i-news లో మళ్ళీ కథ మొదటికి వచ్చింది. N-TV యజమాని నరేందర చౌదరి ఆ ఛానల్ లో వాటా కొని మునిగే పడవను ఆదుకున్నారని అనుకుంటూ ఉండగానే...మరొక సంక్షోభం వచ్చింది. i-news ఉద్యోగులకు అందాల్సిన గత నెల జీతాలు ఇంతవరకూ అందలేదు.ఇది జర్నలిస్టులను, ఇతర టెక్నీషియన్లను క్షోభకు గురిచేస్తున్నది.
చౌదరి గారు i-news బాసు వాసు వర్మకు దాదాపు పదకొండు కోట్లు ఇచ్చారని, అయినా...ఛానెల్ కష్టాలు తీరలేదని సమాచారం. ఈ పరిణామం మింగుడుపడని చౌదరి గారు తాను ఈ డీల్ నుంచి వెనక్కు మరలుతున్నట్లు ప్రకటించారని సమాచారం. ఈ పరిణామాల మధ్య సంస్థ మళ్ళీ ఇబ్బందుల్లో పడిందని, అయినా...కాస్త ఓపిక పట్టమని జర్నలిస్టులను కోరుతున్నారని తెలిసింది.
అయితే...నిజంగానే వాసు వర్మ మిస్ మానేజ్మేంట్ వల్లనే తాజా సంక్షోభం ఏర్పడిందా? లేక...నరేన్ చౌదరి, వాసు, చావు తెలివి తేటల పుట్ట--ఇలాంటి చెత్త అయిడియాల దిట్ట అయిన జర్నలిస్టూ కలిసి ఉద్యోగుల సంఖ్యను వదిలించుకునేందుకు దీన్ని కృత్రిమంగా సృష్టించారా? అన్నది తేలాల్సి వుంది. i-news యాజమాన్యానికి వ్యతిరేకంగా రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి మాజీ ఉద్యోగులు చేసిన ఫిర్యాదు విషయం ఏమయ్యిందీ కూడా తెలియరాలేదు.
ఇది ఇలా వుండగా....i-news లో ఒక ప్రముఖ యాంకర్, ఆమె కెరీర్ కు కారణమై ఇప్పుడు N-TV లో ఉన్న ఒక ప్రముఖుడు కలిసి Studio-N కు వెళ్ళడానికి రంగం సిద్ధమైనట్లు కూడా తెలుస్తున్నది. ఒక పది రోజులుగా ఈ అంశంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే...వాసువర్మ తనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరని కూడా చెబుతున్నారు. పైన చెప్పిన వీరిద్దరూ Studio-N లో చేరితే...కందుల రమేష్ బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాస్తో కూస్తో విలువలు ఉన్న రమేష్....డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకుతున్న ఈ జర్నలిస్టు గారిని భరిస్తారా? ఏమో!
Thursday, July 22, 2010
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
"i-news లో ఒక ప్రముఖ యాంకర్"..roja naaa?
రాజ్,
రోజాలు, రాజాల సంగతి నాకు తెలియదు. వేచి చూద్దాం.
రాము
పదకొండు కోట్లు వర్మార్పణం అన్నట్ట్లేనా ?? N Tv ఉద్యోగులకేమైనా బోనస్ లాగా ఇచ్చినా సద్వినియోగమైనట్టుండేదేమో ?
Some news channels are giving detailed story on the contesting candidates by elections in Telangana
of national parties covering upto nearly thirty minutes.Is it not a paid news coverage?
JP.
పాపం, పెణంలోంచి పొయ్యిలో పడతారేమో?
Its very sad.
(phoenix)
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి