ఆగస్టు 31, 2013 న హైదరాబాద్ కేంద్రంగా ఆరంభమైన 'మెట్రో ఇండియా' ఆంగ్ల పత్రిక ప్రచురుణ ఈ రోజు (డిసెంబర్ 13, 2015) నుంచి ఆగిపోయింది.
శనివారం నాడు ఒక కీలకమైన మీటింగ్ లో పాల్గొన్న పత్రిక అధిపతి రాజం గారు బైటికి వచ్చి 'ఇక పత్రిక రాదు... నేను ఊరు వెళ్లి వచ్చాక మీ జీతాలు సెటిల్ చేస్తా..." అని చెప్పి వెళ్లిపోయినట్లు సమాచారం.
ఈ నిర్ణయం జర్నలిస్టులకు (ఎడిటర్ శ్రీ ఏ శ్రీనివాస రావు సహా) షాక్ ఇచ్చినట్లు చెబుతున్నారు. 'నమస్తే తెలంగాణా' తెలుగు పత్రిక ప్రాంగణం లో నడుస్తున్న ఈ పత్రిక ఇలా అర్ధంతరంగా మూత పడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస రావు, ఎస్ రామకృష్ణ, భాస్కర్ త్రయం నాయకత్వంలో వచ్చిన 'మెట్రో ఇండియా' ఇప్పుడిప్పుడే ఒక రూపు దిద్దుకుంటున్న దశలో ఈ పరిణామం జరిగింది. పత్రికను వదిలిన ఎస్ ఆర్కే గారు సొంత పత్రిక పెట్టుకున్నారు, భాస్కర్ గారు 'ది హన్స్ ఇండియా'అనే ఆంగ్ల పత్రికలో చేరి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
'మెట్రో ఇండియా' ను కొన్ని రోజులు మూసేసి, నమస్తే తెలంగాణా మాదిరిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త హంగుతో తెస్తారని చెబుతున్నారు. ఆ రాబోయే కొత్త పత్రికకు 'ది హిందూ' మాజీ సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస రెడ్డి గారు నాయకత్వం వహిస్తారని కూడా అంటున్నారు. ఇవన్నీ ధృవ పడని విషయాలు.
జూన్ 2014 లో నాటకీయ పరిణామాల మధ్యన నమస్తే తెలంగాణా ను రాజంగారు వదులుకోవాల్సి వచ్చింది. పూర్తి వివరాల కోసం 'నెగ్గిన కే సీ ఆర్ పంతం... పత్రికను వదులుకున్న రాజం" అనే పోస్టు ను చదవండి.
1989 లో జర్నలిస్టు జీవితం ఆరంభించిన ఈ బ్లాగు స్థాపకుల్లో ఒకరైన రాము మెట్రో ఇండియా వ్యవస్థాపక స్పోర్ట్స్ ఎడిటర్ గా ఆరేడు నెలలు పనిచేసారు. పత్రిక మొదలు పెట్టిన రోజు తీసిన ఫోటో లు ఇక్కడ ఇస్తున్నాం. ఎర్ర చొక్కాతో ఉన్నజర్నలిస్టు... రావు గారు. ఎంతో ఉత్సాహంగా ఇక్కడ పనిచేస్తున్న జర్నలిస్టుల భవిష్యత్తు ఏమిటా? అన్నది ఆందోళన కలిగిస్తున్న విషయం.

0 comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి