ఈ దీపావళి పండగ మీద నాకు రానురాను మంట ఎక్కువవుతున్నది. ఏమిటండీ ఈ బాంబుల గొడవ? జనం వెర్రెక్కినట్లు బాంబులు గట్రా కొంటున్నారు, కాలుస్తున్నారు. ఆనందం వాళ్ళకు, కాలుష్యం అందరికీ. ఇది పాసివ్ స్మోకింగ్ కన్నా డేంజర్.
పాపకు పద్నాలుగు, బాబుకు పదేళ్ళు నిండాయి కదా...ఈ సారి 'దీపావళి' కి టపాసులు తగలేసేపని లేకుండా చేయాలని విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాను. పొద్దున్నే...క్రాకర్స్ కొనే ప్రతిపాదన వాడు చేసినప్పుడు...'Oh...you want to spend some money to destroy this environment?' అని ఒక డైలాగ్ వేసి చూశాను. వాడికి ఆ మాట నచ్చలేదని అర్థమయ్యింది. బాంబులు కాల్చడం వల్ల వచ్చే పొగ, ధ్వని కాలుష్యం గురించి వివరించాక మెత్తపడినట్లు కనిపించాడు కానీ....సాయంత్రానికి కొనక తప్పలేదు. అయితే...కేవలం ఐదు వందలే దానికి కేటాయించి...ప్రపంచంలో అత్యంత పిసినారి తండ్రిలా నటించి....ఒక రెండు గంటల కిందట కొనుక్కొచ్చాను.
మెదడుకు క్రాక్ వచ్చిన వాళ్ళు బాంబులు పేలుస్తారు కాబట్టి...వాటికి క్రాకర్స్ అనే పేరు వచ్చిందని అని ఒక డైలాగ్ వేసాను. వాడు...ఆపు ఈ పైత్యం అన్నట్లు ఒక చూపు చూసాడు. ఏదో ప్రతి డైలాగ్ వేశాడు.
తెచ్చాక...ఇద్దరికీ...స్పష్టంగా చెప్పాను-"దీపావళికి టపాసులు కొనడం ఇదే లాస్టు. మళ్ళా ఎప్పుడూ అడగవద్దు." సరే వచ్చే ఏడాదికి ఏమి చేస్తారో చూడాలి. ఈ పోస్టు ముగించే సమయానికి....పుత్రరత్నం వచ్చి....రమ్మని అడిగాడు. అక్కడకు వెళ్లి...ఒక పక్క కుర్చీలో కూర్చొని ప్రమాదాలు జరగకుండా చూడాలి.
ఏమిటోనండీ...ఆ వినాయక చవితి రోజు విగ్రహాలు వేసి నీళ్ళను పాడు చేస్తారు, దీపావళి పండగతో నానా కాలుష్యం సృష్టిస్తారు. విధ్వంసం లేకపోతే...ఆనందం లేదేమో మనకు!
Friday, November 5, 2010
Subscribe to:
Post Comments (Atom)
20 comments:
రోడ్డు మీద బాంబులు పేలుస్తూ వాహనాల మీద వెళ్లేవాళ్లు ఝడిసిపోయేలా చెయ్యడం మా ఊరిలో దీపావళి నాడు మామూలే. ఇందాక రోడ్డు మీద బాంబు వెలిగించబోతున్న ఒక కుర్రాడిని తిట్టాను. ఏమీ కాదులే అన్నా, పక్క నుంచి వెళ్లిపో అని అంటున్నాడు.
ఈ విషయంలో మీకు అవగాహనాలేమి ఉన్నాదని తెలుస్త్తోంది.
పండగలో లోపమేమీ లేదు. దీపావళి అనే పదం ద్వారా మన పూర్వీకులు దీపాల వరుసని మాత్రమే ఉద్దేశించారు. తక్కువ జనాభా, తక్కువస్థాయి టెక్నాలజీ ఉన్నంతకాలం వీటివల్ల నష్టమేమీ జఱగలేదు. జనాభా పెఱిగి ఆ పెఱిగిన జనాభా అందరూ అత్యాధునిక రసాయనాల్ని వాడుతూ వీటిని జఱుపుకోవడం వల్లనే ప్రమాదం ముంచుకొస్తోంది. వీటిని జఱుపుకునే పద్ధతులు మారాల్సి ఉంది. అంటే బహుశా మనం కాస్త వెనక్కి నడవాలేమో !
దీపాల ఆవళే దీపావళి అని అర్ధం చేసుకోవడం కష్టం
దీపావళి తో సంబంధం లేకుండా అన్ని రకాల ఉత్సవాల
ఊరేగింపులలో టపాసు బాంబులని పేల్చడం ఇంకా మీకు
అలవాటయినట్లు లేదు. పెళ్ళిళ్ల ఊరేగింపులు అర్ధరాత్రిళ్ళు
కాలనీల్లోకి వస్తూ ఉంటాయి. గంటల తరబడి డ్రమ్ముల
ఢమఢమలు, బాంబుల ఢాం ఢాం లతో భూమి దద్దరిల్లుతూ
ఉంటుంది . వృద్ధులు, పసిపిల్లలు , అనారోగ్యంతో
ఉన్న వారు ఉన్నారని ఎంత చెప్పినా వినిపించుకోరు..
RAAMU GAARU NIJAM GAA DABBULU TAGELESA KARYAKRMAM AYINAA ADI DAANILKO KONTAA UPAYOGAM UNDI ANDI..HYD LO UNNA MURIKI DOMALAKI GHMC VALLU ELAAGU DOMALA MANDU PICHIKAARI CHEYSAARU KADAA ILAA AAA POGAA THO KONNI DOMALU ANNA CHASTAAAII..
రామూగారూ,
మీ భావాలతో పూర్తిగా ఏకీభవిస్స్తున్నాను. మీ ఆశయం బాగుంది. నెరవేరాలని కోరుకుంటున్నాను. దాని కోసం నా క్రుషి కొనసాగిస్తాను. గత 15 ఏళ్లుగా బాణాసంచా కొనటం ఆపేసిన మేము ఈ ఏడాది తప్పాము. బంధువుల అమ్మాయి మా ఇంటికి వచ్చినందున తప్పలేదు. అయితే ఎప్పటి మాదిరిగానే మా పిల్లలు వాటి జోలికి పోలేదు. రూ. 260 పెడితే చేతిలోకి రాలేదు. అందులో ఢాం ఢాంలు లేకపోవటం ఒకింత మేలు.
venkata subbarao kavuri
telugillu.wordpress.com
Why don't you write an article on sound pollution created by many religious bodies every day 5 times and some seasonally continuously. Sound pollution is also dangerous. There is a Supreme Court judgement that no religious body should use mikes for their prayers, who is caring. After all Deepavali comes once a year and the so called pollution you are talking about is for about an hour or so. But the sound pollution I am referring to is continuous regularly on every day without any break. There are many pollutions in this world which are to be attacked first more especially the psychological pollution the so called media and very dangerously the Advertisement Mafia is creating.
సవత్సరానికి ఒకసారి వచ్చే పండగల మీద ఇవేమీ ఆవేదనలు ?
too much !
హమ్మయ్య, పర్యావరణాన్ని కాపాడడానికి నడుం బిగించిన మరో మహోన్నత వ్యక్తి మీలో కనిపించాడు. నిజంగా దీపావళి కాలుష్యాన్ని పెంచేదే అని ఇప్పుడే తెలిసింది. శబ్దకాలుష్యాన్ని నివారించేందుకు మీరు టపాకాయలు కొనడం మానేసినందుకు అభినందనలు. మరి శబ్దకాలుష్యాన్ని అరికట్టేందుకుగాను మీ కుటుంబం పెట్రోలు, డీజిలు వాహనాలు వాడడం మానేసింది. వాటి హారన్లని తొలిగించిందా... మీ కుటుంబ సభ్యులు స్టీరియోలు వినడం మాసేశారా.. వాయు కాలుష్యాన్ని నివారించేందుకు మీరు మాస్కిటో కాయిళ్లు, ఎయురోసోల్ స్ప్రేలు వంటివాటిని కూడా వాడడం మానేశారా... జల కాలుష్యాన్ని అరికట్టేందుకు మీ ఇంటి మురికినీరు కాలువల్లోంచి నదుల్లోకి పారకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే ఉండి ఉంటారు కదా. ఇలాగే జల, వాయు, శబ్ద కాలుష్యాలను అరికట్టేందుకు మీరు అహరహం కృషి చేస్తునే ఉండి ఉంటారు అందుకే మీకు అభినందనలు.
జిహెచ్.ఎం.సి లాంటి సంస్థలు మీ ఫొటోల్ని ప్రచురిస్తూ ప్రకటనలు చేస్తే చాలా మంది ఇలగే నడుం బిగిస్తారేమో...
ఇంత ఆలోచన ఉన్న మీరు పరిశ్రమల వల్ల కాలుష్యం పెరిగిపోతున్నదని తెలుసుకునే ఉంటారు కనుక మన రాష్ట్రంలో ఎలాంటి పరిశ్రమ ఉండకూడదని, ఉన్న పరిశ్రమలు మూసివేయాలని, భవిష్యత్తులో ఎలాంటి పరిశ్రమ ఇక్కడ స్థాపించకూడదని ఉద్యమించండి... దేశం వారం రోజుల్లో బాగుపడిపోతుంది. ప్రకృతిమాత మీమ్మల్ని అమితంగా ప్రేమిస్తుంది....
చినప్పటి నుంచి మా నాన్నగారు దీపావళి కి డబ్బులు తగలేసు కుంటానంటే రెండు వందలు
దాచుకుంటానంటే నాలుగు వందలు అని మెల్లిగా ఆలోచన విధానం లో మార్పు తేగలిగారు .
అదే పద్దతి మా పిల్లలకి అవలంబిద్దమంటే పాప వప్పుకుంది బాబు ఇంకా దార్లోకి రాలేదు .
వొక స్వాగతించ వలసిన మార్పు ఏంటంటే ఈ సారి మా వీధి లో కూడా జనాలు తక్కువే తగలేశారు .
ప్యాసివ్ స్మోకింగ్ కన్నా డేంజర్ అని మీరు చెప్తున్న పొగ నిన్నటి వరకూ కురిసిన వర్షాల వల తయారయిన దోమలు క్రిమి కీటకాలను సంహరించడానికి ఉపయోగపడుతుందండి. ఆధునికత పేరుతో ప్రమాదకర రసాయనాలను వాడటం నివారించ గలిగితే మనష్యులకు హాని ఏమి ఉండదు ఇక ద్వని కాలుష్యం అంటారా అంతగా నచ్చనివారు ఓ గంట సేపు తలుపులు బిడాయించుకుని ఇయర్ ప్లగ్స్ పెట్టుకొనే అవకాశం ఎటూ ఉందికదా.
రాము గారు,
పిల్లలు ఎంతో ఇష్టపడి జరుపుకొనే దీపావళి పండుగకు పర్యావరణం పాడౌతుందని ఒక ప్రచారం ఈ మధ్య కాలం లో ఎక్కువైంది. ఇది నకీలి కణికుడి నేం 10 వర్గపు కుట్ర. ప్రజలకు ఎదో పర్యావరణం అవసరం గురించి తెలియజెప్తున్నట్లు నటించటం. ఇంగ్లిష్ మీడియం స్కుల్స్ వాటికి వత్తాసు పలకటం ఎందుకంటే ఇవి అధిక భాగం క్రైస్తవ మిషనరీలు వారివి కావటం వలన. నిజం గా పర్యావరణం మీద శ్రద్ద ఉంటె అభివృద్ది చెందిన దేశాలు పర్యావరణాన్ని కాపడటా వాటికి నికి ఎందుకు ముందుకు రావటం లేదు. వారు వదిలే విషవాయువులతో పోలిస్తే ఒక్క రోజు టపాసులు కాల్చటం వలన ముప్పు ఉందా? క్రితం సంవత్సరం జైపుర్ లో పెట్రొల్ ఆయిల్ నిలువ ఉంచే ప్రదేశం తగలబడినపుడు మొదట ఇన్ని కోట్లు నష్టం అన్ని కోట్లు నష్టం అని కవర్ చేసిన మీడియా వారు, నష్టం ఎక్కువ అయ్యేకొద్ది మెల్లగా రాయటం మానుకొన్నారు. అన్ని కోట్ల రూపాయల పెట్రోల్ తగల బడితే పర్యావరణానికి ఎనత్ ముప్పు వాటిల్లాలి, దాని గురించి ఎంత మంది చర్చించారు. కాని దీపావళి పండుగకు టపాసులు కాల్చటం ఈ మధ్యకాలం లో పర్యవరణానికి లింక్ పెడుతూ మాట్లాడటం ఎక్కువైంది.
వినాయకచవితి రోజున జలకాలుష్యం ఒకరోజు మాత్రమే,దీపావళి రోజున శబ్దకాలుష్యం రెండురోజులే.ప్రతిరోజు నదుల్లో కర్మాగారాల ద్వారా గానీ ఇంకో విధంగా గానీ కలుపుతున్న వ్యర్థాల పరిస్థితేంటి?కర్మాగారాల ద్వారాగానీ వాహనాలద్వారా గానీ ప్రతిరోజు జరిగే వాయుకాలుష్యం మాటేమిటి? ప్రతిరోజూ ట్రాపిక్కులో చెవులు చిల్లులు పడేటట్లు వాహానాల హారన్ల శబ్ద కాలుష్యం మాటేమిటి? వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? పర్యావరణానికి పండుగల ద్వారా ఒకటి రెండు రోజుల్లో జరిగే నష్టమెక్కువా లేక 363రోజులపాటూ నిరంతరం జరిగే కాలుష్యమెక్కువా? చెప్పండి.
As long as everything is done within specific limits, it is fine. It is the irrational sense of just going out there and burning as many crackers as possible, more loud and more fancy by year, is the problem. In my teens it wasn't like this but of late I notice there is a sense of pride/social status attached to it (I think this only matters in smaller places).
రామూ గారు,
పండగ విషయంలో, మీ అభిప్రాయాలతో ద్వివీభవిస్తున్నందుకు (పోరంకి మాష్టారు గారి చమత్కారం) బాధగా ఉంది.
"సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ
మీ పిల్లల సంతోషం కోసం మీరు పెట్టే ఖర్చు
ఎలా అవుతుంది దండగ!"
నా కపిత్వాన్ని మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తూ..
~ శశిధర్ సంగరాజు.
www.sasidharsangaraju.blogspot.com
రాము గారు
నమస్తే. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండగ వల్ల కలిగే కాలుష్యం గురించి భయపడనక్కరలేదండీ. పండగల విషయంలో మన పూర్వీకులు గొప్ప వారే. మంచి ఆలోచనాపరులును. ఇది పండిన పంట చేతికొచ్చే సమయం. సరిగ్గా పంటలకు దోమకాటు తగిలే సమయం. అందుకే మనం కాల్చే దీపావళి సామగ్రి పొగ వాతావరణంలో గాలితోపాటు కలిసి వాటిని మట్టుబెడుతుంది. ఇది అప్పటి టెక్నాలజీ మరి. రైతు ఫ్రెండ్లీ పండగన్నమాట. దానితోపాటే మనకు వినోదం కూడా. ప్రస్తుత కాలమాన పరిస్తితులను బట్టి మన ఆలోచనలు ఈ విధంగా మారిపోతున్నాయి. పండగల అసలు ఉద్దేశ్యాలు తెలియకుండా పోతున్నాయండీ. ఖర్చు భరించలేక ఎవరికివారు సామాను కొనడం తగ్గించేసుకొంటున్నారు. మా ఊర్లో రాత్రి 6.30 గంటలకు మొదలయ్యి ఏడింటికల్లా అయిపోయింది.
శ్రీవాసుకి
Deepavali and crackers go together since time immemorial.No one can stop this culture.
But the fire works culture has invaded other ocassions since a few years like the functions of marraiges,birth days and other functions..The fire works during the international sports and games events is known to every one.But it looks there might be some change as fire works will be mimiced through laser technics in fuure due to pollution menace.
Surprisingly one can see fire works in the funeral procession!What about this?
JP.
Dear Ramu!
కొత్త పోస్టులు మీరు రాస్తూ పోవడం, మేము కామెంట్లు వ్రాస్తూ పోవడమేనా, పాత వాటిపై మేము వ్రాసిన (చర్చ అవసరమనిపించే) కామెంట్లవైపు కూడా చూసేదేమైనా ఉందా? ఒక్కసారి "సినిమా పిచ్చి బాగా ముదిరిన పోరంబోకు ఛానెల్స్...."
లోని చివరి 3 కామెంట్లు చూసి స్పందించగలరు.
some ideas
1) stop using soap, use నలుగు పిండి
2) stop using shampoo, use Shikai / Kunkudu kai
3) stop using car,Use Bicycle
4) stop using Floor cleaner,Use wet cloth
5)stop using Detergents / washing powders,Use plain water
6)stop using Tooth paste,Use neem stick
"'Oh...you want to spend some money to destroy this environment?' అని ఒక డైలాగ్ వేసి చూశాను."
- ఏం మీకు తెలుగు రాదా ? పోనీ బాబుకి రాదనుకున్నా, మీ అబ్బాయితో మీరన్న ఆ నాలుగు ముక్కల్ని ఇక్కడ తెలుగులో ప్రసాదించవచ్చుగా మాకు ? ఇంతోటి భాషాభిమానానికి మళ్ళీ ఈనాడు తెలుగుమీద అంత చర్చ దేనికో ?
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి