Thursday, March 25, 2021

వెంకటకృష్ణ కొత్త ప్రయాణం అతి త్వరలో!

తెలుగు మీడియాలో బాగా కష్టపడి పైకివచ్చిన జర్నలిస్టుల్లో ముగ్గురు మాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంటారు. వారు- రాజశేఖర్ (ప్రస్తుతం ఎన్-టీవీ), మూర్తి (టీవీ 5), వెంకటకృష్ణ (ఏ బీ ఎన్ లో మొన్నటిదాకా). ముగ్గురూ ఈనాడు గ్రూపు ప్రోడక్ట్స్. ఇందులో... తెరవెనుక ఉండి అసాధారణ   తెలివితేటలతో కంటెంట్ సృష్టించే మహత్తరమైన సత్తా ఉన్నజర్నలిస్టు రాజశేఖర్. మిగిలిన ఇద్దరూ తెరమీద చించేస్తారు. మహా ముదుర్లయిన రాజకీయ నాయకులతో, ఇతర ప్రముఖులతో వాడివేడిగా చర్చలు జరపడంలో పేరెన్నికగన్నారిద్దరూ. వారి మీద తరచూ వచ్చే ఆరోపణల్లో నిజానిజాలు దేవుడికే తెలియాలిగానీ...వృత్తిలో వారి ప్రతిభా సామర్ధ్యాలు తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.  

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనాడు వార్త పత్రిక స్ట్రింగర్ గా (అంటే రాసిన దాన్నిబట్టి డబ్బులు వచ్చే పని) ప్రస్థానం మొదలుపెట్టిన పర్వతనేని వెంకటకృష్ణ (వీకే) నిజానికి మంచి ఫీల్డ్ జర్నలిస్టు. అప్పట్లో మిరపకాయ గింజల మీద తాను చేసిన స్టోరీ సంచలనం సృష్టించింది. ఒడ్డూ పొడుగూ బాగుండి, వాక్ చాతుర్యం ఉన్న వీకే ఈ టీవీ లో ప్రవేశించి అనతికాలంలో పేరు తెచ్చుకున్నారు. అక్కడ రామోజీ రావు గారి దృష్టిలో పడి మంచి కథనాలు కవర్ చేశారాయన. 

టీవీ-5 లో చేరినవీకే ఒక రష్యన్ వెబ్సైట్ లో వచ్చిన కథనం ఆధారంగా వై ఎస్ ఆర్ మరణం వెనుక రిలయెన్స్ హస్తం అంటూలైవ్ లో నానా యాగీ చేసి అరెస్టు అయి విడుదలై వీర జర్నలిస్టుగా పేరుపొందారు. తర్వాత హెచ్ ఎం టీవీ, 6 టీవీ, ఏపీ 24/7 లలో పనిచేశారు. 

ఏప్రిల్ 2020 లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ లో చేరి కురుకున్నట్లు కనిపించిన వీకే ఒక మూడు రోజుల కిందట అక్కడి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ ఛానెల్ చర్చలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పార్టీ వై ఎస్ ఆర్ సీ పీ మీద దాడిచేయడం, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం చేశారన్న మాట మూటగట్టుకున్నారు. ఆ చర్చలు పెద్దగా చూడని కారణంగా దానిమీద మేము వ్యాఖ్య చేయలేని పరిస్థితి! కారణాలేమైనా తనే రాజీనామా చేశారని కొందరు, యాజమాన్యం బలవంతంగా చేయించిందని కొందరు, డబ్బు వ్యవహారం వికటించి ఈ పరిస్థితికి దారితీసిందని మరి కొందరు అంటున్నారు. నిజానిజాలు మనకు తెలియదు కాబట్టి బురదజల్లడం మంచిది కాదు. 

అయితే... త్వరలో వీకే మరొక ఛానెల్ హెడ్ గా రాబోతున్నారన్న సమాచారం మాకు ఒక పక్షం కిందటనే వచ్చింది. సినిమాల్లో మునిగివున్న ఒక పెద్దమనిషి తనతో చర్చలు జరిపి ఇప్పటికే అనుమతులు ఉన్న ఒక ఛానెల్ ను యాక్టివేట్ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

This is what VK put on his FB page:

One journey.. There will be many challenges and challenges.. Now it is only a holiday.. If there is anything more than that, I will tell you soon.. Some people who love me too much will be trolling something with a dog.. No need to care.

2 comments:

Chiru Dreams said...

రోజూ పొద్దునా సాయంత్రం, ఎవడో చచ్చినట్టు వెంకటకృష్ణ అండ్ బాచ్చి ఏడుపులు... ఏబీఎన్ లో చాలా కామెడీగా ఉంటాయి. ఇంతకీ రాధాకృష్ణదగ్గర జాబ్ చెస్తున్నాడా లేక వెన్నెముక తాకట్టుపెట్టాడా? జనాల్లో టాకెంటంటే, చంద్రబాబు సోదిలోకూడా లేకుండాపోడానికి అతిపెద్ద కారణం ఈ వెంకటకృష్ణ ఓవర్ యాక్షనే అని.

Anonymous said...

పాపం చంద్రబాబు ఈ రాహు కేతుల నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. జగన్ అదృష్టం.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి