Monday, January 4, 2016

అది 'తెలంగాణా టుడే' నే.... వచ్చేది ఉగాదికి!

'నమస్తే తెలంగాణా' తెలుగు పత్రిక వారి ఇంగ్లిష్ పత్రిక పేరు 'తెలంగాణా టుడే' అనీ, సీనియర్ జర్నలిస్టు కె. శ్రీనివాస్ రెడ్డి గారు దానికి ఎడిటర్ అని దృవపడింది. కిందటేడాది (2015) చివరి రోజు (డిసెంబర్ 31) సాయంత్రం 4.59 గంటలకు శ్రీనివాస్ రెడ్డి గారు తన ఫేస్ బుక్ పేజీ లో ఈ కింది నోట్ ద్వారా వారి కొత్త పాత్రను ప్రకటించారు.

Friends. I have joined as Editor of 'Telangana Today', an English daily to be launched shortly from Hyderabad. Wishing you a Happy New Year!

ఇప్పుడు 'నమస్తే తెలంగాణా' ప్రాంగణంలో... శ్రీ సీ లక్ష్మీ రాజ్యం గారి యాజమాన్యంలో వస్తున్న 'మెట్రో ఇండియా' అనే ఆంగ్ల పత్రికనే రూపు రేఖా విలాసాలు మార్చి 'నమస్తే తెలంగాణా' అధ్వర్యంలో తెస్తారన్న ఒక ప్రచారం/ భ్రమకు రెడ్డి గారు ఈ నోట్ ద్వారా తెరదించారు. రెడ్డి గారు షార్ట్లీ అన్నారు కానీ... తెలంగాణా టుడే ఒక నాలుగు నెలల్లో... బహుశా ఉగాది నాటికి వస్తుందని భావిస్తున్నారు.


ఇందుకోసం జర్నలిస్టుల నియామకాల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. శ్రీనివాస్ రెడ్డి గారిని చూసి పత్రిక లో చేరే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. చివరకు 'ది హిందూ'నుంచి కూడా ఒక బృందం అక్కడ చేరబోతున్నట్లు ప్రచారం భారీగా జరుగుతోంది. 'కనీసం ఎనిమిది మంది వెళ్తారట. నిజంగానే అది జరిగితే.. ది హిందూ లో అదే పెద్ద భారీ వలస అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో... కొందరు ది హిందూ నుంచి వెళ్ళే అవకాశం బాగానే ఉంది,"అని ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పిన మాట నమ్మదగినదిగానే ఉంది.

ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి ముందు ఉన్న ఒక కఠినాతికఠినమైన సవాలు: నాణ్యమైన జర్నలిస్టులను సత్తా ప్రాతిపదికన ఎంచుకోవడం. మీడియా అనగానే... తప్పులు లేకుండా తన పేరు రాయగలవాడు, నాలుగు మాటలు చెప్పి బతకగలిగిన ఎవడైనా చేయదగ్గ ఉద్యోగం అన్న అభిప్రాయం  పెరిగిన నేపథ్యంలో... మన కులపోళ్ళు, వేలువిడిచిన మేనమామ మనమళ్ళు, భజనపరులు పోలో మంటూ వస్తారు.  ఈ కులాభిమానానికి, మనో వికారాలకు లొంగితే ఇంతే సంగతులు... చిత్తగించవలెను. ఇప్పుడు మన తెలుగు టీవీ ఛానెల్స్ నాశనం కావడానికి ఇలాంటి చెత్త నియామకాలే పెద్ద కారణం.  

నిజానికి పక్కా రీజనల్ ఇంగ్లిష్ పత్రిక ఇంతవరకూ ఒక్కటీ లేదు మనదగ్గర. ఆ లోటును పూడ్చే ప్రయత్నాన్ని 'మెట్రో ఇండియా', 'హన్స్ ఇండియా'లు చేస్తున్నాయి కానీ... అంత్యంత ప్రతిభావంతులైన జర్నలిస్టుల కొరత వాటిని పీడిస్తున్న అంశాల్లో ఒకటి. జీతాలు తక్కువగా ఇస్తూ... ఉద్యోగ అభద్రతను సృష్టిస్తే మంచి జర్నలిస్టులు దొరకరు. శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో 'తెలంగాణా టైమ్స్' ఈ సమస్యలు అధిగమించి చరిత్ర సృష్టించాలని కోరుకుందాం.

కొత్త సంవత్సరం సందర్భంగా... శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కే సీ అర్ గారిని కలిసిన దృశ్యం ఇది. ఇది రెడ్డి గారి ఫేస్ బుక్ నుంచి సంగ్రహించబడింది.  

2 comments:

Unknown said...

super sir..

katta jayaprakash said...

Many English newspapers started and closed as they could not stand before The Hindu, DC, Express and TOI.I donot think the fresh one Telangana Today stands firm along with these old guards.Let wait.


Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి