ఎనభయ్యవ దశకంలో విలేకరి నిజంగా ఒక కరివేపాకు. 'ఈనాడు'లో పనిచేస్తున్నప్పుడు బతుకు భలే భయంగా వుండేది. ఎప్పుడు వుద్యోగం తీసేస్తారో, దొరల్లో ఏ దొరకు...ఎందుకు కోపం వస్తుందో అనే భయం వెంటాడేది. కళ్ళున్న బాస్ లూ, అరసగం కళ్ళున్న బాస్ లు, కళ్లు-బుర్రలేని బాస్ లు వుండేవారు. అప్పట్లో నాలుగు వేలు వస్తే ఈ హైదరాబాద్ లో దర్జాగాబతికాం.
అప్పట్లో కాస్త మంచి డ్రెస్ వేసుకున్నా వెకిలి కామెంట్స్ చేసి పైశాచిక ఆనందం పొందే సోడాబుడ్డి బాస్ లు, పెళ్ళాన్నిఫోన్లోనే వుతికి ఆరేసే బాస్ లు, మనిసి అన్నాక కాస్త కలా పోసన అవసరమని గుడ్డిగా నమ్మే బాస్ లు వుండేవారు. ఈమహానుభావుల కారణంగా వున్నదానికి, లేనిదానికి భయపడి చచ్చేవాళ్ళం.
ఒక పుణ్య స్త్రీతోతన చాంబెర్ లో బిజీగా వున్న బాస్ దగ్గరకు ఒక పని మీద వెళ్లి ఇరుక్కున్న సంఘటనామరిచిపోలేనిది. 'నేను జిరాక్స్ కు పోయి వచ్చే లోపు అక్కడకు నువ్వు ఎందుకు వెళ్ళవయ్యా బాబు,' అని పాపంఅటెండర్ భలే విసుకున్నాడు. అ రసిక బాస్ ఆ తర్వాత నా ఆర్టికల్స్ తొక్కి పారేస్తున్నప్పుడు తీరిగ్గా కూర్చుని విశ్లేషణచేసుకుంటే అప్పుడు నాకు విషయం బోధ పడింది. ఇదంతా వేరే వ్యవహారం. ఈ టైటిల్ తో సంబంధంలేని సంగతి.
అప్పటి జర్నలిస్టులు- కట్నం తీసుకుని హైదరాబాద్ వచ్చి వడ్డీకి తిప్పుకుంటూ జీతంతో దర్జాగా బతికేసే మహాపురుషులు, కేవలం జీతం మీదనే ఆధారపడే అభాగ్యులు అని రెండు రకాలు. మొదటి వర్గం వారికి అత్త గారు పెట్టినఖరీదైన బట్టలు వుండేవి. ఈ రెండో రకం జనం అలగా బాపతు. నాగయ్య చౌదరి రెండు రోజులు జీతం లేట్ చేస్తే
(చేయడనుకోండి) చచ్చి వూరుకునే వారు. వురేయ్ బాబు, నువ్వు బాగా పనిచేశావ్..ఇకపై నీ జీతం నెలకు మూడొందలు పెరిగిందంటే పండగ చేసుకున్నాం నీను, మరో వెర్రిబాగుల ఫ్రెండ్. అందుకే మేమంతా ఒకే పేపర్లో చాల రోజులు వుండేవాళ్ళం. సీనియర్లను పొమ్మని పోగాపెట్టేవారు కాని జూనియర్లకు పెద్దగా బాధ వుండేది కాదు. మా రక్తంలో లాయల్టీ పొంగి పొర్లుతూ వుండేది. మనం వెళ్ళిపోతే బ్యానర్ ఎవడు రాస్తాడు? పెద్దాయన (రామోజీ) ఏమనుకుంటాడు? అనే ప్రశ్నలు మెదడును కుళ్ళ పోడిచేవి. అవన్నీ వెర్రి భ్రమలని తెలిసేది కాదు. తత్త్వం బోధపడే లోపు పుణ్య కాలం దాటిపొయ్యేది.
అలాంటిది గత నాల్గు ఐదు ఏళ్లలో పరిస్థితి మారింది. చాల తెలుగు పత్రికలూ, చానల్స్ ది హిందూ కన్నా జీతాలుఎక్కువ పే చేస్తున్నాయి. ఇప్పుడు జర్నలిస్టు లు మంచి జీతాలు పొందుతున్నారు. మంచి బట్టలు వేస్తున్నారు, కార్లలోతిరుగుతున్నారు. పిల్లలకు మంచి చదువులు చదివిస్తున్నారు. ఇదంతా మంచి పరిణామం.
కాని ఇప్పుడు లాయల్టి అనేది ఒట్టి బూతు మాట. ఏదో ఒక వర్గాన్ని నమ్ముకోవటం, జాగ్రత్తగా నాలుగు డబ్బులుసంపాదించడం..మరో మంచి ఆఫర్ వస్తే జంప్ చేసేయ్యటం. ఇది సూత్రం. యాజమాన్యాలు సైతం సీనియర్లు దండగ మారివారని భావిస్తున్నాయి. కాస్త సీనియారిటీ రాగానే సాగానంపెస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్లు లేకుండానే కొన్నిచానల్స్ నడుస్తున్నాయి.
"రిపోర్టింగ్ రూల్స్ మారాయండి. అందమైన ఆడ పిల్లలయితేనే ఏ బైట్ అంటే ఆ బైట్ తెస్తారు. అబ్బే..సీన్యర్స్ తో లాభంలేదు," అని... తెగ సంపాదించి ఒక చానల్ కూడా పెట్టబోతున్న జర్నలిస్ట్ అంటున్నాడు. ఇది వాస్తవ పరిస్థితి. కాదనలేము. నేటి పిల్ల జర్నలిస్టులకిది పండగ కాలం. వారికి విజయీభవ!!!
Monday, September 28, 2009
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
all the best.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి