మొండివాడు రాజుకన్నా బలవంతుడని అంటారు. ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ ముఖ్యమంత్రి కే సీ ఆర్ కన్నా బలవంతుడని ఇప్పుడు నిరూపితమయ్యింది. అప్పుడే అధికారంలోకి వచ్చిన భయంకరమైన ఊపు మీద ఉన్న తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వం... శాసన సభ్యుల మీద యెకసెక్కపు కథనం ప్రసారం చేసిన టీవీ-నైన్ మీద, మరేదో మిషతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మీద నిషేధపు వేటు వేసింది.
మాదేమి లేదు... అంతా కేబుల్ ఆపరేటర్ల నిర్ణయం అని ప్రభుత్వం చెప్పింది. కళ్ళు ఉరమగానే... తమ ఆధీనం లోని టీవీ-1 ఛానెల్ ను 'జై తెలంగాణా'గా మార్చి బతక నేర్చిన రవి ప్రకాష్ సర్కార్ కు జీ హుజూర్ అన్నారు. దానికి భిన్నంగా... తాడో పేడో తేల్చుకుందామని వేమూరి రాధాకృష్ణ అరిచి గీ పెట్టి హడావుడి చేసి అసహ్యించుకుని... దీని సంగతి చూడాలని సుదీర్ఘ పోరాటం చేసారు.
'చేసింది చాలు- నిషేధం ఎత్తేస్తే మేలు' అని ఈ బ్లాగు బృందం కూడా రాసింది. వేమూరి రాధాకృష్ణ ఒక గొప్ప జర్నలిస్టు అన్న దురభిప్రాయం తో కాకుండా, ప్రభుత్వం ఒకటి రెండు ఛానెల్స్ ను లక్ష్యంగా చేసుకోకూడని మాకు అనిపించింది. అయినా... గులాబీ ప్రభుత్వం అనుకున్నట్లు చేసింది. వేమూరి కాబట్టి... అటు పక్క ఆయనకు అనుకూలమైన ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది కాబట్టి... పోరాటం సాగింది, ఫలించింది.
ఒక ఐదారు రోజుల నుంచి ఈ ఛానెల్ ప్రసారాలు పునః ప్రారంభం అయినట్లు చెబుతున్నారు. మళ్ళీ 'ఓపెన్ హార్ట్'లో పిచ్చి ప్రశ్నల ఆర్కే ను చూడాల్సి రావడం ఖర్మే అయినా... ఆయనలో చేగు'వేరా' ను చూసుకుని మురవడం తప్ప చేసేదేమీ లేదు.
సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చిన రోజు కేకు కట్ చేసి హడావుడి చేసిన వేమూరి ప్రసారాలు ప్రారంభమయ్యాక (ప్రారంభింపచేసుకున్నాక) మాత్రం కామ్ గా ఉన్నారు. అదీ మంచిదే. ప్రస్తుతానికి గెలిచింది... ఆర్కే నా? కే సీ ఆరా? మీరు ఏమనుకుంటున్నారు? మాకు రాయండి. ముఖ్యమంత్రి గారి కూతురు, ఎం పీ కల్వకుంట్ల కవిత, ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ కలిసి పాల్గొన్న కార్యక్రమంలో తీసిన ఫోటో ఇక్కడ ఇచ్చాం. ఇది జనవరి 5, 2015 న తీసిన ఫోటో. ఈ ఛానెల్ ప్రసారాలు పునఃప్రారంభం కావాలని నవంబర్ 3, 2015 న సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్లు డెక్కన్ క్రానికల్ ప్రచురించిన వార్త ఇది:
మాదేమి లేదు... అంతా కేబుల్ ఆపరేటర్ల నిర్ణయం అని ప్రభుత్వం చెప్పింది. కళ్ళు ఉరమగానే... తమ ఆధీనం లోని టీవీ-1 ఛానెల్ ను 'జై తెలంగాణా'గా మార్చి బతక నేర్చిన రవి ప్రకాష్ సర్కార్ కు జీ హుజూర్ అన్నారు. దానికి భిన్నంగా... తాడో పేడో తేల్చుకుందామని వేమూరి రాధాకృష్ణ అరిచి గీ పెట్టి హడావుడి చేసి అసహ్యించుకుని... దీని సంగతి చూడాలని సుదీర్ఘ పోరాటం చేసారు.
'చేసింది చాలు- నిషేధం ఎత్తేస్తే మేలు' అని ఈ బ్లాగు బృందం కూడా రాసింది. వేమూరి రాధాకృష్ణ ఒక గొప్ప జర్నలిస్టు అన్న దురభిప్రాయం తో కాకుండా, ప్రభుత్వం ఒకటి రెండు ఛానెల్స్ ను లక్ష్యంగా చేసుకోకూడని మాకు అనిపించింది. అయినా... గులాబీ ప్రభుత్వం అనుకున్నట్లు చేసింది. వేమూరి కాబట్టి... అటు పక్క ఆయనకు అనుకూలమైన ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది కాబట్టి... పోరాటం సాగింది, ఫలించింది.
సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చిన రోజు కేకు కట్ చేసి హడావుడి చేసిన వేమూరి ప్రసారాలు ప్రారంభమయ్యాక (ప్రారంభింపచేసుకున్నాక) మాత్రం కామ్ గా ఉన్నారు. అదీ మంచిదే. ప్రస్తుతానికి గెలిచింది... ఆర్కే నా? కే సీ ఆరా? మీరు ఏమనుకుంటున్నారు? మాకు రాయండి. ముఖ్యమంత్రి గారి కూతురు, ఎం పీ కల్వకుంట్ల కవిత, ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ కలిసి పాల్గొన్న కార్యక్రమంలో తీసిన ఫోటో ఇక్కడ ఇచ్చాం. ఇది జనవరి 5, 2015 న తీసిన ఫోటో. ఈ ఛానెల్ ప్రసారాలు పునఃప్రారంభం కావాలని నవంబర్ 3, 2015 న సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్లు డెక్కన్ క్రానికల్ ప్రచురించిన వార్త ఇది:
The Supreme Court on Tuesday directed the Telangana state government and the Centre to take steps to restore broadcasting of ABN Andhra Jyothi channel through Multi System Operators (MSOs) in the state with immediate effect.
MSOs in Telangana had been banning telecast of ABN Andhra Jyothi for the last 502 days. “Though justice was delayed, ultimately justice was not denied to us, it is nothing but a victory of dharma,” said Mr Vemuri Radhakrishna, managing director of the channel and the Telugu daily Andhra Jyothi.
Member of the Press Council of India and Journalists’ Union leader Kosuru Amarnath had demanded that the state government and MSOs restore telecast of the channel which was subjected to an undemocratic and illegal ban all these months.
MSOs in TS had stopped telecast of TV9 and ABN Andhra Jyothi, run by Amoda Broadcasting Company Private Limited, in TS allegedly due to deliberate denigration and mockery of TS legislators in its programmes.
The Telecom Settlement Dispute Settlement and Appellate Tribunal in October 2014 had granted an order in favour of TV9 to restore its telecast over cable TV networks.
0 comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి