వారమంతా హడావుడిగా ఉండే హైదరాబాద్ ఒక్కసారిగా అలిసిసొలసి పెద్ద వేప చెట్టు కింద సేదతీరినట్లు అయిపోతుంది...ఆదివారం పూట. రోడ్లు కాస్త ఖాళీగా కనిపిస్తాయి. జనం రిలాక్స్ గా కనిపిస్తారు. ఇళ్ళ నుంచి బిర్యానీ వాసన వస్తుంటుంది. అందుకే ఆదివారం ఉదయం వాకింగ్ మిగిలిన రోజులుకన్నా భిన్నమైనది.
ఈ ఆదివారం ఉదయం...వాకింగ్ చేసాక...దగ్గరిలోని టేబుల్ టెన్నిస్ హాల్లో మా వాడు ఎలా ఆడుతున్నాడో అని చూసేందుకు వెళ్ళాను. గతంలో రోజూ అందులోకి వెళ్ళేవాడిని కానీ....ఈ మధ్య వివిధ కారణాల వల్ల ఆ ఆట మీద మనసు కాస్త విరిగిపోయింది. వీడిని భారత్ తరఫున ఆడేవాడిగా చేయాలని ఎన్నో ఆశలు ఉండేవి. ఈ వ్యవస్థను, ఇందులో ఓవర్ ఏజ్ గొడవను, రాజకీయాలను, దేశభక్తి లేని అమాంబాపతు జనాలను చూశాక...మనం ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నామేమో అని అనిపించింది. ఇది వేరే విషయం.
సరే..ఆ హాల్లోకి వెళ్ళాక ఇద్దరు ఐ.టీ.ప్రొఫెషనల్స్ ఆట మధ్యలో విశ్రాంతి సమయంలో మాట్లాడుకుంటూ కనిపించారు. చర్చ చాలా సీరియస్ గా సాగుతోంది. దేశంలో స్పోర్ట్స్ చంకనాకి పోవడానికి (అంటే..డెవలప్ కాకపోవడానికి. క్షమించాలి.) కారణాలు ఏమిటన్న దానిపై అర్నబ్ గోస్వామి 'టైమ్స్ నౌ' ఛానల్ లో జరిపిన చర్చ గురించి ముందు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత చర్చ తెలుగు ఛానెల్స్ లో యాంకర్స్ మీదికి మళ్ళింది.
అందులో ఒక పెద్ద మనిషి...TV-9 స్టార్ యాంకర్ రజనీకాంత్ (పక్క ఫోటో) కు వందకు వంద మార్కులు వేశారు. "అతను చాలా స్రూడ్. ప్రశ్నలు చాలా తెలివిగా ఉంటాయి. భయం లేకుండా ప్రశ్నలు అడుగుతాడు," అని ఆయన చెప్పారు. తాను చూసిన రజనీ ప్రోగ్రామ్స్ ను ఆయన వివరిస్తూ ఆ యాంకర్ గొప్పతనాన్ని వేనోళ్ళ కీర్తించారాయన. ఇక అటు పక్క ఉన్న ఐ.టీ.మనిషి విశ్లేషణ మొదలయ్యింది.
"సార్...మీరు ఎన్నైనా చెప్పండి. కొమ్మినేని (N-TV చీఫ్ ఎడిటర్) శ్రీనివాస రావు (ఈ పక్క ఫోటో) ది బెస్ట్ యాంకర్. తడుముకోకుండా భలే మాట్లాడతాడాయన," అని ఆయన కితాబు నిచ్చారు. ఆయన జోక్ గా అంటున్నారేమో అనుకున్నా. కాని ఆయన సీరియస్ గా చెప్పిన మాట అది. ఆ విశ్లేషణ, సంభాషణ అలా చాలా సేపు సాగాయి. కొమ్మినేని గారు టీ.వీ.లో పత్రికా భాష మాట్లాడతారని, నవ్వకూడని చోట నవ్వుతారని నేను అనుకుంటాను. ఆయనకూ విశేషంగా అభిమానులు ఉన్నారు. ఆయన చర్చకు ఎంచుకునే ప్యానల్ పకడ్బందీగా ఉంటుందని మిత్రులు అంటారు.
నామటుకు నాకు డైనమిక్ యాంకర్ గా అనిపించేది TV-9 CEO రవి ప్రకాష్. అతను కళ్ళతో, నవ్వుతో, స్పష్టమైన భాషతో ఆకట్టుకుంటాడు. ఆ ఛానల్ ఎదుగుదలకు అతని విగ్రహ పుష్టి కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.
రవి ప్రకాష్ తర్వాత చెప్పుకోవాల్సింది HM-TV లో కనిపించే బాలకృష్ణ అనే కుర్రవాడు. అతను సూపర్బ్ యాంకర్. ఆ స్వచ్ఛత, సమయోచిత మాటలు, నగుమోము బాగా నచ్చుతాయి మాకు. అతను కష్టపడి, పట్టుపట్టి మరీ యాంకర్ అయ్యాడట. ఒకసారి లైవ్ లో అతనితో కే.సీ.ఆర్. నోరు జారి మాట్లాడితే....నాకు ఒళ్ళు మండింది. ఈ లోపే ఆ అబ్బాయి...జాగ్రత్తగా మాట్లాడి...తమ ఛానల్ ఏ పక్షమూ వహించదని భలే కట్ చేశాడు.
మొదట్లో బాగుండే స్వప్న గారు నానాటికీ దిగదుడుపులా అయిపోతున్నారు. కారణాలు ఏమిటో గానీ...ఆమె మొహం బాగా దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నది. మాటలు కూడా ముద్ద ముద్దగా వస్తున్నాయని నాకు అనిపిస్తున్నది. మూడు రోజుల కిందట ఆమె 'సాక్షి' ఛానల్ లో నిలబడి వార్తలు చదువుతుంటే...ఒకటే తడబాటు, అస్పష్టత. ప్రగతి అనే యాంకర్ గారు చదివితే కూడా బాగుండేది.
సౌజన్య అనే చలాకీ యాంకర్ అప్పట్లో ఒక మెరుపు మెరిసారు. 'ఈ-టీ.వీ' తో అరంగేట్రం చేసిన ఆమె.. తర్వాత N-TV లో చేరారు. తర్వాత i-news లోకి దూకారు. అక్కడ కొన్ని రోజులు చేసి...Mahaa news లో చేరారు. తెలుగు టీ.వీ.కి దొరికిన మంచి ఆణిముత్యం ఈమె అనడంలో సందేహం లేదు. i-news లో ఉన్న రోజా గారు కూడా మంచి న్యూస్ రీడర్ కానీ...పిచ్చి డ్రస్సులు, ఓవర్ మేకప్, ఎబ్బెట్టు హెయిర్ స్టైల్ తో చూడడానికి ఎలానో అయిపోతున్నారామె. "ఆమె (రోజా) మా స్కూల్ (న్యూ ఇరా) ప్రిన్సిపాల్ గా ఉండే వారు," అని సెలవలకు ఖమ్మం నుంచి వచ్చిన మా అన్నయ్య కూతురు చెప్పింది.
N-TV లో ఉన్న శ్వేతా రెడ్డి, హిమబిందు కూడా నాట్ బ్యాడ్.
గోరంత విషయాన్ని కొండత చేసి పూటల కొద్దీ నడపడంలో దిట్ట సత్యనారాయణ మూర్తి. ABN-ఆంధ్రజ్యోతి స్టార్ యాంకర్, ప్రజెంటర్ అయిన మూర్తి మాదిరిగానే TV-5 యాంకర్ వెంకట క్రిష్ణ కూడా వండివార్చడంలో చతురుడు. బహు భార్యత్వం ఆరోపణలు, యాసిడ్ దాడితో చాలా కోల్పోయిన కరీం కు కూడా మంచి ఫాన్స్ ఉన్నారు. తనకు తెలియని విషయాన్ని అయినా సరే తెలివిగా కూలంకషంగా చర్చించడంలో అతను దిట్ట.
కందుల రమేష్ గారు మంచి యాంకర్. ప్రస్తుతమున్న యాంకర్స్, ప్రజెంటర్స్ లో అందరికన్నా విషయ పరిజ్ఞానం ఉన్న మనిషి ఆయన. TV-5 నుంచి వచ్చాక యాజమాన్య బాధ్యతలలో పడి తెరమీద కనిపించడం లేదు కందుల. తెరవెనుక ఎవ్వారాలు ఎక్కువైతే...తెర మీద పెర్ఫారం చేయడం ఎవరికైనా కష్టమే కదా!
Sunday, May 16, 2010
Subscribe to:
Post Comments (Atom)
25 comments:
మీ బ్లాగ్ లొని పోస్టుల్లో అతి నాసి అయిన పొస్టు ఇది... మీరు కూడా విషయ పరిజ్ఞానం కన్నా వర్చస్సు అవి చూస్తారని ఈ పోస్టు చూస్తే అర్ధమవుతుంది కొమ్మినేని కి రజనీకాంత్ కి పోలికా ..అది మీ అభిప్రయం కాకపొవచ్చు
daaadapu 25 samvatsaraalu paatrikeya rangam lo vundi ventane tv rangamloki vachhi success ayina vyakthi kommineni ... TV5 news Scan success lo pradana bhoomika kommineni.. etuvanti vishaym lekunda ganatalu koddi mukaniki plastic navvulu pulumukoni show nadapaleka povatam ataniki chetakakapovachhu.. antaa maatrana meeru chesina comment chaala peddadi..kommineni kooda fans vuntaara ani journalisam lo undi meeru ala maatladatam baaledu atanni janalu choodatam ledu ante endhuku tv 5 nuyndi Ntv ki malli teesuku vellaru..kontamani endhuku ceo typet iste cheya leka arda ratri desk meeda resignation letter petti malli pata boss daggara vaalipoyadru vallu pedda adbutamaina achors content unna vallu meed rustilo paniki raani vallu
wow raamu ji kya baath hai..sasi ane kurradini nenu ippativaraku choodaledu baaga cheste atniki manchi bavishyattu untundi.. kaani ganatalu koddi show nadipina daantlo paavu ganta ki ayina paniki vachhe vaishyam cheppinavaadu manchi presenter...ayinaa meeku nachhina vallu andariki nachhali ani ledu naaku nachhina vaalu andariki nachhali ani ledu ..kabatti meemeeru oka roju poortiga andari presentations pariseeliste meeku telustundi mee post entaa naasiga undooo
I vote for TV-9 Raviprakash. His 'ENOCOUNTER" in Gemini was a super show.But unfortunately he lost that tempo after he owned a channel.I agree with you regarding Ms.Swapna.Even I felt the same abt her when she was reding news last week.
కిట్టు గారూ...
మీరు నన్ను అపార్ధం చేసుకున్నారు. కొమ్మినేని గారు నాకు బాగా తెలుసు. ఆయన ప్రింట్ లో కింగ్. అందులో అనుమానం లేదు కానీ ఎలెక్ట్రానిక్ మీడియా కు సూట్ అయ్యే విగ్రహం, అభివ్యక్తి ఆయన దగ్గర లేవని చాలా మంది అభిప్రాయం. కొమ్మినేని గారు గుడ్...అన్న మొట్ట మొదటి వ్యక్తిని నేను ఈ రోజు కలిసాను. అదే మీకు చెప్పదలుచుకున్నాను. ఆయన చాల ఇంప్రూవ్ చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ఆయన నాకు నిజానికి గురుతుల్యులు. I always wish him good luck.
రాము
రాము గారు,
మీరు అందరిని వెటకారంగా, విమర్శిస్తూ మాట్లాడి (రాసి) , తర్వాతా ఆయన నాకు గురువు, ఆయనకు నేను మూడో కొడుకు లాంటి వాణ్ని అనటం అస్సలు బాగాలేదు . ఇలాంటి మాటల వాళ్ళ మీరు ఏదో మధ్యస్తంగా , ఎవరిని నొప్పించకుండా రాస్తున్నా అనుకుంటున్నట్లు వుంది. అది నిజం కాదు. మీ పోస్ట్‌లు అన్ని చదివాను. చాల మంది వ్యక్తులను ఇబ్బంది పెట్టె వ్యాఖ్యలు చాల వున్నాయి. 'లబ్ద ప్రతిష్టులైన' పాత్రికేయునిగా అవి మీకు తెలియవని అనుకోవడం లేదు. konni సందర్భాల్లో మీరు కూడా సాధారణ పాత్రికేయునిలా, చాల సహజ ధోరణిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో ఈ పోస్టు ఒకటి మాత్రమె!
మీ
చక్రి
చక్రి గారూ...
I am helpless. అయినా ఈ పోస్టులో వెటకారం ఏముంది? లబ్ద ప్రతిస్టత లేదు తొక్కా లేదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుందాం. మీరు నా మీద కామెంట్స్ ఆపి...విషయం మీద వుంటే చెప్పండి. చర్చించుకుందాం.
రాము
కొమ్మినేని, రోజా, స్వప్నల మీద మీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా వున్నాయి సార్. మొహాలు, మేకప్‌లు గురించి ఎందుకు సార్? అలా ఉండటానికి , రంగు వేసుకోడానికి లక్ష కారణాలు ఉండొచ్చు. కొమ్మినేని గారికి అభిమానులు వుందకుదడా? అందులో వెటకారం వుందని ఒకటో తరగతి చదివే వాడికి కూడా తెలుస్తుంది.. విషయానికి సంబంధం లేని అంశాలు ప్రస్తావించడం ఎందుకు సార్? యాంకరింగ్ ప్రతిభగురించి చర్చకి , మొహాలు, మేకపలకు సంబంధం ఏంటి సార్.? ఆ వ్యాఖ్యలు పూర్ గా వున్నాయి. మిమ్మల్ని నొప్పించి వుంటే సారీ సార్.
- చక్రి.
Even I like Kommineni style. Many a times he asks very straight forward questions that will trouble his guests. To reduce that heat, he will bring artificial smiles. otherwise he is so far so good.
Rajanikanth conducts the show in clean and pleasant way. But the reason is many a times he wont trouble his guests.
when it comes to news reading, I really like most of the news readers come from ETV2, esp. soujanya, sarma, and other guy with french cut.. He is presently with HMTV. is he the chakri that u r referring to?
రజనీకాంత్ లో ఒక చంద్రముఖి ఉంది... టీ ఆర్ ఎస్ వాళ్ళు దెబ్బ కొట్టినప్పుడు సూపర్ గా కనిపించింది ఆ చంద్ర ముఖి ... సారీ రజనీ .. యు షుడ్ ఇంప్రూవ్
చక్రి గారూ...
నేను ఆ ముగ్గురి గురించి చేసిన వ్యాఖ్యలు దురుద్దేశం తో చేసినవి కావు. అలా అనుకుంటే వేరే విధంగా రాసే వాడిని. అవి నిజంగా వారికి ఉపకరించే పాయింట్లు. కొమ్మినేని గారికి అభిమానులు ఉండకూడదని నేను రాసానా? వెటకారానికి, స్పష్టమైన అభిప్రాయానికి మధ్య తేడాను మీరు గమనించలేక పోతున్నారు.
చీర్స్
రాము
yeah u r right...even i too like the presentation of all the ppl mentioned above...n i think dat they'd b even better if they follow these suggestions...
sir one small request to you...i'd feel happy if u also tell the drawbacks in the remaining news readers...also about the young news anchors who r new to dis news reading...so that even they improve themselves n develop into worthy news presentors...wat do u say??
thank u....hope u'd post it soon!
rajanikant is better than kommineni .
రాము గారూ..
మీరు చెప్పిన హెచ్ఎంటీవీ యాంకర్,,
చక్రి కాదు.. బాలకృష్ణ.
హైదరాబాద్ మీడియా హౌస్, 2008 మార్చిలో టీచానెల్ కోసం 1500 పైగా అభ్యర్ధుల నుంచి 48 మందిని సెలెక్ట్ చేసింది.
అందులో బాలకృష్ణ ఒకరు.
వేరే ఏ చానెల్లో పనిచేసిన అనుభవం లేకపోవటం, రామచంద్ర మూర్తి, భావనారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్య గార్లను చాలా దగ్గరనుంచి చూడటం వల్ల ఏర్పడిన పరిశీలన స్వభావం తనకు, నాకు, ఇంకా నలభై మందికి పైగా మితృలకు సహాయం చేస్తున్నాయి.
దయచేసి పేరు సరిచేస్తారని ఆశిస్తూ..
నరేష్ నందం.
http://naresh.co.tv
నరేష్ గారూ...
మీరు మంచి పనిచేసారు. ఆటను బాలకృష్ణే. సవరించాను. ఈ పేర్లతో భలే సమస్య వచ్చింది. ఒక HM-TV ఉద్యోగి తో మాట్లాడి అతని రూపురేఖలు చెబితే అతను చక్రి అని చెప్పాడు. అందుకే రాసాను. ఆటను బాలకృష్ణే. ఇప్పుడు గుర్తుకు వచ్చింది.
థాంక్స్
రాము
తెలుగు యాంకర్లలో ఎక్కువ మందికి టాపిక్ మీద అవగాహన తక్కువ . ఉదయం వచ్చే చర్చా కార్యక్రమాల్లో రాజకీయ నాయకులని పిలవడం , వాళ్ళు అరుచుకుంటుంటే వినోదం గా చూడడం మించి మన కొమ్మినేని , రజనీకాంత్ చేసే గొప్ప యాంకరింగ్ ఏమిటబ్బా ! ఈ రకమయిన నాసిరకం చర్చా కార్యక్రమాలకి ఒక్క HMTV మాత్రమే మినహాయింపు . అయినా ఈ యాంకర్లకి ఏ మేరకు స్వేచ్చ ఉంటుందో తెలియాల్సి ఉంది . యాంకర్ల ముక్కూ , మొహాల గూర్చి కామెంట్ ఎవరు చేసినా తప్పే .
కర్రెం గారు ఇప్పుడు న్యూస్ యాంకర్ గా పని చెయ్యడం లేదా ? సమాచారం ఉంటె చెప్పండి. tv9 వచ్చిన కొత్త లో బాగా ఆకట్టు కున్నాడు
శివ గారూ, మీ బ్లాగ్ చాలా రోజులనుండి చదువుతున్నాను, రజనీకాంత్ బెస్ట్ యాంకర్ అనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు , కానీ కొమ్మినేని గారి గూర్చి మీకున్న భావన,
మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇప్పటివరకు కొమ్మినేని గారు టాప్ యాంకర్స్ లిస్టు లో రెండవ స్థానంఅని నేనే కాదు చాలామంది నమ్ముతున్నారు,అలాగే స్వప్న కూడా మీరన్నట్లుగా
కొద్దిగా ఇబ్బందికరంగా యాంకరింగ్ చేస్తోంది,ఐ థింక్ ఆమె ప్రెగ్నెంట్అని బావిస్తున్నాను ,(నా ఊహ తప్పు ఇఎతే క్షంతవ్యుణ్ణి),అలాగే TTD విషయంలో TV9 కధనాలలో వాస్తవం వున్నా
రవి ప్రకాష్ మతం మారటం వలనే ప్రతిరోజూ అదేపనిగా వ్యేతిరేక కధనాలు వాసున్నాయ్ అని భావిస్తున్నాము ,ఈ విషయంలో నిజానిజాలు next మీ పోస్ట్ లో చూడాలని ఆశిస్తున్నాను.
అలాగే ఏ న్యూస్ చానెల్ లో ఎవరు భాగస్వాములుగా ఉన్నారో కూడా తెలియ చేస్తే ఆ ఛానెల్స్ లో వచ్చే వార్తలను ఎలా అర్ధం చేసుకోవాలో మా లాంటి సామాన్యులకు
తెలుస్తుంది.
ramu garu..
peru sarichesinanduku thanks.
alage.. maro mitrudu Mr. Anonymous anna Mr. French Cut is Kiran.
One more thanks for visiting my blog and commenting.
nenu na blog lo reply chesina meeru chustaro ledo teliyadu.. anduke ikkada.
medialo nenu just rendunnarellu kuda nindani pillodini. edo cheseddamani manchi business vadulukuni vachanu. kani ikkada alanti paristhiti kanipinchaledu. malli venakki vellalenu.. friends mundu chinnatanam..
B>Tech chadivinchina parents mundu talettukolenu.. na batch mates anta nelaku 40-60k madhya unte andulo pavu vantu kuda nenu sampadinchatledani vallaku cheppalenu.
adi antala utikeyataniki karanam.
anni rojulu ilage undavu kada..
nenu kuda decision making position ki vastanu. appudu cheyalanukunnavi chestanu. kakapote.. wait cheyali.. opikaga..
i too think kommineni garu is not siutable for live shows. he has a vast load of content.but he cant present it well.
i like sumathi from tv9,never noticed error in her speech and pronunciation.
శంకర్జీ...
నా పేరు రాము. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. మీరు అడిగినది పెట్టడానికి ప్రయత్నం చేస్తాను.
నరేష్ జీ,
బాస్, I appreciate your frankness. There is light at the end of the tunnel. Why don't you try in English channels?
తెలుగు చానల్స్, పత్రికలలో సరుకు తక్కువ సార్లు పెద్ద పొజిషన్లలో తిష్ట వేసారు. మీకు మంచి అర్హతలు ఉంటె తొక్కి పారేస్తారు. అందరూ అందరే. విశాల హృదయం లేని సంతతి. ఇంగ్లీష్ జర్నలిజం వైపు చూడండి.
Cheers
ramu
dear readers, kommineni is the professional journalist like pranay, bharkha, arnab, Ravi prakash is of course a legendary figure. You see professionals in english channels only. face is not that much importent if subject takes center stage. comparing kommineni with rajanikanth is obsurd. Rajani is not a jounalist at all. His questions are prompting from desk. credit goes to desk. i know many of our news presenters are just silly anchors. not professionals like the people we see in english channels. badluck for ap tv viewers.
komineni ki full knowledge undi and he is best among the anchors..
kani rajnikanth doesnt no any knowledge on the issues kani 60min show nadipisthadu ,rechagotadam tho
komineni is best and than rajnikanth is the worst among anchors .
dear ramu
iam not going into the merits of ur opinion regarding who is best anchor. I would only like to tell u that over age problem is there through out the world. The players have come up despite this problem n other problems which u have mentioned or u r facing.
U r son is too young n promising let him enjoy game n he will definitely come up. pl dont get disheartened by these things.No body can halt a player's progress as long as he is talented . Take the example of Subham sharat Saina n others. every one had faced these kind of problems.When Subham had first represented Indian first time he was playing in the same academy where ur son is playing now. In fact his father was notwilling to let him play after tenth class. He was forced to allow his son to play Zonals there after he created history
So far as sharat is concerned he was Tamil Nadu Junior no 8 in his last year in juniors Category. With in 3 years he became national champion and there after common welth champion . There fore dont get disheartened
So far as other things are concerned , I also feel that Rajinikanth is the best person in the field, I like his way of questioning without offending the guest n also the way he improvises during discussion is also great. Kommineni is not cut out for tv media.
as we know all great players cannnot become good coaches , the same way all the great journalists in orint media cannot be good anchors in electrinic media n ofcourse there are execptions always
Mr.Bobby,
Thanks for your words of encouragement. Lets hope for the best.
Ramu
Note to readers:
A kind-hearted man, a sports lover and an advocate by profession, Mr.Bobby is the head of the sports wing of Anandnagar Welfare Association in Khairatabad in Hyderabad. He is the source of encouragement for the players of AWA.
its nice blog
I first visited the competition post, commented and then have come to this post. Made a mistake. Frankly, I cannot watch all the news channels because earlier TATA SKY had given only a few channels and now DISH TV is also giving only a few channels. Earlier we had Sakshi. Now we have ABN AJ in its place. So donot know the latest developments in Sakshi.
I always wished I could mention the decent and dignified adn 'good Telugu' speaking anchors of ETV2 as my favourites but the programmes in that channel are
different from those of the other channels. Earlier I loved to watch Kalyani read out news and Jaya Prakash Narayana 'questioning' politicians in a discussion programme.
As for Kommineni, I couldn't get a chance to see him in any programme as we donot have the connection to his channel. Iam actually delighted to read in your post that he talks the way news is presented in newspapers. It should, definitely, be a treat to the ears....hearing the actual presentation of the language.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి