Thursday, May 20, 2010

రాణి ఎలిజబెత్ మరణించారని 'జోక్' చేసిన బీ.బీ.సీ. రేడియో డీ.జే.

టీ.వీ.స్టూడియోలలో యాంకర్లు-ప్రజెంటర్లు, రేడియో స్టేషన్లలో డిస్క్ జాకీ (డీ.జే.)లు ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోతే...చాలా కష్టం. లైవ్ లో....ఆ టెన్షన్లో...హడావుడిలో, ఆ కెమెరా లైట్ల తిమ్మిరిలో మతి ఒక్కసారి భ్రమించినా...చెడు మాట నోరుజారినా ఇంతేసంగతులు. బీ.బీ.సీ.రేడియో జాకీ ఒకరు రాణి ఎలిజబెత్ మరణించారని లైవ్ షో లో కుళ్ళు జోకు వేసి 'రాయల్'గా ఇరుక్కున్నాడు. చివరకు ఉజ్జోగం పోగొట్టుకున్నాడు.
 


సోమవారం మద్యాహ్నం పూట వచ్చే ఒక హాస్యభరిత ప్రోగ్రాం లో డానీ కెల్లీ అనే 39 ఏళ్ళ డీ.జే. (పక్క ఫోటో, courtesy: bbc.co.uk) ఉన్నట్టుండి చేసిన ఒక ప్రకటన బ్రిటన్ లో సంచలనం కలిగించింది.  "Sorry to break this news, Queen Elizabeth has indeed died," అని డానీ చెప్పాడు. అంతటితో ఆగకుండా...సంతాప సూచకంగా అన్నట్లు వాళ్ళ జాతీయగీతాన్ని ప్లే చేసిపారేసాడు. అది విన్న జనం ఒక్క సారి కంగుతున్నారు. ఈ జనస్వామ్య వ్యవస్థలోనూ రాచరికపు సుగంధాన్ని ఆస్వాదిస్తున్న నవీన నాగరిక బ్రిటిష్ జనం కూడా ఈ వార్త నిజమా అని విస్తుపొయ్యారు. రేడియో రంగం లో పదేళ్ళ అనుభవం ఉన్న ఆ డానీ గారికి కావలిసింది అదే. ఛీప్ ట్రిక్. ఫక్తు అనైతిక జర్నలిజం. 

పాపం ఆ పక్కనే ఉన్న ప్రొడ్యూసర్ 'hey...you can't say that,' అని వారిస్తున్నా...మన నోటితీట డానీ పట్టించుకోలేదట. దీన్ని తీవ్రంగా పరిగణించిన బీ.బీ.సీ.ఈ వెర్రి జోక్ వేసినందుకు చాలా సారీ లు చెప్పి 'చావు'తెలివితేటలు ప్రదర్శించినందుకు డానీని ఇంటికి సాగనంపింది. 
మర్నాడు డానీ స్థానంలో ఆ ప్రోగ్రాం చేయడానికి వచ్చిన మొల్లి గ్రీన్ బీ.బీ.సీ.తరఫున ప్రజలను క్షమాపణలు వేడుకున్నారు.

ఈ ఘోర తప్పిదం చేసిన డానీ ఈ వృత్తిలోకి రాకముందు పాతకార్లు అమ్మేవాడట, వంట మనిషిగా పనిచేసే వాడట. ఒక సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ లో ఉన్న మాటను మాత్రమే తాను ఉటంకిన్చానని డానీ చెప్పాడట. ఈ తప్పు మన సోదర సోదరీమణులకు ఒక గుణపాఠం కాగలదని ఆశిస్తూ...


(నోట్: We appreciate it if you can participate in the survey mentioned in the previous post)

9 comments:

Saahitya Abhimaani said...

ఇది చూస్తె జ్ఞాపకం వస్తున్నది. ఆకాసవాని పాట్నా కేద్రం నుంచి అనుకుంటాను 1990 లో లైవ్ లో చిన్నపిల్లలా కార్యక్రమం జరుగుతొందిట. పిల్ల చేత పాటలు పాడిస్తున్నారుట. ఒక పిల్లో పిల్లాడో చంగున ఒక పాత అందుకున్నా డు/ది ట. పాతెమితో తెలుసా!

गल्ली गल्ली में शोर है, राजीव गांधी चोर है

"సందు గొందుల్లో గోల, రాజీవ్ గండి దొంగ అని"

నిర్ఘాంతపోయ్యారు కార్యక్రమ నిర్వాహకులు. కాని అప్పటికే వేలమంది పాత విని నవ్వుకున్నారు. ఆ సమయంలో బోఫోర్సు గురించి చాలా గోలగా ఉన్నది.

ఈ విషయంలో ఎన్ని తలలు దొర్లాయో కాని, ఆకసవాని వారు అప్పటి నుంచి లైవ్ కార్యక్రమాలను చెయ్యటం ఆపి రికార్డెడ్ మాత్రమె ప్రసారం చెయ్యటం మొదలెట్టారుట.

మీరు చెప్పిన D J చిన్న పిల్లాడేమీ కాదు చిలకలా ఎవరో చెప్పినది వల్లించటానికి.

నా ఉద్దేశ్యంలో, లైవ్ కూడా ఫీడ్ ప్రసారం కావటానికి ఒక పది సెకండ్లు వ్యవధి ఉండాలి. దీనిని వింటూ ఒక చాకు లాంటి వ్యవహర్త ఉండాలి. లైవ్ లో చెత్త వాగుతుంటే ఒక బటన్ నొక్కి అది ప్రసారం కాకుండా ఆపెయ్యాలి. కాని ఆ వ్యవహర్త చాలా హుషారుగా ఉండాలి. లేకపోతె వాడి తలా తెగి పడుతుంది.

Anonymous said...

There are many such DJs in our country too as there were wrong scrollings on Vajpayee's health,Rajashekhar Reddy's helicopter landing safely and returning by a car and so many other things which we cannot count them.To create sensation is the sadistic and inborn quality of the journalists,reporters, the news channels in particular.I donot understand how the reporters enjoy the effects of their sensational news flashes!

JP.

ram said...

రాము గారు మే ప్రయత్నం బాగుంది! ఇలాంటివి మంచి ఇన్ఫో.

Anonymous said...

ఆయన పాత వృత్తి ఏదైనా మాటలని అమ్ముకోడానికి వచ్చినపుడు జాగ్రత్తగా ఉండాల్సిందే!

ఆంధ్ర జ్యోతి పేపర్ వారం పది రోజుల క్రితం గాయని ఎస్.జానకి గొంతు మూగవోయిందని (అంటే గొంతు వ్యాధి వచ్చిందని కాదు)పశ్చిమ గోదావరి ఎడిషన్లో రాసి పారేసింది. పైగా పశ్చిమ తో జానకి అనుబంధం మరువలేనిదనీ, ప్రజలు జానకి మృతి వార్తను జీర్ణించుకోలేకపోతున్నారని విషాదం గుమ్మరించింది.మరి ఇంత ఒళ్ళూ పై తెలీకుండా వార్తలు రాయడాన్ని ఏ జర్నలిజమంటారు? టీవీ ఛానెళ్ళ వాళ్ళు ఆ న్యూస్ పేపర్ ను చక్కగా జూమ్ చేసి చూపిస్తుండగానే నెట్ ఎడిషన్లోంచి ఆ వార్తను తీసివేశారట.

ప్రముఖ వ్యక్తుల గురించి, అందునా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తుల గురించి ఇటువంటి వార్తలు ఎటువంటి నిర్థారణా లేకుండా ఎలా ప్రచురిస్తారంటారు?

Anonymous said...

annayya, manavaallu emee takkuva tinaledu. Monnatiki monna andhra jyothi west godavari edition lo S.Janaki chanipoyindani santaapa vartha vesesaru! Inka BBC vaallu nayam charya teesukunnaru. AJ lo vartha raasina, vesina vaalla meeda emi charya teesukunnaro teliyadu.

Ramu S said...

boss,
can anyone send me the scanned copy of the news related to janaki's "death"? Then we can make story for record sake. It is one of the biggest blunders of Telugu media.
ramu

Anonymous said...

ramu garu radio announcers/anchors ni VJ(video jockey)anaru.they are called RJ's (Radio Jockey).sorry for correcting you

Raja

Anonymous said...

Our Venkata Krishna team too did the same. They too blamed it on that website that day after provoking people to attack Reliance outlets. Any idea what happened to that case?
Any scope of doing a follow up in your blog on the case since the CBI has now clarified that there was no conspiracy angle and it was an accident?

సుజాత వేల్పూరి said...

:-))

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి