Tuesday, October 12, 2010

Studio-N లో ఉద్వాసనల పర్వం--ఆందోళనలో జర్నలిస్టులు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నిర్వహిస్తున్న స్టూడియో-ఎన్ అనే ఛానెల్ నుంచి గత రెండు రోజులలో యాభై మందికి పైగా సిబ్బందిని తొలగించారు. తెలుగు దేశం భజనకు, కాంగ్రెస్ దూషణ కు పరిమితమైన ఈ ఛానల్ ఒక్క రాజకీయ వార్తలకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ స్పోర్ట్స్, బిజినెస్, క్రైం, సినిమా డెస్కులను పూర్తిగా ఖాళీ చేసినట్లు సమాచారం. ఈ పరిణామంతో కడుపు కాలుతున్న జర్నలిస్టులు త్వరలో ఎన్.టీ.ఆర్.ట్రస్ట్ భవన్ దగ్గర నిరశన కు దిగబోతున్నట్లు తెలిసింది. 

నిన్న ఒక్క రోజునే ముప్ఫై మందిని తొలగించారు. ఈ పరిణామాల పట్ల...ఛానల్ బాధ్యతలు చూస్తున్న కందుల రమేష్ స్పందన తెలియాల్సి వుంది. 

"మిమ్మల్ని భరించలేకపోతున్నాం..." అని చెప్పి పదిహేను రోజుల జీతం అదనంగా ఇచ్చి ఇళ్ళకు పంపుతున్నట్లు చెబుతున్నారు. ఇది అమానుషం, దారుణం. జర్నలిస్టులు, ఇతర సాంకేతిక సిబ్బంది కుటుంబాలు దీని వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వసూళ్లు తప్ప జర్నలిస్టుల సంక్షేమం ఏమాత్రం పట్టని జర్నలిస్టుల సంఘాలు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి వీరిని ఆదుకోవాలి. 

ఈ తాజా పరిణామాల పట్ల...కందుల రమేష్ స్పందించాలి. తాను తీసుకు వచ్చిన ఇంతమందిని యాజమాన్యం తొలగించి సమాధి చేస్తుంటే....మనదేమి పోయిందని ఆయన అనుకోవడం తప్పు. సీనియారిటీ వల్లనో, కులం గోత్రం వల్లనో లక్షో, లక్షన్నరో వస్తున్నాయనో సీనియర్లు నోరుమూసుకుని కూర్చోవడం మంచిది కాదు. జర్నలిస్టులు...ఐక్యమై ఈ అన్యాయాన్ని ఎదిరించాలి. రమేష్ కూడా ఒక నెల కిందట ఛానెల్ వదిలేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక మూడు రోజులు అలిగి...మళ్ళీ ఆయన సెట్ అయ్యారు. ఇప్పుడు బలికావడం చిన్న ఉద్యోగుల వంతు అయ్యింది. విలేకరులకు ఇబ్బడిముబ్బడిగా తీసుకుని...మూకుమ్మడిగా తొలగించడం అన్యాయం. 


"ఒకప్పుడు బాబు గారు వ్యవసాయం దండగ అనుకున్నారు. వారి కుమారుడు గారు ఇప్పుడు రాజకీయేతర జర్నలిస్టులు అవసరం లేదని అనుకుంటున్నారు. మీడియాలో పెద్ద చీడ పురుగు స్టూడియో-ఎన్," అని ఒక జర్నలిస్టు ఆవేదన వెలిబుచ్చాడు.  

30 comments:

Unknown said...

ఇలాంటి ఒపీనియన్ బేస్డ్ ఛానెల్స్ కి అస్సలు లైసెన్సే ఇవ్వకూడదు. ఈ మాట అనడం అజ్ఞానమే అవుతుంది. అయినా సరే అనకమానదు. ఇట్లు ఓ జర్నలిస్టు అన్న భ్రమల్లో వున్న- నేను.

for telangana said...

pls studion n lo unnavariki suport cheyandi. lack's rupies salarys unnavarini vadili just besic salary vallanu tiyadam sari kadu. pls manam manushulame. nithulu cheppe chandrababuku edi telidani cheppalemu kada.....

for telangana said...

నీతులు చెప్పే చంద్రబాబు ఛానెల్లో అతి తక్కువ జీతాలున్న వారిని తొలగిస్తున్నారు. మనం మనుషులమే కదా... వారికి సపోర్టు చేసి తీరాలి. లక్షల రూపాయాలు తీసుకుంటున్న వారిని వదిలి నెల జీతాల మీద తన ఇంటిని నెట్టుకొచ్చే వారిపై తన ఇష్టానుసారంగా అభిష్ట చేస్తున్న వికృత చేస్టలను ఖండించాల్సిందే. దీన్ని మొండిగా సమర్థిస్తున్న కందుల రమేష్‌ను ప్రశ్నించాల్సిందే...

పూర్ణప్రజ్ఞాభారతి said...

భజన కోసమే టీవీ ఛానెళ్లు పెడితే ఇంతే. ఓదార్పువీరుని ఛానెల్లో ఆయన యాత్రలే వార్తల్లో ప్రాముఖ్యం వహిస్తున్నాయి. ఇలా మరికొంతకాలం సాగితే ఏ రెండు ఛానెళ్లూ ఒకే వార్తను ఉన్నదున్నట్లు చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. ఇక మనం నాలుగైదు ఛానెళ్లు చూస్తే కాని వాస్తవం తెలియని కాలం దాపురించేట్లు ఉంది. అదే జరిగితే ప్రజలు సిన్సియర్గా తమిళ అనువాద సీరియళ్లు మాత్రమే చూస్తారు. ఛానెల్ బాసులు ఈ కటువైన వాస్తవాన్ని గమనించకపోతే నెత్తిన చెంగు వేసుకునే రోజులు గభాల్న వచ్చి పడతాయి.

Unknown said...

ananymous said
mosapoyam annayya..mosapoyam
annayya..idhantha chandhrababuku
thelise jaruguthondha..
mammalni kapadandi ramannayya

astrojoyd said...

వసూళ్లు తప్ప జర్నలిస్టుల సంక్షేమం ఏమాత్రం పట్టని జర్నలిస్టుల సంఘాలు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి వీరిని ఆదుకోవాలి.
chennailoni tejous ane sangham koodaa ide reethilo nadustondi mari..

Srinivas said...

తెలియక అడుగుతున్నాను - స్టుడియో నడపడం కష్టమయినప్పుడు లేక సరిగా పని చేయనప్పుడు ఉద్యోగస్తులను తీసివేసే హక్కు కంపెనీ యజమానికి ఉండదా?

astrojoyd said...

@. ఛానెల్ బాసులు ఈ కటువైన వాస్తవాన్ని గమనించకపోతే నెత్తిన చెంగు వేసుకునే రోజులు గభాల్న వచ్చి పడతాయి.pandit ji--bosses r decorating the sign-cloth on their journalists heads.so bosses never loose sir.

@srinivas----తెలియక అడుగుతున్నాను - స్టుడియో నడపడం కష్టమయినప్పుడు లేక సరిగా పని చేయనప్పుడు ఉద్యోగస్తులను తీసివేసే హక్కు కంపెనీ యజమానికి ఉండదా?--if they feel difficulty in running,how they came in to the contract of buying andhrajyothi-daily wth a huge amount of 4oocrs?sir..

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

మీ బ్లాగులో ఈ మధ్య దుర్వార్తలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.

మంచి పాత్రికేయుడుగా పనిచేయాలంటే చాలా విశాలహృదయం కావాలి. విధేయత యజమానికైనా, అంకితభావం సమాజానికి అయి ఉండాలి. కఱుడుగట్టిన ఆస్థానకవులూ, వందిమాగధులూ భట్రాజులూ పాత్రికేయతకి wrong candidates. కానీ చూడబోతే ఈ నవీన మీడియా సంస్థానాధీశులకి మాత్రం అలాంటివాళ్ళే కావాలి. ఈ సంకుచిత తెలుగు మీడియాలో అలాంటి నిజమైన పాత్రికేయులు బతగ్గల రోజులు సమూలంగా అంతరించిపోతున్నట్లున్నాయి. ఈరోజు ధనబలం చూసుకొని ఇలా ప్రవర్తిస్తున్నాయి నిర్వాహకవర్గాలు. ఱేపు ప్రజలే మీడియా-ముసుగేసుకున్న ఈ స్తోత్రసమాజాలకీ, బుఱదజల్లుడుసైన్యాలకీ, భట్రాజమండళ్ళకి, ఈ మాఱువేషపు పార్టీ గెజిట్లకీ భరతవాక్యం చదువుతారు.

observer said...

mr. ramu nuvvu principal ga pani chestunna journalism college yajamanyaniki chendina hm tv enthmandini bayataku pampindo neeku telusaa? nuvvu nispakshapathanga vyakhyanimchalante andarigurinchi rayi.lekunte nuvvu kuuda edo oka rangu,ruchi vaasanaku chendina pakshapaathivane mementha anukuntaamu.aa leble nuvvu korukuntunnaavaa?

Anonymous said...

this is totally barbaric...its very insane...! they should definitely protest over this injustice...

Unknown said...

telivi thakkuva srinvas garu...

vallani jobloki teesukuneppudu..channel pettinappudu aa telivi emaindi..>

nuvvu abhista gadi chencha gadiva..

ilanti comments aapu..lekapothe charithra heenudivi avuthavu..

for telangana said...

మిస్టర్‌ శ్రీనివాస్‌ వాస్తవాలు తెలుసుకుని నీ అభిప్రాయాలను రాయి. నీవు ఏదైన జాబ్‌ చేస్తుంటే నీకు తెలుస్తుంది ఒక ఉద్యోగి మనోభిప్రాయం.మంచి ఉద్యోగాలను వదిలి ఆ దరిద్రపుగొట్టు దిక్కుమాలిన ఛానెల్లో చేరాల్సిన అవసరం లేదు కదా. మంచిని మంచి అనకుంటే చేడును చేడు అనకుంటే ...? ఏమనాలో తేలీడం లేదు. నీవు జండూబామ్‌ రాసుకునే చోట ఇంకా కొంత ఎదగాలి.

Unknown said...

nice picture http://img145.imageshack.us/img145/497/studion.jpg

Srinivas said...

రెండు ప్రశనలు వచ్చాయి నా ప్రశనకు బదులుగా.
ఒకటి స్టుడియో నడపలేనప్పుడు అన్ని కోట్లతో ఆంధ్రజ్యోతిని ఎట్లా కొంటున్నారని. మరొకటి ఛానెల్ పెట్టినప్పుడూ, ఉద్యోగమిచ్చినప్పుడూ ఆ తెలివి ఏమయిందని. అంటే ఇప్పుడు తీసేట్లయితే అసలు ఉద్యోగం ఇవ్వడం దేనికని అర్థం అయి ఉండాలి.
ముందుగా ఉద్యోగం కోల్పోయిన వారికి నా సానుభూతి. అది ఎవరికయినా అంటే వాళ్లకూ, చూచేవాళ్లకూ బాధాకరమే. తీసేయడంలో కుల మత ప్రాంత లింగ వివక్ష కనిపిస్తే పోరాడ వలసిందే.
ఉద్యోగమన్నది ఒక ఒప్పందం. ఇద్దరికీ ఆమోదయోగ్యమయినంతవరకూ మాత్రమే అది నిలబడి ఉంటుంది. మరొక చోట ఎక్కువ జీతం వస్తే వెళ్ళేందుకు మీకెంత హక్కు ఉంటుందో, మీ సేవలు అవసరం లేనప్పుడు తీసి వేసేందుకు యజమానికీ అంతే హక్కు ఉంటుంది. మీ సేవలు కంపెనీకి లాభదాయకమయినంతవరకూ మిమ్మల్ని బయటికి పంపడానికి ఏ యాజమాన్యమూ పాల్పడదు, అంతకంటే లాభసాటి ప్ర్త్యమ్నాయమేదో ఉంటే తప్ప.
ఉద్యోగుల్ని తీసేయడానికి నష్టాలే రానక్కర్లేదు; లాభాలు పెంచుకోవడానికి కూడా కావచ్చు. గుర్తించవలసింది వ్యాపార సంస్థలు ప్రభుత్వ సంస్థలు కానీ, ధర్మసంస్థలు కానీ కాదన్న వాస్తవం. ఉద్యోగానికి సంబంధించిన వొప్పందాన్ని అతిక్రమిస్తే తప్ప యాజమాన్యాన్ని తప్పు పట్టలేం.
తీసేస్తున్న వాళ్ళకు వొప్పందం ప్రకారం అదనపు జీతం చెల్లించడం వాళ్ళ బాధ్యత. వాళ్లకు వేరే ఉద్యోగాలు వెతుక్కోవడంలో కొద్దిపాటి సాయమయినా చేయడం ధర్మం.

Anonymous said...

శ్రీనివాస్ మీరు చెప్పేది సబబుగా వుంది. నష్టాలు వస్తున్నా వుద్యోగులను ఉద్ధరించడానికి అదేమీ ప్రభుత్వ సంస్థ కాదు కదా. సంస్థను నడపడంలో యాజమాన్యానికే ఎక్కువ హక్కులు, భాధ్యతలు వుంటాయి. పనిచేయని ఉద్యోగులను తొలగించే హక్కు ప్రైవేట్ యజమాన్యానికి వుండాలనటం న్యాయమే అనిపిస్తుంది.

vin vin properties said...

news reader Himabindu seems to have left N -TV and joined Studio-N.

Anonymous said...

@Sri & Banti
మీ ఎమోషన్స్ ను అర్ధం చేసుకోగలం. కానీ, మనకు నచ్చని ఒక వ్యాఖ్య వ్రాసినంతమాత్రాన మనం కౌంటర్ వ్యాఖ్యతో దాన్ని ఖండిస్తూ వారిని తప్పు పట్టవచ్చు. అలాగే వారు ఏ కోణంలో ఆ వ్యాఖ్య వ్రాసారో, అందులో ఏమైనా వాస్తవాలు ఉన్నాయేమో కూడా గమనించాలి. అంతేగానీ, వాళ్ళను కించపరిచేలా వ్యాఖ్యానించడం తెలివైన పని అనిపించుకోదు. సోక్రటీసు మొట్టమొదతి సారిగా భూమి గుండ్రంగా ఉందన్నప్పుడు ఒక రకమైన మత ఛాందసంతో ఉన్న వారు ఆయనను వెంటనే చంపేసారు. ఆ తర్వాత నిజం తెలుసుకున్నా అంత పెద్ద తత్వ, శాస్త్రవేత్తను మాత్రం మళ్ళీ తీసుకురాలేరుగా??
ఇహ ఉద్యోగాలు తీసుడు విషయానికొస్తే, కారణాలు సహేతుకమైనవి కాకపోయినప్పటికీ ఈ గ్లోబలైజేషన్ కాలంలో మనం ఒక యజమాని దగ్గరే ఖచ్ఛితంగా ఇన్నిరోజులు పనిచేస్తామని ఎలా చెప్పలేమో, వాడు ఎన్నిరోజులు మననా ఉద్యోగంలో ఉండనిస్తాడో కూడా అలాగే అయింది. కాకపోతే ఈ విషయంలో అంత అన్యాయంగా ఎకా ఎకిన టోకుగా అంతమందిని తీసెయ్యడం మాత్రం సరిగా అనిపించలేదు.
అన్నట్లు, పాపం ఒకానొక తొలగించబడిన ఉద్యోగి ఆత్మహత్యా యత్నం కూడా చేసాడట. సాక్షి వాడికి అదొక హాట్ కేక్ అయిపోయింది నిన్న రాత్రంతా........

Unknown said...

meeru journalist aithe na sanubhuthi..
kakapothe meeku konni vasthavalu theliyacheyali..

1. mediaku sambandham leni gottam gadu (abhista)akkada rajyam eluthunnadu..vadiki evaru sarinavado ...evadiki panirado theliyadu..

2. input ga output ga kottaga evaru vachina thanatho o kotha mandanu thesukosthe..evaru...enduku..emiti..ani adagakunda job ivvadam..tharvatha thesiveyada..

3. manchi journo's akkada okkaru leru..

4. I satyanarayana lanti senior journoni a abhista gadu..orey..annadata...

5..nayudu gari channel lo brahmana samajanni nelakolpe plan chestunnadu aa abhista gadu..

6.10,000 salary unnavariki ikkada 20,000 ista ani theesukuravadam...3 months kagane pampeyadam..what is this..

7. dept.s etheyam emitira..channel ela undalo ela undakudado plan undada..jeevithalante antha chulakana...
8. channel nadapadaniki oka journo dorakaleda lokesh neeku..

8..srinivas...ilantivi inka chala unnai..thelusuko...

9. employer..employ relations maku thelusu..situation is different..
pls support it..or keep quit..

phoenix said...

Nice Post..

(ramnarsimha)

Amar said...

@ Ramu & Hema టిఆర్ఎస్ విద్యార్ధి నేత సుమన్ .. అమరవీరుల కుటుంబాల ప్రతినిధి రఘుమారెడ్డి ఫైటింగ్ సీన్ ..కొమ్మినేని వారి సాక్షిగా ..
ఈ నెల ఎన్ టివి లొ లైవ్ షౌ పై మీ మౌనం నిరాషపర్చింది. మీ బ్లాగ్ లొ దానిపై రాయండి .

Unknown said...

MR.SREENIVAS
MEMUPANICHESEDHI KARMIKAHAKKULU GURINCHI NITYAM MATLADE..POTLADE MEEDIALO...THELIVILENI COMMENTS
RASI EE BLOG VILUVANI THAGGINCHAKANDI
PLZ..

katta jayaprakash said...

The employee and employers relationship is based on mutual trust,faith,understanding and mutual benefit.If the employee feels that the employer is inefficient,indiscilined and a white elephat to him he can sack the employee with prior notice.If the employee feels that the job is not beneficial to him in any manner and if there are good opportunties in all aspects better than the existing one he or se can quit the job with prior notice.Both got freedom in this aspect.When new TV channels were started a few years ago many of the staff of ETV left for the new channels as they were offered better salary and facilities than ETV.Many seniors who were with ETV since it's birth had left the channel with goodwill without any ill feelings and the management never objected nor created any problems to those who quit the job.Any sacked employee too should not create problems and drag into the issue to the streets with regional,political and caste feelings but accept it honourably.
But the way Studio 1 had sacked the employees enmass during the navarathri festival is highly condemnable anmd objectionable.The management should have sacked in phases to avoid problems to the employees and should have chosen the period after the festival season as the sackedemployees never be happy during the festivaln season and Studio 1 has committed a major blunder inviting wrath of the society even though they got freedom to sack any employee with prior notice and avance payment.It is most unfortunate that cable net works have stopped telecasting Studio 1 in Telangana which is unethical,unproffessional and the regionalism is nothing to do wit the problems of the employees and employer.

JP.

Anonymous said...

@Sri
@ 10,000 salary unnavariki ikkada 20,000 ista ani theesukuravadam...3 months kagane pampeyadam..what is this?
ప్రశ్న బాగానే అడిగారు గానీ, మరి అంతంత ఆశ చూపగానే గొర్రెల మందల్లాగా మనవాళ్ళు చేరిపోవడం, ఆశలకు కూడా హద్దులుండాలని మరిచిపోవడం, ఒక చానళ్ళో బాగానే సాలరీ+గౌరవం వున్నా మరింత సాలరీ కోసం అర్ధాంతరంగా (ఫ్రీక్వెంట్ గా కూడా) జంపింగ్‌లు చేసెయ్యడాలు ఇవ్వన్నీ కూడా సర్వసాధారణమైపోయాయిగా?
ఏది ఏమైనా ఇలా కొన్ని మీడియా హౌజులు మరో చానల్‌లో వున్న వాళ్ళను మొదట ఎక్కువ ఆశ చూపించి గుంపుగా తమవైపు లాగటం తరువాత గుండుగుత్తగా తీసెయ్యడం మాత్రం క్షమించలేని తప్పు.
ఇలాంటివాటికి ఒకే ఒక పరిష్కారం-మీడియా ఆంబుడ్స్‌మన్. అటువంటి వ్యవస్థ ఒకటి వుంటే ఎవరికి సమస్య వచ్చినప్పుడు వారు వ్యక్తిగతంగా పోరాడటం కాకుండా దాని ద్వారా సహేతుక న్యాయాన్ని ఆశించవచ్చు. పైగా మీడియా హౌజుల 'అతి' ని కూడా అది నియంత్రించగలదు.

Unknown said...

RS Reddy Garu..

pls try to understand my point..

they r least bothered of employes and their life..

how can one management take employes with out any test or qualification.

we journalists thinks that it is of chandrababu naidu channel..more comfort more reliable..

don't u think it is cheating..

don't u think his son a cheater

pls do know about that bloody abhista..

you will come to know what is going on in studio n

do'nt compare this issue and that srinivas mindless comments with socrates ...


pls...

Srinivas said...

జయప్రకాశ్ గారు చెప్పినదాన్ని అంగీకరిస్తాను - ఆ యాజమాన్యం మానవతా దృష్టితో పండగ వెళ్ళిందాకా ఆగడం (అయితే దసరా వెళ్లగానే దీపావళి, కొత్త ఏడాది, సంక్రాంతి.. సరైన సమయం ఎప్పుడు అన్నది ఒక ప్రశ్న), మూకుమ్మడిగా కాక విడతల్లో తొలగించడం చేసి ఉంటే బావుండేది.
నేను జర్నలిస్టును కాను; మీ జర్నలిస్టు ప్రపంచం నాకు తెలియదు. ఎవరికీ శత్రువునూ, మిత్రుణ్ణె కాను. ఉద్యోగం పోయిన వాళ్ళకు సానుభూతి చూపగలనే కానీ, తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని వొత్తిడి తేవడాన్ని సమర్థించలేను. నన్ను నిందించినా అది మీ ఆవేదనలోంచి పుట్టిందనే భావించి పట్టించుకోవడం లేదు. తర్కంలో Ad Hominem మనం తరచుగా చూచే fallaciesలో ఒకటిగా గుర్తించి వాదానికి పరిమితమవుదాం.
ఆ స్టుడియోలో అనేకలోపాలు ఉండొచ్చు; వాటికీ, యాజమాన్యానికి గల ఉద్యోగుల్ని తొలగించే హక్కుకూ సంబంధం ఏమిటి? దేని ఆధారంగా తొల్గించిన ఉద్యోగస్తుల్ని తిరిగి తీసుకోవాలో చెప్పగలరా?
ఇక ముందూ ఇటువంటివి జరుగుతాయి. కాస్త దూరదృష్టితో జర్నలిస్టులంతా సంఘటితమైతే, తొలగించబడిన వాళ్లకు ఉద్యోగం వచ్చేలోగా ఆర్థిక సాయం, వేరే ఉద్యోగం వెతుక్కోవడంలో తోడ్పాటు లభించే ఏర్పాట్లు చేసుకోవచ్చు. తొలగింపుకు సహేతుకమైన కారణం చూపించడానికీ, తొలగింపుల్లో ఒక నెలలో నిర్ణీతశాత పరిమితికి యాజమాన్యాలను వొప్పించవచ్చు. తొలగించినప్పుడు ఆ స్టుడియోలో పనిచేసిన కాలం ఆధారంగా severence pay పొందడం వంటి హక్కుల్నీ సాధించుకోవచ్చు. వ్యాపారాత్మక ప్రపంచంలో ఎవెరూ దయాదాక్షిణ్యాలతో ఉద్యోగాలు ఇవ్వరు, తొలగించకుండా ఉండరు, తిరిగి తీసుకోరు.
జర్నలిజం లో ఉన్నవాళ్లు ఈమాత్రం ఆలోచించగరనే నా ఆశ.

Thirmal Reddy said...

స్టూడియో ఎన్ ఉద్యోగులను మూకుమ్మడిగా తీసెయ్యడం నిజంగా చాల బాధ కలిగించింది. ఇలాంటి ఘటనలు ఇంకా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొన్ని చానెళ్ళలో కూడా ఇలా మూకుమ్మడిగా కాకపోయినా పూటకో ఇద్దరు ముగ్గురు చొప్పున సాగనంపే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నా స్నేహితులు కొంత మందిని ఇలాగే బయటకు పంపారు. తమను కూడా ఏ క్షణంలో వెల్లగోడతారో తెలియక ఇంకొంతమంది భయం భయంగా ఉన్నారు. మొత్తం మీద ఏ చాన్నేల్లో జర్నలిస్టులను పలకరించినా "ఇవాలో రేపో అన్నట్టుగా ఉంది" అనే మాటా తరచుగా వినిపిస్తుంది.
నాకు తెలిసి దీనికి చానెళ్ళ స్వార్ధం ప్రధాన కారణం. పూర్తి రాజకీయ అజెండాతో, తమ తక్షణ అవసరాల కోసం ఛానళ్ళు పెట్టి, జర్నలిజానికి ఏదో మేలు చేస్తున్నట్టు, సమాజాన్ని ఉద్ధరించాబోతున్నట్టు ప్రకటనలు గుప్పించేస్తున్నారు. ఇక్కడే మన జర్నలిస్టు సోదరులు ఈ చానేల్లను నమ్మి మోసపోతున్నారు. కోట్లకొద్దీ పెట్టుబడి, పెద్ద నాయకుల అండ, ఓ పది పదిహేను ఓబీ వ్యాన్లు, గుక్క తిప్పుకోకుండా చేసే ప్రకనలు చూసి ఇదేదో మంచి సంస్థే ఉన్నట్టుంది అనుకుంటున్నారు. దానికి తోడు ఉన్న ఉద్యోగం కంటే ఎక్కువ జీతాలు ఇస్తామన్న ప్రలోభానికి మన సోదరులు లొంగిపోతున్నారు. ఇలాంటి కుహనా మీడియా సంస్థలకు జర్నలిజమంటే కేవలం వ్యాపారం లేదా అధికారాన్ని అందించే సాధనం తప్ప "బాధ్యత" ఎంత మాత్రం కాదు. సరే పెట్టుబడి పెట్టినప్పుడు, ఆర్దికమో, అధికారమో ఏదో ఒక లాభం చూసుకోవాల్సిన అవసరం మీడియా సంస్థలకు ఉంటుంది కాని, అది bye product కావాలి తప్ప end product అయితే ఇలాగే ఉంటుంది. ఒక్కసారి end product (money or power) వచ్చిన తర్వాత లేదా వచ్చే ఆవకాశం లేదని తెలిసిన తర్వాత ఇక ఉద్యోగుల అవసరం ఏముంటుంది. అందుకే వెనక ముందు ఆలోచించకుండా ఉద్యోగులను వెళ్ళగొట్టి, పండగ పూట వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు.

మరోవైపు మన జర్నలిస్టు సోదరులు కూడా మరీ అధిక జీతాలు ఇచ్చే వారిని యిట్టె నమ్మేస్తున్నారు. ప్రస్తుతం పదివేలు సంపాదించే వారికి పదిహేను వేలు ఎవరైనా ఇస్తామంటే ఓ అర్ధం ఉంది, కాని ఒకేసారి ముప్పై లేదా నలభై వేలు ఇస్తామంటే మన సోదరులు వెనక ముందు ఆలోచించకుండా చేరిపోతున్నారు. 300% అధిక జీతలిస్తము అంటున్నారంటే దాని వెనక ఏదో మతలబు ఉందనే ఆలోచన ఆ సమయానికి రావడం లేదు. జీవితం లో గడిచే ప్రతిరోజు గతం కంటే మెరుగ్గా బతకాలనే ఆకాంక్ష ఉండడంలో తప్పు లేదు. కాకపోతే ఇలాంటి మోసపూరిత సంస్థల్లో చేరే ముందు ఒక్కసారి కుటుంబ సభ్యుల గురించి ఆలోచిన్చంచాలి. వారికి నా చేతనైన సాయం చేయాలనీ ఉంది. రాము సర్జీ... ఈ బ్లాగునే ఒక ప్లాట్ఫారం గా చేస్కుని, ఏదైనా కార్యక్రమం చెప్పట్టే ఆలోచన ఉంటె మా సప్పోర్ట్ ఉంటుంది.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

muralirkishna said...

My Dear Media Frds..

journalist gaa cheri samajaaniki seva cheddamu anukuni vrutti lo nibaddatho pani chestu sudden gaa jobs pogottukunnavallaki naa pragaada saanubuti telputunnanu..

ikkada nenu evarini samardinchatam ledu

my dear frds..

studio N udyogulaku baasata gaa nilchina journalist sanagaala nayakulaku danyavaadaalu..But.. naaku ardam kaani vishyam okkate..ikkada

paapam I news MNR valla adhvaryam lo nadustunnappudu vandaladi journalist lu akali badhalu padutuntee ekkada unnaru eee journalist naayakuylu..appudu enduku baytaki raaledu..endhuku prasinchaaledu..etuvanti karaanalu cheppakundaaa udyogulanu teesiveyatam lo Studion N channel ye Modatidi kaadu Chivaridi kaadu..ippudu N0 `1 nd No 2 ,channels kooda chaala mandi employees ni saaganampaai mari vaatini endhuku prasinchaledu.. kevalam Studion N ki maatrame neetulu vartistayaaa..journalist cards istaamu ani cheppi dabbulu vasoolu chesi ippati varaku card kaadu kadaaa aa dabbulu kooda ivvaled aa dabbulu evaru tama sontraaniki vaadukunnaro teliyani paristuhi..

ikkdaa nenu studio n ki vattasu palakatam ledu ..kaani nijanni samadi cheyavddu antunna..guruvinda ginnjaa saame taala maatldakoodadhu antunna

ninna aa visuvals lo iddaru muggurini choosanu jobs poguttukunna vaarini..daanilo vallu ippatiki moodu naalugu channels maarinatlu gurtu..oka anchor kooda undi...Tv5..doordarshan..sakshi tv..nd studion N(peru telusu kaani prastavincha dalchukoledhu)..ee case lo studio N di tappe anukundaamu mari mundu channels anni teesesaya..leka manchi offer ani vellindaa..okay ..manchi offer ye anukundaamu TV5 kanna doordarshan manchi offer aa ?

tam avasarala kosam journalist lanu vaadukoni vadile se yajamanyalu unnatam kaalam journalist la batukulku ila ne untaai..mottaniki ippatikanna elctronic media journalist laki oka Sangahm undi vallu mana kosam poradataaru ani telsindi...ippatiki ainaa yajamanyala ki tottulu gaa kakundaa nijayeeti ga panicheste ippudu kaakapoina bavishyat lo ainaa vyavastaa maarutundi

Pavani said...

RS Reddy gaaru makes much sense here. We adopted 'Hire at will and fire at will' policy for good or bad decades back. For some such policy looks progressive as many economic indicators are moving up and up.It is working against employees in this case. If employees leave the channel en masse,then it will work against the chaneel.Both are legal under our current system. They may not be moral.
It is unfortunate so many lost their jobs.If anybody feel descriminated, I am pretty sure there will be a legal recourse. Hoever if they did it as part of restructuring, change in direction or other imperatives, I do not think those who lost their jobs has any case. Unless it is proved that the company violated any contract or its own gudelines.
Today we have more channels than the market can sustain. Market is a great leveller. Thats what is happening now.
On a side note: There isn't a single good word from any blogger on this channel. Why would anybody want himself associated with such channel.?

Anonymous said...

@Pavani
On a Said note....Well said.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి