Friday, January 1, 2010

బూతు ఛానెల్స్ పై పౌర ఉద్యమం

అఖిలాంధ్ర ప్రేక్షకులారా....

మనమంతా...ఏవేవో విషయాలపై సొల్లు కబుర్లు మాని సీరియస్ గా కొన్ని అంశాలు చర్చించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఎంటర్ టైన్మెంట్ ముసుగులో మన సంస్కృతిపై మన టీ.వీ. ఛానెల్స్ జరుపుతున్న దాడి నుంచి సమాజాన్ని కాపాడుకోవాల్సిన సమయమిది. సినిమాల కన్నా వేగంగా, బలంగా కొన్ని ఛానెల్స్ మన సమాజాన్ని మనకు తెలీకుండానే నైతిక సంక్షోభం లోకి నెట్టేస్తున్నాయి. ఇది కంటికి కనిపించని మహా సంక్షోభం, పెను ఉపద్రవం.



స్కూల్ లో చదివే మీ కూతురుకు క్లాస్మేట్ తో లేచిపోవాలని అనిపించకముందే...అక్రమ సంబంధాలు తప్పు కాదు అన్న భావనను  టీ.వీ. సీరియల్స్ నుంచి వంటబట్టించుకున్న మీ ఇంటి ముందు కాలేజ్ కోర్రోడు మీరు లేనప్పుడు...మీ ఇంట్లోకి దూరకముందే...మీ బుర్రల్లో...పరాయి అమ్మాయి కనిపించగానే అందాన్ని సొంతం చేసుకోవాలన్న పిచ్చి పిచ్చి  ఆలోచన ప్రవేశించి మిమ్మల్ని కసాయిగా మార్చకముందే...మీరు మేల్కొనాలి. చదవడానికి ఇది సిల్లీగా కనిపించినా....కాస్త తీరిగ్గా బుర్రపెట్టి ఆలోచిస్తే...మీకే అర్థమవుతుంది...కనిపించకుండా జరుగుతున్న తీవ్ర నష్టం. 


న్యూ ఇయర్ ఆగమనం సందర్భంగా...'కిస్ మిస్' పేరిట ఈ TV-9 ప్రసారం చేసిన ముద్దు సీన్లు చూసారా? ఇదేమి వికృత టేస్టు? సినిమాలలో కళాపోషణ, క్రియేటివిటీ ముసుగులో పెంట మీద రూపయినైనా ఏరుకుని జేబులో వేసుకునే ఏ దర్శకుడో....సమాజంపై ఈ సీన్ల ప్రభావం గురించి ఆలోచించకుండా..చిత్రీకరించిన ముద్దు సీన్లు ఇవి. వీటన్నింటిని...గుదిగుచ్చి ఒక కార్యక్రమంగా మలిచి తెలుగు ప్రేక్షకులపై వదిలారు...TV-9 వారు. ఇది వారికి కొత్త కాదు. ఇతర ఛానెల్స్ కూడా దీన్ని 'సక్సెస్స్ ఫార్ములా' గా స్వీకరించాయి. 

ఇంట్లో పిల్లా పాపలతో..తల్లి దండ్రులతో కలిసి కూర్చొని చూడదగిన ప్రోగ్రామా ఇది? గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి...ఇది మిమ్మల్ని ఎంబరాస్ చేయలేదా? ఆ స్క్రిప్టు ఏమిటి? ఆ పిచ్చి సీన్లు ఏమిటి? మనమేమి చేస్తాం?.. అని అనుకుని ఛానల్ మార్చడమో, సిగ్గూ ఎగ్గూ లేకుండా ఆ సీన్లు చూడడమో చేద్దామా? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే...మాటి మాటికి...ఏకంగా న్యూస్ బులెటిన్లలో నగ్న, అర్ధ నగ్న అమ్మాయిలను చూపిస్తుంటే...అది మన

ఇంట్లో పిల్లలపై ప్రభావం చూపుతుంటే...రిమోట్ కు పనిచెప్పడం తప్ప ఇంకేమీ చేయలేమా? 

ఇది కాదురా నాయనా...జర్నలిజమంటే...అని మనం (అంటే సాధారణ జనం) గొంతెత్తి చెప్పలేమా? అసలు ఆ హక్కు మనకు లేదా? పిచ్చి కుక్కలా రేస్ లాగా ఛానెల్స్ పోటీ పడి...టీ.ఆర్.పీ. రేటింగ్స్ కోసం న్యూస్ లో స్త్రీ అంగాంగ ప్రదర్శన చేస్తుంటే...ఇది మనకు పట్టని వ్యవహారం ఎలా అవుతుంది?


"మ్యేకింగ్ ఆఫ్ సౌత్ స్కోప్ క్యాలెండర్" అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఈ ఛానల్ ప్రసారం చేసింది. ఒక తొక్కలో క్యాలెండర్ కోసం అందమైన భామలు ఇచ్చిన పోజులు...బ్యాక్ గ్రౌండ్ వర్క్... అసలు ఒక కార్యక్రమం ఎలా అవుతుంది? కింగ్ ఫిషర్  క్యాలెండర్ కు సంబంధించిన  ఒక కార్యక్రమాన్ని N-TV ప్రసారం చేసింది. అంటే...మనం ఏది చూపినా..సొంగ కార్చుకుంటూ చూసేందుకు తెలుగు జనం సిద్ధంగా ఉన్నారని ఈ చానెళ్ళ భావనా? జనం బలహీనతపై వీరికి ఎనలేని భరోసా. 

అమెరికన్ టెలివిజన్ కార్యక్రమాలను తన దేశం లోకి అనుమతించని క్యూబా కమ్యునిస్టు వీరుడు ఫిదెల్ క్యాస్ట్రో చెప్పిన ఒక మాట గుర్తుకు వస్తున్నది. "ప్రజలు నా దేశ మానవ వనరులు. స్వేచ్ఛ, భావ ప్రకటన పేరిట మీ కార్యక్రమాలతో మీరు (అమెరికా) వారి బుర్రలను కలుషితం చేస్తానంటే...చూస్తూ ఊరుకునే వెర్రి వెంగళప్పను కాను నేను," అని ఫిదెల్ చెప్పాడు. మన ప్రజలను అద్భుతమైన మానవ వనరులుగా ఎవరూ చూడరేం? ఈ ఛానెల్స్ ప్రతి పల్లె కూ పోతున్నాయి. అవి అక్కడి అమాయకులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. చదువుకున్న జనమే...రెచ్చిపోయి...ఓకే అనని అమ్మాయిలపై యాసిడ్ దాడులు చేస్తుంటే...పెద్దగా వివేచనలేని వారి గురించి అనుకోవడం దండగ.

"ఏటండీ....ఈ TV-9? కిస్సు సీన్లు మరీ దారుణంగా చూపించేస్తంది? ఇది మరీ దారుణం," అని ఈ ఉదయం రాజమండ్రి వాస్తవ్యుడు ఒకరు ఖైరతాబాద్ లో కలిసి వాపోయారు. చాలా మంది ఈ "హాట్ హాట్" కార్యక్రమాల గురించి ఇబ్బంది పడ్డారు. కానీ...అంతా కిమ్మనకుండా ఉంటే ఎలా? మీ నిరసనను... బూతును ప్రసారం చేసే ఛానల్స్ కు తెలియజేయండి. ఇలాంటి బూతు ఛానెల్స్ ను క్షమించడం బాధ్యతారాహిత్యం.


భారత్ లో ఒక పధ్ధతి ఉన్న వ్యవస్థను మనం నిర్మించుకున్నాం. ప్రకృతి...ఎంతో అద్భుతంగా ఒక వయస్సు ప్రకారం లైంగిక మార్పులను శరీరంలో తీసుకువస్తుంది. మనకొక పటిష్టమైన వివాహ వ్యవస్థ ఉంది. భార్యా, భర్త కొన్ని కొన్ని అభిప్రాయబేధాలు ఉన్నా జీవితాంతం కలిసి ఒక చక్కని వ్యవస్థను ఏర్పరచడం...ఒక సాంప్రదాయంగా వస్తున్నది. అందుకే...ఇతర దేశాల వారు...మన వైపు భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు. మన వ్యవస్థ వారికి ఒక వింత....ఇక్కడి "క్రియేటివ్ బ్రైన్స్" కు మాత్రం ఒక రోత. మన సినిమా జనం, టీ.వీ.ల సీ.ఈ.ఓ.లు రేటింగ్స్ కోసం జుగుప్సా కరమైన శృంగారానికి పెద్దపీట వేయడం వల్ల...పిల్లలలో హార్మోన్ల మీద ప్రభావం కనిపిస్తున్నది. ఒక గాఢ చుంబనం వంటి హాట్ సీన్ తెరపై చూసిన అమ్మాయి/ అబ్బాయి లో ఒక్క సారిగా వస్తున్న మార్పు చూడండి. స్కూల్ లెవల్ లోనే ఇవన్నీ చేసుకోవచ్చన్న సందేశం ఇస్తున్నారు. ఇక అక్రమ సంబంధాలను వ్యవస్థీకృతం చేస్తున్నారు. 

సదాలోచన పరులారా....ఈ వ్యవహారం చాప కింద నీరులా మనలను నైతికంగా దెబ్బ తీస్తున్నది. యాసిడ్ దాడులు, హత్యలు, రేప్ ల వంటి నేర ధోరణులు పెచ్చరిల్లడానికి అశ్లీల దృశ్యాలు కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. సమాజంలో కీలక భాగస్వామి అయిన మహిళల పట్ల చులకన భావం ఏర్పడడానికి ఈ ఛానెల్స్ ప్రసారం చేసే చెత్త కార్యక్రమాలే కారణం. "ఇష్టం లేకపోతే..వేరే ఛానల్ చూడండి" అనడం....సరైన జవాబు కాదు.  


ఈ కొత్త సంవత్సరంలో...బాధ్యతాయుతమైన పౌరులుగా...ఈ పాడు కార్యక్రమాలకు మనం అడ్డుకట్ట వేద్దాం. ఈ అంశంపై చర్చ జరుపుదాం...మన నిరశనను టీ.వీ.యాజమాన్యాలకు తెలియజేద్దాం. అందుకు పట్టణాల వారీ గా కొన్ని వేదికలు (ఫోరమ్స్) ఏర్పాటు చేసుకుందాం. బూతు చూపే ఛానెల్స్ ను బహిష్కరిద్దాం. ఇది నైతిక సమాజం కోసం జరిపే..ఒక పవిత్ర కార్యం. రండి..ఇందులో భాగంకండి. మన సమాజాన్ని, సంస్కృతిని మనమే రక్షించుకుందాం. 

23 comments:

Bhadrasimha said...

బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని. మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం
భద్రాచల నరసింహ క్యాలండర్ – 2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ

Unknown said...

మనందరం కలసికట్టుగా కృషిచెయ్యాల్సిన అంశం ఇది. ఏ విధంగా ముందుకు వెళితే మంచిదో అందరం కలసి ఆలోచించాలి. నా సహకారం నూటికి నూరు శాతం అందించగలను.

Anonymous said...

tv9 వారి మెరుగైన సమాజం అంటే ఇదే అని వారనుకుంటున్నారు. మ్యేకింగ్ ఆఫ్ సౌత్ స్కోప్ క్యాలెండర్ కార్యక్రమం ను వారి (tv9) కుటుంబసబ్యులతొ చుస్తారా?

Saahitya Abhimaani said...

Ramuji,

Please tell what should we do. Is it possible to petition to Supreme Court to take this kind of TV Channels to task and issue proper guidelines and control the bunch of guys calling themselves media(!) This channel as if its a great social reformer gives slogans of banning caste, confiscating the assets of factionists.

What about themselves. I am of the view that the CEO of the channel should be asked to watch the programme alongwith his wife and children(if any) and such viewing by them should be telecast live so that we can see how his children react to the obscenity on the channel with the fellow responsible for it sitting beside them.

I am of the strong view that there should be Ombudsman system to control these channels. The present Press Council is self serving and it can never act as Ombursman for these rogue channels.

VENKATA SUBA RAO KAVURI said...

ఈ కొత్త సంవత్సరంలో...బాధ్యతాయుతమైన పౌరులుగా...ఈ పాడు కార్యక్రమాలకు మనం అడ్డుకట్ట వేద్దాం. ఈ అంశంపై చర్చ జరుపుదాం...మన నిరశనను టీ.వీ.యాజమాన్యాలకు తెలియజేద్దాం. అందుకు పట్టణాల వారీ గా కొన్ని వేదికలు (ఫోరమ్స్) ఏర్పాటు చేసుకుందాం. బూతు చూపే ఛానెల్స్ ను బహిష్కరిద్దాం. ఇది నైతిక సమాజం కోసం జరిపే..ఒక పవిత్ర కార్యం. రండి..ఇందులో భాగంకండి. మన సమాజాన్ని, సంస్కృతిని మనమే రక్షించుకుందాం.
ramu gaaru meeku dhanyavaadaalu. neanu mee vemta vumtaa. 9963427510
venkata subba rao kavuri. ex news state coordinator, maa tv.

kvramana said...

annayya
I am all with you in what you are saying. The programmes you mentioned in your post were definitely objectionable. As I understand this only shows the culture of the programme/creative heads in the channels. Either they are too low in their thought or they are above the middle class thought. In one of my earlier jobs in a national newspaper, I had an opportunity to stay in touch with some Page 3 people for a particular assignments. They think there is no problem in showing such scenes and they brand us as middle class hence untouchables. Interestingly, a majority in the lower strata of the society too find no fault with it. The problem is only with people like you and I or the middle class. We think too much about morals and ethics and get engaged in this kind of discussion. Anyway, please consider me too if you are planning to do something on this.
Good Luck
Ramana

durgeswara said...

అనుకరణ తప్ప అలోచనలేని మనకు ఇప్పుడు శస్త్రచికిత్సజరపవలసినదే . మామూలు మందులు పనిచెయ్యవు.

Ramu S said...

ప్రియమైన మిత్రులారా...
ఈ TV-9 వాళ్ళు నిన్నటి నుంచి బూతు చూపిస్తున్నారు. ఈ సాయంత్రానికి ఈ వైరస్ అన్ని ఛానెల్స్ కు పాకింది. ఈ రోజు రాత్రి తొమ్మిది నుంచి పది గంటల మధ్య ABN-ఆంధ్రజ్యోతి, TV-5 లలో కూడా ఏదో ఒక మిషతో బూతు చూపించారు. వేమూరి రాధాకృష్ణ గారి ఛానల్ అయితే...రవి ప్రకాష్ ఛానల్ కన్నా తక్కువ తిన్నామా? అన్నట్లు 'కామసూత్ర' తరహా బిట్లను ప్రసారం చేసింది. వీళ్ళకు కొత్త సంవత్సరం రోజున ఏమి పొయ్యే కాలం వచ్చిందో? ఇందాక ఒక ఛానల్ ఆఫీసు లో ఒక సీనియర్ మిత్రుడు చెప్పాడు..."బ్రదర్, ఈ బూతుకే రేటింగ్ బాగా వస్తుంది." సోదరుడు రమణ చెప్పిన మాట నిజం. మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనుకున్నా సరే...ఈ తప్పుడు ప్రసారాలను మనం అడ్డుకునే ప్రయత్నం చేయాలి. ఇది మన భావి తరాన్ని నాశనం చేస్తున్నది.


ఇకపోతే...శివ గారు చెప్పినట్లు ఈ ఛానెల్స్ నియంత్రణకు ఒక వ్యవస్థ ఉండాలని కోర్ట్ లో పిటిషన్ వేస్తేబాగుంటుంది. అందుకు ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నా మిత్రులు నాకు మెయిల్ చేయండి (mittu1996@gmail.com). ముందుగా మనం టచ్లోఉంది ఒక మీటింగ్ నిర్వహిద్దాం, అందులో కార్యాచరణ ఆలోచిద్దాం.

ధన్యవాదాలతో

రాము

నాగప్రసాద్ said...

ఎప్పుడో మూణ్ణెళ్ళకో, ఆర్నెళ్ళకో ఒకసారి తప్ప టీవీ చూసే అదృష్టం నాకు లేదు. అప్పుడు కూడా ఎక్కువగా ఏ క్రికెట్ మ్యాచో చూస్తాను. అందుకే వార్తా చానళ్ళు ప్రసారం చేసే అశ్లీల దృశ్యాల ప్రభావం ఎంతమేరకు ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేను కానీ, మీరు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తుంటే, ఇది ఖచ్చితంగా మన సంస్కృతిపై జరుగుతున్న దాడిలాగానే కనిపిస్తోంది.

కాబట్టి, ఈ విషయంలో నా వంతుగా నేను కూడా మీకు తోడ్పాటునందించగలనని తెలియజేసుకుంటున్నాను.

Anonymous said...

"చదువుకున్న జనమే...రెచ్చిపోయి...ఓకే అనని అమ్మాయిలపై యాసిడ్ దాడులు చేస్తుంటే..." ఇక్కడ నాదొక సందేహం. పాశ్చాత్య దేశాలలో టీ వీ లలో ఇంత కంటే ఎక్కువ శ్రుంగారమే చూపిస్తారు. కానీ అక్కడ యాసిడ్ దాడులు ఎందుకు జరగవు? ఇండియా తో పోలిస్తే రేప్లు ఎందుకు తక్కువ? మన సమాజం మరీ కన్సర్వేటివ్ గా ఉండి స్త్రీ పురుషుల మధ్య ఆరోగ్యకరమైన ఇంటరాక్షన్ లేకుండా చేయటం వలన, దానికి తోడైన మీడియా, ఇంటర్నెట్ ల లో శృంగారాల వలనా ఇటువంటి స్థితి ఏర్పడుతోంది అనిపిస్తుంది.
నా చిన్నప్పుడు మా ఇంటి పక్క ఉన్న అమ్మాయి ప్రేమ వివాహం చేసుకొంటే,మా ఇంట్లో పెద్దవాళ్ళు, "ఎంత బరితెగించింది" అని మాట్లాడుకోవటం, దానికి కారణం ఆ నాటి సినిమాలే అనుకోవటం నాకు గుర్తు. ఆర్ధిక సరళీకరణ తరువాత ఈ దిశలో మార్పు మరింత వేగవంటమైంది. మీడియా తన వంతు పాత్ర పోషిస్తోంది. ఇక పోతే మనం ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నాం. ప్రకృతి నుంచీ సమాజం,సమాజం నుంచీ వ్యక్తీ విడివడే ప్రక్రియ లో ఇది ఒక స్థితి. సమాజ మూలాల లో మార్పు రాక పోతే సమాజం ప్రయాణించే ఈ దిశ లో కూడా మార్పు రాదు. పెట్టుబడిదారీ వ్యవస్థ లో ఉండి ఈ విషయాల గురించి బాధ పడటం గొంగట్లో తింటూ వెంట్రుకలను వెతికినట్లే.
ఇంకొక విషయమేమిటంటే సామాజిక సాంస్కృతిక విలువలు కాలాన్ని బట్టి మారుతుంటాయి. మన భారతం లో ఒక మనిషికి అనేక మంది భార్యలు, ఉన్నారు. అది ఆ కాలం లో తప్పు కాడు. మనం ఈ కాలపు నైతిక విలువల తో చూస్తే అది తప్పు అనిపిస్తుంది. మనం సరళీకరణ తీసుకు వచ్చిన సంధి యుగం లో ఉన్నాం. మన నైతిక విలువలు మన భావి తరాల వారికి ఆమోదం కాక పోవచ్చు. అలానే కొన్ని వందల లేక వేలతరవాత సమాజం దృష్టి లో సృంగారానికీ అన్నం కలిసి తినటానికీ పెద్ద తేడా ఉండక పోవచ్చు.
అలా అని ఇవాళ మనం నమ్మిన విలువల రక్షణకు ఉద్యమించే హక్కు మనకి లేకుండా పోదు. .నన్ను కూడా చేర్చుకోండి.

Unknown said...

నిజమే మీరన్నది tv9 స్రుతి మించింది,ఆ క్యాలెండరు షూట్ గోవా లో ఎలా జరిగిందో చూపడం తో పాటు
వొక లేడీ anchor చేతే ఇలియానాఅందాల అరపోత మత్తెక్కిస్తున్డి వగైరా కామెంట్స్ అన్ని చెప్పించి
ఆఖర్న మీరు యి అందాల సున్దరి మణులను (కేలండర్ అని భావం అనుకుంటా)సొంతం చేసుకోవాలంటే
వెంటనే స్కోప్ అని టైపు చేసి ఫలానా నంబర్ కి sms చెయ్యండి అంటూ promotional వ్యాపారాన్ని
మొదలెట్టారు .ఇదివరకు రాత్రి పన్నెండు దాటాక పెద్దలకు మాత్రమె అని ప్రసారం చేసే వారు ,
ఇప్పుడు ప్రతి రాత్రి అర్ధరాత్రే వాళ్ళకి .
ఎవరో వొకరు ఎపుడో అపుడు అని మీరు యి విషయం లో చొరవ తీసుకోవడం అభినంద నీయం .
అందరం కలిసి మన నిరసనని మెయిల్స్ ద్వార వోకేసరి అందరం రవిప్రకాష్ కి తెలియ బర్చడం
మన తోలి అడుగు గా భావించొచ్చు .

aravind Joshua said...

sir mee avedana lo ardham undi. neetulu chebutoo bootulu ammukuntunna ee channels ki budhi cheppadam enta late aite anta pramadam mana samajaaniki. I'm with you. Let's fight it.

aravind Joshua said...

sir mee avedana lo ardham undi. lokaniki neetulu cheppi tamu matram bootulu ammukuntunna ee channels ki budhi cheppadam enta late aite anta pramadam mana samajaniki. nenu meeto unnanu. anaitikata to meeru jaruputunna ee poratam lo.

Telugu Movie Buff said...

ఈ వార్త స్రవంతులు రోజు రోజుకి శ్రుతి మించుతున్నాయి.
1వ తారికున వారి కార్యక్రమాలు:
1. Top 9 crimes of year 2009 (ఏంటండి ఇది)
2. వార్తలు
(అరగంటలో 20 నిమిషాలు విదేశాలలో 2010 సంబరాలు గురుంచి. చూపించిన దృశ్యాలన్నీ తెల్ల తోలు జంటలు మూతులు, ఒళ్ళు నాకోవడం)
౩. తెలుగు సినిమా rewind -2009
చక్కగా సినిమా కార్యక్రమం చూద్దాం అనుకుంటే, వాడి స్క్రిప్ట్ బాబోయ్ ....
చిత్రం పేరు చెప్పడం- సినిమా గురుంచి కాక కధా నాయకల గురుంచి వీడి వర్ణన ....ఎంత ఘోరంగా అంటే మరీ ఇద్దరు......
చూపించినవి కూడా అన్ని ఆ సినిమాలలోని మసాల దృశ్యాలు

మీకు అభినందనలు. మనం ఇలా మాట్లాడుతూ కూర్చుంటే లాభం లేదు. పోరాటం చేయలసిందే.
నేను కూడా నా శక్తి మేరకు పాలు పంచుకుంటాను.

admin said...

నేను దూరదర్సన్ న్యూస్ తప్ప ఏమి చూడడం లేదు.. నాకెందుకు వచ్చిన గొడవ

snehit said...

Bondalapati gaaru,
You've made a very good comment. I can understand the co-relation between capitalism and culture but the present day situation is alarming. If you can elaborate your comment on this topic, I'll make it a separate post for the sake of concerned citizens.
Thanks and regards
Ramu

Anonymous said...

అమ్మాయిలే ఈ బూతు ప్ర్రోగ్రాంలు చేయాలని హెడ్లు ఒత్తిడి చేస్తుంటే లేడీ యాంకర్లు ఎంత చిత్రవధ అనుభవిస్తున్నారో? ఇలాంటి ప్రోగ్రాంలు చేయించే ముందు హెడ్ లు తమ కూతుళ్ళను యంకర్ల స్థానంలో ఊహించుకోవాలి.

Kathi Mahesh Kumar said...

షోల రూపకల్పనలో TRP ratings పాత్ర మీకు తెలియనిది కాదు. ఇలాంటి షోలకు అత్యధిక అనధికారిక TRP ఉంటుందనేది సత్యదూరం అస్లుకాదు. అంటే ఇక్కడ సంస్కరించాల్సింది ఎవరిని? ఛానల్స్ నా ప్రేక్షకుల్నా? ఇద్దరినీనా!!!

శ్రీనివాస్ said...

అందరం ఒకే రోజు ఈ చానళ్ళ పని తీరునుఎండ గట్టేలా టపా లు వేద్దాం ముందు ఏమంటారు

Saahitya Abhimaani said...

As a first step, lets ask our cable provider to remove TV9 from the basket of channels.

Step 2 every body write one post card to the channel condemning what they are doing. If there is a deluge of criticism flooding their post box (not mail box) may be they would come out of their self trance.

Step 3 file a PIL in courts. I just wonder why any court is not taking suo motto case of these channels! I hope judiciary proactively reacts and put an end to this. Nobody would object if such channels are pulled up. If such channels talk about press freedom its a shame for the cause of freedom of expression.

admin said...

పోస్ట్ కార్డ్ రాస్తే వాళ్ళు ప్రోగ్రాం జనాల్లోకి బాగా వేల్ల్లిందని అని కుంటారు తప్ప తప్పు తెలుసుకోరు. నాకైతే మనమందరం వీళ్ళ మీద కోర్ట్ లో కేసు వేద్దాం..
ఎంత వరకైనా వెళ్ళాలి. చరిత్ర లో స్వచ్చంద పౌర పోరాటం గా మిగలాలి. ఏది ఏమైనా ఈ మద్య కాలం లో ఎలక్ట్రానిక్ మీడియా న్యాయ మూర్తులు గా ప్రవర్తిస్తూ ( టీవీ 9 అయితే ఇంక తనే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్న పోజు పెడుతుంది.. ) .. వాళ్ళ రేటింగ్ పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు ,,

Anonymous said...

మీ వెనకే మేమంతా. టీవీ 9 తీవ్ర పోకదలకు పోతోంది. నాకు ఆ ఛానెల్ మీద వున్న గౌరవం ఇప్పుడు సున్నా.

Anonymous said...

రాము గారు..
మీరు మీడియా వ్యక్తి కాబట్టి . ఈ బూతును నిరసించే ప్రముఖులనందరిని కూడగట్టి ముందు ఓ ప్రతికా విలేకరుల సమావేశం పెట్టండి. అందులో ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ష్ ను పక్కన పెట్టి న్యూస్ ఛానెల్స్ ను ఎండగట్టండి. ముఖ్యంగా మహిళా నేతలగా టీవీ స్టూడియాల్లో కనిపించే వారిని ఆ మీడియా సమావేశంలో మాట్లాడమనండి. ఒక చిన్న ముందడగు ఇలా వేస్తే బాగుంటుందేమో సూచన.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి