Monday, July 12, 2010

'షోకాజ్' పాపం ఏ ఛానల్ ది? ఆ ఛానల్ కు శిక్ష లేదా??

'ఓదార్పు యాత్ర' లో రాజకీయ అవాకులు-చవాకులు పేలిన ఎం.పీ.జగన్ మోహన్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ షోకాజ్ నోటీసు ఇచ్చిందని ఈ మధ్యాహ్నం అన్ని తెలుగు ఛానెల్స్ ఊదరకొట్టాయి.  ఒక ఛానల్ వెంట మరొకటి ఈ అంశంపై చాలా అమూల్యమైన ఎయిర్ టైం ను నాశనం చేసాయి. కొందరు సోకాల్డ్ సీనియర్ విశ్లేషకులు దాని మీద తమకు తోచిన చెత్త కబుర్లు చెబితే, మరి కొందరు '?' (ప్రశ్నార్ధకం) తో ఆ స్క్రోల్ వేసి నానా హంగామా చేశారు. 

TV-9 ఢిల్లీ విలేకరి లైవ్ లోకి వచ్చి ఆ నోటీసు మీద జనార్ధన్ ద్వివేది సంతకం  కూడా చేసారని చెప్పడం, మరి ఇప్పుడు ఏమి జరగబోతున్నది? అని యాంకరమ్మ అడగడం...వంటి కనువిందు కలిగించే తమాషా చాలా జరిగింది ఛానెల్స్ లో. చివరకు అది తుస్సుమంది.

"నిజానికి ఇది కాంగ్రెస్ లోని ఒక వర్గం ఒక ఇంగ్లిష్ ఛానల్ (TIMES-NOW) లో వచ్చేలా చేసింది. ఇది జగన్ ను భయపెట్టే ఎత్తుగడ. ఆ ఛానల్ లో చూసి దాదాపు అన్ని ఛానెల్స్ దాన్ని ప్రసారం చేసాయి," అని ఢిల్లీ జర్నలిస్టు ఒకరు చెప్పారు. కాంగ్రెస్ వాదులు నడిపే Sakshi, N-TV తప్ప అన్ని ఛానెల్స్ ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించాయి.

వెరిఫై చేసుకోవాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేని ఛానెల్స్...కొంపలు ఆరిపోతున్నట్లు షో కాజ్ మీద నానా హడావుడి చేసాయి. ఒకరితో ఒకరు పోటీ పడి గందరగోళం సృష్టించారు. దానికి తోడు రాష్ట్రంలో ఈ ఛానెల్స్ వారికి తేరగా దొరికే బుర్ర తక్కువ అధికార ప్రతినిధులు, అనలిస్టులు...తమ వంతు ఆజ్యం పోశారు. చివరకు...వీరప్ప మొయిలీ వచ్చి....ఇవన్నీ ఆధారం లేని వార్తలు అని తేల్చాడు. 

అప్పటికే....రాష్ట్రంలో రాజకీయం ఒక్క సారిగా వేడి ఎక్కింది. షో కాజ్ ఇస్తే జరిగేదేమిటి? ఎం.ఎల్.ఏ.లను జగన్ వర్గం గుండు గుత్తకు కొనుక్కుని ఆయన్ను సీ.ఎం.ను చేస్తుందా? ప్రజా రాజ్యం ఎం.ఎల్.ఏ.లు ఎంత రేటుకు బేరం కుదుర్చుకున్నారు? తెర వెనుక వున్నది...గాలి సోదరులు, లగడపాటేనా? ఇప్పుడు రోశయ్య పరిస్థితి ఏమిటి? ఈ తాజా పరిణామం ప్రభావం తెలంగాణా ఉప ఎన్నికల మీద ఎలా వుండబోతున్నది? వంటి ప్రశ్నలపై ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరిగింది. ఈ రాష్ట్రాన్ని, జనం చర్చలను ఈ తిక్క ఛానెల్స్ నియంత్రిస్తున్నాయని మరొక సారి తెలుసుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణ, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. 


ఈ అనవసరపు హడావుడి లో పడి...పీ.ఎస్.ఎల్.వీ. సీ-15 ప్రయోగం విజయవంతమైన వార్తకు సరైన ప్రాధాన్యత లభించలేదు. ఆ శాస్త్రవేత్తల విజయాన్ని ఛానెల్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఒక పొలిటికల్ స్టోరీ విషయంలో  కోట్లమంది వీక్షకులను తప్పుదారి పట్టించి వారి సమయాన్ని వృథా చేసినందుకు ఈ ఛానెల్స్ కు శిక్ష వేయకపోతే ఎలా? ఈ శిక్ష ఎవరు వేయాలి? వెరిఫై చేసుకోకుండా వార్త ప్రసారం చేసినందుకు ఒక్క ఛానెల్ అయినా క్షమాపణ చెప్పిందా? ఇది బాధ్యతాయుతమైన గొర్రెదాటు జర్నలిజం కాదా? 

28 comments:

తార said...

మీ దృష్ఠిలో తెలుగు న్యూస్ చానెల్స్ అంటే ఈటీవీ-2 కాకుండానా?

Saahitya Abhimaani said...

".....ఈ అనవసరపు హడావుడి లో పడి...పీ.ఎస్.ఎల్.వీ. సీ-15 ప్రయోగం విజయవంతమైన వార్తకు...."

నిజం! నిజం!! మంచి వార్తలకు మన మీడియా ఎప్పుడూ దూరమే అని మరొక్కసారి నిరూపితమయ్యింది. వీళ్ళకి చెత్త రాజకీయ వార్తలే(పైడ్??)మోజు మరి

"....వెరిఫై చేసుకోవాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేని ఛానెల్స్...."

అలా వెరిఫై చేసి చానేల్సు నిజాల్ని సరిగ్గా తెలియచేప్తే ఈ ఓదార్పు యాత్ర ఉండేదిటండీ!!!??? ఒక మనిషి మరణిస్తే మరొక మనిషి మరణించే అవకాశం ఉంటే గింటే, ఆ కుటుంబంలో అతి దగ్గిర బంధువులకు ఉండాలిగాని, ఇలా జిల్లాలవారిగా మరణిస్తారా??!!!!!. ఇలాంటి వార్తలను ఎవరు వెరిఫై చెయ్యాలి? మీడియా కాదూ? మరి ఆ బాధ్యతను మరచి ఇంకేదో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమని, తెహలకాలని అని ఉట్టుట్టి ప్రగల్భాలెందుకు. రాజకీయ వాతావరణం ఇంతవరకు తీసుకు రాబడింది, ఇటువంటి అవక తవక వార్తలు కాదూ. నిజా నిజాల్ని వెరిఫై చేసి మీడియా కనుక తమ బాధ్యత తాము నిర్వర్తించి ఉంటే, ఈ చౌకబారు రాజకీయ యాత్రలు ఎత్తుగడలు ఉంటాయా????

kvramana said...

Though the basic questions you have raised are pertinent, I can't agree with you completely on this. I don't think it is right to blame the channels squarely for what happened on the showcause notice issue. As far as I understood and checked out on Monday afternoon, the party too was keen on checking out the mood of the public and the ground level reaction in case a showcause notice is issued to Jagan. That prompted people in the party to leak it to media. For about one hour there was high decibel reaction on that and the party closely monitored the response appearing on the channels. After their job was done, they issued a clarification that no notice was issued. May be the high command will base its next move/decision on the response that was gathered through the leak.

Kavanoor Dayalan said...

Ramuji,

do you support what Ys Jagan is doing? do you believe 600 people died for YSR, HOW COME NO ONE DIED FROM HIS FAMILLY OR CLOSE ASSOCIATES? akrama sampadana kapadu kovadaaniki he is playing all the games. Rossaiah is a great n honest man the young leader trying to blame him. please why cant you start a channel and maintain all qualities in your channel. you allways blame Ramoji rao ITS EASY TO BLAME OR FIND NEGATIVES. EVEN THOUGH I AM NOT FROM MEDIA I AM DOING THE SAME ITS SIMPLE

Ramu S said...

Ramana,
I agree, political parties resort to such tricks to know the public pulse. Almost all channels telecast stories as if the notice had already been issued. As I mentioned, TV-9 guy went a step ahead to announce that Dwivedi had signed on it.
Its unfair to create a crisis-kind of situation based on mere speculations. If you fell in the trap laid by politicians, then there is no difference between a reporter and an ordinary man.
I feel they should apologize people for their felony.
Ramu

katta jayaprakash said...

Though it might be a political gimmick to know the pulse of the people on the issue of show cause notice the media should not mislead the society as it has got major responsibility as a fourth pillar of democracy.Politicians many games for their selfish endfs but the media must be very cautious in such issues.Infact so far no new channel or newspaper has apologised to the people for any false news but still continue to play with the people by bringing out false news without any shame.It is upto the Press Council of India to interfere to guide and instruct the media to regret any false news coverage.
JP.

ramasai said...

Gundepootu Vundi twaragaa Chaavalanukune vaaru Telugu News Channels Chooste Saripotundi.
Telugulo Anni View Channels tappa News Channels levu.

ETV2, HMTV are the only Channels to some extent preserving the values in media hats off to ETV2 remaining all channels are giving baseless news.

Definetely there should be some Censorship to Media also.

ABHIGNA

Thirmal Reddy said...

It's not just about the showcause notice, but also the news that Jagan sent an emissary to Rosiah with a compromise formula. This news was published in DC and another English news paper, which was later (on Monday and Tuesday) being aired by some channels, particularly Sakshi. Though sakshi TV had obviously condemned this news, the question of media authenticity (especially those two English papers) still remains unanswered.

Sir jee, (offline the subject) is it possible to do a survey on the best journalist in Telugu news channels. (Now arises the viscous cycle of defining the term "BEST, I know)

vinod said...

Since i didn't expect ETV2 will give that news, since they do very sensible journalisumnot flashy journalism... ?

vaanachinuku.blogspot.com said...

Media not giving importance to the PSLV C-15 experiment is very sad.

Ram_Anv said...

Going by the TRP ratings and the top ratings for the programmes like Rahasyam or such kinf of programmes, it seems there is a market for Discovery kinda channels in Telugu. Let us see if some media house can tie-up with Discovery and beam the content in Telugu.

Unknown said...

So
Mr.Ramu has become a judge. Given a judgement on Mr.Y.S.jagan Mohan Redyy that he is uttering "Avakulu chevakulu". Congrats Mr.Ramu

sai said...

Sir,
u forgot d fact that even Sakshi aired d news.bt later(the next day) started crying that other channels have telecasted it do decrease jagan's reputation.

katta jayaprakash said...

In the sea of Jagan yatra,show cause notice the success of PSLV-C15 and the launching of five satellites were submerged by our chanels.It is most unfortunate that studsat of engineering students has also been neglected with least coverage.Why this sadistic attitude of channels?

JP.

ntv insider said...

mr,ramu garu.jagan notice vishayam lo modataga breaking ichindi meeru atyanta credible chanelga cheppe hmtv.mimmalni entha live ki piliste matram aa chanel jagan vishayam lo chesina tappu meeku teliyaleda?and zee,abn,veetannintilo live lu,phone in lu ayyake tv9 lo live vachindi.studio n ayite ekanga munduku velli madhu yashki tho notice jagan ki vachindani f2f kuda icharu.abn,studio n ,zee ,hm la fonein live lalo notice ki reply ivvadaniki ennirojulu gaduvu ichindi?and aa notice lo emunnadi anna vishayanni kuda aya reporter lu chepparu.meeru tv 9 live chudaledani spashtamga ardham avutondi.female anchor question adigarani raasaru.,aa question adigindi male anchor. may be meeku info istunna sakshi jurno mistake cheppuntadu,meerade post chesaru.ivvanni nenela cheptunnanante aa time lo nenu shift lo work chestunna.prati daniki tv9 nu adiposukovadam manchi paddati kadu.

Ramu S said...

Well gaaru,
౧) అది ముందుగా వచ్చింది HM-TV లో కాదు. మీరు ఒక్క సారి చెక్ చేసుకోండి. నేను అపుడు అక్కడే ఉన్నాను. ఇతర ఛానెల్స్ లో వచ్చాక ఈ ఛానెల్ లో వేశారు. అయినా...నేను మరొక సారి చెక్చేసుకుంటాను.
౨) లైవ్ కి పిలిచినా, ఉద్యోగం ఇచ్చినా....తప్పు తప్పుగా చెప్పుకోవడం లో ఏమీ తప్పులేదు. అది క్రెడి బుల్ చానల్ అని ఇదివరకు నమ్మే వాడిని, ఇప్పుడు చూస్తున్నాను. ఏమాటకు ఆ మాటే సర్...TV-9 తో దీన్నిపోల్చకండి.
౩) నేను టీ.వీ.-9 లైవ్ చూశాను. మేల్, ఫిమేల్ విషయంలో పొరపాటు పడ్డానేమో గానీ...రిపోర్టర్ జనార్ధన్ ద్వివేది పేరు చెప్పడం విన్నాను. అది చూసానండీ.
౪) నాకు ఇన్ఫో ఇచ్చే 'సాక్షి' జర్నో నా? ఈయన ఎవరు? నాకు ఇన్ఫో ఇస్తున్నానని, వారు చెప్పింది నేను రాస్తానని ఆయా ఛానెల్స్ లో ప్రచారం చేసుకుని....అక్కడి తమ ఫ్రెండ్స్ మధ్య నుంచి ఫోన్స్ చేసి చంపేస్తున్న వర్గం ఒకటి తయారయ్యింది. TV-5 లో అలాంటి ఒక సారు నను బద్నాం చేశారు. ఇప్పుడు జాగ్రత్త పడ్డాను.
౫) ప్రతి దానికి నేను TV-9 ను ఆది పోసుకుంటూ ఉన్నానా? మీ అభిప్రాయం తప్పేమో. అకారణంగా నేను ఆ పని చేయను. నేను తప్పు చేస్తే...మీరు కూడా పాయింట్ చేయండి.సరిచేసుకుంటాను.
Ramu

Saahitya Abhimaani said...

Everybody is so much worried on the finer points of who telecast the wrong news first. But, this entire issue has grown to this level due to the irresponsibility of media in not verifying the veracity of the claim that some people died after hearing the tragic news of YSR's death. How far it is correct?? Whether any channel can tell atleast now. Channels/Media if at all they think that they have some journalistic value left, should concentrate on the fact finding mission and come out with the truth in the "claim" on which this ridiculous yatra is being enacted. Why such a handle is given to a person to take the state to ransom by organising such kind of yatras creating this hubbub and hullabaloo . May be the media is afraid that if the truth is brought out, they shall not have news to cover because the yatra will lose its credibility!!!

Sekhar Reddy said...

@Siva garu

First let us say there is no deaths at all for YSR. It is true that some family member is died and those are poor. Is is against to the constitution or unethical to console that family?? Is it not all our responsibility??

Jagan is an aspiring political leader has every right to take up Yatras. Have you opposed Advani's Ratha Yatra, YSR praja prasthanam, Babu Mee Kosam ??

ntv insider said...

mr.ramu garu,conformag cheptunna,hmtv lo 12:50 pm ki jagan news breaking vachindi.tv9 lo jagan wishayam lo live 1:20 pm.
janardhan dwivedi vishayam nijamemo kani migita chanel la phonein live lo entha cheppaaroo meeru vinanattunnaru.

Saahitya Abhimaani said...

Advani Ratha Yatra and other such campaigns were all embarked upon with political motives. You accept that this man also is doing this for his political ends. Then why all these pretensions and deception as if he is so much interested to console these bereaved people.

Let the media bring out the truth in the claim that "so many" people died out of grief of a leader's death.

Ramu S said...

వెల్ గారు,
మీరే కరెక్టు. కనుక్కున్నాను, ఈ ఛానల్ వారే ముందుగా బద్దలు కొట్టారట. అయినప్పటికీ...వార్త దృవ పరుచుకోకుండా హడావుడి పడడం ఎవరు చేసినా తప్పే. మ్యాడ్ రేసులో కొట్టుకుపోకుండా...ఉండాలి. అన్ని ఛానెల్స్ దీని నుంచి పాఠం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇంత పెద్ద విషయంలో తప్పు చేసిన వారు 'సారీ' చెప్పడం మంచి సంప్రదాయం.
రాము

katta jayaprakash said...

If any one visits to any home of bereaved families visit will be sober,calm and conveying condolenes.No one goes with a sweet box.As the bereaved families are in shock at the death of their kin one has to maintain low profile without any hungama and convey condolences and this routine for any one.But the way Jagan paying condolences to the families which lost their near dear with convoy of vehicles and ho\ired people from neighbouring district with road shows is unethical and inhuma.Let him go to all the families with a low profile with selected friends may be in or two vehicles.But the manner in which this yathra of Jagan reveal tha he has got major political agenda with confrontation with the CM and high command.There is no necessity to speak on poltical affairs of the state if it is purely a odarpu yatra.Why Jagan is not learning lessons from Rahul Gandhi who is goings stematicaaly winning the love of people.It is a trgedynthat Jagan is going on a wrong track which might derail resulting in disturbances in his political life.Let him do his duty as a parlament member.
JP

Saahitya Abhimaani said...

Just suppose immediately after the accidental death of YSR, if this man was made CM as so much desired by him and his cohorts, whether he would have conducted this roadshow of so called "Odarpu Yatra". A person who owes his Parliament seat to the fact that he is son of so and so, now making all this hungama is quite ridiculous. Even his own uncle opposed his Parliament seat allocation and has to be persuaded to make way for this political boy.

In this entire episode the way media is behaving is quite suspicious. Nobody is questioning the veracity of the reasons for this road show. Thats very sad as it is evident that the journalistic instincts are giving way to political leanings.

Ramu S said...

Siva gaaru
In fact a Delhi based tabloid-Mail Today of India Today group-published an investigative story on the so called deaths and suicides and found that many of them are not related to YSR's death. Jagan's camp made a hue and cry over that story, which in fact marred his chances of becoming the Chief Minister. That story could shake the Jagan's camp.
You may search the story in their website
mailtoday.in
Ramu

Saahitya Abhimaani said...

Thank you Ramu garu for the information. I am aware of that "Tabloid" coming out with the investigative piece. But, what happened to the mainstream media. We know the reputation of the Tabloids. My point is that why Telugu Media is mum on this?? Is it because of Political leanings or God forbid any other consideration??!!

Ramu S said...

Yes sir,
I agree with you. Telugu papers/channels should have exposed it.
Ramu s

Pheonix.b said...

Kontha mandi YS..kosam maraninchaledani iteevala Andhrajyothy..serial kathanalu prachurinchindi..

Ee kathanala gurinchi Saakshi.. spandinchindo ledo teliyadam ledu..

Unknown said...

a media valu goppa kadu okapudu prajala badalani ardam chesukune varu epudu vari astulani kapadukotam kosam mediani vadukuntunaru dani vala media prapanchanike mayani macha rabotundi diniki mukya karanam manishilo asa kalagatam eduti varikante tanu goppa vadu ani prove chesukotam kosam chese poratam lo tanaki teliyakunda aneka tapulu cheyatame maralsindi samajam kadu manishi marali vari alochanalu marali edi nijam

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి