Tuesday, July 27, 2010

బాసుల పై సర్వే వ్యవహారం: మీ టైం తిన్నందుకు సారీ....

బెస్ట్, వరస్ట్ బాస్ ఎంపిక కోసం చేసిన అభిప్రాయసేకరణ గందరగోళానికి దారి తీసింది. శాస్త్రీయత లోపించిందని పలువురు మెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా చెప్పిన మీదట...తుది ఫలితాలు చూసిన తర్వాత ఇవి ప్రకటించకపోవడం ఉత్తమమని అనిపించిందని తెలియజేయడానికి చింతిస్తున్నాను.

నేను అనుకున్న సాంపిల్ సైజ్ కూడా రాలేదు. పైగా....ఈ ఆన్ లైన్ సర్వే నచ్చక పోవడం వల్ల కావచ్చు ఒక సోదరుడు/ సోదరి...వరస్ట్ బాస్ కాలంలో 'రాము' అనే పేరు ఒక పాతిక సార్లు పంపారు. రాము అంటే...నేనో, లేకపోతే...'సాక్షి' రామ్రెడ్డి అన్నయ్య ముద్దు పేరో, ఇంకెవరి పేరో అర్థం కాలేదు. కారణం చెప్పమని అడిగిన కాలం చూస్తే అర్థం కాకపోతుందా? అని అనుకున్నాను. ఆ కాలంలో...'asdf..asdf...asdf...' అని మాత్రమే కంపోజ్ చేశారు. ఇదేదో మెంటల్ కేస్ చేసిన పని అని అనుకున్నా....మిగిలిన వ్యాఖ్యలలో సైతం స్పష్టత లోపించింది. చివరకు మీడియా నిపుణుడైన మా అబ్రకదబ్ర ను ఆశ్రయించాల్సి వచ్చింది. 'ఎందుకు బాస్...వదిలేద్దాం,' అని సలహా సకారణంగా ఇచ్చాడు. 


అంత మంది టైం వెస్ట్ చేయించినందున...ఎలాగైనా ఫలితం ఇవ్వాలని నాకు బాగా ఉత్సాహంగా ఉంది. ఇదే విషయం...బ్లాగు నిర్వహణలో అమూల్య సలహాలు ఇచ్చి సహకరిస్తున్న హేమను అడుగుదామని అనుకున్నాను. "నాకు తెలీకుండా...సర్వే కు ఎందుకు పొయ్యావు? ఇందులో లోపాలు ఉన్నాయి," అని ఆ మర్నాడే నాకు అక్షింతలు పడిన విషయం గుర్తుకు వచ్చింది. ఇక లాభంలేదని ఈ కింది ప్రకటనతో ఈ అంశాన్ని ముగిస్తున్నాను. 


"సర్వేలో పాల్గొన్న అందరికి కృతఙ్ఞతలు. ఇందులో శాస్త్రీయత లోపించింది అన్న వాదన నిజమే అని నమ్మడం వల్ల...ఫలితాలు ఇవ్వడం లేదు. ఇదొక గుణపాఠం గా చేసుకుని....ఈ సారి నిపుణుల సాయంతో మరొక సర్వేలో కలుద్దాం. మీ టైం వృధా చేసినందుకు నిజంగా సారీ.--రాము"

23 comments:

critic said...

రాము గారూ!
ఆన్ లైన్ సర్వేలు ఇలాగే ఉంటాయి. పైగా బెస్ట్, వరస్ట్ బాసులను నిర్థారించాలనే ఆలోచనే సమస్యాత్మకం. ఒకే బాసు ఒకరి కోణంలో ‘దేవుడు’ అనిపించుకుంటే మరొకరి కోణంలో ‘రాక్షసుడు’ అనిపించుకోవచ్చు. మీలాంటివాళ్ళు చేసే సర్వేల్లో శాంపిల్ సంఖ్యను బట్టి అతడు రాక్షసుడిగానో, దేవుడిగానో తేలవచ్చు. అది అర్థ సత్యం మాత్రమే అవుతుంది కదా!
అందరు బాసులూ ఇలా ఉండరంటారా? నిజమే. కొందరి విషయంలోనైనా ఇది వాస్తవమే కదా.. అలాంటపుడు వారికి అనుచిత గౌరవమో, అనుచిత అగౌరవమో సంప్రాప్తించటం అన్యాయం కాదా?
చివరకు ‘ఎలాగైనా ఫలితం ఇవ్వాలన్న’ ఉత్సాహం మీకెందుకండీ? ఇలాంటివి మీకైనా, మాకైనా నిజంగా టైం వేస్ట్ వ్యవహారాలే!

ranjani said...

చక్కటి పని చేసారు :)

VENKATA SUBA RAO KAVURI said...

మీ నిజాయితీకి అభినందనలు

Unknown said...

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..
నిప్పుతోటి కడుగు ఈ రాముగారి బ్లాగుని..

డియర్ రాము,
నువ్వు వెంటనే ఈ బ్లాగు మూసేయ్..
లేదా నిజాలు చర్చించు..

శరత్ కాలమ్ said...

మంచి పని చేసారు. నేనయితే ఆ టైటిల్ చూసే టపా కూడా చదవలేదు.

katta jayaprakash said...

It's a very good thing to drop the item on bosses.Infact it was not a good idea and has no meaning as good,bnad and ugly exists in every individual and we canno measure these perfectly as it varies person to person while judging these qualities.Hope you comre back to the original policy of the blog by discussing the media kaburlu on the current affairs of media.
Hope you might have got the news that Sridhar transfered to Khammam and is joining on 2nd August.Infact we missed you as well as Sridhar very badly as you are the gems of journalism with sincerity,dedication,and duty minded without demanding or accepting COVERS etc.I asm very unhappy at his transfer.But he has to obey HIS BOSS as there is a bright future for him in The Hindu as he has good proffessional and personal record with the management.
Let us wish him good luck in your native district.
JP.
JP.

Thirmal Reddy said...

@Ramu

This was the Juliane Assange I was referring to. Felt this would be an apt platform to make him more visible to our media fraternity.

http://epaper.sakshi.com/Details.aspx?id=532756&boxid=25131872

Basically he is an 'ethical hacker' promoting free speech akin to journalism. And no matter what, he is known to sticks to his ethics. Time magazine has to say this about his organisation 'Wikileaks'

"... could become as important a Journalistic tool as the Freedom of Information Act." — Time Magazine

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

హరికృష్ణ పులుగు said...

నిజమే. బాసుల్లో మంచి చెడులు నిర్ధారించడం కష్టమే. నేను మొదటనే అనుకున్నా...ఇది అయ్యే పని కాదని.
thanks for closing this issue.

-మహర్షి ( ఇది నా ముద్దు పేరు. ఇలాగే ప్రచురించాలని మనవి )

Vinay Datta said...

thnx.

Ramu S said...

మిరిపకాయ్,
నువ్వు ఎవడివిరా నా బ్లాగ్ మూయ మానడానికి.
రాము

katta jayaprakash said...

I am just surprised at the comment by one blogger by nick name mirapakai.It looks he has forgotten the basic fundamental right of freedom of expression as long as it never takes away other freedom.By publishing mirapakai's comment Ramu has shown his broadmindedness otherwise we would not have heard of mirapakai and the comments.If mirapakai is the active worker of cngress party let him demand Ramoji Rao and RK to close their papers and if he is of TDP let him demand Jagan to close Sakshi and so on.If mirapakai has got any difference of opinion in any degree let him come out with proper argument with dignity.Why mirapakai is notcoming out with real name?Let him be bold and courageous while commenting in this blog.

JP.

Thirmal Reddy said...

@Ramu

Sir jee

So what's the difference between @mirapkai and you.
మీరు మీరు పరస్పర దూషణలు చేసుకునేందుకే బ్లాగ్ ఉన్నట్టు అయితే.... మధ్యలో మేమెందుకు. @Mirpakai అనే ఒకానొక వ్యాఖ్యాత బ్లాగ్ మూసేయమంటే దానికి మీ సమాధానం మీ తరహాలో ఉండాలి గాని.... "నువ్వు ఎవడివిరా" అనే పద ప్రయోగం ఎందుకు. ఎవరికో సంస్కారం లేకపోతే మీ సంస్కారానికేమైంది. బహుశా ఇకనుంచి వ్యాక్ఖ్యలు చేసే ముందు మేముకూడా పదిసార్లు ఆలోచించుకోవాలి కాబోలు.
I thought your reflexes are sensible and not just reactions. Absolutely absurd.

aks said...

ఏమి సోదరా updates తగ్గాయి ఈ మధ్య ?

Ramu S said...

Mr.Tirumal,
Thanks for your sermons. My reaction to such nasty suggestions would be like this, you may like or dislike.
When people make such dirty allegations against me people like you don't counter it but you have a problem when I am rude to such fellows. Please be practical.
Thanks
Ramu

Vamsi said...

@Tirimaula తమ్ముడు
ఒక నిజం చెప్పనా
నచ్చితే చదువు . మెచ్హుకో.
లేకపోతే చదవటం మానేయీ.
ఇంకా దమ్ముంటే నువ్వు కూడా ఒక దుకాణం (బ్లాగ్) పెట్టుకో .
ఎందుకు లేనిపోని పెద్దరికాలను నెత్తిన వేసుకొని (అష్ట చెమ్మ సినిమా లో హీరో లా( nani ఫ్లాష్ back) )
ఈ చెత్త వాగుడు ఎందుకు?.
@రాము అన్న
ఎన్ని రోజులు నుండి చూస్తున, పోస్ట్ మార్చవు. మార్చన్న. మీ సారీ లు ఆపి త్వరగా మిగత పోస్ట్లు తగలేట్టండి ( కొంచం ప్రేమ తో )

Thirmal Reddy said...

@ Ramu
Thanks for you kind reply. మీ బ్లాగు మీ ఇష్టం. నిజమే... ఎవడు ఎలా కామెంట్ రాస్తే నాకెందుకు. కాకపోతే నా కామెంట్ని మరొక్కసారి ప్రశాంత చిత్తంతో చదవగలరని మనవి. అందులో ఎలాంటి sermons లేవు.

@Vamsi తమ్ముడు,
నీ అజ్ఞానానికి నా ప్రగాఢ సానుభూతి. రాసిన పోస్ట్ గురించి నేనెక్కడా తీవ్రంగా వ్యాఖ్యానించలేదు. ముందు అది గమనించు. చదవటానికి, మానేయటానికి నీ బోడి పర్మిషన్ నాకు అవసరం లేదు. దమ్ముంటే దుకాణం (బ్లాగు) పెట్టుకోమని నువ్విచ్చిన ఉచిత సలహాకి థాంక్స్. నా దుకాణం కోసం నువ్వు శ్రమ పడాల్సిన అవసరం లేదు. దాని సంగతి నేను చూసుకుంటా. అది వేరే విషయం. ఏదో చెత్త సినిమాతో నువ్వు చేసిన పోలిక నీ కామెంట్ లాగే అర్ధం పర్దం లేకుండా పరమ చెత్తగా ఉంది. నీ వాలకం చూస్తుంటే కేవలం చెత్త కామెంట్స్ చేయాడానికి తప్ప నీ ప్రొఫైల్ ఎందుకూ వాడుతున్నట్టు లేదు. ముందు నీ దుకాణం సంగతి చూసుకో తమ్ముడు.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com
mobile: 9848621931

vipravinodi said...

రాము ఎస్, తిరుమల సారీ తిర్మల్ రెడ్డి గార్లతో సహా అందరికీ...
ఇప్పుడే చెప్పేస్తున్నా....

ఉడుక్కోడాల్లేవ్...

Ramu S said...

Dear Tirumal...
Sorry for being rude in writing such a reply to you. I never think that this is my blog. Had it been the case, I wouldn't have posted a story written by you along with your pictures. Let me reiterate that I am for democratic discussion. If you don't like my point of view, you are welcome but I can't tolerate the idiotic suggestion of closing down the blog. It hurts, boss. I am not a soft person to take such things softly or lightly. Don't misunderstand me.

Tirumal, you can't always give mileage to such anonymous people. I wish to trace them down to give a dressing down in Khairatabad circle. Please don't stop me doing that.
Cheers
Ramu

Ramu S said...

Dear Tirumal...
Sorry for being rude in writing such a reply to you. I never think that this is my blog. Had it been the case, I wouldn't have posted a story written by you along with your pictures. Let me reiterate that I am for democratic discussion. If you don't like my point of view, you are welcome but I can't tolerate the idiotic suggestion of closing down the blog. It hurts, boss. I am not a soft person to take such things softly or lightly. Don't misunderstand me.

Tirumal, you can't always give mileage to such anonymous people. I wish to trace them down to give a dressing down in Khairatabad circle. Please don't stop me doing that.
Cheers
Ramu

Krishnarjun said...

రామూ గారూ,
"మిరపకాయ" టపాగాళ్ళను పట్టించుకోకండి.వాళ్ళకు నా బూతులు.

మీ బ్లాగ్ కి అడిక్ట్ అయిన నాలాంటి వాళ్ళకోసమన్నా రోజుకో పోస్ట్ ఉండేలా చూడండి.

మీ క్రిష్ణ

Unknown said...

అన్నయ్యలూ, కోపగించుకోకండి..
రాము గారు చాలా నిరాశ కలిగించారు.
దరిద్రపుగొట్టు బాసుల్ని ఉతికి ఆరేస్తే బాగుండు. ఎపి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో ఇప్పుడున్న బాడుఖావ్ బాసుల వల్ల ప్రొఫెషనలిజం నాశనం ఐపోతోంది. పొట్ట కోస్తే అక్షరం లేనివాళ్ళతో తెలుగు మీడియా నడిచే రోజులు ఇప్పటికే వచ్చాయి. భాష తెలియని వాళ్ళు కూడా పెద్ద పెద్ద పోస్టుల్లో దూరిపోతున్నారు. బాసు ఎదగడు, నిన్ను ఎదగనియ్యడు. అదీ మేటరు. రాము గారైనా కనీసం కొందరి బట్టలు వూడదీస్తారనుకున్నా. ప్చ్.. ఈసారైనా, గట్టి ప్రయత్నం చేద్దాం. విషెస్ టు రాము గారు, తిర్మల్, జేపీ, ఆల్ అదర్స్.

Thirmal Reddy said...

@Ramu,
@vipravinodi

Vipravinodi gaari suggestion is super good. Let's strive towards more democratic discussions in letter and spirit.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Ramu S said...

సోదరా మిరపకాయ్..
తెలుగు మీడియాలో బాసుల మీద నేను రాసినన్ని పోస్టులు ఎవరూ రాసి వుండరు. పాత పోస్టులు చదువుకోండి. పాతవి చూడకుండా చిటపట లాడితే ఎలా సర్?
పోనీ..బాసుల మీద మీ దగ్గర సమాచారం, ఇన్ పుట్స్ వుంటే పంపండి. ఇంకోటి రాద్దాం. నోటికొచ్చింది రాయడం ఈ బ్లాగ్ ఉద్దేశ్యం కాదు.
రాము

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి