Sunday, September 5, 2010

'టీచర్స్ డే' రోజు ఇంత నెగిటివ్ కార్టూన్ సందర్భోచితమా?

e
ఈయన తన విద్యార్థినిని ప్రేమ పేరున వేధించి బంధించాడు. ఈ సారు శిష్యుడి చేయి విరిచారు. ఈ మేడం విద్యార్థుల్ని కొరివితో కాల్చింది. ఈ మేష్టారు స్టూడెంట్స్ కు కరెంట్ షాకిచ్చారు.

36 comments:

Praveen Mandangi said...

ఉపాధ్యాయ వృత్తిలో దిగజారిన విలువల గురించి వేసిన కార్టూన్ అది. ఉపాధ్యాయులు మనం అనుకుంటున్నంత ఉన్నతులా? ఉపాధ్యాయులలో ఎంత మంది రూల్స్ పాటిస్తున్నారో తెలుసా? ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తాను పని చేస్తున్న గ్రామానికి 8 కిలో మీటర్లు కంటే ఎక్కువ దూరంలో నివాసం ఉండకూడదు. టీచర్ ఉద్యోగం చేసే మా బంధువు ఒకాయన తాను పని చేస్తున్న గ్రామానికి 15 కిలో మీటర్లు దూరంలో ఉన్న పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు సైడ్ బిజినెస్ లు చెయ్యకూడదు. నాకు తెలిసిన ఒక స్కూల్ టీచర్ కోచింద్ సెంటర్ నడుపుతున్నాడు, ఇంకో స్కూల్ టీచర్ రైస్ మిల్ నడుపుతున్నాడు. విద్యా వ్యవస్థ అవినీతికి అతీతం కాదు. జర్నలిస్ట్ అయిన మీకు ఈ విషయం తెలిసే ఉంటుందనుకుంటాను.

సుజాత వేల్పూరి said...

ఈ కార్టూను ఇవాళ వేయవలసింది కాదు! అలా శిక్షించే వారు మైనారిటీ!

ప్రతి ఒక్కరూ తమ గురువుల్ని ప్రేమతో, గౌరవంతో స్మరించుకునే ఈ వేళ ఈ కార్టూను అసంబద్ధంగానే ఉందనిపిస్తోంది

Unknown said...

" ఉపాధ్యాయులు మనం అనుకుంటున్నంత ఉన్నతులా? " ఏ కార వారు లేక పోతే ఈ రోజు మీరు ఈ పదాలు వ్రాయగలరా .
మీరు చెప్పెన వాళ్ళు కూడా ఉన్నారు అంత మాత్రాన ఆ సంఘం మొత్తం నే విమర్శ తగదు. ఏ వ్యవస్థ కూడా అవినీతికి అతీతం కాదు .
మంచి వారు అందారో ఉన్నారు వారి అందిరికీ పాధబీవందనలూ .

gajula said...

inkoroju veste samardaniyamaa?cartoonlo emundi mukyamu kaani eppudesaaru kaadu.e cartoon gummadikaayala dongala kosamegaani andarini vuddesinchi kaadu.e roje vese vuddesyamu e roju aadarshapraayulaina teachers jeevithacharitralu vini vokkaru maarinaa aa cartoon thana panilo vijayam saadinchinatle.gurubramha,gururvishnu,gurudevo mahesvaraha,gurusaakshaath parabramha -thasmaisri guravenamaha.

srinivasrjy said...

ఏవి ఏమైనా ఈ మధ్య స్రీధర్ ఇలాంటి నెగెటివ్ కార్టూన్స్ వేసి తన స్థాయి దిగజార్చ్హుకుంటున్నాడు... మానస్థత్య వేత్తలు విSలేశించ్హాలి...తను ఇలా ఎందుకు నెగెటివ్ గా మారాడో ?

చాణక్య said...

ప్రవీణ్ శర్మ గారితో నూటికి నూరు పాళ్ళూ ఏకీభవిస్తున్నాను. విద్యా వ్యవస్థ ఇక ఏ మాత్రం అవినీతికి అతీతం కాదు. అయినా కొంత కాలం క్రితం ఇదే బ్లాగ్‌లో మీరే అటువంటి ఉపాధ్యాయులను చీల్చి చెండాడారు. మీరు మీ స్టైల్‌లో నిరసన తెలిపితే, శ్రీధర్ ఆయన స్టైల్‌లో నిరసన తెలిపారు. అది తప్పైతే మీ రాతలు కూడా తప్పే.

Saahitya Abhimaani said...

రామూ గారూ. శ్రీధర్ గారు నిన్న వేసిన కార్టూన్‌లో గాని, ముఖ్యంగా, ఈరోజున ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వేసిన వ్యంగ్య చిత్రంకాని ఎబ్బెట్టుగా ఏమీ లేవు. ప్రస్తుత పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. పరమ పవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి. కానీ, ఈరోజున ఆ వృత్తి అంత పవిత్రంగాలేదు అని ఎత్తి చూపటమే శ్రీధర్ ఉద్దేశ్యం, ఆ పవిత్రత లోపించటానికి ఉన్న తగిన కారణాలు ఆ వ్యంగ్యచిత్ర సంభాషణలోనే చక్కగా పొందుపరిచారు శ్రీధర్.ఇందులో తప్పేమీ లేదు.

బాకా పత్రికల్లో చెంచా కార్టూన్ల గురించి ఒక్కసారి చూడండి.

శ్రీనివాస్ said...

ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా శ్రీధర్ గారి కార్టూన్స్ ఉన్నాయి. నాకు శ్రీధర్ గారి కార్టూన్ లలో తప్పేమి కనిపించడం లేదు.

Praveen Mandangi said...

ఉపాధ్యాయులలో ఔన్నత్యం లోపించినప్పుడు ఉపాధ్యాయ దినోత్సవాలు జరుపుకుని ఏమి లాభం? ఇప్పటి బడి పంతుళ్లకి జీతాలు తీసుకోవడమే కానీ చదువు చెప్పడం చేత కాదు. ఓసారి స్కూల్ లోని కంప్యూటర్ లో బరహా ఇన్స్టాల్ చెయ్యడానికి 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లాను. అక్కడ మా మామయ్య హిందీ మాస్టర్ గా పని చేసేవాడు. అక్కడ పని చేసే మాస్టర్లందరూ టౌన్ లో ఉంటూ మోటర్ బైక్ ల మీద వచ్చేవాళ్లు. వీళ్లలో స్థానికంగా కానీ 8 కిలో మీటర్ల లోపు కానీ ఎవరూ నివాసం లేరు. వాళ్లలో ఒకరిద్దరు మహిళా టీచర్లు ఉన్నారు. వాళ్లు ఆటోల మీద వచ్చి పోతుంటారు. మహిళా టీచర్లు వాళ్ల భర్తలు పని చేసే చోట నివాసం ఉంటారనుకుందాం. కానీ పురుష టీచర్లు అలా కాదు. తమ పిల్లల ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం పట్టణాలలో ఇళ్లు తీసుకున్నారు. అది కూడా నిబంధనలకి విరుద్ధంగా 10 లేదా 15 కిలో మీటర్లకి దూరంగా ఉన్న పట్టణాలలో. మా జిల్లాలోనే దామోదరం అనే గురువు తన శిష్యురాలిపై యాసిడ్ పోశాడు. ఓ గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురువు తన శిష్యురాలికి కడుపు చేశాడు. వీళ్లు గురువులని చెప్పుకోవాలా?

Unknown said...

తప్పుని తప్పు అని చెప్పటం ఏ రోజైతే ఏమిటండీ రాము గారు.

katta jayaprakash said...

It is a fact that the society always looks negatively at proffessions like techers,doctors ,politicians etc 365 days in a year bombarding them with all bitter feelings.But can't we have a positive look at teachers,doctors etc at least for one day in a year on teachers,doctors day by recognising the good among the bad and worst by appreciating their services?
JP.

WitReal said...

"ఆచార్య దేవో భవ" అని రాస్తే అది కార్టూన్ అవదు సార్.

గత సంవత్సర కాలంగా జరిగిన విషయాలు సింహావలోకనం చేసుకుంటే ఆ కార్టూన్ అర్థమవుద్ది.

అ మాత్రం satire/sarcasm లేకపోతే దాన్ని కార్టూన్ అనరు.

Anonymous said...

ఒక మిత్రుడు వ్రాసినట్లు పనిచేసే గ్రామానికి 15 కిలో మీటర్లు దూరంలో ఉన్న పట్టణంలో నివాసం ఉండటం, ఇంకో టీచర్ కోచింగ్ సెంటర్ నడపడం లాంటివాటిని విభిన్న కోణాల్లో విశ్లేసించవచ్చు(సమర్ధనీయం అయినా, కాకపోయినా).
నాకు తెలిసిన ఒక టీచర్ (పేరు విక్రం రెడ్డి, వయస్సు-32), ఖమ్మం లో ఉంటూ(అలాగని టౌన్ లో ఏ సైడ్ బిజినెస్ లూ లేవులెండి) 20కి.మీ దూరంలో ముత్యాలగూడెం అనే ప్రాధమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా చేస్తున్నారు. అయినా అతని కమిట్‌మెంట్ కు జిల్లా విద్యాధికారులందరూ+అతను పనిచేసి వచ్చిన ప్రతి గ్రామవాసులూ సెల్యూట్ చేస్తారు. అతను వెళ్ళిన ప్రతీ స్కూల్ లోనూ అప్పటివరకూ కొంచెం నిరాసక్తంగా పని చేసిన సహాధ్యాపకులు కూడా తీరు మార్చుకొంటారు. ఇది గత పదేళ్ళుగా(అతని సర్వీసు) జరుగుతూనే వుంది. ఈ సంవత్సరం నా ఏకైక కుమార్తె 6వ పుట్టిన రోజు సంధర్బంగా(జనవరి5), వారి పాఠశాలలోని పేద (అందరూ) విద్యార్ధులకు ఉచితంగా నోటుపుస్తకాలు ఇప్పించేవిధంగా కమిట్‌మెంట్ తీసుకొని ఈ జూలై లో ఇప్పించాడు. మరికొందరు దాతలను ఒప్పించి పాఠశాలలో మరుగుదొడ్ల అభివృద్ధి, మంచినీటి సదుపాయం వంటివి కల్పించారు. ఇలాంటివారుకూడా ఇంకా వున్నారు అని చెప్పడం నా ఉద్దేశ్యం.
ఇక శివగారు మరికొందరు చెప్పినట్లు కార్టూనిస్ట్ ఆలోచనలకు ఆకాశమే హద్దు, వంద వ్యాక్యాలలో చెప్పలేనిది ఒక వక్ర రేఖలో చూపగలరు వారు, అందులో శ్రీధర్ గారిది ఘనమైన చేయి. ఇందులో ఎవరికీ సందేహం లేదు. కానీ, నేటి సమాజం లో అన్ని వ్యవస్థలలో వచ్చిన మార్పుల లాగానే విద్యా వ్యవస్థ కూడా కొంత దిగజారిందనేది కాదనలేని వాస్థవం. అంతమాత్రాన అందరినీ ఒక గాటన కట్టలేం కదా. టీచర్స్ డే రోజున నెగటివ్ కామెంట్ బదులు సర్వేపల్లి గారినో, వారి దారిలో ఇంకా నడుస్తున్న ఎవరైనా ఉత్తముణిపైన కామెంట్ వ్రాస్తే పాజిటివ్ గా ఉండేదేమో.
బాకా పత్రికల్లో చెంచా కార్టూన్ల గురించి ఒక్కసారి చూడండి అని శివగారు వ్రాసారు. కానీ చూడబోతే ఎందుకో శ్రీధర్ గారు కూడా (అలాంటి ఒక బాకా పత్రికలో ఉండబట్టేనేమో?), పైగా రామోజీ గారి హ్రస్వ ధృష్టి లక్షణాలు ఏమైనా సోకాయేమో అనిపిస్తోంది. దయచేసి ఇలా వ్రాస్తున్నందుకు శ్రీధర్ గారి అభిమానులను(నేను కూడా అందులో ఒకణ్ణి) క్షమాపణలు అడుగుతున్నా.
చివరగా టీచర్ల తరపున మరో రెండు మాటలు: 1. మారుతున్న జీవనశైలి(+అవసరాలు) టీచర్ ను కూడా ఏదో ఒక ఎక్ష్‌ట్రా యాక్టివిటీస్ చేసి నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదించాల్సిన అవసరాన్ని కల్పిస్తున్నాయి. పైగా మన ఘనతవహించిన నేతలు వారి జీత భత్యాల పెంపుపై ఉన్న శ్రద్ధ వీరి బాగోగులపైన, సమాజాభివృద్ధికి కీలకమైన విద్యా వ్యవస్థ పరిపుష్ఠిపైన చూపడంలేదనేది అందరం గమనించాలి. ప్రాధమిక విద్యకు పైసా విదిల్చేందుకు వెనకాడుతున్న ఈ ప్రభుత్వాలు ఉన్నత విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఎందుకిస్తున్నాయో తెలుసా? వారికి ఓటు హక్కు వుంది, వీరికి లేదు. (చిరంజీవి పార్టీ వైపు గ్రాడ్యుయేట్ యువత పోకూడదనే ఈ పధకం పెట్టినట్లు ఆరోపణలు వుండనే ఉన్నాయి).
2. పాఠశాలకు 8కి.మీ ల లోపలే టీచర్ ఉండాలనేది కొంత వరకు సమర్ధనీయమే అయినా, మరోరకంగా చూస్తే దగ్గరలో వుండే టౌన్ లో ఉండి అప్ & డౌన్ చేసినా తన వృత్తికి న్యాయం చేయగలిగితే సమర్ధనీయమే. ఎందుకంటే ఒక చిన్న పల్లెలో ఉపాధ్యాయుడైనందుకు అతను తన స్వప్రయోజనాలన్నిటినీ త్యజించాలని మనం ఆశించలేం. వివరంగా చెప్పాలంటే ఒకప్పుడు టీచర్ అంటే ప్రభుత్వోపాధ్యాయుడే, వారి పిల్లలు కూడా అదే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య పొందేవాడు. కానీ, నేటి పరిస్థితులు అలా లేవు (అందుకు సమాజంలోని అందరమూ భాద్యులమే). అలాంటప్పుడు, తన భార్యా, పిల్లలు పట్టణంలో ఉండి అక్కడి సౌకర్యాలను అనుభవించాలని కోరుకోవడం తప్పుకాదు. అతను చెప్పే బడిలోనే తన పిల్లలను కూడా చదివించాలి అనే వితండవాదం మనం గానీ చేసే పరిస్థితి వస్తే అదే పని మనమెందుకు చేయడం లేదు అని మనను మనమే ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది.
ఈ అంశం పైన మరిన్ని విశ్లేషణలు నా బ్లాగు: http://dare2questionnow.blogspot.com/ లో చూడగలరు.
(ప్రతిసారీ పొడవాటి వ్యాఖ్యలు వ్రాసి ఇబ్బంది పెడుతున్నట్లు ఎవరైనా భావిస్తే సారీ. విషయం అలాంటిది మరి.)

తుంటరి said...

గురువులలో విలువలు పడిపోతున్నప్పుడు వాటి గురించి చెప్పడానికి ఈరొజే తగిన రోజు. మళ్ళీ వచ్చే సెప్టెంబరు 5 వరకు గురువులు ఎవరికీ గుర్తురారు కదా.

Praveen Mandangi said...

RS గారు. ఒకప్పుడు టీచర్లు తాము పని చేసే చోటే నివాసం ఉండేవారు. 1980 తరువాత పట్టణ ప్రాంతాలలో ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల సంఖ్య బాగా పెరిగింది. పల్లెటూర్లలో పని చేసే టీచర్లు తమ పిల్లలకి ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పించడానికి పట్టణాలలో ఇళ్లు తీసుకోవడం మొదలయ్యింది. కొన్ని చోట్ల గ్రామాలు పట్టణానికి 40 కిలో మీటర్లు పైగా దూరంలో ఉంటాయి. అంత దూరం అప్ & డౌన్ అవ్వడానికి రూల్స్ ఒప్పుకోవని తెలిసినా అప్ & డౌన్ అయ్యేవాళ్లు ఉన్నారు.
కీచక గురువుల్ని ఆదర్శంగా తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు. దామోదరం తన శిష్యురాలిపై యాసిడ్ పోసిన కొన్ని రోజుల తరువాత ఇంకో ఘటన జరిగింది. ఒక యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిని ’నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను మరో దామోదరాన్ని అవుతాను’ అంటూ బెదిరించాడు. గురువులు చెడిపోతే సమాజం కూడా చెడిపోతుంది.

Jagadeesh Reddy said...

శ్రీధర్ గారి కార్టూన్‌లో అంత అసంబద్దత ఏమీ కనిపించడం లేదు. మీరందరూ ఒక్క విషయం మరిచిపోతున్నారు. ఈ రోజు గురుపూజా దినోత్సవం. కాదనడం లేదు. అలాగే గురువులందరూ ఇలాంటివారే అని ఇక్కడేమీ చెప్పడం లేదు. జాగ్రత్తగా గమనించండి. అది ఒక ప్రభుత్వ సభ. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఫంక్షన్ జరుగుతోంది. అక్కడ వేదిక మీదెక్కిన వారి గురించి వక్త పరిచయం చేస్తున్నాడు. అంటే ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అంత గొప్పవారికి, అంత మంచివారికి ఇస్తున్నారనేది దాని సారాంశం. సహజంగా నిజంగా బాగా చెప్పే గురువులు అవార్డులు ఆశించరు. కాని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావాలంటే మాత్రం అప్లికేషన్ పెట్టుకోవాలి. పైరవీలు చెయ్యాలి. పైవాళ్ళ ప్రాపకం బాగా వుంటే అవార్డు వస్తుంది. నాకు తెలిసి గతంలో మా వూర్లోనే ఆడపిల్లల్ని లైంగికంగా వేధించిన కీచక గురువుకే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ వచ్చింది. విషయం తెలిసి చాలా బాధ పడ్డాను. అంతకు మించి మరేమీ చెయ్యలేము కదండి.

Praveen Mandangi said...

మైనర్ బాలికలు అమాయకులు అనుకుని గురువులు వాళ్లని లైంగికంగా వేధించి ఉంటారు. ఈ ఉద్యోగం కొందరికి లాభదాయకమే. వీళ్లకి సెలవులు ఎక్కువ వస్తాయి. దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులు. సాధారణ ఉద్యోగులు సెలవు పెట్టి సైడ్ బిజినెస్ లు చెయ్యడానికి అవ్వదు కనుక సైడ్ బిజినెస్ లు చెయ్యాలనుకునేవాళ్లు టీచర్ ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఒకవైపు కీచక పనులు, ఇంకో వైపు సైడ్ బిజినెస్ లు. వాళ్లకి ఈ ఉద్యోగమే హాయిగా ఉంటుంది.

Anonymous said...

@Praveen Samra
మీరు చెబుతున్న చాలా విషయాలను నేను నా బ్లాగు లో వ్రాసాను. కాకపోతే "గురువులు చెడిపోతే సమాజం కూడా చెడిపోతుంది" అని మీరు వ్రాసారు, "సమాజంలో వస్తున్న విపరీత పరిణామాలవల్ల కొందరు గురువులుకూడా చెడిపోతున్నారని" నేను వ్రాసాను. వారుకూడా మానవమాత్రులేకదా? మనోహర్ లు ఏర్పడడానికి ఏ సామాజిక పరిణామాలు కారణమయ్యాయో, దామోదర్ లు ఏర్పడడానికి కూడా అవే కారణమయ్యాయి. అంత మాత్రాన అలాంటి గురువులను వెనకేసుకొస్తున్నానని మాత్రం అనుకోవద్దని మనవి. వారినే హైలైట్ చేసి మిగతా గురువులందరినీ కించపరచవద్దన్నదే నా పాయింట్.
@S.P Jagadish
మీరు చెప్పిన పోలిక బాగుంది. కొందరు అలాంటి వాళ్ళు కూడా సత్కారం పొందుతున్నారన్న మీ బాధ సమంజసమే. కానీ సత్కారం పొందేవాళ్ళందరూ వాళ్ళే కాదుగదా. ఆ విధంగా జనరలైజ్ చెయ్యడంవల్ల మొత్తం గురువులందరినీ అవమానించినట్లవుతుంది. కనీసం ఇంకొకరిని చూపించి ఈయన గారొక్కరే ఉత్తమ బోధన చేసారు అనుంటే నలుగుట్లో ఒకరిద్దరికైనా అర్హులకు అవార్డులు వస్తున్నాయనే మీనింగ్ వచ్చేది.

A K Sastry said...

జగదీష్ గారు చెప్పింది బాగుంది.

శ్రీధర్ కార్టూన్ పొద్దున్నే చూస్తూంటే......అలా పైరవీలు చేసుకొని 'వుత్తమ వుపాధ్యాయులు' గా అవార్డు అందుకుంటున్నవారే కనిపించారు నాకు.

ఇక ఈనాటి వుపాధ్యాయులు (గురువులా?!) గురించి వ్రాయాలంటే ఓ వంద టపాలు సరిపోవు.

కార్టూన్లో తప్పేమీలేదు.

Krishna K said...

స్పీ జగదీష్ గారు, you nailed it.. ఇప్పుడు ఉత్తమ ఉపాధ్యాయులు గా గుర్తింపు పొందున్న వారు దాదాపు అందరూ ఎంతో కొంత పైరవీలతోనో, లేక కుటుంబ రాజకీయ ప్రాబల్యంతోనో పొందుతున్నవారే, ఈ మధ్య కాలంలో అలా కాని వారు ఎంతమంది నిజంగా ఉన్నారో ఓ సారి ఆలోచించండి. ఇది ఓ ఉపాద్యాయుని కొడుకుగా, కుటుంబలోనూ, స్నేహితులలోనూ ఇప్పటికీ చాలామంది ప్రబుత్వ ఉపాద్యాయులుగా పనిచేస్తున్న వారు ఉన్నవాడిగా చెబ్తున్నాను.

శ్రీధర్ కార్టూన్ shows the same especially when it comes to "so called" ఉత్తమ ఉపాధ్యాయులు"

Sudhakar said...

ఈ జెనరేషన్ లో తయారయిన ఉపాధ్యాయుల గురించి బాగానే చెప్పింది ఈ కార్టూన్. వాటాలు పెట్టేవాళ్లు, అసలు స్కూళ్లకే వెళ్లని ఒజ్జలు, పిల్లలతో ఇంటి పని చేయ్యించుకునే వాళ్ళు, సెక్స్ హరాస్మెంటు గాళ్ళు చాలా చాలా ఎక్కువయ్యారు. వాళ్లందరి కోసమే ఇది.

Praveen Mandangi said...

RS గారు. గురువులు వ్యవస్థకి అతీతులు కారు. నిజమే. నాకు పాఠాలు చెప్పిన గురువే స్త్రీలని కించ పరిచే సామెతలు మాట్లాడేవాడు. పూర్వం భర్త చనిపోయిన స్త్రీలకి గుండు గియ్యించి తెల్ల చీర కట్టే ఆచారం ఉండేది. ఆ ఆచారాన్ని కూడా ఆ గురువు బలంగా నమ్మేవాడు. గుండు గియ్యించడాన్ని శిరోముండనం అనేవారు. ఆ గురువు విద్యార్థులని తిట్టడానికి ’మొగుడు చచ్చినా ముండకి బుద్ధి రాలేదు’ అనే సామెత వాడేవాడు. పల్లెటూర్లలో ఇప్పుడు కూడా ఆ ఆచారాన్ని పాటిస్తారని ఆ గురువే చెప్పేవాడు. తెలిసితెలిసి స్త్రీలని కించపరిచే సామెతలు మాట్లాడేవాడు.

ramasai said...

There have been news that now a days teachers become cruel. In these circumstances that cartoon is ok, nothing wrong in it

Abhigna

Srinivas said...

రాము గారు,
శ్రీధర్ గారి కార్టూన్స్ మీదే ఎందుకు ఇలా టపాలు వేస్తారు మీరు ???
మీకేమైనా వ్యక్తిగత విభేధాలు ఉన్నాయా ఆయనతో ?

ఇంకే బాకా కార్టూన్స్ మీకు కనపడలెదా ?

నిజంగా సంధర్భోచితం కాని కార్టూన్స్ పై టపాలు రాయండి సర్.

Pinstriped Zebra said...

ఈ 8 కిలోమీటర్ల నిబంధన వెనకాల ఉన్న లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. బడికి సరైన సమయంలో వస్తున్నారా పాఠాలు సరిగ్గా చెబుతున్నారా అనేది చూడాలి కాని బడికి ఎంత దూరంలో నివసిస్తున్నారనేది కాదు. నేను క్రమం తప్పకుండా సరైన సమయానికి బడి రాలేకపోతె నన్ను శిక్షించండి కాని నేను ఎక్కడ నివసిస్తున్నానేది none of anybody else's business. మన పాఠశాలల efficiency పెంచడానికి ఇటువంటి షార్ట్ కట్ నిబంధనలు తీసుకురాడం మూర్ఖత్వం.

బాబు హయాంలో ఈ హాస్యాస్పదమైన నిబంధన కొద్ది రోజులు ఖచ్చితంగా అమలు జరిపారు. The overriding feeling among teachers during that phase was that they were being treated as bonded labour by the government. Such irrelevant regulations will make even that miniscule minority of honest and sincere teachers to get demoralized.

kattashekarreddy said...

not only media, all mediums including cinema make teacher villain or comedian these days. there are people like that. but they are minority. see positive face of a teacher also.
shekar

Praveen Mandangi said...

@Pinstriped Zebra పల్లెటూర్లలో ఇళ్లు అద్దెకి కావాలనుకుంటే దొరుకుతాయి. మా అమ్మానాన్నలు తూర్పు గోదావరి జిల్లాలో బ్యాంక్ ఉద్యోగాలు చేసే రోజుల్లో పల్లెటూరులోనే ఉండేవాళ్లం. నేను టౌన్ కి అప్ & డౌన్ అవుతూ DTP వగైరా నేర్చుకునేవాడిని. ప్రభుత్వ టీచర్లు తమ పిల్లలకి ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పించడానికే పట్టణాలలో ఇళ్లు అద్దెకి తీసుకుంటున్నారు.

vipravinodi said...

మడిసన్నాక కాసింత కలాపోసన ఉండాలి మేష్టారూ.. కార్టూన్ల మీద ఈకలు పీకితే ఎలా?

Surya Tej Reddy said...

nakenduko .. sridhar ki extra publicity istunnattu anipistunadi ..

Balu said...

వేలమంది మంచి గురువులలో ఉన్న అతికొద్దిమంది చెడ్డవాళ్ళను, అదీ ఈరొజు కార్టూన్లో ప్రదర్శించడం బాగాలేదు.

all telugu news said...

వాస్తవాలు శ్రీధర్ కార్టూన్ లా చేదుగానే ఉంటై .. మింగుడు పడటం కష్టమే

all telugu news said...

మిత్రమా ... మీడియా కధలు వదిలేసి కార్టూన్ల మీద పడ్డావేంటి ?
అటు జగన్ ఓదార్పు , రోశయ్య నిట్టుర్పు, గ్రూప్ వన్ వడగాడ్పు, 'సేనియర్ల వేధింపు, మంత్రుల బెదిరింపు, ఎంపి ల దబాఇంపు ,వలస వరదతో కెసిఆర్ కన్నులు ఇంపు, చంద్రబాబు కంటగింపు... చిరంజీవి కలవరింపు, ఇలా జనం జర్ కష్టాల బదలాయింపు...
నీ కలం పదునుకు కావలసినంత కాన్సెప్ట్స్ ఓ దులుపు ... దులుపు దులపోచ్చు

Anonymous said...

ఉత్తమ గురువు అవార్డ్ ల ఔన్నత్యం విషయంలో మెజార్టీ అభిప్రాయం కరక్టే. నిజంగా అందుకు అర్హులైనవారుకూడా దానికి అప్లై చేసుకోవాలన్నా, తీసుకోవాలన్నా వెనకాడుతున్నారు. అసలు ఈ అవార్డ్ ల కోసం నేను ఉత్తమ ఉపాధ్యాయున్నీ అని టీచరే అప్లై చేసుకొవాలనే రూలే తప్పు. పద్మా అవార్డ్ ల వంటి వాటికి కూడా ఇదే రూలు. ఇందులో ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యమే ఎక్కువ. ఎందుకంటే ప్రతిభావంతులను ఎం.ఈ.ఓ, డీ.ఈ.ఓ, కలక్టర్ లాంటివారి ద్వారా జిల్లా స్థాయిల్లో ప్రభుత్వమే వారి ప్రతిభ ఆధారంగా నిర్ణయించాల్సిందిపోయి. ఎవరు ఉత్తములో మీరే నామినేట్ చేసుకొండంటే, అధమునికే కదా ఎక్కువ ప్రచార యావ ఉండేది?

sumadhurabhashini said...

Todays07 09 2010) cartoon on eenadu doesnt have any logic. It is like supporting giving freebies to all

Anonymous said...

'దామోదరం అనే గురువు తన శిష్యురాలిపై యాసిడ్ పోశాడు', 'ఓ గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురువు తన శిష్యురాలిని గర్భవతిని చేశాడు' లాంటి వార్తలు చదివినప్పుడు/ విన్నపుడు ఎంతో ఆవేదన కలుగుతుంది. మనుషుల్లో అందరూ చెడ్డవారే వుండరు, కొందరే వుంటారు. ఆ కొందరిని చూపి మనుష్యులంతా చెడిపోయారని జనరలైజ్ చెయ్యలేం. అలాగే గురువుల్లో కూడా. అంతమాత్రాన గురువులందరూ చెడ్డవారనేవిధంగా జనరలైజ్ చెయ్యరాదు. చెడును అసహ్యించుకుందాం. చెడ్డపని చేసినవాణ్ణి చీల్చి చెండాడుదాం. కానీ కొందరి చెడ్డతనాన్ని చూపి ఆ కమ్యూనిటీ మొత్తాన్ని అసహ్యించుకుంటూపోతే చివరికి గురువు అనేవాడే మిగలడు.
4. "గురువులు చెడిపోబట్టే సమాజం కూడా చెడిపోతుంది" లాంటి వితండ వాదన కొందరు వినిపిస్తుంటారు. అదికూడా కరక్ట్ కాదు. సమాజంలో వస్తున్న విపరీత పరిణామాలవల్ల కొందరు గురువులుకూడా చెడిపోతున్నారు. వారుకూడా మానవమాత్రులేకదా? మనోహర్ లు ఏర్పడడానికి ఏ సామాజిక పరిణామాలు కారణమయ్యాయో, దామోదర్ లు ఏర్పడడానికి కూడా అవే కారణమయ్యాయి. అంత మాత్రాన అలాంటి గురువులను వెనకేసుకొస్తున్నానని మాత్రం అనుకోవద్దని మనవి. వారినే హైలైట్ చేసి మిగతా గురువులందరినీ కించపరచవద్దని నా మనవి.
ఇహ చెడ్డ గురువుల గురించి ప్రస్థావన రాగానే ప్రభుత్వ టీచర్ల గురించి మాత్రమే సెటైర్లు వేసుకొనే వివక్షాపూరిత పరిస్తితులు ప్రస్తుతం ఉన్నాయి. ఏం, ప్రయివేటు స్కూళ్ళలో ఎంతమంది దామోదర్ ల ఉదంతాలు వెలుగు చూడలేదు. 'తెలుగులో మాట్లాడం' అని పిల్లల మెడలో బోర్డులు తగిలించిన మిషనరీ స్కూళ్ళ ఉదంతం చూడలేదా? మరి ఆ స్కూళ్ళు ఏమైనా మూయించామా? మన పిల్లల్ని పంపడం మానేసామా?
దీన్ని బట్టి చూస్తే మనకేది అవసరమో దాన్ని వెనకేసుకొస్తూ, అవసరం లేనిదాన్ని (మన పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళకు ఎటూ పంపడం లేదు కాబట్టి) చెండాడుతున్న ద్వంద వైఖరిని ప్రదర్షిస్తున్నామనుకోవచ్చేమో?

Praveen Mandangi said...

ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లతో పాటు స్కూల్ యాజమాన్యం కూడా నీతి మాలిన పనులు చేస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో ఎవరైనా గురువు కీచక పనులు చేస్తే సస్పెండ్ చేస్తారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తమ స్కూల్ పరువు పోకూడదని టీచర్ ని వెనుకేసుకురావడం జరుగుతుంది. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు బాగానే ఉండేవి. ప్రైవేట్ స్కూళ్ల కంటే మెరుగైన ప్రమాణాలు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు లేక మనం పిల్లల్ని ఆ స్కూళ్లకి పంపడం లేదు. ప్రభుత్వం కావాలని విద్యని ప్రైవేటీకరించాలనుకుంటోంది. ఇంగ్లిష్ మీడియం కోసం కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకి పంపిస్తున్నాం. ప్రభుత్వ టీచర్లు కూడా తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకి పంపిస్తున్నారు. అందుకోసం పట్టణాలలో ఇళ్లు అద్దెకి తీసుకుంటున్నారు. మా జిల్లాలో పాలకొండ పట్టణం మైదాన ప్రాంతంలో ఉంది. కానీ పాలకొండ పట్టణానికి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న గిరిజన గ్రామాలలో పని చేసే ఉపాధ్యాయులు కూడా ఆ పట్టణంలోనే ఇళ్లు తీసుకుంటున్నారు. ఉద్యోగం కోసం ఇంగ్లిష్ అవసరమే కానీ తెలుగు సబ్జెక్ట్ లేని కొన్ని సెంట్రల్ సిలబస్ స్కూళ్లలో కూడా ప్రభుత్వ టీచర్ల పిల్లలు చదువుతుండడం ఆశ్చర్యకరం.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి