Sunday, June 6, 2021

'నమస్తే తెలంగాణ'కు పదేళ్ళు- మన సురేంద్ర కు 'ది హిందూ' లో పాతికేళ్ళు

(డాక్టర్ ఎస్. రాము)

'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి' పత్రికలకు దీటుగా 'సాక్షి' పుట్టుకొస్తే...ప్రత్యేక తెలంగాణకు గొంతుకగా నిలవాలని 'నమస్తే తెలంగాణా' ఆవిర్భవించింది. ఈ రోజు పదేళ్ల పుట్టినరోజు జరుపుకుంటున్న 'నమస్తే తెలంగాణా' యాజమాన్యానికి, అన్ని విభాగాల సిబ్బందికి శుభాకాంక్షలు. ఈ పత్రిక తెలంగాణా హృదయ స్పందనై వందేళ్లు పయనించాలని, ప్రజలకు మెరుగైన జీవనం ఇవ్వడంలో తోడ్పడాలని కోరుకుందాం. 

రాజకీయ రాగద్వేషాలు అనేవి  మీడియా యాజమాన్యాల విధానంలో భాగమైనందున, ఈ పత్రిక అధికార పార్టీ మౌత్ పీస్ అని మొత్తుకోవడం కన్నా పత్రికకు అభినందనలు చెప్పడం ఉత్తమం. అన్ని పత్రికలకు ఉన్నట్లే ఈ పత్రిక యానంలోనూ మెరుపులు, మరకలు ఉన్నాయి. అల్లం నారాయణ గారు, కట్టా శేఖర్ రెడ్డి గార్ల తర్వాత యువకుడైన తిగుళ్ల కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఎడిటర్ గా ఉన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో బాగా నలిగిన కృ.తి. సంపాదకత్వంలో మరింత పురోభివృద్ధి సాధిస్తుందని ఆశిద్దాం. 

పదేళ్ల సందర్భంగా ఈ రోజు నమస్తే తెలంగాణా మొదటి పేజీలో వచ్చిన ఈ కింది శ్లోకం బాగుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని సంకల్పంగా చెప్పుకోవడం మంచి విషయం. దీన్ని తు.చ. తప్పకుండా  జర్నలిజంలో చేయకూడని పనులు చేయకుండా ఉండడం అందరు జర్నలిస్టుల పరమావధి కావాలని ఆశించడంలో మంచిది.  



గర్వించదగిన కార్టూనిస్టు సురేంద్ర గారు 

తెలుగు జాతి గర్వించదగిన కార్టూనిస్టు సురేంద్ర గారు ప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక 'ది హిందూ' కు సేవలందించడం ఈ రోజుతో పాతికేళ్ళు అయ్యింది. వారికి శుభాకాంక్షలు. ఒక తెలుగు కార్టూనిస్టును కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి మెరుగైన కార్టూనిస్టుగా తీర్చిదిద్దిన యాజమాన్యానికి అభినందనలు. ఒక వెబ్ సైట్ కోసం నేను 2016లో సురేంద్ర గారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. ఆ వివారాలు ఇక్కడ చూడవచ్చు. 

https://www.telugu360.com/interview-hindus-surendra-self-made-gifted-cartoonist/

ఈ రోజే సురేంద్ర గారి జన్మదినోత్సవమని తెలిసింది. వారికి బర్త్ డే గ్రీటింగ్స్. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి