Tuesday, March 2, 2010

TV-5 నుంచి మహాత్మ నిష్క్రమణ--తిరిగి N-TV గూటికి...

కందుల రమేష్ తర్వాత మరొక ఆణిముత్యాన్ని TV-5 కోల్పోయింది. క్రైం బ్యూరో చీఫ్ గా ఉన్న మహాత్మ కొడియార్ అనూహ్య పరిణామాల మధ్య ఆ ఛానల్ నుంచి బైటికి వచ్చి తాను గతంలో వదిలిన N-TV లో చేరాడు. ఒక రెండు ఆసక్తి కరమైన విషయాలు ఉన్నాయి ఈ వ్యవహారంలో.

1) మహాత్మకు వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా....TV-5 లో ఉంటూ N-TV బాసులకు సమాచారం ఇస్తున్నాడని యాజమాన్యం ఆరోపించింది. 

2) ఒక ఫ్రాడ్ కేసులో మహాత్మను యాజమాన్యం తొలగించిందని, ఇకపై తానే క్రైం బ్యూరో చీఫ్ అని ఒక TV-5 ఉద్యోగి పేరిట పలువురికి  మెయిల్స్ వెళ్ళాయి. తర్వాత తెలిసింది ఏమిటంటే...ఆ ఉద్యోగి పేరిట ఎవడో బూచోడు దొంగ మెయిల్ ఐ.డి. సృష్టించి మహాత్మను బద్నాం చేసే పని చేసాడని. అదీ ఎప్పుడంటే...మహాత్మను యాజమాన్యం పిలిపించి మాట్లాడిన కొన్ని గంటల్లోనే ఈ మెయిల్స్ క్రైం రిపోర్టింగ్ సర్కిల్ లో ఉన్న చాలా మందికి వెళ్ళాయి.

N-TV లో డి.సత్యమూర్తి ప్రభ బాగా వెలుగుతున్నప్పుడు మహాత్మ బైటికి వచ్చి TV-5 లో చేరాడు. నీతీ నిజాయితీ తో తనపని తాను చేసుకుపోయే మహాత్మకు రహస్య శత్రువులు తయారయ్యారు. అయినా...ఒకటి రెండు ఛానెల్స్ నుంచి ఆఫర్స్ వచ్చినా...మహాత్మ వెళ్ళని విషయం నాకు తెలుసు. "నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ ఛానల్ ఆదుకుంది. నేను మంచిగా పనిచేసే వాతావరణం ఇక్కడ ఉంది," అని మహాత్మ అప్పట్లో చెప్పారు. 

N-TV లో ఉన్న ఒకరిద్దరు సీనియర్లతో మహాత్మ తరచూ ఫోన్ లో మాట్లాడడాన్ని ఒక సీరియస్ విషయంగా చిత్రీకరించారని సమాచారం. నిజానికి...ఛానెల్స్ విస్తృతి పెరిగిన దృష్ట్యా....ఛానల్ హెడ్స్ ఇతర ఛానెల్స్ సీనియర్ రిపోర్టర్ల తో మాట్లాడడం సాధారణం. ముట్టె పొగరు హెడ్స్ మినహా...కాస్త మానవత్వం ఉన్న హెడ్స్ ఇతర సీనియర్లతో మాట్లాడడాన్ని పెద్ద సీరియస్ విషయంగా చిత్రీకరించాల్సిన పని లేదు. TV-5 వెంకట క్రిష్ణ Zee- తెలుగు శైలేష్ తో ఫోన్ లో టచ్ లో ఉంటే...యాజమాన్యం సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు. అయితే...ఇప్పుడు మహాత్మకు ఫోన్ చేసి మాట్లాడిన N-TV హెడ్ మానవత్వం ఉన్న మహనీయుడు అని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ...ఆయన కావాలనో, తెలియకనో...మహాత్మకు తరచూ ఫోన్ చేశాడు. అది TV-5 కు నచ్చలేదు. 


"మేము గత నెల రోజులుగా అతనిపై నిఘా పెట్టి ఈ నిర్ణయానికి వచ్చాం," అని TV-5 యాజమాన్యానికి సన్నిహితుడైన ఒకరు చెప్పారు. ఇలాంటి విషయంలో...ఆ ఫోన్ కాల్స్ వల్ల తమ సంస్థకు ఎలా నష్టం కలిగినదీ యాజమాన్యం విశదీకరిస్తే బాగుండేది. మరి ఇంతకూ...తానే కొత్త బ్యూరో చీఫ్ అన్న మెయిల్ పంపిన అజ్ఞాత వ్యక్తి ఎవరు? అన్నది అంతు చిక్కని ప్రశ్న. ఈ ఎపిసోడ్ నుంచి కొన్ని విషయాలు గ్రహించాలి.

1) కంపనీ ఫోన్ ఇచ్చింది కదా అని...ఎవ్వడితో పడితే వాడితో అదే ఫోన్ లో మాట్లాడం మంచిది కాదు. యాజమాన్యానికి తెలియనివ్వకుండా...మరొక ఫోన్ వాడుకోవడం మంచిది. జాబు విషయాలు సంస్థ ఫోన్ లో మాట్లాడు కోకండి 

2) మనమేమీ కీడు చేయకపోయినా మనకు ఎర్త్ పెట్టే వాళ్ళు పొంచి వుంటారు. వారానికి ఒక్కసారైనా అలాంటి దుష్ట దుర్మార్గ తిక్క నక్కలు ఎవరో ఒక్కసారి అవలోకించుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

3) నీతీ జాతీ దయా గియా లేని కొన్ని ఛానల్ యజమానులు ఎప్పుడు వెళ్లమంటారో మనం చెప్పలేం. కాబట్టి...ఈ ఛానల్ లో ఉంటూనే...ఇతర ఛానల్ బాసులతో భేషుగ్గా సంబంధాలు నెరపండి. బాక్అప్ ఏర్పరుచుకోండి. యజమానులకు లేని నీతి మనకు ఉండాల్సిన పనిలేదు. అలాగని మరీ ఘోరంగా  కోవర్టు ఆపరేషన్స్ మంచిది కాదు. 


4) ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది కనుక...మీ యజమాని ఎంత నీచుడైనా...సంస్థ ఫోన్ లో ప్రతి కాల్ కు ఒక సారైనా వాడిని పొగడండి.


5) టెక్నాలజీ పెరిగింది కనుక...మిమ్మల్ని బద్నాం చేసే వారు దొంగ ఈ-మెయిల్స్ పంప వచ్చు. మీ పాస్ వర్డ్ కొట్టేయ్యవచ్చు. కాబట్టి...ఆఫీసు కంప్యూటర్ల పై సొంత మెయిల్స్ వాడకండి. ఆఫీసు వాడకానికి ఒక ప్రత్యేక మెయిల్ వాడుకోండి. మీ నుంచి మెయిల్స్ వస్తే వాటికి ఉండే ఫీచర్స్...మీ సన్నిహితులకు చెప్పి ఉంచుకోండి. 

11 comments:

Anonymous said...

I dont appriciate this post. What is the need to write all these internal issues here. Do you think issues like this only happen in media? I have appriciated when you wrote posts in public interest. But there is no use for any person who does not belongs to media by this post.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

So,a journalist has to be as attentive and discreet as a spy.isn't it?

Anonymous said...

RAMU GARU MERU 2SIDES THINK CHYCI POST CHYAGALARU

Anonymous said...

బ్లాగు వ్యక్తిగతం. ఏమైనా రాసుకోవచ్చు. బ్లాగుకు చదివించే లక్షణం ఉండాలే తప్ప ప్రజాప్రయోజనం అవసరం లేదు. ఒకఱు తమ వృత్తిలోని సాధక బాధకాల గుఱించి రాస్తే తప్పేంటి ? ప్రజలకి లోగుట్టు కూడా కావాలి.

--తాడేపల్లి

సుజాత వేల్పూరి said...

విపరీతమైన పోటీ మీడియా ఛానెళ్ళ మధ్య నెలకొన్న నేపధ్యంలో జర్నలిస్టులకు మీ సూచనలు బాగా ఉపయోగపడేలా ఉన్నాయి.:-))

సైబర్ నేరాలు మీడియాకు కూడా పాకాయన్నమాట.

Anonymous said...

anduke ati manchi ga yakkada work cheyakoodadu. yakkuva work cheste elane vuntundi so takkuva pani cheyali channel yala vunte manaki yanduku. manaku salary istunara leda annade mukyam kaani channel devolepment manaki yanduku.media lo baaga chinna post chestunna naaku kooda elanti parabhavame jarigindi.

Anonymous said...

Today a field day for some of the channels as they sexploited Nityananda's video clippings.Some of the channels are repeatedly showing the clippings in one programme or another.Between the news of crash of aircraft of air show and Nityananda's case it is the latter that attracted our CEO's of channels to exploit it for more TRPs.This is the culture of our TELUGU channels.
Hey BHAGWAN.PLEASE HELP US FROM THIS HELPLESS SITUATION OF TELUGU VIEWERS OF TELUGU CHANNELS.

JP.

WitReal said...

seems my comment is censored

kvsv said...

మనమేమీ కీడు చేయకపోయినా మనకు ఎర్త్ పెట్టే వాళ్ళు వుంటారు....చాలా బాగా చెప్పేరు రాము సార్ ...అన్నీ ఫీల్ద్స్ లో నూ ..చివరికి సామాన్య ప్రజలు కూడా ఈలానే తయారయ్యారు ....నిజాయితీగా ధర్మంగా ఆలోచించే పరిస్థితులు లేవు ...people are polluted...

Anonymous said...

ramu garu two sides vinali

Anonymous said...

Arachethini addu petti Suryuni tejassuni aapalerannattu... nindalu vesi Mahatma lanti vyaktiki macha theesuku ralemani Mahatma Rahasya shatruvulaku Ippatike arthamai vuntundi. Anyway... Evari Ottidiki longakunda Mahatma vishayamlo vunnadi vunnatte Rasina Blogger Ramu gariki kruthagnathalu.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి