వాక్ స్వాత్రంత్య్రం. సోషల్ మీడియా.
ఈ రెండూ ఫ్రీగా దొరికాయ్ కదా...అని మనకు నచ్చని వారిమీద రెచ్చిపోతే గట్టిగా ఇరుక్కుంటాం. తిట్లు తినే వాళ్లు పట్టించుకోకపోబట్టి, కోర్టుకు ఈడ్చే తీరికా, ఓపికా లేకపోబట్టి నోటి తీట/ చేతి గుల మహనీయులు బతికిపోతున్నారు కానీ లేకపోతే తలనొప్పి, తలబొప్పి ఖాయమయ్యేవి. ఇందుకు ఒక క్లాసిక్ కేసు ఇది. ఈ రోజు ది హిందూ మొదటి పేజీల్లో 'Unconditional Public Apology' అన్న శీర్షిక కింద వచ్చిన ఒక ప్రకటన చూడండి. దాని కథాకమామీషు ఇదండీ.
హైదరాబాద్ లో మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ అనే గొప్ప విద్యా సంస్థ ఉంది. దాని మాజీ ఛాన్సలర్ గారికి ఎందుకో ఒళ్ళు మండి జర్నలిజం శాఖలో పనిచేసే ప్రొఫెసర్ మీద 2019 లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రొఫెసర్ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగేలా మీడియా ముందు అన్నారట. గతంలో ఉన్న లైంగిక వేధింపుల కేసు నుంచి విముక్తి లభించాక కూడా తనను ఆ అర్థం వచ్చేలా ఘాటైన మాట అనడం మీద జర్నలిజం ప్రొఫెసర్ గారు కోర్టుకు వెళ్లారు. ఛాన్సలర్ గారు అడ్డంగా దొరికిపోవడంతో సుప్రీం కోర్టులో సారీ చెప్పారు. తన క్లయింట్ 'emotional outburst (భావోద్వేగ విస్ఫోటం)' తో అన్నారే తప్ప ప్రొఫెసర్ ను బద్నాం చేయాలని కాదని ఛాన్సలర్ తరఫు న్యాయవాది విన్నవించారు. ఆయనకు మెడిసిన్ చేస్తున్న ఇద్దరు పిల్లలు ఉన్నందున జరిమానా విషయంలో దయ చూపాలని కూడా ఆ న్యాయవాది కోర్టును కోరారు. దానిపై స్పందిస్తూ.... ప్రొఫెసర్ గారికి Unconditional Public Apology ప్రకటన రూపంలో చెప్పాలని, మనో వేదన కలిగించినందుకు ఒక లక్ష రూపాయలు చెల్లించాలని సుప్రీం కోర్టు బెంచ్ అక్టోబర్ లో ఆదేశించింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశం మేరకు ఈ రోజు మాజీ ఛాన్సలర్ గారు Unconditional Public Apology ప్రచురించారు The Hindu లో. నా లెక్క ప్రకారం, లాయర్లకు, ఈ ప్రకటన వేయడానికి ఛాన్సలర్ గారికి కనీసం 7-8 లక్షలు వదిలి ఉంటాయి. పైగా అందరి ముందు చులకన అయ్యే పరిస్థితి.
This is a case of defamation by libel filed by Journalism Professor in 2019.
First a criminal complaint with police, then criminal proceedings before a Junior Civil Judge, then a Original Suit with Addl Dist Judge, then a Criminal Petition before a single Judge of TS High Court and finally a Spl Leave Petition before a Division Bench of Supreme Court.
"A 6 year litigation of defamation not only defamed 2 professors but also brought disrepute to MANUU, a Temple of learning," అని సీనియర్ అడ్వకేట్ Babji Yana గారు చెప్పారు.
అదీ సంగతి... ఇది అందరికీ గుణపాఠం. మీడియా ముందు, వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇతరులపై రెచ్చిపోయి రాయడం గానీ, వీడియోలు చేయడం గానీ చేయకండి. చట్టాలు టైట్ అవుతున్నాయి. మీ అభిప్రాయాలు చెప్పడం వేరు, చెలరేగిపోయి పిచ్చపిచ్చ ఆరోపణలు చేయడం వేరు.
భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్/ సిస్టర్.
3 comments:
ఈ ప్రకటన ద్వారా ఇప్పటి దాకా వీరెవరో తెలియని వారికి కూడా వీరెవరో ఇప్పుడు తెలిసి వచ్చేను :)
ముందు మీడియా వాళ్ళు నేర్చుకుంటే మంచిది. అసత్యాలు, అర్ధ సత్యాలు, వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత జీవితాలపై తప్పుడు కథనాలు ఇలాంటివి కూడా ఆగిపోవాలి.
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని ఆత్రేయ గారు ఎప్పుడో చెప్పాడు. మీడియా సోదరులు తాము ఆచరించి తరువాత ఇతరులకు చెబితే బాగుంటుంది కదా.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి