Sunday, May 16, 2010

Jaya-టీవీలో ఖుష్బూ ప్రోగ్రాం 'జాక్పాట్' పై వేటు


రాజకీయ నేతలు లేదా వారి అనుయాయులు మీడియాను నిర్వహిస్తే పరిణామాలు ఎలావుంటాయో చెప్పడానికి ఇది మరొక మంచి ఉదాహరణ. DMK లో చేరినందుకు నటి ఖుష్బూ పరిహారం చెల్లించుకోవాల్సి వచ్చింది. 


తమ బద్ధ శత్రువు కరుణానిధికి శాలువా కప్పి DMK లో చేరినందుకు ప్రతీకారంగా....Jaya-TV ఖుష్బూ నిర్వహించే ఒక రియాలిటీ గేమ్ షో ను నిలిపి వేసింది. తొమ్మిదేళ్లుగా ఖుష్బూ నిర్వహిస్తున్న 'జాక్పాట్' అనే ఈ కార్యక్రమానికి అత్యంత ప్రజాదరణ ఉందని పీ.టీ.ఐ.వార్తా సంస్థ తెలిపింది. AIADMK అధినాయకురాలు జయలలిత సన్నిహితురాలు శశికళ బంధువులు ఈ ఛానల్ ను నిర్వహిస్తున్నారు. 

ఆదివారం రాత్రి గంట పాటు గమ్మత్తుగా కొనసాగే ఈ 'జాక్పాట్' ను తమిళులు విపరీతంగా ఆరాధిస్తున్నారు. DMK తో సంబంధం ఉన్న ఎవ్వరినీ తెర మీద చూపించకూడదన్న విధాన నిర్ణయం మేరకే ఈ ప్రోగ్రాం ను నిలిపివేసారట. కరుణానిధి ప్రమేయం ఉన్న ఏ సినిమానూ jaya-tv లో చూపించరు.

ఈ పరిణామం సహజంగానే ఖుష్బూ మనసును కష్టపెట్టింది. "వారు ఆ పనిచేస్తారని ముందే ఊహించాను. వ్యాపారాన్ని, రాజకీయాలను కలిపిచూడడం బాగోలేదు," అని ఆమె చెప్పినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. శుక్రవారం నాడు ఆ నటి DMK లో చేరగానే ఆదివారం నాడు jaya-tv ఈ నిర్ణయం తీసుకుంది. DMK పార్టీ కి చెందిన Sun-TV లేదా Kalaignar-TV లలో 'జాక్పాట్' ను కొనసాగించే అంశంపై ఖుష్బూ ఒక నిర్ణయం తీసుకోలేదట.
(Photo courtesy:  bharatwaves.com)

6 comments:

Anonymous said...

ఖుష్బూ కి తిక్క కుదిరింది ... లోగడ రాధిక సమర్పించి నటించిన కొన్ని సీరియల్స్ ను శరత్ కుమార్ DMK ను వీడిన సంధర్భం లో SUN నెట్ వర్క్ ఇలానే ఆపేసింది.

Anonymous said...

There is no surprise n Jaya TV removing Khushbu from it's programme as it is natural to any one and no body keeps his or her enemy's friend or fan near to him or her.As Jayalaitha is more adamant like Indira Gandhi she never keeps in her company her bitter and life long enemy Karunanidhi's friend or fan or follower as her treatment to Karunanidhu during her regime in arresting Karunanidhi in mid night
mercilessly reveal.It looks Khishboo is more interested in political lfe than her proffession.

JP.

yv . ramana said...

ఖుష్బూ ఉదంతం నాకేమీ అశ్చర్యంగా లేదు . తమిళ రాజాకీయాల్లో ఇది అనాదిగా వస్తుందే కదా ! సాంబారు మహత్యమేమో .

Anonymous said...

http://www.countercurrents.org/hansa130510.htm

తెలుగు జర్నలిస్ట్ లు చదివి బుద్ది తెచ్చుకోండి. వికారుద్దిన్ పోలీసును చంపాడు అని అధికారులు చెప్పగానే గోర్రేల్లగా తల ఊపు కుంటూ రాసుకోవడం కాదు. నిజానికి వికార్ బతికే ఉన్నాడా? పరిశోధించండి.

Anonymous said...

expected reaction. nothing unexpected. i am pretty sure she was totally prepared to be axed. after all it is her life and it is her priorities.

Saahitya Abhimaani said...

మనకున్నది నిష్పక్షపాత మీడియాట! అందుకనే ఇలా జరుతుగూ ఉంటాయి.

అసలు రాజకీయ నాయకులు చేపట్టే చానేల్లల్లో, పత్రికల్లో జర్నలిస్టులం అనుకునే వాళ్ళు పని చెయ్యటానికి నిరాకరించాలి. అవ్వి పార్టీ బాకాలుగానే ఉండనివ్వాలి . వేరే చానేళ్ళల్లో పని చేస్తూ, ఈ బాకా చానెళ్ళ లోకి దూకి "బాకా" లకు గుర్తింపు తీసుకు రాకుండా ఉంటే బాగుంటుంది

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి