పదిహేను రోజుల పాటు ఛానెల్స్ ను మూసివేస్తే పరిస్థితి చక్కబడుతుంది అని ఆయన సెలవిచ్చారు. అసెంబ్లీ కార్యక్రమాలను మీడియా ప్రసారం చేయడం ఆపాలన్న వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి కుతంత్రంలాంటిదే జే.పీ.గారి సూచన. పందికొక్కు దూరిందని కొంపను తగలబెట్టడమంటే ఇదే. ఇది ప్రజలకున్న సమాచార హక్కును తస్కరించడం, మీడియాకు ఉన్న స్వేచ్ఛను హరించడం.
దీనికన్నా...మంచి మందును మా మిత్రుడు ఒకడు సూచించాడు. ఈ సమస్యకు కారణమైన నాయకులు ఎవరో మనకు తెలుసు కాబట్టి...వారిని అసెంబ్లీ ముందు నిలబెట్టి....కాల్చిపారెయ్యడమో....అందర్నీ కట్టకట్టి బంగాళా ఖాతంలో తోసెయ్యడమో చేయాలి. జే.పీ.గారు సూచించిన దానికన్నా ప్రభావశీలంగా పనిచేసే మంచి మందు కాదా ఇది?
ఎన్నికలకు ముందు...దూరాశతో పుట్టుకొచ్చిన పలు ఛానెల్స్ జనానికి జుగుప్స కలిగిస్తున్నాయి. ఇది ఎవ్వరూ కాదనని సత్యం. వీటికి ముకు తాడు వేసే యంత్రాంగం కావాలని సదాలోచనపరులు కోరుకుంటున్నారు. రాష్ట్రం రగులుతుంటే....అవి అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. పిచ్చి కుక్కల రేసులా...టీ.ఆర్.పీ. రేటింగ్ యావలో పడి ఈ ఛానెల్స్ చాలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాయి. (అందుకే...ఛానెల్స్ యజమానులు, ఎడిటర్స్ సమావేశమై స్వీయనియంత్రణ వ్యవస్థను రూపొందించుకోవాలని ఈ బ్లాగ్లో ఎప్పుడో మొత్తుకున్నా అది అరణ్యరోదనే అయ్యింది. శ్రీమాన్ రవిప్రకాష్ కు కూడా వినమ్రంగా ఆ పోస్ట్ మెయిల్ చేశాను. సారు పట్టించుకోలేదనేది వేరే విషయమనుకోండి.)
ఏ బంగి అనంతయ్యో మీడియా నిషేధం వంటి దుందుడుకు ప్రకటన చేస్తే...పోనీ..పాపం...పెద్దగా తెలీని మనిషి...అనుకోవచ్చు. కానీ..జే.పీ.లాంటి మేధావి ఈ ప్రకటన చేయడం ఆందోళనకరం. ఆయన ఏదో నిస్పృహతో ఇలా మాట్లాడారని భావించి మెదలకుండా ఉండడం బెటర్.
జే.పీ.గారూ....ముందుగా మీరొక మూడు పనులు చేసి ఈ స్టేట్ మెంట్ ఇచ్చివుంటే....మర్యాదగా, బాధ్యతాయుతంగా ఉండేది.
ఒకటి) మీడియా ధోరణులను వాటి యజమానులకు తెలిసే ప్రయత్నం మీరు ఒక్కటైనా చేసారా? ఈ ఘర్షణలు చెలరేగగానే వారితో మీరు ఒక మీటింగ్ జరిపితే ఎంత బాగుండేది! మీరు పిలిస్తే...వారు తప్పనిసరిగా వచ్చివుండే వారు. సమస్య తీవ్రతను వారికి తెలియజెప్పి ఉండాల్సింది. ఏదో...అడ పిల్లల నగ్న శరీరాలు జననానికి చూపి...నాలుగు ప్రకటనలు సంపాదించాలని అనుకునే...పరమ కర్కోటక జాతికి చెందిన పశువులు ప్రవేశించిన రంగమిదని మీరు మరిస్తే ఎలా?
రెండు) మీ లోక్ సత్తా వేదికగా మీడియా పాత్రపై అన్ని జిల్లాలలో చర్చ నిర్వహిస్తే బాగుండేది. మీడియా యజమానులకు దానివల్ల కొంత బుద్ధి వచ్చేది.
మూడు) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు మీడియా నియంత్రణ గురించి లేఖలు రాసి జనాలను చైతన్య పరచాల్సింది.
అయ్యా...జే.పీ.గారూ మీరు ఈ రాత్రి 'మహా టీవీ' చర్చలో చెప్పినట్లు...ప్రచారం అనేది రాజకీయనేతలకు ఆక్సిజన్ లాంటిది. అది లేనిదే...వారూ, మీరూ బతకలేరు. ఇప్పుడు మీకు మనసుబాగోలేక...మీడియా ను కొన్ని రోజులు నిషేధీద్దామని అంటున్నారు. రేపు మరొక సమస్య వస్తే...ఆ లగడపాటో, కే.సీ.ఆరో మరి కొన్ని రోజులు నిషేదిద్ధమంటారు. అప్పుడేమి చేస్తారు?
సార్...మీడియా చేస్తున్న అఘాయిత్యాలు కోకొల్లలు. దీని విపరీత పోకడల గురించి రోజూ నెత్తి నోరూ బాదు కుంటున్నామిక్కడ. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే...సమస్యకు మూలం ఆలోచించండి, ప్రక్షాళనకు నడుం బిగించండి. అంతే కానీ.. సగటు రాజకీయ నాయకుడిలాగా నోటికొచ్చింది మాట్లాడి...ప్రజాస్వామ్యంలో ఒక కీలక వ్యవస్థకు మాత్రం చిక్కులు తేకండి.
20 comments:
మీరు రాసిన దాంట్లో స్పష్టత లేదు.
"ఈ బ్లాగ్లో ఎప్పుడో మొత్తుకున్నా అది అరణ్యరోదనే అయ్యింది".
"రోజూ నెత్తి నోరూ బాదు కుంటున్నామిక్కడ."
అసలు ఒక బ్లాగు పరిధి ఎంత అనుకుంటున్నారు? మీ బ్లాగు ఎంతమంది చదువుతారు? కనీసం కొన్ని వందలు కూడా దాటదు ఇది చదివేవారి సంఖ్య. ఇక్కడ నెత్తీ నోరూ మొత్తుకోవడం వల్ల మార్పు వచ్చేస్తుందని ఆనుకుంటున్నారా? మహా ఐతే చదివిన వాళ్ళు కాసేపు ఆలోచిస్తారేమో. దీనితోనే మార్పు కోరుకుంటే అంతకన్నా తెలివితక్కువతనం ఇంకోటుండదు.
చెత్త పోస్టు :(
జేపి గారు చాలా ఆలస్యం గా చెప్పారు ఈ విషయం మా స్నేహితుల మద్య యెప్పుడో అనుకున్నాం ..మీడియా మనిషిగా మీకు నచ్చక పోయి వుండొచ్చు గానీ its fact
జేపి చల్లా ఆలస్యం గా చెప్పారు ఈ విష్యం మీదియా మనిషిగా మీకు నచ్చకపోవచ్చు గాని ప్రజలు ఈ మద్య ఇదే అనుకుంటున్నారు ..మా స్నేహేతులమ్ కూడా ఈ టాపిక్ పైన ఇలానే అనుకున్నాం మీరు ఈ ఛానెల్స్ లో దిస్కేకషన్స్ చూడండి నలుగురు ఎగస్పారిటీ వాళ్ళని తేవడం గొడవ పెట్టటం వారి అభిప్రాయాల పేరుతో వాల్ల తో నానా విధాలైన కామెంట్స్ యెదుట వాల్ల మీద చేయించడం నిప్పు రాజేయడం ...అది చూస్తూ జనం వెర్రెక్కి పోతున్నారు సార్ ..
జేపీని ఉతికి ఆరేశారు. శభాష్. కానీ చివర్లో ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఓ కీలక వ్యవస్థకు చిక్కులు తేకండని జేపీకి వినతి చేశారు. బాగా లేదు. అతగాడు మీరు భయపడినంత చిక్కులు తేలేడు. ఏతావాతా ఆ పని మీ మీడియాతోనే సాధ్యమవుతుంది.. జేపీనీ కానీ.. ఇంకే రాజకీయ నాయకుడిని గానీ తిట్టే ముందు మీరు సరిగా ఉన్నారా లేదా చూసుకోండి.
మీడియా బ్రష్టు పట్టిపోతుందని ఎప్పటి నుంచో అందరూ ఘోషిస్తున్నరు. పెయిడ్ ఆర్టికల్స్ పేరులో రాజకీయ నాయకులు దగ్గర కోట్ల రూపాయిలు ఆదాయపు పన్ను లెక్కలకందకుండా నొక్కేశారు. సిగ్గు శరం లేకుండా. నిన్నగాక మొన్న శవాల మీద కాసులేరుకున్నట్టు లగడపాటి దగ్గర డబ్బులు తీసుకున్నరు. తెలంగాణ వాదుల దగ్గరా మొహమాట పడ లేదు. పత్రికా స్వేచ్ఛ పేరుతో చేయాల్సిన రంకు పనులన్నీ చేస్తూ.. బొంకులన్నీ పలుకుతూ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నరు. అయినా మీకు నియంత్రణ రేఖ ఎవరూ గీయడం లేదు. పోనీ మీరైనా అలాంటి రేఖను గీసుకునే ప్రయత్నం చేశారా . అంటే అదీ లేదు. వాడు వేస్తున్నాడని వీడు.. వీడు వేస్తున్నడాని వాడు.. నెపాన్ని ఇంకెవరి మీదకో నెట్టేస్తూ... యెధవ సూక్తులు చెబుతారు. టీఆర్ పీ తగ్గిపోతుందని ఒకడు.. భాబోయ్ సర్కులేషన్ అని ఇంకొకడు... యావ ఎప్పడూ కాసులు మీదే.
ఏమంటే ప్రజస్వామ్యంలో కీలక వ్యవస్థ అని ఫోజు కొడతారు. కానీ మొత్తం వ్యవస్థ కుళ్లిపోయింది. దాన్ని మీలాంటి జర్నలిస్టులు బాగుచేస్తరో.. చేయగలరో నాకు తెలీదు గానీ.. ఒకరిని వేలెత్తి చూపిస్తున్నప్పడు నాలుగు వేళ్లు మనవైపు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి.
జేపీ ఏ సందర్భంలో అన్నాడో నాకు తెలీదు. గానీ జేపీకి పత్రికా స్వేచ్ఛ మీద పూర్తి నమ్మకముంది.. అతడు అలాంటి వ్యక్తి కాదు. పొరపాటున ఓ మాట జారుంటాడు. దాన్ని పట్టుకుని ఈ స్థాయిలో ఏకడం మీ స్థాయికి సమంజసమా ఒక్కసారి ఆలోచించండి.
సర్...నమస్తే.
ఒక చిన్న విషయం. గత ఎన్నికలలో నా వోటు కాక, మా మిత్రులందరి ఓట్లు పనిగట్టుకుని మరీ లోక్ సత్తాకు వేయించాను. జే.పీ.గారిని ఏకగ్రీవంగా గెలిపించాల్సిన ఆవశ్యకత మీద 'ఈనాడు' ఎన్నికల పేజీకి ఒక వ్యాసం కూడా సమర్పించాను. మీడియా విషయంలో జే.పీ.గారి ధోరణి మాత్రం అభ్యంతరకరంగా ఉంది నాకు. రామోజీ రావు--మార్గదర్శి గొడవ అప్పుడు ఆయన తీరు ప్రశ్నార్ధకంగా ఉంది.
మీడియా సంస్కరణల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా...ఒక్క సారిగా నిషేధిద్దామంటే (కొన్ని రోజుల పాటైనా) అది ఏ రకంగా సమర్ధనీయం? ఆ సూచన చేయడానికి ముందు...మీడియా స్వీయనియంత్రణ కోసం ఆయన ప్రయత్నించి వుండాల్సింది. చేతి మీది పుండుకు చికిత్స కోసం ప్రయత్నం చేయకుండా...చెయ్యి నరికేద్దాం అంతే ఎలా? మీడియా అతి చేస్తున్నదనడంలో సందేహం లేదు కానీ...మీడియా ఆబ్సేన్స్ లో రాజకీయులు మరింత చెలరేగిపోతారు. ఇంకా నష్టం కలిగిస్తారు. ఇది ప్రజాస్వామ్యానికి నష్టమని నా బాధ. అంతే తప్ప జే.పీ.నాకు అయిస్టుడు కాదు. గత ఎన్నికలప్పుడు హేమ లోక్ సత్తా బీట్ చూసేది. చాలా సార్లు... జే.పీ.గారిని ఇంటర్వ్యూ చేసి ప్రసారం చేసింది. మాకు ఆయన అంతే గౌరవం.
