Saturday, October 9, 2010

"ది హిందూ" ఫోటో గ్రాఫర్ గోపాల్ పై కంట్రీ క్లబ్ గూండాల దాడి

నల్గొండ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం నుంచి ఎంతో కష్టపడి వచ్చి ఫోటో జర్నలిస్టు గా అద్భుతంగా పనిచేస్తున్న 'ది హిందూ' ఫోటో గ్రాఫర్ నగర గోపాల్ పై ఈ సాయంత్రం హైదరాబాద్ లోని కంట్రీ క్లబ్బు సెక్యూరిటీ సిబ్బంది గా చెప్పుకునే గూండాలు దాడి చేసి గాయపరిచారు. 

ఒక నిస్సహాయ యువతిని ఈ గూండాలు విచక్షణారహితంగా కొడుతున్నప్పుడు గోపాల్ చూసి విధి నిర్వహణలో భాగంగా రెండు స్నాప్స్ తీసాడు. దాంతో చెలరేగిపోయిన పది పదిహేను మంది సెక్యురిటీ సిబ్బంది..."మీడియా వాడు రా..." అంటూ తనను క్లబ్బు లోకి బలవంతంగా తీసుకువెళ్ళి ఇష్టమొచ్చినట్లు కొట్టారని, కెమరా గుంజుకున్నారని గోపాల్ చెప్పాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఒక సబ్ ఇన్ స్పెక్టర్  శ్రీనివాస రెడ్డి సహాయంతో గోపాల్ బతికి బైటపడ్డాడు. 

వెంటనే పోలీసులు గోపాల్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ మధ్య తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ...మానసికంగా కుంగి వున్న గోపాల్ పై ఈ దాడి జరిగింది. వృత్తిని దైవంగా భావించే గోపాల్ పై...ఈ తెగ బలిసిన గూండాలు ఇలా దాడి చేయడాన్ని ఈ బ్లాగ్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ గూండాలను వెంటనే అరెస్టు చేయాలని కోరుతున్నాం. 

నల్గొండలో నేను 'ది హిందూ' విలేకరిగా వున్నప్పుడు గోపాల్ ను ఫోటో గ్రాఫర్ గ నియమించాను. అంతకు ముందు అతను హేమ దగ్గర 'zee channel' వీడియో గ్రాఫెర్ గా పనిచేసేవాడు. వలిగొండ రైలు ప్రమాదం అప్పుడు గోపాల్ సాహసంతో తీసిన ఫోటో లు, అతని చలాకీతనం నచ్చి 'ది హిందూ' పత్రిక ప్రధాన సంపాదకులు ఎన్.రామ్ గారు గోపాల్ కు పర్మినెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఇక్కడి బ్యూరో చీఫ్ నగేష్ గారు, సిటీ ఎడిటర్ శ్రీనివాస రెడ్డి గారు, ఫోటో సెక్షన్ ఇన్ ఛార్జ్ సతీష్ గోపాల్ కు వెన్ను దన్నుగా వున్నారు.     

"బాగా కొట్టారు. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి," అని గోపాల్ చెప్పాడు. ఈ దాడి పట్ల ఎన్.రామ్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి తో మాట్లాడి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాలని రామ్ గారు నగేష్ గారిని కోరినట్లు తెలిసింది.  

11 comments:

oremuna said...

Do u have those photos?

Anonymous said...

జర్నలిస్టుల సంఘాలు చచ్చాయా?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Very bad.

సుజాత వేల్పూరి said...

అసలు ఆయువతిని కూడా ఎందుకు కొట్టారో విచారించాల్సిన అవసరం ఉందనుకుంటాను.

ఇంతకీ ఆ గుండాల మీద పోలీస్ రిపోర్టు ఇచ్చారా లేదా?

ఇప్పుడు గోపాల్ ఎలా ఉన్నారు? జర్నలిస్టు సంఘాలు ఏమైనా స్పందించాయా?

@ఒరెమునా,
మీరు అడిగింది నిన్న ఆ యువతిని కొడుతున్నపుడు గోపాల్ గారు తీసిన ఫొటోలా? వలిగొండ రైలు ప్రమాదం ఫొటోలా? :-))

Saahitya Abhimaani said...

Thats very bad. I hope media shows its strength in ensuring suitable action against the culprits.

astrojoyd said...

in chennai also this club is doing some bogus activities

tarakam said...

కంత్రీ క్లబ్ గూండాలు అలా చేశారంటే నాకేం ఆశ్చ్యర్యం గా లేదు . యధా రాజా తధా ప్రజా . చార్మినార్ బాంక్ లాంటి వాటి నెన్నిటినొ దోచుకొని ఎంతొ మంది ఆత్మహత్యలకు కారఱమైన క్రిమినల్ దగ్గర పని చేసే వాళ్ళు క్రిమినల్స్ కాకుందా ఎలా ఉంటారు ?

katta jayaprakash said...

I was just shocked after going through the news of brutal attack on our Gopal.The Hindu management must take this incident very seriously.Gopal is most sincerer,obedient,disciplined press photographer who was trained in photo journalism by you and I recollect the farewell party given to you and warm words about Gopal by every one.Really it is a dark day for the press photography.I am surprised that there is no coverage of the attack in the TV news channels as far as I know.My heartful sympathies Gopal and pray for his early recovery from the body pains.Let us hope the asociation of press photographers will follow the caetill the culprits are punished.

JP.

martialarts said...

Very bad ramu gaaru..
Ilanti sandarbaallo journalist thiragabadalanedi naa abhiprayam. nenu gatham lo koodaa meeku ee vishayam cheppanu. Andhrapradesh Crime Reporters Association ni 20.10.2010 naadu official gaa prarambhistunnamu. maa association tharapuna thappakunda ee vishayam pai poradathamu...

- Kamal

Saahitya Abhimaani said...

...."The Hindu management must take this incident very seriously...."

Ramugaroo, I still remember one post made by you regarding journalists not being allowed inside the AP Bhavan in Delhi and the fervor with which some "Senior" Delhi journos coming on this blog and attacking bloggers for their arguments.

What are these highly spirited journos doing now?? Are they not feeling it is their duty to respond and ensure that justice is done to their brother journalist, or their spirited response is only hallow words with no deeds!?

Sudhakar said...

ముందు ఆ కంత్రీ క్లబ్ రాజీవ్ రెడ్డి గాడిని బయటకు లాగాలి. ఫోను స్పాములు, రకరకాల పాకేజీ స్కాంలు, పెద్దోల్ల భార్యా మణుల పేకాట డ్రామాలు అన్నీ వీడి వల్లనే అవుతున్నాయ్.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి