Wednesday, November 8, 2017

భాష రాకున్నా... మార్ఫింగ్ తో సంపాదన!

అక్టోబర్ నాలుగో తేదీన సిల్వర్ జూబ్లీ చేసుకున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) బూతుపై సమరం ప్రకటించిన తర్వాత 
సైబర్ క్రైమ్ విభాగం వేగంగా స్పందించి, మార్ఫింగ్ తో అశ్లీల సైట్స్ నడుపుతున్న పలువురిని అరెస్టు చేసింది. 
ఈ క్రమంలో... ఇలాంటి పలు వెబ్‌సైట్లను నిర్వహిస్తున్న అహ్మదాబాద్‌కు చెందిన ఠాకూర్‌ మహేష్‌ కుమార్‌ జయంతీజీ, ఠాకూర్‌ బాలూసిన్హా లను సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. 
ఈ వెధవలకు తెలుగు భాష రాకున్నా... ప్రముఖ సినీ తారల గురించి తెలుసుకొని వారి ఫొటోలు, వీడియోల్ని మార్ఫింగ్‌ చేసి వెబ్‌సైట్లలో పెట్టి వాటికి వచ్చే హిట్స్‌తో డబ్బు సంపాదిస్తున్నారట. వెబ్‌సైట్లకు వచ్చే హిట్స్‌ ఆధారంగా ప్రతినెల రూ.25-35 వేల వరకు సంపాదిస్తున్నారని ఆంధ్రజ్యోతి పత్రికలోని ఒక వార్త కథనం. వీళ్ళిద్దర్నీ గుజరాత్‌లోని వీసానగర్‌లో  అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచాక హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.
 ఈ కేసులో ప్రదీప్‌ అనే నిందితుడ్ని ఇదివరకే అరెస్ట్‌ చేసిన సీఐడీ విదేశాల నుంచి వెబ్‌సైట్లు నిర్వహిస్తున్నవారిపై చర్యలకు ఇంటర్‌పోల్‌ సహకారం తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రదీప్‌, ఠాకూర్‌ మహేష్‌ కుమార్‌, ఠాకూర్‌ బాలూసిన్హాలు నాలుగైదేసి వెబ్‌సైట్లను, కొన్నింటిని విదేశాల నుంచి నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారని ఆ వార్తలో రాశారు. 
 
'మా' ఇచ్చిన ఫిర్యాదుతో ముఖ్యంగా 30 అభ్యంతరకర సైట్లను గుర్తించిన సీఐడీ సైబర్‌ క్రైం పోలీసులు వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. www.blowjobbrocks.com, www.axsexpic.com, www.indianstarpics.com, www.desixxxphoto.c om,www.indianxxximage.net, www.sexxxxn udepics.com సైట్లు అహ్మదాబాద్‌ కేంద్రంగా నిర్వహిస్తున్నట్లు సీఐడీ గుర్తించి, బాధ్యులను అరెస్ట్‌ చేసింది. 

1 comments:

YVR's అం'తరంగం' said...

రాముగారు, ఒక సిన్సియర్ సందేహం. సప్లై వుంటే డిమాండ్ పెరుగుతుందా? డిమాండ్ వుంది కనక సప్లై పెరుగుతుందా? రెండిటికీ సమాన పాత్ర వుంది కదా? డిమాండ్‌కి కారణం అవుతున్న జనం మనస్తత్వాన్ని ఏం చెయ్యాలంటారు?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి