Tuesday, March 16, 2010

'మార్పు'నకు నాంది పలకాల్సింది...మీడియానే!

U= Ultimately
G= Glorious
A= Amazing
D= Days
I= In front of you.
Wish you a happy UGADI
------------------------------------
కొత్త రోజు
కొత్త ఉదయం
కొత్త ఆశలు
కొత్త ఆశయాలు
కొత్త విజయాలు
కొత్త సంతోషాలు 
వికృతి నామ ఉగాది శుభాకాంక్షలు
-------------------------------------
షడ్రుచుల ఉగాది పచ్చడితో
మీ జీవితం సప్తవర్ణ శోభితం అవ్వాలని
మీ కీర్తి అష్ట దిక్కుల వ్యాపించాలని
ఆశిస్తూ....కొత్త సంవత్సర సుభాకామనలు..
-----------------------------------
తెలుగు నోట 
తెలుగు మాట
తెలుగు పాట
తెలువు పిండివంట
తెలుగు ఎదలో అన్నీ తెలుగు సొదలే నిండాలి...
ఇది తెలుగు ఉగాది ఆకాంక్ష
---------------------------------------
ఇవీ నా ఆప్త మిత్రులు ఈ రోజు తెలుగు నూతన సంవత్సర శుభ సందర్భంగా పంపిన కొన్ని ఎస్.ఎం.ఎస్.లు. నల్గొండ కవి మిత్రులు...వేణు సంకోజు గారు ఫోన్లో మాట్లాడుతూ...'వికృతి' అంటే ఏమిటి? అని అడిగారు. 'వికృతి' అంటే 'మార్పు' అట. అదే మన నల్ల కలువ బారక్ ఒబామా నినాదం.  ఆయనను గెలుపు పల్లకిలో ఊరేగించిన అద్భుతమైన సకారాత్మక నినాదం. 


ఈ శ్రీ 'వికృతి' నామ సంవత్సరంలో అందరికీ విజయాలు లభించాలని...నిలువెల్లా గాయాలైన రాష్ట్రం త్వరితగతిన కోలుకోవాలని...శాంతి వెల్లివిరియాలని, ప్రజల మధ్య వైషమ్యం సమసిపోవాలని, అందరం మంచిని పెంచాలని-పంచాలని ఆశిద్దాం.

TV-9 రవి ప్రకాష్, ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ, N-TV నరేంద్రనాథ్-రాజశేఖర్, TV-5 నాయుడు-బ్రహ్మానంద రెడ్డి, 'సాక్షి' రాంరెడ్డి-స్వప్న లు  ఛానెల్స్ లాభం కోసం కాకుండా సమాజహితం కోసం పనిచేయాలని, వారి పుర్రెలు అలా ప్రవర్తించేలా పంచభూతాలు వారికి సహకరించాలని కోరుకుందాం. మీడియాలో ఉన్న వారంతా తేట తెనుగు రుచిని పెంచాలని, దీన్ని విశ్వవ్యాప్తం చేయాలని ఆశిద్దాం. పత్రికలు, టీవీ లను ఏలుతున్న ఈ మహారాజులు, మహారాణులు జర్నలిస్టుల ఉజ్జోగాలు పీకుతూ....వారి జీవితాలలో అనిశ్చితిని, సంక్షోభాన్ని సృష్టించకుండా ఉండాలని ఆశిద్దాం. అలాగే...సినిమా జనానికి పట్టిన బూతు పిచ్చి వదలాలని, అది వదలకపోతే....కోర్టు కేసుల ద్వారా ప్రజలు ఆ దయ్యాన్ని వదిలించి...వారిని మార్చాలని కోరుకుందాం. సమాజంలో మార్పునకు మీడియానే నాంది పలకాలి. దిగ్విజయీభవ.

5 comments:

Anonymous said...

UGAADI shubhakankshalu.
As rightly pointed let hope a good ,moral,ethical,proffessional and human sense will prevail over the electronic media people mentioned by you for performing their duty with some purpose for the people for their welfare,development and we all pray GOD to bless them with the above qualities.Money comes and goes but morality comes and grows and let our CEOs of these channels not eat every grass just for the sake of money and commercial returns.
According to the news reports AP High court has permitted the screening of film High school!
What is your comment?

JP.

చిలమకూరు విజయమోహన్ said...

మీకు,మీ కుటుంబానికి కూడా వికృతి నామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.

kvsv said...

మీడియానే కాదండి అన్ని రంగాల్లో కూడా విషసంస్కృతులు దాపురించాయి...డబ్బే ప్రదానం..తర్వాత దానితో వచ్చే విలాసవంతమయిన జీవితం...ఒక సినీ నిర్మాత నుండి సమాజహితం కోరే సినీమాలు ఆశిస్తామ్ గానీ మత్తు మందుల స్మగ్లింగ్ expect చేస్తామా..?

Srikanth said...

బ్లాగ్ యాజమాన్యానికి, పాటకులకు మరియు తెలుగు ప్రజలందరికీ వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికి అన్నింటా జయం కలుగు గాక... శుభం భూయత్...

-శ్రీకాంత్

Swarupa said...

Ilanti Ugadi pandugalu enni vachina channel managements maravu. vari swardham variki mukhyam. journalists emaipothe vallakenduku... Anyway hope for the best...

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి