Monday, November 6, 2017

జర్నలిస్టుల వాహనాలకు బార్‌కోడ్‌!

మీడియాలో పనిచేసేవాళ్ళతో పాటు, ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేవాళ్ళు కూడా తమ మోటార్ సైకిళ్ళు, కార్ల కు ముందూ, వెనకా 'ప్రెస్' అన్న స్టిక్కర్లు అంటించుకుంటారు. కొన్ని పట్టణాలలో దాదాపు అన్ని బండ్ల మీదా 'ప్రెస్' గుర్తు ఉండడం మనం గమనించవచ్చు. ఇట్లా అతికించుకుంటే... కొన్ని వెసులుబాట్లు ఉంటాయని ఎక్కడా రాసి లేదు కానీ... 'ప్రెస్' అన్న మాటలు చూసి పోలీసులు చెకింగ్ కోసమని బండి ఆపరు. పైగా... సొసైటీలో అది కొద్దిగా దర్జా వ్యవహారం. 

ఇలాంటి బాధ పడలేక కాబోలు...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం పోలీసులు  జర్నలిస్టుల వాహనాలకు బార్‌కోడ్‌తో కూడిన ప్రెస్‌ స్టిక్కర్లను జారీ చేశారు. పత్రికలు, ఛానెళ్లలో పని చేయకపోయినా కొందరు ప్రెస్‌ స్టిక్కర్లను వాహనాలకు అతికించుకొని దుర్వినియోగం చేస్తున్నారన్నారనీ,  ఇలాంటి వారికి అడ్డుకట్ట వేసేందుకు జర్నలిస్టుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు బార్‌కోడ్‌ స్టిక్కర్లను జారీ చేశామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చెప్పారని మిత్రులు తెలిపారు. బార్‌కోడ్‌ను స్కాన్‌ చేయగానే సంబంధిత జర్నలిస్టు వివరాలు అందులో ప్రత్యక్షం అవుతాయట. రాష్ట్రంలో అన్ని చోట్లా ఈ పధ్ధతి అమల్లోకి తెస్తే బాగుంటుంది. 

0 comments: