Thursday, December 3, 2009

సున్నితమైన అంశాలూ...టీ.వీ.ఛానెల్స్ తీరూ...

ఇప్పుడు జరుగుతున్న ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సందర్భంగా కొన్ని పాఠాలు నేర్చుకునేందుకు టీ.వీ.ఛానెల్స్ కు, జర్నలిస్టులకు మంచి అవకాశం ఏర్పడింది. 

నిజం చెప్పుకోవాలంటే- ఇన్నాళ్ళు...పేపర్లు ఈ ఉద్యమం గురించి, ఈ ప్రాంతం వాళ్ళ గురించి అనుకూలంగా రాసింది చాలా తక్కువ. నియామకాలు, పదోన్నతుల విషయం లోనూ ఈ ప్రాంతం జర్నలిస్టులు అన్యాయానికి గురైనట్లు ఆరోపణ ఉంది. ఒక మూడు నాలుగు సంవత్సరాల కిందటి వరకూ ఇది నిజమే అని నాకు అనిపిస్తున్నది.  


"సమాజ సేవ మన విహిత కర్తవ్యం...మనం ఏది మంచిది అనుకుంటామో...అదే సమాజ హితం," అని నమ్మే...'ఈనాడు'ది అప్పట్లో ఏకఛత్రాధిపత్యం కాబట్టి...ఆ పేపర్ తెలంగాణా గొంతు నొక్కేది అని నేను స్వయంగా చూసి తెలుసుకున్నాను. ఏదో గొడవ సందర్భంగా..."అందుకే ఈ ఉస్మానియా వాళ్ళను తీసుకోకూడదు,' అని 'ఈనాడు' పర్సనల్ డిపార్టుమెంటులో ఒక పెద్ద సారు నాతో అన్నప్పుడు దిమ్మ తిరిగింది. అప్పుడు తీరిగ్గా కూర్చుని లెక్క వేసి చూస్తే...'ఈనాడు' లో ఒక ప్రాంతం వారిని ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారని, ఒక కులం వారికి ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తున్నదని అర్ధమయ్యింది. 

"ఈ గ్రూపులో పెద్ద పోస్టులు ఇప్పటికీ ఈ ప్రాంతం వారికి రావు," అని ఒక మిత్రుడు లెక్కలు చూపాడు. 'ఈనాడు' లో హైదరాబాద్లో, జిల్లాలలో పెద్ద పొజిషన్లలో ఎందరు, ఏ కులాల వారు, ఏ ప్రాంతాల వారు ఉన్నారో...ఒక టేబుల్ వేసి చూసాను ఈ మధ్య కాలంలో. మళ్ళీ దిమ్మ తిరిగింది. సరే...అంత పెట్టుబడి పెట్టినవాడు... వాడి మనుషులను పెట్టుకోకుండా...అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఇస్తాడని ఈ కాలంలో అనుకోలేము కదా. ఒళ్ళు మండేది ఎక్కడ అంటే...ఈ కులగజ్జి యాజమాన్యాలే...సమ సమాజ స్థాపనే ధ్యేయం అన్నట్లు పోజులు కొట్టడం..జనానికి సుద్దులు చెప్పడం. ఎజెండాలు నిర్దేశించడం ఇది వేరే విషయం.


మొత్తం మీద...ఈ ఛానెల్స్ మధ్య విపరీతమైన పోటీ వల్ల తెలంగాణా తాజా ఉద్యమానికి వీర కవరేజ్ దొరికింది. విషయ ప్రాధాన్యం బట్టి నడుచుకునే జర్నలిస్టులు ఫీల్డులో బాగా పనిచేసారు. స్టూడియో లలో కూర్చున్న కొందరు ప్రజెంటర్ల  వెకిలి ప్రశ్నలు దారుణం అనిపించినా...మొత్తానికి కే.సీ.ఆర్. శ్రీకారం చుట్టిన తాజా అంకానికి అన్ని ఛానెల్స్ లో చాలా కవరేజ్ దొరికింది. సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా డీల్ చేసారంతా. ముఖ్యంగా కెమెరా మెన్ చాలా బాగా పనిచేసారు. ఆగ్రహావేశాలు, గందరగోళం, పోలీసుల వీరంగం...నేపథ్యంలో వీరి కృషి అభినందనీయం. 

పైకి ఏముందిలే...అనిపిస్తుంది కానీ...ఈ తరహా సున్నితమైన వ్యవహారాలను కవర్ చేయడం నిజానికి చాలా కష్టం. కాస్త తేడా వచ్చినా ఒంటికి, ఛానల్ కు నష్టమే. వేడి మీద వున్న ఉద్యమకారులు కచ్చితంగా...రిపోర్టర్ ప్రాంతాన్ని బాగా పట్టించుకుంటారు. కొందరు ఇతర ప్రాంతాల రిపోర్టర్లకు ఇది ఇబ్బంది కలిగించే అంశమే. కొందరు...ఈ ప్రాంతపు రిపోర్టర్ లు మనసు నుంచి తన్నుకు వచ్చే భావాన్ని అణుచుకుంటూ రిపోర్టింగ్ చేయడానికి చాలా కష్ట పడ్డారు. 

కే.సీ.ఆర్. పట్ల పోలీసులు, గద్దర్ వ్యవహరించిన తీరు చాలా మందికి బాధ కలిగించిందనే చెప్పాలి. ఇది మంచిదా, చెడ్డదా అన్నది... మనం ఏ పక్షాన వున్నాం...అనే దాన్ని బట్టి ఆధారపడి వుంటుంది. తెలంగాణలో పుట్టి, సాయుధ పోరాటం గురించి తెలిసి, ఏదో రకంగా ఉజ్జోగంలో అన్యాయానికి గురై, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను చూసి, ఈ అన్యాయాలను రిపోర్ట్ చేసిన వారికి...సహజంగానే తాజా ఉద్యమం ఉద్వేగాన్ని ఇస్తుంది. అయినా..రిపోర్టర్ లు, ఎడిటర్లు సంయమనంతో వ్యవహరిస్తూ...అన్ని వర్గాలకూ సమానమైన వాయిస్ ఇస్తూ రిపోర్ట్ చేశారని నాకు అనిపించింది. 

బుధవారం రాత్రి గద్దర్ తో లైవ్ లో 'జీ- 24 గంటలు' లో ఒక కాలర్ ఆంధ్ర ప్రాంత వాళ్ళను ఒక బూతు పదం తో సంబోధించాడు. ఇది బాధాకరం. కానీ..ప్రజంటర్ కృష్ణ వెంటనే..ఆ కాలర్ ను వారించి..లైన్ కట్ చేయించారు. 'కాలర్స్ వాడే పదజాలం సరిగా వుండాలి. ఇష్టం వచ్చిన పదజాలం వాడవద్దు," అని కృష్ణ సూచించారు. ఇది మంచి పద్దతి. గురువారం ఉదయం గోరేటి వెంకన్నతో 'సాక్షి' లో స్వప్న ఇంటర్వ్యూ బాగుంది. వెంకన్న...భాష గురించి చాలా నిష్పాక్షికంగా మాట్లాడారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి చెప్పుల దండ వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ..."అలా చేయడం త్యాగాన్ని కించపరచడమే, ఇతరుల మనోభావాలను దెబ్బతీయడమే," అని చెప్పారాయన. 

అయితే..."ఈ ఛానెల్స్ ఇంత చేటు విప్లవ పాటలను ఇంత ఎక్కువగా ప్రసారం చేయాలా?" అని ఒక ఆంధ్రా మిత్రుడు అడిగాడు. వరంగల్ TV-9 రిపోర్టర్ రమేష్ మాటి మాటికీ ఈ పాటలనే పాడించి అందించిన మాట వాస్తవమే. కావాలని కాకుండా..ఏదో వెరైటీ కోసం అలా చేసాడేమో, మనకు తెలియదు.


ఇప్పుడు జరుగుతున్నది...ఒక ఉద్యమం. ఇందులో రిపోర్టర్ లు రాగ ద్వేషాలకు అతీతంగా పని చేయడం అవసరం. మన భావాలు బైట పడకుండా...రిపోర్ట్ చేయడం అంత తేలిక ఏమీ కాదు. అయినా తప్పదు. మీడియా, రిపోర్టర్ లు సంయమనం కోల్పోయి సొంత పైత్యం రంగరిస్తే...తీవ్ర నష్టం జరుగుతుంది. ఒక్క తప్పుడు సమాచారం ఇచ్చినా అగ్గిని రాజేసినట్లు అవుతుంది. స్టూడియో లో కూర్చున్న ప్రజంటర్లు చర్చల్లో కావాలంటే..వారి అభిప్రాయాలు ప్రతిబింబించేలా ప్రశ్నలు అడగ వచ్చు..కొమ్మినేని శ్రీనివాస రావు గారి లాగా. ఎవరో ఒకరు ఈ ఉదయం సూరత్ నుంచి లైవ్ కార్యక్రమంలో ఫోన్ చేస్తే..."ఇక్కడ ఉద్యమం అక్కడ మీకు ఏమి లాభం కలిగిస్తుంది?" అని ఆయన అదోలా నవ్వుతూ అడిగారు. ఇలాంటి పరిస్థితులలో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వడం కూడా అవసరం.

మండల్  కమిషన్ నివేదిక సమర్పించినప్పుడు కూడా రిపోర్టర్ లు ఇలాంటి మీమాంసనే ఎదుర్కున్నారు. దీన్ని...అగ్ర కుల రిపోర్టర్ లు ఒక రకంగా, నిమ్న కుల రిపోర్టర్ లు ఒక రకంగా నివేదిస్తే ఎలా వుంటుందో ఊహించండి. మత పరమైన విషయాల  నివేదనలోనూ చాలా జాగ్రత్తలు అవసరం. వార్తల్లో వ్యక్తిగత అభిప్రాయాలు చొప్పించకుండా...ఉన్నది ఉన్నట్లు అందించడం నైతిక జర్నలిజం. రిపోర్టర్ లు రాగ ద్వేషాలు చొప్పిస్తే...చాలా ప్రమాదం.

7 comments:

Anonymous said...

Blogger శ్రీధర్ రాజు - చికాగో said...

రాము గారు,
ఈ వ్యాసం చదివింతర్వాత మీపై గౌరవ భావం పెరిగింది. మీ విశ్లేషణ - తోటి పాత్రికేయులకు మీరిచ్చిన సందేశం చాలా బాగుంది.

మీరు చెప్పినట్టుగా కౄరమైన కులపిశాచి చూపే వివక్ష ఒక పాత్రికేయ ప్రపంచాన్నే కాకుండ చేతికందివచ్చిన అన్ని రంగాలపై ప్రభావం చూపింది.

ఈ కులరాక్షసి మూలకారణంగా ఒక ప్రాంతానికి జరిగిన వివక్ష ఎంతటి అనర్థానికి దారితీస్తోందో ఇప్పటి తెలంగాణ ప్రజాసమరం చూపే ప్రళయతాండవం ఓ మచ్చుతునకలాంటి ఉదాహరణ అనడం సరైందేనేమో.

మరి ఈ అసలు పిశాచిపై తిరుగుబాటు సమరం ఎప్పుడో... అదింకా చాపకింద నీరులా ప్రవహిస్తూనే ఉంది.

Anonymous said...

ramanna..
inka konchemlothuga vellalanna. present medialo oka hmtv minahayisthe annee andhrave. dantho sandu dorikithe telangana udyamaanni neerugarchalani chuseve. oka chennel ayithe chandrababu delhi programne pade pade cover chesinfi. dani poti chanelemo omc meeda godava jariginapudu mathrame telangana lollini chupettindi. ika mr rajinikanth yedava navvulu, vetakaralatho, vekili chestalatho prasnalu aduguthunnadu.. idi manchidi kadhu. poti patrikalu isthunnayanna badhathone thappa nijayathiga coverage undadam ledanna.

Anonymous said...

greatandhra.com vanti siteslo telangana udyamam paina vyangyanga vyasalu rasthunnaru. deenini addukovadam ela mithrama? asalu vallu journalistla? leka vyaparula?

కార్తీక్ said...

kula gajji anni chotla undiandhra lo kooda undi..... andra lo kooda andhra valla patla oka kulam vivakshathachooputhundi...

ikkada kulampakkana pedithe thelangaanaku anyayam jaragadam nijam..

antha mandi mem vidi potham untunte
kendram kallu moosukovadaaniki kaaranam rosayya lanti vedavale...

www.tholiadugu.blogspot.com

Anonymous said...

telangana udyamam uvvettuna egisi padutunte.... hyderabad lo unna national channels reporters gallaku kanapaddam leda ? okka vedhava saraina coverages ivvadam ledenduku ? thelangana udyama sega delhini... akkadi dunnapotu charmamunna sonia, manmohanlaku thagilinche badhyata hyderabad kendranga panichese national mediaku leda ?

Anonymous said...

కేసీఆర్ ఆమరణ దీక్ష పులి స్వారీ నుంచి బయట పడటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం ఒక్క టైంస్ మాత్రమే ఎందుకు రాయగలిగింది. వై.ఎస్. మరణానంతరం చావుల్లో చాలావరకు కారణాలు వేరే అని డెల్లీ పత్రిక రాస్తే మనం వార్తగా వేసుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా డీల్ చేయడం అంటే అర్ధం ఇదన్నమాట. (ఆ ఇది ఏమిటో జర్నలిస్ట్ మిత్రులకు తెలుసు) నిజానికి అందరూ కలసి కేవీపీ వుచ్చులో తెలంగాణా యువతను బిగించుతున్నారు.

శ్రీనివాస్

Anonymous said...

మీరు జర్నలిస్టుల గురించి వ్రాసారు.
మరి పోలీసుల సంగతి ఏమిటి?
వాళ్ళు ఎంత సంయమనంతో, నిగ్రహంతో పని చేయాలి?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి