒంటెద్దుపోకడల్లోంచీ నష్టపోతున్నదే ఎక్కువ. హిందీ చిత్రరంగం నుంచీ మనోళ్ళు నేర్చుకుంటున్నది సున్నా. ఎవరికి వాళ్ళు సిండికేటై ఎదుటోడి సినిమాల్ని దెబ్బతీసి తమ పబ్బంగడుపుకునే ఈ పరిశ్రమకు పైరసీకి వ్యతిరేకంగా పోరాడే నైతిక హక్కు ఉందా అనేది నాకు సందేమే.

Anonymous said...

some funny names about our news chanels spreading over internet...
tv9 = CRIME NEWS..TV CRIME
etv2= ONLY NEWS..
tv5 = NEWS..BUT NO GUARANTEE..
ntv = NEWS 50% FILMS 50%
inews=RUNNING TROUBLE (start ok)
sakshi=Y.S.R...ZINDAA'BAD'
mahaa =Oho! GOD..WHERE WE ARE?
hmtv = BETTER THAN DD
studio n = NEW TRACK...NO TRACK
abn = ALL SENSETIONAL BAD NEWS
zee-24 = AMMO..SOME THING IS HAPPENING IN THE WORLD

హరి said...

చాలా బాగా వ్రాసారు. తెలుగు సినిమాలలో ఈ పరిణామం నాగార్జున, వెంకటేష్ లతో ప్రారంభమైంది. వీళ్ళ సినిమాలలో తప్ప కుండా రెండు విదేశీ పాటలు, బొంబాయి భామలు, అంగాంగ ప్రదర్శన ఉండేవి. ఎలాగైతేనేం, తమ డబ్బు బలంతో వీళ్ళని పెద్ద హీరోలుగా మార్చారు వీరి తండ్రులు. ఇప్పుడు మిగతా వారు కూడా అదే బాట పడుతున్నారు, ఒకింత ఎక్కువ దోసుతో.

ముంబాయి వారు 3 idiots, my name is ఖాన్ వంటి సినిమాలతో సృజనాత్మకత, విలువలు పాటిస్తూనే హిట్లు కొడుతుంటే మనవారు మాత్రం డబ్బు మదంతో ఎలాగైనా తమ కుక్క మూతి పిందెలని project చేసుకోవడానికి నానా గడ్డి కరుస్తున్నారు.

అంగాంగ ప్రదర్శన, హింస మొదలైన వాటితో అనవసరమైన కంప్యూటర్ గాఫిక్సు కల గలిపి టాలెంటు లేక పోయినా తమ సంతానాన్ని ప్రొజెక్టు చేసు కోవడం, సినిమా హాల్లని, మీడియాని గుప్పిట్లో పెట్టుకొని ప్రజలను మభ్య పెట్టడం కరక్టైతే, వీటిని పైరేట్ చేయడం కూడా కరక్టే.

Anonymous said...


sir,
tv5 is manipulating TAM reports
please enquire about that.

Anonymous said...


Now Chamuru 5
TV5 Naidu launched Hair oil company in his TV studio. This oil is called new-gen and this Chittoor Naidu claims it will grow hair on the bald. Idea is good. When TV cannot make money you search for other resources. Despite the claims and huge publicity in his channel the users have complaints on this product. Instead of growing new hair they started loosing existing one.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

Agreed with you.

మీ శ్రేయోభిలాషి said...

చప్పట్లు..ఈలలు..మీ పొస్టు కు

Anonymous said...

తెలుగు వారెంత అభివృద్ది చెందినా వారి నర నరాల్లో భూస్వామ్య సంస్కృతి నిడి పోయినది. గత 25 సం|| నుంచి రెండు వర్గాల వారు పోటిపడి ప్రతిభకు విలువ లేకుండా, డబ్బె సర్వస్వం, డబ్బు ఉన్న వాడే గొప్ప వాడు, డబ్బు సంపాదించటమే కళలకు పరమావధి అని విర్ర వీగారు. అదే కాకుండా దానిని బాగా అమలు చేశారు. దెబ్బకు ప్రతిభ అనే పదం బూతుమాట అయింది. మెల్లగా ప్రతిభా వంతులు అందరు కనుమరుగయ్యారు. ఇప్పుడు తెలుగు వారి దగ్గర ఎంత డబ్బులు ఉన్నా తెలుగు ప్రజల కి నచ్చె విధం గా సినేమా తీసే ప్రతిభా వంతమైన దర్శకుడు చాలా తక్కువ మంది మాత్రమే. త్రివిక్రం శ్రీనివాస్ , గుణ శేఖర్ లాంటి వారు ఒకరో ఇద్దరో చివరికి మిగిలారు. మిగతా అందరు చెత్త సినేమాలు తీయటం లో పి.హెచ్.డి. లు చేస్తున్నారు. ఈ రంగం ఎంత తొందరగా మూల పడితె ఆంధ్రా వాళ్ళు అంత బాగు పడతారు.

budugu said...

అంతా బాగుంది కానీ ఈ సమ్మేదో నిరవధికంగా చేస్తే బాగుండు. దేశానికి పట్టిన దరిద్రం వదులుతుంది. ఒక్కరోజుతో ఆపడాన్ని నేను నిరసిస్తున్నాను. :)

Anonymous said...

very good and honest article. you are absolutely right.

Anonymous said...

DECREASE TICKET RATE ...! VALLA ISTAM VACCHI TALU TICKET RATES HIKE CHSTE ANTHE SANGATHULU........CINEMA LU KUDA EAM BAGUNYEE....COMPARE TO TAMIL MOVIES BETTER.......PEDDA PEDDA HEROS VALLA VALLA LABAM KOSAM CHUSUKUTUNNRU.......CHINNA CINEMA LA SANGTHI ENTI...AVI ADANIVVARU......

MULTIPLEX LO 150...........?MARI ANTHA.........

Anonymous said...

సినిమాల్లో చూపించే బూతు సరేనండీ బాబు, వీళ్ళు పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ మాట్లాడుతున్న భాష మరీ బూతు. నిన్న రాత్రి ఒక టి.వి. చానల్ షోలో డి. సురేష్ బాబు "వీళ్ళని ఏదో కేసు లొ తోసి బొక్కలో పెట్టాలి " అని ఉవాచించారు. వీళ్ళు కాస్త డీసెంట్ గా మాట్లాడడం నేర్చుకుంటే బాగుండును.

WitReal said...

i didnt understand the logic.

what is the logic in combining piracy issue with not having a successful/good movie?

isnt it even more worrying that a flop movie will get thrashed further by piracy problem?

if films are bombing, why cant the fimi ppl ask to curb piracy?

all the arm chair thninkers like katti & dornala know anything about the problem?

do they know who the target audience of TJP, 3I & MNIK? these movies made all their money in overseas & class A centers, where people prefer to go to multiplexes or buy original prints.

why cant all you armchair thinkers put together few lakhs and make a socially relevant successful movie like grahanam & 1940 oka gramam?? have guts??

why nobody is betting their money on K. Viswanath?

మన డబ్బులు కాకపొతే.... ఖబుర్లు బాగా చెప్తాం

Anonymous said...

ఊరుకోండి సార్.తమ్మరెడ్డిలానే మీరూ " త్రీ ఇడియట్స్ " తియ్యమనండి చూద్దాం అని సవాల్ విసురుతారేంటి. తీసినా తీసేస్తారు . నాగేస్రావు , నాగార్జున, నాగ చైతన్య ముగ్గురు నాగాల త్రి ఇడియట్స్ . అమ్మో మా వల్లకాదు

SADASIVARAO said...

manchi cinimalaku eppudu aadarana vuntundi. aslilanni chupite chustaru anukovatam vari telivi takkuvaku nidarsanam.ika pote madyataragati family varam diatre ki velli chudali ante tadichi mopedavutundi. anduke pairacy patla moju.evarikundadu thiatre lo chudalani .ardika paristitiki adjust avvatam tappa .viru enta morapettukunna pairacy control cheyyaleru hall karchulu reasanbul ite tappa.

Anonymous said...

Hi you are only looking at your angle like frog in the well. We have good movies in the recent past like Anand, Leader, Happy Days, Magadheera, Gamyam, Vinaayakudu, Anukokunda Oka Roju, Oka Vurilo, Grahanam, Missamma, Godavari etc. All these films are diverse and not followed the established formula of beaches, boddu and fights. Please dont be cynical. Because of the market size we may not be able to compare with Hindi and Tamil movies. But we dont have dearth for talent. Please discuss how to protect the talent available in the industry.

Kathi Mahesh Kumar said...

@WitReal: పైరసీ చట్టవ్యతిరేకం దాన్ని అరికట్టాల్సిందే. కానీ అరికట్టాలని అరుస్తున్న పరిశ్రమ ముందు తమలో పేరుకుపోయిన ఆధిపత్యధోరణిని పక్కనపెడితే సినిమాలలో మరింత్ సృజనాత్మకతకు స్థానం దక్కి హిట్లు వస్తాయనేది మాత్రమే నేను చెప్పదలుచుకున్నది.

చిత్రపరిశ్రమలోని సమస్యల గురించి నాకు అవగాహన ఉందనే అనుకుంటున్నాను.సమస్యకు మూలాలు ట్యాక్స్ సిస్టం నుంచీ శ్లాబ్ సిస్టం..అక్కడ్నించీ థియేటర్ రెంటల్ సిస్టంకొచ్చేసరికీ ఆరంభమయ్యాయి. కొందరు ఇండస్త్రీపెద్దల చేతుల్లోనే ఆంధ్రప్రదేశ్ లోని మెజారిటీ థియేటర్లు ఉండటంతో సినిమాల్లో వైవిధ్యానికి కొరత ఏర్పడింది. కొన్ని కుటుంబాల ఆధిపత్యమే చెల్లుబాటవుతోంది. ఇలాంటి monopoly పరిస్థితుల్లో పరిశ్రమ ఉన్నంతకాలం we will not have good films. ఓకవేళ వచ్చినా అవి తమిళోల్లు తియ్యాల్సిందేగానీ మనోళ్ళి కాదు.

I have guts and I don't need to prove that to you. But I will do what I can to make a difference for sure.

SADASIVARAO said...

పైరసీ సామాన్యుడీ పెన్నిది .దియేటర్ భారం మోసే పరిస్తితి సామాన్య కుటుంబాలకు లేదు.దీన్ని అరికట్టటం ప్రభుత్వం చేతుల్లోనే వుంది.మంచి సినిమాలకు ఎప్పటికి ఆదరణ వుంటుంది.

Ramu S said...

frog in the well అంటున్న సార్,

మీరు చెప్పిన సినిమాలు చాలా అద్భుతమైనవా? ఇవి ఒక మోస్తరు మంచి సినిమాలు ...ఒప్పుకుంటాను.
లవ్ ఒక్కటే థీం అనుకునే మీలాంటి వాళ్ళతో సమస్య. ఒక్క సారి..అమీర్ ఖాన్ హిట్స్ చూడండి. లవ్ కు తృతీయ ప్రాధాన్యం. 'మగధీర' ఒక తుక్కు స్టొరీ. సినిమా వాళ్ళు అడించిన సినిమాలు కూడా మీ లిస్టులో ఉన్నాయి.
టాలెంట్ పుష్కలంగా ఉంది సార్. వెతకండి.
రాము
Anand, Leader, Happy Days, Magadheera, Gamyam, Vinaayakudu, Anukokunda Oka Roju, Oka Vurilo, Grahanam, Missamma, Godavari

Vinay Datta said...

Definitely action has to be taken against piracy. But some people have taken to piracy because it is easy to make money this way. A stronger reason than this is that they donot have better jobs that give them hefty amounts. Dabbeveriki chedu?

Before thinking about piracy, the filmdom has to rethink on the quality of the stories, purity of the language, actors, importance and payments given to every actor and every person in the unit.Then comes the issue of the cost of the ticket.

We have ' settled ' down at a stage where a young man and young lady are focussed as ' hero and heroin '. The rest are a 'time pass group'.Moreover, the so called top actors are trained in dancing and fighting, leaving behind...acting. They are first exposed to the western culture. Once they grow up to become the 'lead', they attack the regional audience. ( It was heartening to read Ram Charan Teja say that his choice of music is melody because he learnt Carnatic music in his childhood. It is disheartening to find no traces of his interest in his movies.)There's nothing wrong in becoming Vaarasulu, provided the lads are properly trained and guided. At the same time other talented artists should also be encouraged.

I was shocked to read Nagarjuna's statement..." daarina poye daanayyatho evaru cinema theestaaru?" If producers and directors of the yester years thought the same way, his father wouldn't have got a foot hold in the filmdom.

Anonymous said...

1)' నాగేస్రావు , నాగార్జున, నాగ చైతన్య ముగ్గురు నాగాల త్రి ఇడియట్స్'-లలిత గారు.it is 'fun'tastic.

2)sadasiva rao garu : 'పైరసీ సామాన్యుడీ పెన్నిది .దియేటర్ భారం మోసే పరిస్తితి సామాన్య కుటుంబాలకు లేదు' మీరన్నది నిజం.

3)only sex and shah rukh khan sells in India.

4) the big heros are looting public money. first of all let them charge less.
5) amir khan కూడా వందలకోట్లు తీసుకుంటున్నాడు. వీల్లు చేసే ముండమోపి acting కు అంత డబ్బు ఎందుకు?

Anonymous said...

reducing the movie ticket rates is the only solution. we have to learn from the DVD industry and for that matter any industry that has been charging hefty when there was no competition. The hindi film industry was going gaga about the pirated DVDs being sold in the market. Moser Baer slashed down the prices of DVDs now people prefer to buy original DVDs than go for pirated ones.
Take the piracy in a positive way. Movies are produced according to the class of audience. Some produde movies for A class centres, some for B class and some for C class. Who has decided these classes. If you think it is the producers you are wrong it is the audience that decide that class. Likewise, some movies are produced for P(iracy) class. There is a audience that think that some movies are not worth watching in the theatre, spending hundreds of rupees and more than that, three hours of precious time. The general principle is that people watch movies in the theatres only if it meets their requirement in all aspects. I think only the movies directed by Shekar Kammula, Vishwanath, Shanker, etc,. can be watched in theatres, I still prefer to watch Tare Zameen Par in theatres than on small screen.
Its time we make movies exclusively for home viewing, all these small producers who complain about theatre screens being monopolised by G-3 (allu, daggubati, dil raju)should explore the business opportunity. Take cue from Village lo Vinayakudu, it is a good business model, the DVD of the film was released along with the movie. They made good money.

WitReal said...

@ ramu:
A person goes to a movie for his pleasure. if love theme can give a pleasure to a person, then what is the problem?? dont run behind ameerkhan for all solutions. Amirkhan came up with QSQK, Dil, Ishq, Dil chahta hai, and another 100 love stories. he didnt suddenly come from heaven.

Tammareddy is wrong in challenging tollywood with tarezameen. The audience are different...further a vasantha kokila & a swati mutyam were there in tollywood



@katti:

The discussion is on piracy.

1. Whatever you mentioned (aadhipatya dhorani etc..) are not a pre-requisite to ask for justice.

2. if you are taking about anything other than piracy, then we are not talking on the same plane.

3. your understanding of tax,slab,rental system & monopoly is pathetic and irrelavent to piracy.

isnt there 3 khan monopoly there in bollywood? what crap you are taking about "aadhipatyam"??

4. did you note the difference in the audience for those so called great movies and our telugu movies?

did you know that anand could not come onto screens because it was considered to be a A-center movie?

5. the only difference that you can do is to watch tamil movies and curse your own brethern in hyderabad.

@ SadasivaRao
0. Agreed that common man can not bear the ticket prices in multiplexes. so, he is encouraging piracy.

extend the same logic to all fronts of your life

with the current inflation, you can not buy any new home appliances. lets go and buy in chor bazar!!

ravichandrateja said...

మెదడులో ఆలోచనలని పేపర్ పై పరిగెత్తించే ముందు..కొన్ని క్షణాలు ఆలోచిస్తే ఇలాంటి టపా మీరు రాసేవారు కాదేమో!!
పైరసీ గురించి మొదలెట్టి తెలుగు సినిమా హీరోలని తిడుతున్నారు..
అప్పుడు మీరు వేరే hedding ని ఎంచుకొని ఉంటె బాగుండేది..



విమర్శించడమే మీ పాత్రికేయ విలువలకి నిలువుటద్దమా?
నలుగిరిని తిట్టడమే [chimpanji ]....!!mee పేస్ కూడా అద్దంలో చూసుకోండి అని ఎవరైనా అంటే..!
ఇక్కడ ఇంతకంటే చెప్పలేను..
మీకు సినిమా గురించి తెలుసోవాలి అని ఉంటె నాకు మెయిల్ చెయ్యండి..

WitReal said...

AP Govt responded on piracy.

despite all other thousand stinking issues of tollywood, piracy is a punishable crime.

రమణ / Ramana said...

పైరసీవల్ల నిర్మాతలకి కొంత నష్టం కలుగుతుండచ్చుకానీ దానివల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయనడం నిజంకాదు. పైరసీని పూర్తిగా నిర్మూలించడం చాలా కష్టం. హిందీ సినిమాలు థియేటర్ లో వచ్చిన కొద్ది రోజుల్లోనే డివిడి వస్తాయి, కానీ తెలుగు సినిమాలు డివిడి రావడానికి నెలలు పడుతుంది. సినిమాల రెవెన్యూ మోడల్ మారుతోంది, ప్రాఫిట్ మార్జిన్స్ తక్కువవుతాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడం దానికి అవసరమైన కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవడం లాంటి విషయాల మీద దృష్టిపెట్టకుండా పైరసీ మీదే 'పోరాటం' is crying over spilled milk.

Ramu S said...

రవిచంద్ర తేజ గారూ..
ఒకటి) మీరు టపాను, పేరాల మధ్య ముడిని సరిగా అర్ధం చేసుకోలేదు.
రెండు) విమర్శించడం గురించి మీ వ్యాఖ్య తప్పు
మూడు) చింపాంజీ అనే మాట ఉపసంహరించుకోనైనది
నాలుగు) సినిమాల గురించి తెలుసుకోవాలని నాకు అనిపించడం లేదు. థాంక్స్
రాము

Anonymous said...

It is true that piracy an quality of Telugu films are two different issues.A producer investing crores of rupees expects atleast his capital investment either with interest or without.There is aracket of piracy the theatres are not getting good returns as most of the people visit theatre if it is a very good film which can be enjoyed only in the thetres.Thus our citizens are trsting the quality of the films through initial filtration by viewing the piracy cassettes and CDs and if feels good about the film then they go to theatre.In the past most of the fil goers visit theatre on the first day irrespective of the quality of the film and thus filling the theatres seats atleast for the first week and get into mouth publicity .As
there are pirated cassettes and
CDs in these days most of the people are not entering the theatre during the first week as they want to examine it to grage it for visiting the theatre.
Any duplicate thing in any proffession is a crime and the government has to take action against it.There are many duplicates,frauds and bogus elements in every proffession which areaffecting the originals.
Regarding the quality of the Telugu films every producer's main aim and purpose is to earn money through the proffession of movies
and wants to get double or trible returns and only a few selected people sacrifice every thing for art like Vishwanath,KS Reddy(MALLEMALA)but where are they?The big producers belonging to a certain caste with introducing their sons,sons in law,cousins etc who could not prove their academic career in their college life with good record and they are testing their future life in films with the money and power their fathers,uncles etc.But the daughters of these big bosses of the film industry are not allowqed into the studios as actors as they become victims of the culture of the film industry like wine,women and wealth and the big bosses of the film industry donot like to see their daughters spending nights with others for the sake of film opportunities and their future bright prospects.
The non AP actresses imported from the other states never speak Telugu in their interviews and speak fluent English which most of our common peole never feel homely and get irritated at the.But our producers cash on them at the cost of Telugu language and culture.Because it is all money power.
Please donot mix up two issues as done in the case of piracy and quality of films.

JP.

సుజాత వేల్పూరి said...

పైరసీ గోలేమో కానీ బాబ్బాబూ, ఎవరన్నా ఈ బలవంతపు వారసుల గోల వదిలించండి ఏదో ఒకటి చేసి! వీళ్ళలో ఒక్కొక్కడికీ నట శూన్య బిరుదివ్వొచ్చు!

బుడుగు గారూ, అన్ని ఆశలుపెట్టుకోకండి..ఆ ఒక్కరోజూ కూడా వద్దనుకున్నారట. ఇప్పుడే చూశా న్యూసులో! :-))

Ramu S said...

జే.పీ.గారూ..
నాణ్యత లేని సినిమాలు తీసి అవి ఆడక పోవడంతో...మార్కెట్లో తమ రేటును, పరువును కాపాడుకునేందుకు ఈ పైరసీ అనే గొడవను ప్రముఖంగా ముందుకు తెస్తున్నారని అనుమానం. ఎన్నడూ లేని విధంగా హిందీ, ఇంగ్లిష్ సినిమాలు మెగా హిట్ అయి, తెలుగు సినిమాలు దెబ్బతినడంతో ఒక గ్రూప్ ఆఫ్ నిర్మాతలు ఈ హంగామా చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అందుకే నాణ్యమైన సినిమాలు తీసివుంటే...ఈ పరిస్థితి వచ్చేది కాదని..

రాము

పానీపూరి123 said...

ఇంకా నయ్యం, ఇండియాలో పైరసి కి భూతమైన CD/DVD లు బ్యాన్ చెయ్యమని అడగడంలేదు

Anonymous said...

Chaaaki revu... baaga pettav... sodaraa..

Mee ee blog post ki samaadhaanam cheppe ee vvarasatwapu ciee jeevulu evaranna vunnara? Kallu bairlu kammmi vuntaayi vaalla ku tamari maatala tho

Anonymous said...

పైరసీ సమస్యకీ, థియేటర్ల మీద కొద్దిమంది గుత్తాధిపత్యానికీ, నటవారసత్వాలకీ, టికెట్ రేట్ల పెరుగుదలకీ, తెలుగు సినిమాల నాణ్యతాప్రమాణాలు పడిపోవడానికీ మధ్య చాలా చాలా సంబంధం ఉంది. తప్పనిసరిగా సంబంధం ఉంది. అందరికీ అది గ్రహించేటంత మేధాశక్తి లేకపోయినా ! దీని గురించి చాలా కాలం క్రితమే ఒక తెలుగు బ్లాగర్ రాసారు. ఈ కింది లంకెలు ఒకసారి చూడండి.

http://www.tadepally.com/2007/10/blog-post_29.html

http://www.tadepally.com/2007/10/blog-post_2253.html

http://www.tadepally.com/2007/10/blog-post_31.html

http://www.tadepally.com/2007/11/blog-post.html

http://www.tadepally.com/2007/11/blog-post_02.html

http://www.tadepally.com/2007/11/blog-post_09.html

http://www.tadepally.com/2007/11/blog-post_825.html

Ramu S said...

ఈ లింకులు అన్నీ అందించి మంచి రాతతో మా కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసిన మిత్రుడికి ప్రత్యేక అభినందనలు. గుడ్ వర్క్
రాము

Ramu S said...

ఎవరండీ ఈ తాడేపల్లి డాట్ కం. యెంత అద్భుతంగా రాస్తున్నారు. ఈ పైన పేర్కొన్న పోస్టులు చదివితే ప్రాణంలేచి వచ్చింది. ఆయనను కాంటాక్ట్ చేసే మార్గం చెప్పగలరా? ఆయన సైట్ లో ట్రై చేశా కానీ కుదరలేదు.
రాము

Anonymous said...

"తాడేపల్లి T.L. Bala Subrahmanyam" ,

Ramu S said...

దయచేసి బాల సుబ్రహ్మణ్యం గారి కాంటాక్ట్ వివరాలు (మెయిల్ లేదా ఫోన్) ఇవ్వగలరా? మీ స్పందనకు థాంక్స్.
రాము

Vinay Datta said...

@ JP:
There is definitely link between piracy and quality of a film. Unlike the yester years, we have n options for entertainment today. People find it comfortable to get a CD, watch it, throw it away if they don't like it.
I donot watch pirated movies. I went to the theatre to watch JodhaAkbar for its scenic beauty, palaces, wonderful outdoors. I was also interested in Taare....but waited till it was broadcast on TV. I didnot want to spend 5-6 hours of my time even on a 'quality'film like Taare...People who cannot wait or those who want it at the cost of peanuts may go for 'pirated'.

Anonymous said...

There is no dispute about the need to curb piracy. It kills
the industry and millions of people who are associated with it.
However, my main concern is whether these people are doing any
good to the society by producing cheap class films, churning
out same old stuff again and again? They are promoting unhealthy
habits, ideologies and superstitions apart from dishing out
routine formula films.

Moreover, the common man is finding it difficult to watch movies
by spending atleast one thousand rupees in the form of ticket rate,
popcorn, cool drink, parking and transport. (remember we are charged
double the rate than normal for all these). Why film makers and
exhibitors think of reducing ticket rates, prices of eatables etc
in the theatres?

Technology will not stop to give respect to morality. We need to
use it rather than shun it. If we can produce movies which can only
be / bettter watched on big screen, reduce the rates etc, we may
expect better days for the industry.

Plese see this link:
http://www.tkvgp.blogspot.com

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి