Tuesday, March 30, 2010

అయేషా కేసులో 'ఐ-న్యూస్' అంకం రవి సమాంతర విచారణ

కోర్టు విచారణలో ఉన్న కేసుపై మీడియా విచారణ బహిరంగ జరపకూడదన్నది జర్నలిజంలో మౌలిక సూత్రం. దీన్ని పూర్తిగా అతిక్రమించి ఐ-న్యూస్ ఛానల్ లో అంకం రవి గారు 'హార్డ్ కోర్' చర్చ జరిపారు నిన్న రాత్రి. ఆయేషా హత్య కేసులో...పోలీసులు అరెస్టు చేసిన సత్యం బాబు ఆరోగ్యం దెబ్బతిన్నదని, పోలీసులు అతని గురించి పట్టించుకోవడంలేదని...చర్చ జరిపారు.


ఈ కార్యక్రమంలో భాగంగా...స్టూడియోలో ఒక పాత్రికేయుడు సహా ముగ్గురిని...విజయవాడ నుంచి ఆయేషా తల్లి సహా మరో ముగ్గురిని లైన్ లో తీసుకుని ఈ చర్చ జరిపారు. మధ్యలో...ఇటీవల మరణించిన మాజీ మంత్రి కోనేరు రంగా రావు గారి మనవడిని రవి గారు కాసేపు గ్రిల్ చేశారు. ఈ గోలలో ఒకరి మాట ఒకరికి వినిపించలేదు.

దాదాపు మూడేళ్ళ కిందట జరిగిన ఈ హత్య చాలా సంచలనం సృష్టించింది. పోలీసులు ఈ కేసులో పిల్లిమొగ్గలు వేసి నవ్వులపాలయ్యారు. ఈ కిరాతక హత్య చేసిన దుర్మార్గులు ఎవరో తెలుసుకోవాలని తెలుగు ప్రజలు కోరుకుంటారు. ఇదంతా ఓకే. అయితే...ఈ కేసులో...చిల్లర దొంగ సత్యం బాబును ఇరికించారని, అతని ఆరోగ్యం దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదని  అర్ధం వచ్చేలా రవి విచారణ సాగింది. నిజంగా...పోలీసులు అతన్ని ఇరికించి వుంటే..దాన్ని నిరూపించే సాక్ష్యాలు రవి చూపాల్సి వుంది. 'ఇప్పుడు సత్యం బాబు చనిపోతే...ఎలా..." అన్న అంశంపై చర్చ సుదీర్ఘంగా జరిపారు. 


ఈ కేసును దగ్గరి నుంచి చూసినట్లు చెప్పుకుంటున్న ఐ-న్యూస్ గుంటూరు విలేకరి ఫోన్ ఇన్ ఇస్తూ...పోలీసుల మీద చాలా వ్యాఖ్యలు చేశారు. సహజంగానే బాధలో ఉన్న అయేషా తల్లి గారు లైవ్ లో చాలా కటువైన వ్యాఖ్యలు చేశారు.

ఈ చర్చ అంతా చూశాక అర్థం అయ్యింది ఏమిటంటే....అయేషా కేసులో  పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు...అయినా....న్యాయ వ్యవస్థ పట్టించుకోవడం లేదు. నిజంగా కేసులో లొసుగులు ఉంటే....సత్యంబాబు లాయర్ సాయం తీసుకుని ఉంటే బాగుండేది. అలా కాకుండా...బహిరంగ  విచారణ జరిపితే...జనాలకు వ్యవస్థల మీద నమ్మకం సడలే అవకాశం ఉంది. కోర్టు ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణిస్తే అంకం రవిని, కందుల రమేష్ ను, వాసు రాజును బుక్ చేయవచ్చు. 

3 comments:

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

కనీసం ఇలా అయినా ప్రజలకి ఈ కేసు గురించి అమాయకుడైన సత్యం బాబు గురించి తెలిసింది కదా.అయితే వాళ్ళు దీన్ని ఎంతసేపు గుర్తుంచు కొంటారన్నది వేరే విషయం.కొంతమంది స్పందించి సత్యం తల్లికి ఆర్ధిక సాయం అందించడానికి ముందుకు వచ్చారు కదా.ఈ మాత్రం సాధిస్తే ఒక చానల్ ప్రోగ్రాంకి అది చాలదా?

Anonymous said...

సత్యం బాబు దోషి అనే చెప్పే సాక్షాలే లేవు.. ఇది ఎవర్నో కాపాడడానికి పాపం అమాయకుడ్ని బలి చేసారు.. రాజశేకర్ రెడ్డి పాలనలో ఇలాంటివి చాల జరిగాయి..
శాపాలు ఊరికే పోవు.. తగుల్తాయ్..
______
శివుడు
______

Anonymous said...

Already sampam tagilindhi kada. Meeru AP lo lera.