Wednesday, April 30, 2014

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్--తెలంగాణాలో కనాకష్టంగా టీ ఆర్ ఎస్?

1) నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం తధ్యం 
2) ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి కావడం ఖాయం 
3) తెలంగాణలో టీ ఆర్ ఎస్ కనాకష్టంగా మాజిక్ ఫిగర్ చేరుతుంది
--గత కొన్ని రోజులుగా... మేము చేసిన సంభాషణలు, చేసిన కొద్దిపాటి ఇంటర్ వ్యూలు ఈ మూడు అంశాలను వెల్లడిస్తున్నాయి. 
"ఎనఫ్ ఫర్ కాంగ్రెస్. మోడీ షుడ్ కమ్ వన్స్," అని బాగా చదువుకుని సేల్స్ రంగంలో తలపండిన ఒక పెద్ద మనిషి ఓటు వేసి వచ్చాక ఈ ఉదయం అన్న మాటలివి. గత పదిహేను రోజులుగా చూస్తే... మేము కలిసిన చాలా మంది ఇదే భావాన్ని వెలిబుచ్చారు. "ఈయన వస్తే... ప్రమాదం...," అని అన్న వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. మోడీ ప్రసంగంలో నాణ్యత ఉంది. అభివృద్ధి పట్ల ఆకాంక్ష ఉందన్న అభిప్రాయం కలుగుతున్నది జనంలో. 

అటు చేసి ఇటు చేసి చంద్రబాబు నాయుడు గారు మోడీ సరసన చేరడం, పవన్ కళ్యాణ్ కు భయకరమైన ఫాలోయింగ్ ఉందని మోడీ అనుకోవడం, మోడీ గాలి పసిగట్టి... తనను పట్టించుకోకపోయినా బాబు వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలవడం చాలా మందికి వింతగా అనిపిస్తాయి. కాంగ్రెసోళ్ళు, ఎర్ర కామ్రేడ్లు మోడీ ని తిట్టి పోస్తున్నా.... మేధావి జయప్రకాష్ నారాయణ్ గారు కూడా మోడీ జపం చేయడం, ఈనాడు యాజమాన్యం అందుకు మంచి ప్రచారం ఇవ్వడం జరిగిపోతున్నాయి. మోడీ గనక ఒకవేళ ప్రధాని అయితే.. ఆయనకు మచ్చ తెచ్చి గద్దె దిగేలా చేయడం కోసం   హైదరాబాద్లో కల్లోలం సృష్టిస్తారేమో...అన్న అనుమానం కలిగే పక్షులూ ఉన్నాయి. 

హస్తినలో మోడీ స్థాయిలో జగన్ మోహన్ రెడ్డి సీమాంధ్ర లో మూడ్ సృష్టించడం స్పష్టంగా కనిపిస్తున్నది. నేపథ్యం, తెలివి, పరిస్థితులు, డబ్బు...విడివిడిగా కలివిడిగా జగన్ కు అనుకూలంగా అనిపిస్తున్నాయి. జగన్ పరిస్థితి బాగోలేదని అనే వాళ్ళే కనిపించడం లేదు. ఒక ప్రైవేటు సంస్థ ప్రతినిధి...వాళ్ళు చేయించుకున్న ఒక సర్వేను ఉటంకిస్తూ... జగన్ కు 160 సీట్లు వస్తాయని చెప్పడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఇది మామూలు విషయం కాదు. ఇదే జరిగితే తెలుగు దేశం పార్టీ ఖేల్ ఖతం. 
 "ఈనాడు, ఆంధ్ర జ్యోతి పుణ్యాన...జగన్ అవినీతి జనాలకు ఒక పట్టింపు గా లేదు. ఆవు-పులి కథలా ఎవ్వారం మారి... జగన్ ను జనం ఆరాధిస్తున్నారు," అని జర్నలిస్టుగా పనిచేసి రాజకీయాలను అధ్యయనం చేసే ఒక మిత్రుడు చెప్పారు. అది నిజమే మరి. రోజూ చచ్చే వాడి కోసం ఏడ్చే వాడు ఎవడూ ఉండదు.  దక్షిణ తెలంగాణా జిల్లా ఖమ్మం లో ఒక ఎంపీ సీటు, కనీసం మూడు అసెంబ్లీ సీట్లు జగన్ పార్టీ కి రాబోతున్నాయని క్షేత్ర స్థాయి మిత్రులు కట్టిన అంచనా. ఇది జరిగితే అది పెద్ద ఆశ్చర్యం కాక మరేంటి? 
 
రాష్ట్రం ముక్కలైనా... పట్టు వదలని విక్రమార్కుడిలా... సమైక్య నినాదం తో ముందుకు పోతున్న కిరణ్ కుమార్ రెడ్డి వాదన అరణ్య రోదన అయిపోతున్నది. ఒక రాష్ట్రాన్ని నిర్మించే సత్తా ఉన్న నాయకుల్లో బాబు ముందు ఉంటారు. మరి ఆయనను ఆ వైపు ప్రజలు ఎందుకు ఆదరించడం లేదో తెలియదు.  

ఇక ఈ రోజు పోలింగ్ జరిగిన తెలంగాణా లో ఉన్నట్టుండి తెలంగాణా రాష్ట్ర సమితి పుంజుకున్నట్లు ఒక అంచనా. రాష్ట్రం తెచ్చిన చాంపియన్ కే సీ  ఆర్ అని జనం నమ్మక తప్పదు. అది ఆయనకు కలిసి వచ్చింది. లోక్ సభ సీట్ల విషయం ఎలా ఉన్నా... తెలంగాణా అసెంబ్లీ సీట్ల విషయంలో మాత్రం జనం ఆయన్ను కాదనలేని పరిస్థితి... ఆయన కుటుంబ పాలన వ్యవహారం మీద కొద్దిగా ఏవగింపు ఉన్నా. 

"టీ ఆర్ ఎస్ కు 50-52 సీట్లు వస్తాయి. మిగిలిన లెక్క పూర్తి చేయడం ఆయనకు పెద్ద కష్టం కాకపోవచ్చు," అన్నది ఒక మిత్రుడి విశ్లేషణ. అదే అయితే... మాటల మాంత్రికుడు తెలంగాణా ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఓటరు ప్రభువు... నిజంగా ఏమి తీర్పు ఇచ్చాడో తెలియాలంటే... ఈ 'ఇఫ్ అండ్ బట్" లెక్కలు, ఊహాగానాలు మాని కొన్ని రోజులు ఎదురు చూడాలి. ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించి... తెలుగు ప్రజలకు సుఖ శాంతులు ఇవ్వాలని అందరం కోరుకోవాలి. 

10 comments:

Anonymous said...

ఎన్నికల ప్రచారమంతా 'కాగ్రెస్సా లేక మోదీయా?' అన్న false dilemma గా సాగినందున కావచ్చు నాక్కూడా మోదీ గెలుపు ఖాయమని అనిపిస్తుంది. వినడానికి వింతగా ఉన్నా కాంగ్రెస్ గెలిస్తే (అలాంటి వాళ్ళని ఎన్నుకున్నందుకు) వోలుమొత్తంగా ఓటర్లనీ, భాజపాగెలిస్తే (అంతకు మించి ఓటర్లకు వేరే గత్యంతరం లేకుండాచేసిన) కాంగ్రెస్‌ని తప్పుబట్టాలనేది నా ఉద్దేశం.

సరిగ్గా ఇదే జగన్ విషయంలోకూడా వర్తిస్తుంది. ప్రధానంగా క్రైస్తవ, దళిత ఓట్ల ఆధారంగా (ఒకవేళ) గెలిచినా, బుడ్డోడిలో (ఏదేమైనా నేను తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకిస్తాను అని ఒక మాట చెప్పి, దానిమీద నిలబడగల) ఒక మూర్ఖత్వం/తిక్క ఉంది. అంతకంటే మేలైన ప్రత్యామ్నాయం సీమాంధ్రులకు లేకపోవడం వారి ఖర్మం.

చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలక్రిష్ణ వీళ్ళు నిజజీవితంలో ఇంకొకరి చంకలునాకడానికి తప్ప ఇంకెందుకూ పనికిరారని, వీళ్ళ వీరంగమంతా తమ/తమశ్రేయోభిలాషుల మేలుకోసమే తప్ప ఇంకెందుకూ కాదని కాదన్న విషయాన్ని తెలుగు వోటర్లు (ముఖ్యంలా లుంగీలెగ్గట్టుకొని ప్రచారంలో పాల్గొనే అభిమానులు) ఎప్పుడు తెలుసుకుంటారో కదా!

Madhu G said...

why they left remaining 15 seats in seemandhra, I believe those seats will win by TDP rebels and BJP,so as per Jagan mafia survey no chance for TDP to win a single MLA seat in seemandhra.

Very nice analysis sir keep it up.

kiran said...

తెలంగాణా సంగతి నాకు తెలియదు కానీ, మా ఆంధ్రప్రదేశ్ విషయంలో మీ కల నెరవేరదు. లక్షకోట్ల అవినీతిపరుడు , కాంగ్రేస్ తో లాలూచీ పడి బెయిలుతో బయటికొచ్చి ప్రచారం చేస్తున్న వ్యక్తిని మా రాష్ట్ర ప్రజలు నమ్మరు. మా రాష్ట్రం లో కాంగ్రేస్ అనే పేరు ఏ ముసుగులో కూడా వినపడకూడదు అని ప్రజలు గట్టిగానే నిర్ణయించుకున్నారు. మీరు చెప్తున్న కులమతాల నేపధ్యం, డబ్బు వంటివి ఈ ఎన్నికలలో పనిచేయవు. 2019లో మాట్లాడుకుందాం ఇలాంటివన్నీ. 2014 లో మాత్రం రాజధానిని, రాష్ట్రాన్ని నిర్మించే అనుభవజ్ఞుడయిన నాయకుడికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆమాత్రం విజ్ఞత ఉంది.

Naveen P said...

160 seats na Jagan ki cheppandi navvuthadu ,ila chetha

Naveen P said...

175 vaste super 150 ki taggithe matram ysr fans ni cheat chesinattu

venu madhav said...

nice comments

Narendra Reddy said...

jagan cm kavadam pakka anubhavam kaadu aalochana kavali

journalist said...

Meeru kuda elanti vaarhalu raastaranukoledu

Madhu G said...

you are wrong Mr Reddy.

Jagan ki alochna tho baatu anubhavm kuda undi ela dochukvali and daachukovali ani

Hari Babu Suraneni said...

నా అంచనా యేమిటంటే తెలంగాణా లో తెరాసా యే ప్రభుత్వం యేర్పాటు చేస్తుంది, కానీ యేక చత్రాధిపత్యం కాదు - హంగ్.అసలు విలీనాన్ని వ్యతిరేకించడం తెరాసా కాంగ్రెసు ఇద్దరూ అలోచించుకునే చేసి ఉండాలి. విడి విడిగా వాళ్ళ వాళ్ళ బలాన్ని పెంచుకుని యెన్నికల తర్వాత కలిసి ప్రభుత్వం యేర్పాటు చెయ్యడం అనేది మంచి వ్యూహమే. కానీ ఫుల్ మెజార్టీ లేనప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉండదు కాబట్టి పరిపాలన అంత గొప్పగా ఉండక పోవచ్చు. ఆంధ్రలో మాత్రం తెదెపా ఖాయం.జగన్ కి ఫావర్ గా చెప్తున్న సర్వేలు చేసిన వాళ్ళంతా జగన్ అభిమానులో లేక మరో విధంగా అతని చేత ప్రభావిత మయిన వాళ్ళే నన్నది గమనిస్తే అసలు రహస్యం తెలుస్తుంది.