ఇకపోతే...మీడియా మీద ఇక్కడ జరుగుతున్న చర్చల గురించి చదవమని, తమ వంతుగా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశ్యంతో స్వయంగా జే.పీ.గారికి, ఆయన మనుషులకు ఎస్.ఎం.ఎస్.లు క్రమం తప్పకుండా పంపుతున్నాం. ఆయన లాంటి సచ్చరితుడు చొరవ చూపుతారన్న నమ్మకంతో అలా చేసాం కానీ...లాభం లేదు. ఈ పోస్టు ఆయన మీద ద్వేషం/ కోపం తో రాయలేదు. అలాంటి గొప్ప వ్యక్తి ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వడం...తమ గుట్లు మీడియా బైట పడేస్తున్నదని బాధపడే ఇతర నాసిరకం/అవినీతి నాయకులకు ఊపునిస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్చగా చేసే కొందరు పోలీసు అధికారులకు ఊతమిస్తుంది. అన్ని వ్యవస్థలు దారుణంగా ఫెయిల్ అయిన నేపధ్యంలో కాస్త సంస్కరించుకోవడానికి వీలున్నది మీడియానే. ఆ పని జే.పీ.లాంటి వారు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది.
--రాము
What exactly is media? We should define the word media first before the discussion on it. Just because somebody starts a rag for ads or purchases some satillite time again for ads, can we call such "things" as media?? Lets not show professional courtesy to such wagabonds. As a follow up for this, the word "News" also should be defined. What can be termed as news? What cannot be? What is panel discussion, what are the rules for such panel discussion? who should be called for such discussions? All these matters were given a "let go" by the present channels and news papers and if anybody who was quite irritated and getting depressed by the ill effects of the sponsored propaganda through these channels and papers and calls for a ban, we should understand the reasons.
I will give a flip point to this. May be by over acting and abusing the media, some vested interest groups are trying to force the society at large to come to a conclusion that media is bad and spontaneously demand for banning?!
There may still be some honourable people left in the news papers/media who should take the lead to clean the rot. What Press Council is doing in all this, just sleeping?? or taking the donations from all the channel owners??
If any Govt. Dept or politician is behaving against public policy and the spirit of law, we go to news papers to express our views and to condemn. But when media itself is misbehaving, to whom should we go? Thats why even people like JP are propagating extreme steps.
నేను జే పీ గారు అలా అన్నారో లేదో చూడలేదు. కానీ చూడబోతే అది ఉత్తమమని అనిపిస్తోంది. స్వీయ నియంత్రణ, క్రమ శిక్షణ పక్కన పెట్టండి కనీసం, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు టీవీ చానల్ల వారు. అసలే దారుణంగా ఉంటె పరిస్తితి, అన్నీ ప్రజలను కేవలం రెచ్చ గొట్ట డానికే పనికొచ్చే పరిజ్ఞానం లేని వారితో పసలేని చర్చలు, వార్తా కథనాలు దాదాపు అన్నిటిలోనూ పోటీలుపడి మరీ ప్రసారం చేస్తున్నారు. ఇలాటి పరిస్తితులలో ఇంకా నష్టం జరగకుండా ఉండాలంటే ఇలాటి సెన్సార్షిప్ ఉచితం అనిపిస్తోంది. లేకపోతె మరి స్వేచ్చ ఉందికదా అని ఇంత దుర్వినియోగం చేస్తారా?
జెపి ఎందుకన్నాడో పక్కన పెడితే, ఈ మధ్య ఎక్కడ చూసినా మీడియా నే తిడుతున్నారు. అస్సలు భాష కానీ, సామాజిక విజ్ఞానం లేని పిల్ల జర్నలిస్టులు ఎడాపెడా న్యూస్ ఇస్తుంటే, అంతకంటే బుర్రలేని ప్రోగ్రామ్ ఎడిటర్లు దానిని రకరకాల మ్యూజిక్ పెట్టి చూపించటం అందరికీ నచ్చుతుందనుకోవద్దు.
జెపి చెప్పినదాంట్లో ఒక నిజముంది. అది మీరు చెప్పిన మొదటి పేరాలోనే వుంది. టీవీలూ ప్రతీ వెధవనీ కవర్ చెయ్యకపోతే ఈ పిచ్చి ప్రేలాపనలు ఎప్పుడో ఆగేవి, కేవలం బుర్ర వున్న వాళ్ళు , బాధ్యత కలిగిన వాౡ మాత్రమే చర్చించేవాళ్లు. ఇప్పుడు పిల్ల నాయాల్లు కూడా కెమెరా కనిపిస్తే రెచ్చిపోయి అదేదో అనేస్తున్నారు.
మీరు ఎంతసేపూ జే.పీ అంటారు కానీ మీడియా చేస్తున్న రచ్చ వలన ఎంత చెడు జరుగుతుందో ప్రస్తావించట్లేదు. మీ కమ్యూనిటీ(Journalist) పక్షపాతం కావొచ్చు. అయ్యా! మీడియా చేస్తున్న చండాలం చెప్పనలవి కానిది, గోరంతలు కొండంతలు చేసి, ఎవడో ఏదో అంటే వీళ్ళు దానికి వంద definition లు ఇచ్చి లేని పోనీ chaos కలిగించి చేస్తున్న దరిద్రం మీకు తెలియనిది కాదు.
ఇలాంటి సున్నితమైన సమయంలో పదిహేను రోజులు నిషేధం మంచిదే. లేకపోతే K.C.R చేసే కంపుకి ఈ జనం పిచ్చకి, మీడియా రచ్చ కి హద్దు ఉండదు.
పోనీ మీరు చెప్పండి ప్రస్తుత తక్షణ తరుణోపాయం, మీడియా ని కంట్రోల్ చెయ్యడానికి ఏం చేయాలో? తక్షణం అంటే తక్షణం!
ఒక రకంగా ఇద్దరు కరెక్ట్ యే .
jp gari point of view:
in our childhood if we donot behave wrongly or do so much nuisance in home sometimes our mother used to tell that "ఒరేయ్ ఇవాళ నీకు అన్నం పెట్టాను" ..
i think reason is so that we may realize value of food and never do the same mistake again. alage media vallaki kuda vallu chestunna tappulu teyiya cheppadaniki ela ani vundavachhu.
ramu garu point of view:
పళ్ళు కొరుకున్నామని పళ్ళని వదులుకోలేము కదా లాంటిది అయన వాదన.
solution: ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేసుకోవాలి.
రామూ గారు...
మీడియాను బాగుచేసే బాధ్యత జీపీ మీద నెట్టడం ఏ మాత్రం బాగా లేదు. మీ దగ్గరున్న కుళ్లును మీరు బాగు చేసుకోకుండా ఆ బాధ్యతను ఇంకొకరి మీదకు నెట్టడం సరికాదు. నిజంగానే బాగు చేసుకోవాలన్న నిబద్ధత ఉంటే . జర్నలిస్లులు.. పత్రిక యజామానులు కూర్చుని ఓ నియంత్రణ రేఖను పెట్టుకోవలి.. లేదు.. మేం పెట్టుకోం.... విలువులనైనా వదులుకుంటాం గాని... మా టీఆర్పీలను, సర్కులేషన్లను మాత్రం వదులుకోం.. అంటారా....
ఎవడో ఒకడు ఒక రోజు వస్తాడు. తాళాలేసిపోతడు. చంక నాకిపోతారు జర్నలిస్టులందరు.
ఇట్లు..
మూడో ఎనానిమస్
జేపీగారితో ఏకీభవిస్తున్నాను. ఇటీవలి అరాజకానికి సగం బాధ్యత మీడియాదే. ప్రత్యక్షంగా, ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నది మీడియానే. మన మీడియా రాజకీయ నాయకుల్ని మించిపోయింది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, నా వ్యక్తిగత పరిధిలో అందఱూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. జేపీగారు మంచివారు, సహృదయులు కనుక ఒక 15 రోజులపాటు మీడియాని మూస్తే చాలన్నారు. నాకే అధికారముంటే మొత్తం మీడియాని నిర్దాక్షిణ్యంగా జాతీయం చేస్తాను.
ఇంకో మార్గం ఉంది. టీవీ వాళ్ళని చెత్త ప్రసారం చేయనివ్వండి. జనానికి బోర్ కొట్టి వాళ్ళే చూట్టం మానేస్తారు. లేదా సంచలనాత్మక వార్తలకు బండబారి పోతారు. జనాలు బావోద్వేగాలకు స్పందించరు. దీనిపైనా ఇమ్యునిటీ పెంచుకుంటారు. రాజకీయ నాయకులు మరిన్ని డబ్బులు ఖర్చు పెడితే గానీ జనాలు బూత్ లకు వెళ్ళి ఓట్లు వేయరు. అంతా మన మంచికే.
Dear Ramu garu,
I am very glad to visit your site for the first time and sorry for the delay as my system got some trouble.You are rendering good service to the proffession of journalism as it is giving foul smell due to heavy pollution in the print and electronic media.It may be recalled that recently the senior Rural editor of The Hindu,Sainath has initiated discussion on the paid news during the recent elections and every one started thinking and talking about iT.I feel with the people like you and Sainath the proffession of journalism will be get a new look by clearing atleast some of the pollution in the proffession if not all through your writings,blogs etc.We are all with you for ethics,human,moral and proffessional values in your proffession.
Regarding JP's comment on the closing of media it was an emotional comment on nthe electronic media today.Just because some political parties are creating problems in the society through bandhs,strikes,etc resulting in troubles and problems to the common man is it proper to ban the parties for a few months?
There is good,bad and ugly in every proffession and every society and every individual and it does not mean that the bad should be banned and close their shops!The role of intellectiuals mlike JP is to reform and tranform the bad into good through their best efforts,experience and skill and through legal means only.If the media is closed for a few days we have to follow the same principle to other proffessions too and I feel if the policy of JP is followed we have to close every proffession for a few days thus sociery becoming zero as JP too has to close his office as he may not be hundred percent perfect and good citizen as there may be good,bad and ugly in him as we come across many differences with his own party cadre.Thus closing media for a few days is just running away from the problem without any efforts to rectify it.
It is true that the proffession of journalism is so degenerated in these days that there are no words to descrcibe.It is the most corrupt,commercial and inhuman proffession of India today as it hurts the mind and heart mercilessly for the selfish purposes.A Journalist is a mirror of the society but tragically a journalist has become mirror of himself or herself leaving the society to chaos.Nowadays every one knows about the journalists .
But there are many journalists who are sincere,dedicated,devotional towards proffession leading a very simple and sober life as they never succumb to unethical,corrupt practices but they are being side tracked due to one reason or other.Kudos to them.The problem comes only with a few blacksheep in the proffession who are tarnishing thev image of proffession as they are succumbing to the pressures of coruption,commercialism and temptations of covers,gifts,etc from the politicians,business people,contractors and some mafia gangs,land grabbers,goverment official dealinmg heavy budget etc thus shaking the foundation of the fourth pillar of the democracy.But who is bothered to control and contain and prevent the shaking of the pillar and every one is bowing the head infront of these people due to one reason or other.But Dr.JP's treatment to the chronic,familial disease of the media is wrong as it never touches the disease properly as the doctor wants to close the clinic to keep away from the patient!
Jaya Prakash Reddy,Nalgonda,AP,INDIA
మొదటి సారి మీ బ్లాగులొ ఒక టపా అతి అసంబద్ధంగా వుందనిపించింది. మీరు కూడా సగటు మీడియా లాగే వాస్తవాలని వక్రీకరించారు తమ దాకా వచ్చే సరికి.
ఆయన ఒక 15 రోజులు చానెళ్ళను మూసేస్తే బాగుండు అనిపించింది అన్నారు గాని, మూసెయ్యమనలేదు. సమస్య తీవ్రత చెప్పటానికి అన్నారే గాని మీరు అదేదో ఆయన డిమాండు చేసినట్టు విశ్లెషణ చేసిపారేసారు.
తాడేపల్లి గారూ -- వొద్దు బాబోయ్ ! అపుడు పొద్దస్తమానూ సోనియా మొహం, మన్మోహన్ మొహం చూడాలి టీ.వీ.లో ! వాళ్ళేం చేసారు ? రాహుల్ ఇవాళ స్నానం చేసాడా లేదా - ఇవే వార్తలు ఉంటాయి. ఇలా రక రకల చానెళ్ళుంటే సాయంత్రం టైం-పాస్ గారంటీ. పండక్కి నలుగురూ కలిస్తే, పేకాడుకోవడం మానేసి, వార్తల కబుర్లే చెప్పుకుంటున్నారు. ఇదో New(s) ట్రెండ్ !
dear ramu,
i have gone through ur article
what is jp without media support today
OK if JP was given exposure in media, JP should keep quite even when media is misbehaving. Is it you scratch my back I shall scratch your back policy!!!!!! Because of such give and take policies only all our institutions are going into comatose position.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి