Sunday, March 7, 2010

e-తెలుగు వర్క్ షాప్ సంగతులు... విశేషాలు..

జర్నలిస్టు మిత్రులకు ఈ టెక్నాలజీ అన్నా... తాము రిపోర్ట్ చేయని సమావేశాలలో పాల్గొనడం అన్నా...కొద్దిగా అన్ఈజీ. జర్నలిస్టుల ద్వారా అంతర్జాలంలో (ఇంటర్నెట్ లో) తెలుగు వ్యాప్తి చెయ్యాలన్న మంచి సంకల్పంతో 'e-తెలుగు' మిత్రులు శ్రమకోర్చి నిర్వహించిన వర్క్ షాప్ కు పట్టుమని పదిమంది జర్నలిస్టులైనా హాజరుకాలేదు. ఇది నేను ఊహించిందే అయినా...నిర్వాహుకులకు కొద్దిగా నిస్పృహ కలిగించే అంశమే. ఇంతకూ అక్కడ ఏమి జరిగింది?

e-తెలుగు లక్ష్యాలను, ఇప్పటి వరకు చేసిన కృషిని కశ్యప్ (కింద ఎడమ ఫోటో) గారు స్లైడ్ షో తో వివరించడం తో కార్యక్రమం ప్రారంభమయ్యింది. యునికోడ్ గురించి వీవేన్ (కింద కుడి ఫోటో) వివరించారు. వికీపీడియా విషయంపై చదువరి గారు మాట్లాడారు. వీరంతా ఉపయోగ పడే పలు విషయాలు చెప్పారు. రవిచంద్ర, మురళి, సతీష్, చక్రవర్తి మధ్యమధ్యలో కొన్ని అంశాలు పంచుకున్నారు. వీరంతా చాలా ఆత్మీయంగా మాట్లాడారు. అందరికీ తెలుగుకు సంబంధించిన ఒక సీ.డీ. అందజేశారు. సాంకేతిక మద్దతు తెలియజేసారు. 


జర్నలిస్టులు ఈ సౌకర్యాలను ఎలా వాడుకోవచ్చో నేను నాకు తెలిసిన మేర వివరించాను. సిటిజెన్ జర్నలిజం, ఎథికల్ బ్లాగింగు గురించి కూడా చెప్పాను.  
బ్లాగ్స్ అనగానే జర్నలిస్టులు నెగిటివ్ గా తీసుకోకూడదని, ఇవి నిత్య జీవితంలో మనసులో చోటుచేసుకునే అలజడికి అక్షర రూపం ఇవ్వడానికి ఆస్కారం ఉన్న అద్భుతమైన వేదికలని అన్నాను. బ్లాగర్లు ఈ వేదికను విద్వేషం రెచ్చగొట్టడానికి వాడుకోవద్దని చెబుతూ....ఒక బాధ్యతారహిత బ్లాగర్ తెలంగాణా ప్రజలను 'తెలబాన్లు' అనడాన్ని , మరొకడు...'ఆంధ్రా వాళ్ళను పారదోలతాం' అని హెచ్చరించడాన్ని ప్రస్తావించాను.  

Reporters Sans Frontiers అనే సంస్థ 'World Day Against Cyber Censorship' జరుపుకునే March 12 న నాలుగేళ్ల కిందట e-తెలుగు ప్రథమ సమావేశం జరగడం గొప్ప విషయమని గుర్తుచేసాను. వివిధ రంగాలలోని బ్లాగ్స్ కు ఏడాదికో, ఆర్నెల్లకో ప్రోత్సాహక బహుమతులు ఇస్తే బాగుంటుందని ఒక సూచన చేశాను కానీ, అందరినీ ప్రోత్సహించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని కశ్యప్ గారు అక్కడే చెప్పేశారు. కాబట్టి...నెట్ నూ ఒక మీడియాగా స్వీకరించి...ఆ పని నేను చేస్తే ఎలా వుంటుందో చూస్తాను. 

ఇందులో పాల్గొన్నందుకు...నేను, హేమ, తమ్ముడు మూర్తి చాలాకాలం తర్వాత కొందరు మంచి మిత్రులను కలుసుకున్నాము. అందులో ఇద్దరు వేణులు, ఆకెళ్ళ రాఘవేంద్ర కూడా వున్నారు. 

Zee-తెలుగు లో పనిచేస్తున్న సీరియస్ బ్లాగర్ కోవెల సంతోష్ కుమార్ కూడా వచ్చాడు. బ్లాగ్ లో తాను రాసిన పోస్టులతో తెచ్చిన బుక్ 'కాలంతో పాటు' ప్రతులు అక్కడ అందించాడు. అక్కడకు వచ్చిన జర్నలిస్టులకు...ఎండలో ఈ వర్క్ షాప్ మనకెందుకురా నాయనా...అనుకుని ఆదివారం హాయిగా ఇంట్లో భార్యాబిడ్డలతో కాలక్షేపం చేసిన జర్నలిస్టులకూ స్ఫూర్తి ఇచ్చేది....ఆ పుస్తకం.
--------------------------------
నోట్: పైన పోస్ట్ చేసిన ఫోటోలు అందించిన సుజాత గారికి కృతజ్ఞతలు

12 comments:

నరేష్ నందం (Naresh Nandam) said...

నేను కూడా రావలిసింది రాము గారూ..
నైట్ షిఫ్టులతో కుదరలేదు.
పోయిన వారమే వద్దామని ప్లాన్ చేసుకున్నాం కానీ, సంఖ్య తక్కువగా ఉందని మీటింగ్ రద్దు చేశారు కదా!
మొత్తానికి ఈ సమావేశం బాగా జరగటం సంతోషం.
ఇంకోసారైనా మన జర్నలిస్టు మిత్రులు హాజరవుతారని ఆశిస్తున్నాను.

సుజాత said...

అయ్యో! మరి నేను? నేను లేనా? నేనెక్కడ? నేనెక్కడ? (సరదాగా...!)

రవిచంద్ర said...

>>నిర్వాహుకులకు కొద్దిగా నిస్పృహ కలిగించే అంశమే...
వ్యక్తిగతంగా నాకైతే ఎటువంటి నిరాశ కలగలేదు. ఎంత మంది వచ్చారనే దానికన్నా ఎంతమందికి చేరువయ్యామన్నదే ముఖ్యం.వచ్చిన వాళ్ళంతా ఎంతో ఆసక్తిగా మేం చెప్పింది మీరు చెప్పింది ఆసక్తిగా విన్నారు. మీ ఉత్తేజభరిత ప్రసంగానికి ధన్యవాదాలు.

కాకపోతే ఎక్కువ మందిని రాబట్టడానికి ఇంకోసారి కచ్చితంగా ప్రయత్నం చేస్తాం.ఈ సారి జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని.. ఆ విధంగా ముందుకు పోదాం :-)

arunasree.marapatla@gmail.com said...

ఇ తెలుగు సమావేశానికి పాత్రికేయ మిత్రులు తక్కువగానే వచ్చినప్పటికి చాలా మంచి విషయాలపై చర్చ జరిగింది. ఈ సమావేశాన్ని నిర్వహించిన నిర్వాహకులకు నెనరులు
అరుణ్ కుమార్ మరపట్ల
ద సండే ఇండియన్

Anonymous said...

sorry dilsukhnagar kada vaddam anukunnanu kani office nunchi phone ravadam valla office lo vachi paddanu.

Kovela santosh kumar said...

thank annaiah... naa peru prastavincharu.. santosham..

జాన్‌హైడ్ కనుమూరి said...

నిర్వహకులు నేను వాళ్ళ వాడిని కాదన్నారు, నా మాటల్తర్వాత అభినందించిన మీరు బ్లాగులో మరచారు ఎందుకో?
నేను ఇంతకీ జర్నలిస్టును కాదనా?
ఎతెలుగు సంఘ అధికార స్భ్య్డను కాననా??
ఎందుకో ఈ వివక్ష??

జాన్‌హైడ్ కనుమూరి said...

నిర్వహకులు నేను వాళ్ళ వాడిని కాదన్నారు, నా మాటల్తర్వాత అభినందించిన మీరు బ్లాగులో మరచారు ఎందుకో?
నేను ఇంతకీ జర్నలిస్టును కాదనా?
ఎతెలుగు సంఘ అధికార స్భ్య్డను కాననా??
ఎందుకో ఈ వివక్ష??

Ramu S said...

జాన్ గారు,
నిజంగా సారీ. మీ స్పీచ్ గురించి రాద్దామనుకున్నాను. కానీ...ఆ ఫోటోలు లేట్ గా రావడం వల్ల, నేను మరొక సెమినార్ లో హాజరు కావాల్సి ఉన్నందున...ఫాలో అప్ చేయలేక పొయ్యాను. రియల్లీ సారీ. మీ గురించి, సుజాత గారి గురించి నాలుగు మాటలు రాయాలని ఉండింది. కానీ...కుదరలేదు. అన్యదా భావించవద్దు. మరొక సందర్భం రావాలని కోరుకుంటున్నాను. వివక్ష అని మీరు అనుకోకండి.
థాంక్స్
మీ
రాము

శరత్ 'కాలమ్' said...

బాధ్యత కలిగిన బ్లాగర్ గారూ,
మీరు అంటున్న "బాధ్యతారహిత బ్లాగర్" ఎవరు?
నేనూ వాడుతుంటాను ఆ పదాన్ని. బహుశా ఆ పదాన్ని తొలిసారిగా వాడిందీ నేనే అయివుండవచ్చు! మీ దృష్టిలో వున్నది నేనే కనుక అయితే ఇదీ నా సమాధానం:
నేను అన్నది తెలంగాణా ప్రజలను కాదు - తెలంగాణా తీవ్రవాదులను! ఏ కాంటెక్ష్టులో వాడిందీ మీరు బాధ్యతగా వెరిఫై చేసుకొని నిందించాలి.

Ramu S said...

మీ వ్యంగ్యం చాలు సారూ...
ఆ పదం ఇప్పటికైనా వాడడం మానండి. తెలంగాణా తీవ్రవాదులు ఏమిటి? ఆ పదం మీరు ఒక్కరే కాదు..చాలా మంది వాడుతున్నారు. అది మీరు మొదలు పెట్టిన సంగతి తెలిస్తే..మీకు ముందే రాసే వాడిని, మీ పేరు ప్రస్తావిన్చేవాడిని. ఇలాంటి మాటలు మంచివి కావని సదుద్దేశంతో చెబుతున్నాను. స్వీకరించగలరని సూచన. మీరు తెలబాన్లు అని రాసినా ఆంధ్రబాన్లు అని రాసినా అది మంచి ప్రయోగం కాదు, ఒకసారి సమీక్షించుకోండి.
రాము

శరత్ 'కాలమ్' said...

రాము గారూ,
మీ సూచనకి ధన్యవాదాలు కానీ తిరస్కరిస్తున్నాను. తీవ్ర తెలంగాణా ఉద్యమవాదులకు ఈ బిరుదు సరి అయినదే అని విశ్వసిస్తున్నాను. అలాగే సమైక్యవాదులతో పాటు ఎవరు అతిగా ప్రవర్తించినా ఇలా బాన్ అని తోక తగిలించి వాడటం సముచితమే కావచ్చు. తాలిబాన్ ఆంశను పుణికిపుచ్చుకున్న వారు ఎవరయినా బాన్ లు అనిపించుకోవలసివస్తుంది. మీరు నిరసించవలసింది అతి పోకడలను - పేరడీ పదాలను కాదు.