Tuesday, February 11, 2014

"ది హిందూ" నుంచి అర్ధంతరంగా నగేష్ నిష్క్రమణ

వివాదాస్పద సీనియర్ జర్నలిస్టు సుసర్ల నగేష్ కుమార్ నాటకీయ పరిణామాల మధ్య 'ది హిందూ' నుంచి నిన్న సాయంత్రం అర్థంతరంగా నిష్క్రమించారు. అత్యంత ప్రతిభాశాలి అయిన జర్నలిస్టు కె. శ్రీనివాస రెడ్డి ని తన స్థానంలో హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ గా నియమించడం, తనకు వేరే పొజిషన్ (కన్సల్టింగ్ ఎడిటర్ అట) ఇవ్వడం పట్ల అలిగి ఆయన రాజీనామా చేసినట్లు ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి. 

"సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో ఆయన రాజీనామా లెటర్ పంపారు. అనూహ్య రీతిలో ఒక అర్ధగంటలో యాజమాన్యం దాన్ని ఆమోదించింది. మా సంస్థలో ఆ స్థాయి వ్యక్తిని ఇంత తొందరగా సాగనంపడం చాలా అరుదు," అని ది హిందూ లో పనిచేసే ఒక జర్నలిస్టు చెప్పారు. పై ఫోటో లోమధ్యలో...కాస్త పొట్టతో ప్యాంటు జాబుల్లో చేతులు పెట్టి తెల్ల చొక్కా ధరించిన మాస్టారే సుసర్ల  నగేష్ కుమార్ గారు.  

దాసు కేశవరావు గారు అనే మంచి మనసున్న జర్నలిస్టు తర్వాత సుసర్ల నగేష్ కుమార్ చీఫ్ ఆఫ్ బ్యూరో గా నియమితులయ్యారు ఒక ఏడు ఎనిమిదేళ్ళ కిందట. ఆయన మంచి టీం లీడర్ కాదని, నిష్కారణంగా నా మీద డిసెంబర్ 25, 2007 న అవినీతి ఆరోపణలు చేసాడని నేను గతంలో చాలా సార్లు రాశాను. మరి కొందరు జర్నలిస్టులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. 

డీ జీ పీ దినేష్ రెడ్డి విషయంలో నగేష్ క్లియర్ చేసిన ఒక బ్యానర్ వార్త 'ది హిందూ' పరువును పంచనామా చేసింది. తాను చేసిన ఘోర తప్పిదాన్ని జర్నలిజం పై దాడిగా నగేష్ అభివర్ణించి ఒక సెక్షన్ జర్నలిస్టుల మద్దతు పొందడంలో విజయం పొందారు. అప్పట్లో నగేష్ కు మొండి వాదనలతో మద్దతు ఇచ్చిన 'ది హిందూ' ఎడిటర్ సిద్దార్థ్ వరదరాజన్ కూడా యాజమాన్యం మీద అలిగి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

శ్రీనివాస రెడ్డి గారి లాంటి అద్భుతమైన జర్నలిస్టుకు పదోన్నతి వస్తే హర్షించి సహకరించాల్సిన నగేష్... యాజమాన్యం పై అలగడం పట్ల ఆ సంస్థ జర్నలిస్టులు ముగ్గురు నలుగురు అసహ్యం వ్యక్తం చేశారు. నగేష్ ఈ స్థాయికి ఎలా ఎదిగాడా? అని ఎప్పుడూ అనిపించే నాకు కూడా ఇది ఇబ్బంది అనిపించింది. నగేష్ గారికి పదోన్నతి ఇచ్చినప్పుడు దాసు కేశవరావు గారు కూడా ఇలానే అలిగి రాజీనామా చేయలేదు. కామ్ గా యాజమాన్యం ఇచ్చిన పని చేసి అందరి మెప్పు పొందారు. అది మరి మంచి కి, మూర్ఖత్వానికి తేడా!, అని అబ్రకదబ్ర అన్న మాటలో తప్పు లేదు.   

పొలిటికల్ రిపోర్టింగ్ లో దిట్టగా పేరున్న నగేష్ కుమార్ నిజానికి గత నవంబర్ లోనే రిటైర్ అయ్యారని, యాజమాన్యం ఆయనకు ఈ ఏడాది నవంబర్ వరకు పొడగింపు ఇచ్చిందని సంస్థ ఉద్యోగులు చెప్పారు. క్రైమ్ జర్నలిజం లో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్న శ్రీనివాస రెడ్డి గారు గత జూన్ నుంచి బెంగళూరు 'ది హిందూ' రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్నారు. 

Nagesh ji, have a nice post-retirement life.
Sreenivasa Reddi Sir, Wish you all the best. 

3 comments:

Jai Gottimukkala said...

Sir, can you give more details about Mr. K. Srinivas Reddy please (his previous experience etc.)

NIRANJAN RAO said...

హాయ్ ..గురు..
ఎ మధ్య కన్పించడం లేదు? ఏదేమైనా కొన్ని పోస్ట్స్ చేసారు కబతీ నేను కాస్త కాంత్రిబుటే చెస్త.
EXPRESS NEWS ఛానల్ లో నేమని భాస్కర్, మురళి జాయిన్ అయ్యరు. అలానే సాక్షి నుంచి dvn కిశోరే మెయిన్ అంచొర్ గ జాయిన్ అయినట్లు తెలుస్తోంది .. శాస్త్రి గారి ఒప్పందం మేరకే తిరిగి న టీవీ కి వెళ్లారు..ఇక శాస్త్రి గారి మిద హోప్ పెట్టుకున్న వాళ్ళలో చాల మందికి ఎ
నిర్ణయం నిరాశే కలిగించిన్ది.హెచ్ ఎం గురించి మీరు చెప్తే మేం విన్తమ్. ఐ న్యూస్ లో పౌండ్రక వాసుదేవుడు తన టీం తో పని చెస్కున్తు ( ఎవర్ని చేయనియకుండా ) కాలం గడిపేస్తున్నట్ట .. cvr నడుపుతున నా వార్తలు నా ఇష్టం ఛానల్ లో గత రెండేళ్ళ నుంచి output ప్లేస్ లో నన బాధలు అనుభవిస్తూ .. బాధలు పెట్టిన గుటాల కామయ్య ఎట్టకేలకు రేసిగ్న్ చెసత్త. ఈయన మహా కానీ హెచ్ ఎం, కానీ ఐ న్యూస్ కానీ ఇలా చాల చానల్స్ లో జాయిన్ అవుతాడని టాక్ ..లెదు లేదు ...తిరిగి cvr కి వస్తాడని ఈయన అనుచరుల తల్క్. ఇన్పుట్ సురేష్, కందుల రమేష్ కూడా బయట ప్రయత్నాలు చెస్తున్నరత.. కానీ లకారాలు ఇచి వీరిని ఎవరు భరించలేరని ప్రస్తుత ఆర్ధిక పరిస్తితుల్ని అంచనా వేస్తున్న మీడియా అనలిస్ట్ తల్క్.

జీ 24 గంటలు మోగించిన భాజా తో శివప్రసాద్ అండ్ కో కి చివరికి ఈ cvr సహా ఎక్కడ ప్లేస్ దొరకక బాధ పదుతున్నరు.
abn లో పొలితిచల్ బ్రేకింగ్ న్యూస్ ఫాస్ట్ గ ఇస్తూ ఆకట్టుకుంటున్న .రేటింగ్ లేక అయోమయం లో ఉన్నరు. కానీ న్యూస్ బ్రేకింగ్ పరం గ ఇదే నెంబర్ ఒనె. కావాలంటే టీవీ 9, టీవీ 5, ntv పక్కన బెట్టుకుని compare చేస్కుని చూడొచ్చు .

---------------
n టీవీ లో త్వరలో ఓపెనింగ్ ఉన్తయత. పొలితిచల్ డెస్క్ ఫోరం చేయబోతున్నారు
క్ష్ ప్రెస్ news తొందరలో మరో తులసి కాకుండా ఉంటె బెటర్ అని ఛానల్ బయట talk . ఆల్రెడీ 9 నెలలు .. గడిచాయి ..ఇక 3 నెలలు ఆగితే ఇక ఎవరు మాట్లాడారు
--------
ఏదో కోతగా పొడిచేస్తాం ..కన్ది పొడి చెస్తమ్.. అని ట్యాగ్ లైన్ తప్పితే అప్పాయింట్మెంట్ లైన్ దొరకని రాజ్ న్యూస్ అంత కన్నా ఎం జరగదు. ఇక దాని పరిస్తితి అన్థె..
bjp ఆరంజ్ న్యూస్ అని ఒకటి మార్చ్ లో లోగో ఓపెన్ చెస్తున్ది. అది మొదలైతే ఇక రాజ్ న్యూస్ ని ఆర్ధికం గ ఆదుకునే నాధుడి ని మల్లి వెతుక్కోవలిసిందే .
---------------
మహా లో selective గ శాలరీ ఇస్తున్నర్త. ..సుజన చౌదరి కొత్త batch ని దింపు తారనే వార్తలతో .. జితలపై ఆశ చనిపోయింది చాలామందికి
ఇవి చాల్లెండి ..ఎఈ మాత్రం వార్తలకే మీకు మొహమాటం వస్తుంది ఎందుకు వాళ్ళపై విల్లపై విమర్సాలని
బాయ్

Prashant said...

You are biased :)