Tuesday, November 30, 2010

వై.ఎస్. జగన్ ఆవేశానికి అర్థం లేదంటారా?

ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఒక మీడియా సెమినార్ కు  నా పీ.హెచ్.డీ గైడు డాక్టర్ పద్మజా షా గారు అవుట్ లుక్ చీఫ్ ఎడిటర్ వినోద్ మెహతాను పిలిచారు--గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు. వినోద్ మెహతాను ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకురావడం నుంచి పంపే వరకూ ఆయనతో ఉండే బాధ్యతను నేను తీసుకున్నాను. అంతకు ముందు 'ది హిందూ' వదిలేశాక...'అవుట్ లుక్' స్టేట్ కరస్పాండెంట్ గా పనిచేసేందుకు ఎంపిక అయినా.... డబ్బు ఆశతో ఇండియా టుడే గ్రూప్ వారి 'మెయిల్ టుడే' అనే  దిక్కుమాలిన టాబ్లాయిడ్ పత్రికలో చేరి చేయికాల్చుకున్న వాడిని కనుక వినోద్ మెహతాను కలుసుకోవడం, ఆయనతో రెండు రోజులు vundadam ఆనందంగా అనిపించింది. కారులో ఎయిర్ పోర్టు నుంచి వస్తూ...మెహిదీపట్నం ఫ్లయ్ఓవర్ దాటాకా...నేను ఆయనను ఒక ప్రశ్న వేశాను--సోనియాతో వై.ఎస్.ఆర్. సంబంధం ఎలావుంది అని? ఆంధ్రా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని? 

"కాంగ్రెస్ కు డబ్బు పంపే పైప్ లైన్ మీ రెడ్డి గారు. కాంగ్రెస్ ఆయనపై ఆధారపడక తప్పదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మరొకసారి అధికారంలోకి వస్తుంది...ఇది ఖాయం. డబ్బు ప్రభావం," అని ఆ సీనియర్ ఎడిటర్ అన్నారు. చిరంజీవి హడావుడి, టీ.ఆర్.ఎస్. ఉద్యమం నేపథ్యంలో....ఎన్నికల ఫలితాలు ఆయన చెప్పినట్లు ఉంటాయా?...ఏమోనబ్బా... అని నాకు అప్పట్లో అనిపించింది. కానీ..చివరకు అదే నిజమని తేలింది. 

సోనియా--వై.ఎస్. విషయంలో ఆయన చెప్పినది కూడా నూటికి నూరుపాళ్ళు నిజమని ఆ తర్వాతి పరిస్థితులు నిరూపించాయి. వై.ఎస్.అనుకున్న దానికి వ్యతిరేకంగా సోనియా బృందం ఒక్క నిర్ణయమైనా తీసుకోలేకపోయింది. ఒకప్పుడు మరాఠా వీరుడు శరద్ పవార్ ఇలాగే కాంగ్రెస్ ను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. పవార్ అయినా, వై.ఎస్.అయినా కాంగ్రెస్ కోటరీని "బాగా చూసుకోవడం" ద్వారా హస్తినలో తమ చక్రం తిప్పారు. అదొక గొప్ప విద్య, ట్రిక్కు. అది అందరికీ అబ్బదు. జగన్ కు ఇంకా ఆ స్థాయి రాలేదు. ఇప్పటికీ...కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ వీరప్ప మొయిలీ కుమారుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? ఆయనకు నెలకు వస్తున్న జీతం ఎంత? అన్న విషయాలు ఎవరైనా పరిశోధిస్తే బాగుంటుంది. సాక్షి పెట్టుబడుల విషయంలో వచ్చిన తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలను పట్టించుకోలేని దైన్య స్థితి కాంగ్రెస్ నాయకత్వానిది. ఇప్పుడు అదే సాక్షి...కాంగ్రెస్ కు భస్మాసుర హస్తమై కూర్చుంది కదా! కాంగ్రెస్ శ్రేణులను గందరగోళ పరిచే శక్తి సాక్షికి, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులకు వుంది. 

అప్పటికే కర్ణాటకలో గనుల మాఫియా బీ.జే.పీ.ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడిస్తున్న వైనాన్ని, ఆ ధనిక స్వాములకు వై.ఎస్. కుటుంబానికి ఉన్న సంబంధాన్ని అంచనా వేసిన సోనియా ఆయన పోయాక జగన్ విషయంలో జాగ్రత్త పడినట్లు సుస్పష్టం. ఈ విషయంలో సోనియా తెలివిడిని అభినందించే వాళ్ళూ లేకపోలేదు. వై.ఎస్.మరణం తర్వాత...కాంగ్రెస్లో అతి సహజమైన వారసత్వం అనే సూత్రాన్ని ప్రాతిపదికన చేసుకుని జగన్ ను ముఖ్యమంత్రిని చేసివుంటే...దక్షిణాదిన పరిణామాలు మరోలా ఉండేవి.

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంతే ఇదే. "జగన్ను మేము...ఏమీ అనలేం...మీరే ఏదైనా చేయండి," అని  ఢిల్లీ పెద్దలు మూతులు తుడుచుకుంటూ...రోశయ్య పై ఒత్తిడి తేవడం వల్లనే...గత వారం రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు అంత వేగంగా మారిపోయాయి.  ముందు జాగ్రత్త చర్యగా పన్నులు అవీ చెల్లించి క్లీన్ అయిపోయిన...జగన్ తెరవెనుక  వేస్తున్న ఎత్తుగడల ఉప్పు అందబట్టే సోనియా పొగపెట్టడం ఆరంభించారు. రాష్ట్ర కాంగ్రెస్ పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం లాగా ఉండబట్టే....కాంగ్రెస్ మహామహులు హుటాహుటిన హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో డ్రామా చేసి కిరణ్ కుమార్ రెడ్డి ని కొత్త ముఖ్యమంత్రి గా చేసి పోయారు. 

నిజానికి తండ్రి పట్ల ఉన్న సానుభూతిని సొమ్ము చేసుకోవడానికి జగన్ కు ఇంతకు మించిన తరుణం లేదు. ఆలస్యం అయ్యేకొద్దీ తన పలుకుబడి మసకబారుతుందని, కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఏడాది పాలిస్తే...సానుభూతి పవనాలు మటుమాయంకావడం ఖాయమని జగన్ శిబిరం అంచనా వేసి వుంటుంది. అది సరైన అంచనానే. జగన్ స్థానంలో ఇంకా ఎవరు వున్నా....అదే నిర్ణయం తీసుకుంటారు. దోచుకోవడం ధ్యేయం కాకుండా...జనసేవ లక్ష్యంగా పావులు కదిపితే....సొంత పార్టీని వచ్చే ఎన్నికల నాటికి నిర్ణాయక శక్తిగా మార్చే తెలివి, డబ్బు, మందీమార్బలం జగన్ కు ఉన్నాయి. ఇప్పుడు జగన్ నిరూపించుకోవాల్సింది...తన తండ్రి కన్నా భిన్నమైన యువ నేతనని. ఆ ఓపిక ఈ కుర్రాడికి ఉందా?

31 comments:

WitReal said...

>> వారసత్వం అనే సూత్రాన్ని ప్రాతిపదికన చేసుకుని
>> జగన్ ను ముఖ్యమంత్రిని చేసివుంటే...దక్షిణాదిన
>> పరిణామాలు దారుణంగా ఉండేవి.

ఇది కొంచెం వివరించగలరా?

ప్రస్తుతం వున్న పరిస్థితులకంటే, లేదా రాబోయే పరిస్థితులకంటే దారుణంగా వుండేదా?

ఒక బలవంతుడిని, క్రమశిక్షణ/విధేయత పేరుతో కంట్రోల్ చెయ్యగలరా? చెయ్యలేనప్పుడు ఇలా చెయ్యి నరుక్కుంటారా?

అది బలం కాదు, వాపు అని అనుకుంటే, మరి మిగిలిన వీహెచ్/కేకే/కాకా - వీల్లకి కనీసం ఆ వాపు కూడా లేదు కద?

ఈ మొత్తం వ్యవహారంలో ఆత్మ గౌరవుమున్న తెలుగు వాడు ఆనందించాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, సర్వే సత్యనారాయణ గారు చెప్పినట్టు "అమ్మగారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ" అడక్కుండా జగన్ బయటకి వెళ్ళిపోవడం.

Anonymous said...

మీరు చెప్పింది నిజమే. అయితే ఆ ఆత్మ గౌరవం నిజమైనదై ఉండాలి. అంటే సి.ఎం పదవికి దారులు మూసుకుపోయ్బట్టి ధిక్కరించడం కాకుండా సి.ఎం ను చేసియున్నా అలాగే ఉండియుంటే అది నిజమైన ఆత్మ గౌరవం. ఎటూ చేసే అవకాశం రాలేదు గనక అది నిజమైనదా లేక ఉక్రోషంతో వచ్చినదా చెప్పలేం. కానీ ఒకవేళ చేసియుంటే వాళ్ళ నాన్న లానే సోనియమ్మ భజన చేస్తూ పోయేవాడేమో? కాదంటారా.
ఇక్కడ సమస్య ఆత్మ గౌరవం కాదు. ఎవరి లెఖ్ఖలు వారికున్నాయి.
@"వారసత్వం అనే సూత్రాన్ని ప్రాతిపదికన చేసుకుని జగన్ ను ముఖ్యమంత్రిని చేసివుంటే...దక్షిణాదిన పరిణామాలు దారుణంగా ఉండేవి"- అన్న రాముగారి వ్యాఖ్యాణంలో వారస్త్వం అనే విషయం అవసరం లేదేమో? దక్షిణాదిన అనేది కర్ణాటక రెడ్డిగార్లను, మన రెడ్డిగారిని కలిపి చూపి వారి మైనింగ్ సంపాదన ఘనత, వీరి రాజకీయ అక్రమ సంపాదనా ఘనతలు రాజకీయాలను ఎలా శాసించియుండేవో తలుచుకుని గుండెలు బాదుకోవాల్సి వచ్చేదని అర్ధమేమో!

Prashant said...

As far as history of rebels is concerned, except SharadPawar,Mamata Banerjee, rest all have again slowly returned back into the party.Jagan has to prove his mettle and carve a niche for himself from now on.But it's not easy if he doesn't have supporters to back him up, especially his relatives.His experience is also meagre as he may fall into the trap of manipulators.Gone are the days of the past when rebels used to rattle CM's, just like his dad,YSR.Now MLA's are simply selfish and may fear losing elections if they resigned from party and join Jagan and in worst case if he fails to live upto his expectations, they may go into oblivion.None of the MLA's hasn't yet resigned from party so far,only proves the point.Only time has to reveal us what it has in store for us.

Anonymous said...

మొత్తం మీద, సోనియమ్మ మొదలుపెట్టిన ఆట ఆయమ్మ ఫిక్ష్ చేసిన రిజల్ట్ వైపే నడుస్తున్నట్లనిపించినా, ఆ రిజల్ట్‌కోసం మాటిమాటికీ ఆమె ఇష్టం వచ్చినట్లు గేం రూల్స్ మారుస్తూ పోయినా చివరికి జగన్ తూచ్ నువ్వాడే దొంగాట బాలేదు అంటూ కొత్త ఆట మొదలుపెట్టాడు. "ముసలి కాకులకేం తెలుసు ఉండేళ్ళలో రకాలు" అన్నట్లు వారూహించని సూపర్ ఉండేలుతో దెబ్బకొట్టాడు! ఫలితం ఎలా ఉంటుందో గానీ ఆరంభం మాత్రం అదుర్స్.
ఇక మీరడిగిన ప్రశ్నకు సమాధానం-ఖచ్చితంగా అతని ఆవేదనకు అర్ధం ఉంది. గాంధీ కుటుంబంలోని యువరాజాకు 2014 భరోసా ఇచ్చినట్లు, ఈయనకుకూడా ఇచ్చి ఉంటే ఈయనకూడా మరో వై.ఎస్ లా సోనియమ్మ భజన చేస్తూనే ఉండేవాడేమో?
ఎందుకివ్వాలి అనే ప్రశ్న ఇప్పుడు అసందర్భం. ఈయనకన్నా ఆయన ఏవిధంగానూ పుణీతుడు కానప్పుడు, వారసత్వ రాజకీయాలకు కాంగ్రేస్‌కు పెట్టింది పేరైనప్పుడు, అది గాంధీలు కాని గాంధీ కుటుంబానికి మాత్రమే పరిమితం అనే పేటెంట్ లేనప్పుడు జగన్లాంటి ఏ 'గన్' ఆశించినా అది తప్పెలా అవుతుంది. ఇక ఈయనకు అనుభవం లేదన్నప్పుడు ఆయనకేం ఉన్నట్లు? కావాలంటే ఈయనకు కూడా పీసీసీ లాంటి పదవిచ్చి అనుభవం తెచ్చుకో, గెలిపించుకో, అనుభవించుకో అంటూ నిర్దేశించవచ్చు కదా? ఇదే విషయంపై నేను గతంలో జగన్ కు ఒక న్యాయం, అప్పుడు రాజీవ్ కు ఇప్పుడు రాహుల్ కు మరొక న్యాయమా? అంటూ ఒక పోస్ట్ (http://dare2questionnow.blogspot.com/2010/08/blog-post.html)వ్రాసాను.
మొత్తమ్మీద ఈ విషయంలో ఆయనలో తండ్రి వై.ఎస్ లో లానే ఓ విధమైన ఆధిక్య భావన, సూపర్ ఈగో, దూకుడు లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ దూకుడు వల్లే తనకు ముఖ్యమంత్రి పీఠం అందుకోవడానికి అన్నేసి యేళ్ళు పడుతోందని గుర్తించిన వై.ఎస్ తన పంధా మార్చుకున్నాక గానీ ఎదగలేకపోయాడనే వాస్థవాన్ని ఈ వై.ఎస్ గుర్తించలేకపోయాడు. గుర్తించియుంటే మీరు గీసిన గీత దాటకుండానే పనిచేస్తాను, నా తండ్రి వై.ఎస్ చేసిన సేవలన్నీ మీకు చేస్తూనే పోతాను. కనుక నామీద దయయుంచి ఇప్పుడు కాకపోయినా 2014 లోనైనా సి.ఎం ను చెయ్యండి అని లోలోపల అవస్థలేవో పడైనా పైకి జనం ముందు మాత్రం హీరోలానే చెలామనీ అయ్యేవాడేమో? పాపం ఆశ, ఆవేశమెక్కువ అనుభవం తక్కువాయె:)

sai said...

sir,

inthaki veerappa moiley koduku em chesthunaado cheppa ledu?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

RSReddy,మీరు చెప్పింది అక్షరాలా నిజం.

Anonymous said...

ఇప్పుడు జగన్ రాజీనామా చేస్తేకూడా అదే కధ పునరావృతం. సగటు మానవతావాది బాధపడాల్సిన, ఆ మాటకొస్తే సిగ్గుపడాల్సిన రోజు మళ్ళీ వచ్చింది. అదే జనం చావుల్ని నేతలపై అభిమానం ఖాతాల్లో వెయ్యడం.
జరగకూడనిది జరిగినంతమాత్రాన మరణమే శరణమా? ఈ నేతలు తామనుకున్నవి జరగకపోతే వారు మరణిస్తున్నారా? లేదే? పోరాటాలు చేస్తున్నారు, లేదా తిరుగుబాట్లు చేస్తున్నారు? కానీ వీరి అభిమానులుగా చెప్పబడుతున్నవాళ్ళు మాత్రం వీళ్ళకోసం మరణించాలా? నిజంగా మరణిస్తున్నారా? సహజ మరణాల్నీ, యాదృచ్చిక ఆత్మహత్యల్నీ నేతల ఖాతాల్లో వేస్తున్నామా? ఇది ఎటు దారితీస్తుంది?
అమాయక ప్రజల చావులతో ఆటలా? జగన్ రాజీనామాను తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య, గుండెపోటుతో మృతి? కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది ఇది ఎంత అత్యంత హేయమైన సాంప్రదాయమో. ఒక తల్లికి బిడ్డకీ ఉండేంతకంటే ఘనమైనదా ఈ నాయకులపై జనాలకుండే ప్రేమ? బిడ్డ మరణిస్తే ఆ తల్లికి గలిగే గుండెకోత వూహకందనిది. కానీ కాలం ఆ గాయాన్ని పూర్తిగా మాంపలేకపోయినా తట్టుకునే శక్తిని ప్రసాదిస్తుంది. అంతేగానీ బిడ్డతోపాటే తల్లినీ చిదిమెయ్యదు. అలాంటిది ఎవడో కౌన్‌కిస్కా గాడికోసం ఎవరో చనిపోవడం అనేది నిజంగా జరిగేదేనా? ఒకవేళ ఒకటీ రెండూ అలాంటివి జరిగే అవకాశం ఉందనుకున్నా ఇలా వంద, రెండొందలు.....అంటూ లెక్కబెట్టుకుంటూపోయేన్ని జరుగుతాయా? ఎంతమంది చస్తారో చూద్దాన్నంత రాక్షసానందంతో చూసే గుంటనక్కల ఆలోచన ఎలా అర్ధంచేసుకోవాలి? పైగా ఈ లఖ్ఖలుగత్టే పనిలో ఫోర్త్ ఎస్టేట్‌గా జనాన్ని తెగ ఉద్ధరిస్తున్నట్లు చెప్పుకునే ఈ మీడియానే నిమఘ్నమవడం ఎంత సిగ్గు చేటు?
వాస్థవానికి ఇంత పెద్ద రాష్ట్రంలో ప్రతిరోజూ ఎంతోమంది వివిధ కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉంటారు, గుండెపోతుతో మరణిస్తూనే ఉంటారు. వాళ్ళలో అన్ని పార్టీలతో, నాయకులతో ఏదో ఒక అనుబంధం ఉన్నవాళ్ళుంటారు. అంతమత్రాన వాళ్ళ చావులన్నీ ఈ నాయకుల లెఖ్ఖల్లోకి వేస్తూపోతే అది ఎంత విపరీతాలకు దారితీస్తుందో ఆమాత్రం ఊహించలేరా ఈ ప్రబుద్ధులు? ఇలాంటివి మాటిమాటికీ ప్రసారం చెయ్యడంద్వారా కొంచెం సున్నిత హృదయులుగా ఉండేవళ్ళనూ, జరిగినదారుణం గురించే (నాయకుల చావు, రాజీనామా లాంటివి) పదే పదే తలుచుకుని బాధపడేవాళ్ళలో కొందరినైనా ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుకాదా?
గతంలో నా మీటింగ్ కు ఇన్ని లక్షల మంది వచ్చారు, అంటే లేదు లేదు నీ మీటింగు కన్నా నా మీటింగ్ కు ఇన్నేసి లక్షల మంది ఎక్కువ వచ్చారు అని గొప్పలు చెప్పుకోవడం లాగా ఇప్పుడు నాకోసం ఇంతమంది చచ్చారంటే, లేదు లేదు నాకోసం ఇంత ఎక్కువ మంది చచ్చారు అని చెప్పుకొనే పరిస్థితులు దాపురించాయి. సచ్చినోళ్ళకోసం చావడం సంగతటుంచి బతికినోళ్ళలో కూడా మా నాయకునికి అవమానం జరిగిందనో, అరెస్టు చేసారనో ఆత్మహత్యలూ (యత్నాలూ) జరుగుతున్నాయి/జరిగినట్లుగా చిత్రీకరించబడుతున్నాయి. మొన్న మహబూబాబాద్ యాత్ర రద్దైనప్పుడు, బాబు బాబ్లీ డ్రామాలో అరెస్టయినప్పుడూ జరిగాయని చెప్పబడుతున్న ఆత్మహత్యలూ (యత్నాలూ) ఇందుకు ఉదాహరణ.ఇప్పుడు జగన్ రాజీనామా చేస్తేకూడా అదే కధ.
స్థూలంగా చెప్పాలంటే పెద్దలకోసం పేదోడు మరణించేలా మనం ప్రొత్సహిస్తున్నాం మరియు పేదోడి సహజ మరణాన్ని పెద్దోళ్ళ కోసం జరిగినట్లుగా చెప్పి పరిహసిస్తున్నాం. ఎంత అమానుషం? వాటికన్నిటికీ బాధ్యత ఎవరు తీసుకుంటారో?
అసలీ రాజకీయ క్రీడలలో ప్రజలెందుకు బలికావాలి? ప్రశ్న మరోలా అడగాలంటే తమ బ్రతుకు పోరాటంలో ఏటికెదురీగలేక మరణిస్తున్న అభాగ్యుల మరణాలను ఏదో ఒక నాయకుని ఖాతాలోకో, ఉధ్యమ ఖాతాలోకో జమ చేస్తున్న నాయకాధములదీ, వారికి తొత్తుల్లా పని చేస్తూ మరణాలను సైతం వివాదాస్పదం చేస్తూ, ఆత్మ హత్యలను మరింత ప్రోత్సహించేలా హైలైట్ చేస్తూ విపరీత పోకడలు పోతున్న ఫోర్త్ ఎస్టేట్ దీ ఎంత విపరీత ధోరణో కాదా? ఇది రాను రాను ఎటువంటి చెడుకు దారి తీస్తుందో కాదా?
ఒక నాయకుడు చనిపోయినప్పుడు వీరాభిమానంతో తట్టుకోలేక కొంతమంది, తెలంగాణా ఉద్యమంలో కొంతమంది చనిపోయింది వాస్తవమే అయినా ఈ మీడియా వారు ప్రతిదీ కవరు చేసి (ఒక్కోసారి కలరింగ్ ఇచ్చి - అంటే పదే పదే చూపడం etc.,)సాధించినది ఏమిటి? మరిన్ని ఆత్మ హత్యలు జరగడానికి కారణమయ్యారు తప్ప ఆగడానికి కాదనేది నిజం కాదా? పైగా ఈ ఆత్మ హత్యలకన్నింటికీ వ్యక్తిగతంగా అనో, పార్టీ పరంగా అనో, ప్రభుత్వ పరంగా(ఇంకా అనలేదు గానీ ముందుముందు అనవచ్చేమో?) అనో ఆర్ధిక సహాయం అంటూ చేస్తూ పోతే ఇది చివరకు ఎటు దారితీస్తుంది?
దీనిపై నేను వ్రాసిన టపా "మళ్ళీ మొదలైన అభిమానాత్మ'హత్యలు'" http://dare2questionnow.blogspot.com/2010/11/blog-post_30.html
లో చూడగలరు

Anonymous said...

అబ్బబ్బ ఈ ఆత్మగౌరవాలతో చచ్చి పోతున్నాం. మన వాడి తండ్రి గారు అమ్మ గారి దగ్గర సాగిలపడినప్పుడు లేని ఆత్మ గౌరవం ఇప్పుడే పుట్టుకొచ్చిందా . ఒక వేళ అమ్మ గారు సీటు ఇచ్చేస్తే దండాలు పెట్ట కుండానే నడిపిస్తాడా. అంత ఆత్మ గౌరవమే ఉంటె ఇప్పుడెందుకు పార్టి నుంచి బయటకు వెళ్ళడం. సీయం పదవి ఇవ్వనన్నప్పుడే బయటకు పోవచ్చు కదా. అసలు సోనియా దగ్గరికి మనం వెల్లడ మేంటి అన్న స్పృహ అప్పుడు లేదా. కనీసం సోనియా ఇవ్వనని తేల్చినప్పుడైన పార్టీ పెట్టొచ్చుగా. ఇంకా అవకాశం ఉంటుందేమో నన్న ఆశతోనే కదా ఆగింది. ఇక రాదు అని అర్ధమయ్యాక అమ్మను అమ్మోరని తిట్టాలని అనిపించిందా.
నా పత్రిక కాంగ్రెస్స్ పత్రిక కాదని చెప్పుకోవడ మంత సిగ్గుమాలిన మాట ఇంకొకటి ఉందా. రామోజీ రావు తిడితే దేశ ద్రోహం, జగన్ తిడితే అది నిజాయితీ, నిష్పాక్షపాతం అవుతుందా ? జనానికి ఏమీ తెలియదనుకొని నోటికోచ్చినట్లు మాట్లాడితే కుదరదు. రాహుల్ గాంధీ కి వారసత్వంగా పదవులు ఇస్తున్నప్పుడు జగనన్న కు ఎందుకివ్వరు అన్న ప్రశ్న వేసుకోవడం మన దౌర్భాగ్యం. అసలు ఢిల్లీ వారసత్వాలతోనే చచ్చి పోతుంటే ...వాడికి పోటీ పెట్టి ఇక్కడ మా వాడికి కూడా కావాలనడం మన దరిద్రం కాక మరేంటి ? బలం బలం అని ఒకటే గోల పెడుతున్నారు. అసలు బలాన్ని కొలవడానికి ప్రమాణాలు ఏమిటో అర్ధం కాదు. జనం అందరికి వస్తున్నారు. చిరంజీవికి కూడా జనం బాగానే వస్తున్నారు. జనం రావడమే బలమైతే చిరంజీవి, బాలకృష్ణ లను కూడా సీయంలను చేయాలి. అయినా జగన్ మాటల్లో, చేతల్లో నిజాయితీ లేదు. ప్రతి దాన్ని డబ్బుతో కొనేయాలన్నా తపన కనిపిస్తోంది. జగన్ కు సీయం పదవి ఇస్తే నిజంగానే దక్షిణాదిలో పరిస్తితులు దారుణం గా ఉండేవి.

Shiva said...

Virappa Moily son founded and running a Micro Finance Institution (the much hated word in AP now due to suicides of borrowers because of coercive methods and high interest rates). The following is the profile appeared in business today long back.

Rural market maker

Harsha Moily uses microfinance to create a rural market place.

Harsha Moily, 36

Year of Founding: 2005
Focus: Microfinance and related areas such as insurance
Current Size: 27,000 customers for micro-credit
Current Equity: Rs 1.45 crore
Funding Plans: Rs 8 crore from a US-based VC and high networth individual


Harsha Moily
On a vacation from his job at the London offices of Lombardi Odier, a boutique private equity firm, Harsha Moily found himself looking for a way to enter the burgeoning microfinance industry. It was March 2005 and the industry was red-hot. Rather than join one of the many mushrooming outfits, Moily, son of former Karnataka Chief Minister Veerappa Moily, decided to branch out on his own with MokshaYug Access, an MFI that focusses on not just microlending but also creating a rural market for insurance and retail in Bagalkot, northwestern Karnataka.

Rather than duplicate the business model of existing MFIs, Moily decided to offer a broader basket of services to his customers, including insurance. “We are just over two years old and have a long way to go in this industry,” says Moily, whose dancer-wife is also a director with the firm. Just the same, Moily, an MBA from Thunderbird, has ambitious goals for his start-up. He wants to have at least 100,000 customers in three years and expand his services to include retail and lifestyle products.

సుజాత వేల్పూరి said...

ఆత్రం తప్ప జగన్ ఆవేశానికి నిస్సందేహంగా అర్థమే లేదు. అసలు ముందు తెలివి తేటలే కనిపించడం లేదు.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి 30 ఏళ్ళు వెయిట్ చేశాడు. వెయిట్ చేయడమే కాదు, జనంలోకి వెళ్ళాడు, జన హృదయాలను గెలిచాడు. అందుకే రాష్ట్రంలోని ఏ ప్రాతం వారైనా అతడిని అభిమానించారు. జగన్ అలాంటి ప్రయత్నాలేవీ చేయలేదు. నాన్న సంపాదించిన ఆస్థి లాగానే ఆయన రాజకీయ జీవితం కూడా తనకు వారసత్వంగా లభిస్తుందన్న భ్రమలో ఉన్నాడు. వై యెస్ మరణం తర్వాత ఉత్తి పుణ్యానికి పిలిచి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనీ ఉక్రోషం, ఆవేశం అడుగడుగునా ప్రదర్శిస్తూ, అలక సాగిస్తూ, జనం అందరూ ఆ ఉక్రోషాన్ని గుర్తించేలా తనే చేసుకున్నాడు. ఒక వ్యూహ రచన లేదు, సహనం లేదు, వేచి చూసే ధోరణి లేదు. సంయమనం అసలే లేదు.

వై యెస్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకు అధిస్ఠానం జగన్ ని నిర్లక్ష్యం చేస్తుందని ఎవరూ అనుకోరు. కాకపోతే ఈ నాలుగేళ్ళు మనసులోని ఆక్రోశాన్ని మనసులోనే దాచుకుని అందరితో కలిసిపోయి ఎంపీగానో మంత్రిగానో ప్రభుత్వంలో పని చేసి ఉంటే రాబోయే ఎన్నికల తర్వాత అతడికి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కొంతవరకూ ఉండేదేమో!

మీరన్నట్లు ఈ సమయాన్ని అతడు సరిగా వినియోగించుకుంటే కొంత వర్కవుట్ అవుతుంది. కానీ ఆయనకి అంత ఓపిక ఉందా అనేది సందేహమే! దూకుడుకు కళ్ళెం వేయాలి. అప్పుడప్పుడూ బుర్రను ఉపయోగించాలి.

WitReal said...

మీ నాన్న రిక్షా తొక్కి కష్టపడి నిన్ను ఇంజనీర్ చదివించాడు. నువ్వుకూడ బి.టెక్ సర్టిఫికేట్ రిక్షాలో వేల్లాడదీసి, రిక్షా తొక్కి పైకిరా అన్నట్టుంది. రాజీవ్ గాంధీ, కుమారస్వామి గౌడ, దయానిధి మారన్.. వీల్లంతా ఎన్నేళ్ళ ప్రజా సేవ తర్వాత పదవులు పొందారు?

armchair thinkers ఇంత విశ్లేషనలైతే చేస్తున్నారు గానీ, జగన్ ను ముఖ్యమంత్రిని చేసివుంటే...దక్షిణాదిన పరిణామాలు దారుణంగా ఉండేవా?...ప్రస్తుతం వున్న పరిస్థితులకంటే, లేదా రాబోయే పరిస్థితులకంటే దారుణంగా వుండేదా?


@@ అసలు బలాన్ని కొలవడానికి ప్రమాణాలు ఏమిటో అర్ధం కాదు

దీని సమాధానం మీరే చెప్పేసారు. జనాలు వస్తున్నారు + డబ్బు వెదజల్లే సత్తా వుంది.

ఆ డబ్బు నీతిగా సంపాదించిందా కాదా, ఈ వారసత్వాల వల్ల దేశానికి ఎంతనష్టం అనేది మీరు రోజుల తరబడి చర్చించి ప్రజలని ఉత్తేజ పరిచి బ్యాలెట్ బాక్స్ రిజల్ట్ తో ఎవరి బలమెంతో తెలియజేయండి. మిమ్మల్ని నేను తప్పక బలపరుస్తాను.

అంతవరకు ఇలా పేజీలకు పేజీలు కామెంట్లు రాసుకోవడం మనకి టైం వేస్ట్!

శ్రీనివాస్ said...

ఓదార్పు యాత్ర కవరేజి బాగోలేదని సాక్షి పేపర్ డిస్ట్రిక్ట్ టాబ్లాయిడ్ ఎడిటర్ లని నిర్దాక్షిణ్యంగా పీకేశాడు. ఎవరూ గుర్తించలేదో లేక జగన్ అంటే భయమో

Anonymous said...

@సుజాతా అక్కాయి
/*కాకపోతే ఈ నాలుగేళ్ళు మనసులోని ఆక్రోశాన్ని మనసులోనే దాచుకుని అందరితో కలిసిపోయి ఎంపీగానో మంత్రిగానో ప్రభుత్వంలో పని చేసి ఉంటే రాబోయే ఎన్నికల తర్వాత అతడికి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కొంతవరకూ ఉండేదేమో!*//
బాగుంది.మీకు బుర్రలో కుంకుడు కాయంత గుజ్జు గూడ లేదు అని తేలి పోయింది. నాలుగేళ్ల తరువాత ఈ రోసయ్యో,కిరనో కాంగ్రెస్స్ పార్టీ ను మళ్ళీ గెలిపించి,ఆ తరువాత రాయ్య అని జగన్ ని సి ఎం చేస్తారా?లేకపోతె ఈ రాహుల్,సోనియా మైమరపించి గెలిపించి జగన్ ని కుర్చీలో కూర్చో పెడతార నాలుగేళ్ల తరువాత? అసలు మీరు ఆలోచిస్తారా?
/*.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి 30 ఏళ్ళు వెయిట్ చేశాడు. వెయిట్ చేయడమే కాదు, జనంలోకి వెళ్ళాడు, జన హృదయాలను గెలిచాడు. అందుకే రాష్ట్రంలోని ఏ ప్రాతం వారైనా అతడిని అభిమానించారు. జగన్ అలాంటి ప్రయత్నాలేవీ చేయలేదు*//
రాజశేఖర్ రెడ్డి మొదట లాబియింగ్ ద్వారా ముఖ్యమంత్రి కావాలని చూసాడు. రాజీవ్ హయాం లో,pv హయాంలో తెరవెనుక రాజకీయాలు చేసి చాత కాక ప్రజల్లోకి వెళ్లి సి ఎం సీటు తెచ్చుకున్నాడు. అందుకే రాష్టంలో అంత మంచిపేరు తెచ్చుకోగాలిగాడు.
అంతే కాదు మొట్టమొదటి సారిగా కాంగ్రెస్ సి ఎం అయిదేళ్ళు పరిపాలించాడు.
జగన్ ఎందుకు ప్రయత్నం చెయ్యలేదు.ఓదార్పు యాత్రో,తొక్కలో యాత్రో జనం లోకి వెళ్ళాలని చూసాడు.కాని సొంత పార్టీ వాళ్ళే అందులో పార్టీ ప్రేసిడేంటే వెళ్లొద్దు అన్నారు.మరి జనంలో పేరు వచ్చేది ఎప్పుడు?మనోడు ముఖ్యమంత్రి అయ్యేది ఎప్పుడు.
వాళ్ళ తండ్రి ఉంటె జగన్,రాహుల్ కన్నా ఎక్కువ సహనంతో ఉండే వాడు. :) :) :)

/*అప్పుడప్పుడూ బుర్రను ఉపయోగించాలి*/
బాగుంది. ముందు మీరు కాస్త బుర్ర ఉపయోగించి కామెంటు రాయండి. తరువాత మీ బుర్రతో జగన్ కి సలహాలు ఇవ్వండి.
/*జనం అందరూ ఆ ఉక్రోషాన్ని గుర్తించేలా తనే చేసుకున్నాడు. ఒక వ్యూహ రచన లేదు, సహనం లేదు, వేచి చూసే ధోరణి లేదు. సంయమనం అసలే లేదు *//
ఈ కిరణ్ గాడు లేకపోతె బాగానే ఓపిక పట్టేవాడు. మనము బెంచ్ మీద ఉన్నప్పుడు,బయటనుండి ఇంకొకడిని రిక్రూట్ చేసుకొని ప్రాజెక్ట్ లో పెడితే దాని అర్ధం ఏందీ? మనల్ని త్వరలో ఫైర్ చేయ్యబోతున్నారని.ఇంక అప్పుడు బయట ఉద్యోగం వెతుక్కోపోతే మనకు ఖచ్చితంగా పిచ్చి అన్న పట్టి ఉండాలి. జగన్ కి పిచ్చిలేదు. అందుకే బయట పడ్డాడు.

/*మీరన్నట్లు ఈ సమయాన్ని అతడు సరిగా వినియోగించుకుంటే కొంత వర్కవుట్ అవుతుంది. కానీ ఆయనకి అంత ఓపిక ఉందా అనేది సందేహమే! దూకుడుకు కళ్ళెం వేయాలి */
కాలమే సమాధానము చెప్తుంది ఎవరు కరక్టో,ఎవరు తప్పో? సారీ ,ప్రజలే నిర్ణయిస్తారు ఎవరి బతుకు ఏమిటో. వెయిట్ అండ్ సి.


/*రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి 30 ఏళ్ళు వెయిట్ చేశాడు*/

అంటే రాజశేఖర్ ముప్పయి ఏళ్ళు ఎదురు చూస్తె ఈయన కూడా అంతే ఎదురు చూడాలా?ఓకే .వారసత్వం తప్పు అనుకుందాము. మరి ఇతనే ప్రజల్లోకి వెళ్లి పేరు తెచ్చుకోవాలి అనుకున్నాడు.మరి ప్రజల్లో తిరగొద్దు అంటే ఎలా? వారసత్వం లేకుండా,ప్రజల్లో తిరగకుండా పదవి వచ్చేది ఎట్లా అక్కాయి?

kattashekarreddy said...

The man who craved and grieved for power, when the fathers dead body is very much in his house, now accuses others for as if he stood for values. the man who pressurized his uncle to resign for Lokh sabaha seat, and rejected by high command, now accuses that he was targeted for as he stood for values. the man who organized a group and sycophants from day one, as if this state and power is his jagir, as he is the only heir for power, and troubling government and party, now accuses high command has done this and that. the man who has no political history, not even history of social service, again even known for egoistic, arrogancy and attrocious nature, now finding fault with everybody. Even a child can tell what is jagan and what he is aspiring for. he may win some people, but he will not succeed as a politician with all these evil qualities.

Naagarikuda Vinu said...

To make fast money,u need help of politicians...When u want to save that money...u have to enter politics...or fund politics...When ur crime goes beyond the limitations...u shud either own a party or be a key player in it...Jagan is just doing what he shud be doing...Kudos to the people who add masala to this and call him a leader...

సుమలత said...

సుజాత గారు బాగా చెప్పారు డబ్బు తో అన్ని కొనిపదివేయడం కడు సియం పదవి అంటే జగన్ కు రాజగం పటల్ల ఎమ్మి తెలుసు మనం జగన్ గ్రుచి చెప్పడం టైం వేస్ట్ తప్ప

Sitaram said...

అప్పిబొప్పి...
మీ వాదన మీరు చేయండి కానీ...కొన్ని వాక్యాలలో వాడిన పదాలు చాలా అభ్యంతరకరంగా vunnayi. dayachesi ilaanti vyakhyalu cheyakandi. kaastanta gouravapradamgaa charcha జరిపితే బాగుంటుంది.
raamu

రాజేష్ జి said...

$Boppay gaaru
You nailed it hardly with meaningful and straightforward arguments. Good go.

Let me think and answer.

nareshnunna said...

@ Shiva....

Dear mr. Shiva,

I heard that one of the sons of Moiley was auditor. one is CEO of Jagan's one of the firms. Is Harsha Moiley another son?
could u clearfify, if u know?

Srikalahasthi said...

Dear Mr Ramu, For some reason your blog entries are confining to day to day political news and missing some the major topics in media and journalism. For some reason you have totally missed writing on Radia tapes which includes invlovement of some the senior journalists. The main motto of your website is journalistic ethics, but you have totally missed an oppurtunity to disect the issue. Most of the medai houses deliberately avoiding any talk on this issue. Doesn't this show the double standards of media. When it comes to their own problem they are also behaving like any other politician. Why are you wasting time on this power greedy young fellow who thinks CM post is a god given right for him.

Sitaram said...

Dear Srikalahasthi..
your observation is right. I failed to dedicate my time to write on media pimps in that episode. Sorry for that.
I've started reading the stuff to do a story.
Cheers
Ramu

Praveen Mandangi said...

జగన్ వెనుకాల కోటరీ పని చేసింది. మీరే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అతన్ని నమ్మించింది. అందుకే జగన్ తనకి ముఖ్యమంత్రి పదవి వస్తుందనుకున్నాడు. తన కొడుకు రాహుల్ గాంధీకే అంత సులభంగా ప్రధాన మంత్రి పదవి ఇవ్వని సోనియా కొత్తగా పరిచయమైన జగన్ ని నమ్మేసి ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తుంది?

పూర్ణప్రజ్ఞాభారతి said...

జగన్ గురించి FIXEDగా ముందే ఒక అభిప్రాయాన్ని సిద్ధపరుచుకుని ఆ అభిప్రాయం మేరకే మన కామెంట్లు ఉంటున్నాయేమో ఒక్కసారన్నా ఆలోచించారా... సోనియ విదేశీమూలాల కారణంగా ప్రధానమంత్రి కాలేదు. అది వాస్తవం. పుట్టుకతోనే ఇటాలియన్ పౌరసత్వాన్ని, జన్మణా భారతీయ పౌరసత్వాన్ని .. అంటే ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్న రాహుల్ రాబోయే కాలంలో ప్రధాని అవతాడట. అసలు ద్వంద్వ పౌరసత్వానికి చోటివ్వని ఈ దేశంలో రాహుల్ ప్రధాని అయ్యే అవకాశాలు సాంకేతికంగా లేనే లేవు. మరి వాడిని భావి ప్రధానిగా ప్రపోజ్ చేస్తున్న నేతల ఆలోచనా ధోరణికి, స్థిర అభిప్రాయంతో వ్యాఖ్యలు రాసే ఈ కామెంటర్లకి భేదం ఏముంటుంది చెప్పండి. జగన్ ఏ పదవినైనా కోరుకునే హక్కు ఉన్న భారతీయ పౌరుడు. అతను సి.ఎం. కావాలని కోరుకోవడంలో తప్పేముంది.. జానారెడ్డి కన్నా హీనమైనవాడు కాదు కదా.. అతని మార్గంలో అతను పోతున్నాడు. నచ్చితే నచ్చిందందాం లేకపోతే వాడి దారి వాడిది అని ఊరుకుందాం. అతనిది అవినీతి సంపదే అయితే డిపార్టమెంటల్ దాడులు ఎటూ చేయిస్తునే ఉన్నారు కదా.. అక్కడ అతన్ని పట్టుకోండి అంతేకాని ఊరికే అవినీతి సంపద.. డబ్బుంది వెదజల్లుతాడు అని ఆక్రోశించడం దేనికి. అసలు డబ్బులు ఎవరిపైకి వెదజల్లుతాడు. ఒట్లు అమ్ముకునే వెధవలపైనే కదా. అమ్మకానికి వస్తువు ఉంటే కొనుక్కోవడ తప్పెందుకౌతుంది.

Anonymous said...

@Pandit jee
పండిట్‌జీ అన్నది మీ నిజమైన పేరో కలం పేరో తెలియదుగానీ మీ వ్యాఖ్యల్లో పరిణతి మాత్రం లేదు.
1. "పుట్టుకతోనే ఇటాలియన్ పౌరసత్వాన్ని, జన్మతా భారతీయ పౌరసత్వాన్ని .. అంటే ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్న రాహుల్......" అంటూ వ్రాసిన దాంట్లో సోనియాకు అడ్డుగా వచ్చిన విదేశీ మూలాలు తండ్రి భారతీయుడైన రాహుల్ కు వర్తించవూనేది మీరర్ధం చేసుకోలేకపోయారు.
2. "జానారెడ్డి కన్నా హీనమైనవాడు కాదు కదా.."
విషయంపై సూటిగా వ్రాయకుండా మరొకరిపై నోరు పారేసుకోవడం అజ్ఙాణం కాదా?
3. "ఓట్లు అమ్ముకునే వెధవలపైనే కదా?"
పాపం ఈ పాపపు నేతలూ, అధికారులూ మేయగా మిగిలిన ప్రజా (తమ) ధనం తమదాకా సరిగా చేరక అధమ స్థితిలో ఉన్న తమ జీవన స్థితిగతులవల్ల అలాంటివాటికి ఆశపడే ప్రజలను వెధవలనడం సబబా?
4. "అమ్మకానికి వస్తువు ఉంటే కొనుక్కోవడ తప్పెందుకౌతుంది"
కాదా? సపోజ్ పూట గడవకో, పిల్లల దుర్భర స్థితి చూడలేకో ఎవరైనా ఓ తల్లి (డబ్బుకోసం) తప్పు చేయడానికి సిద్దపడితే, ఎవడైనా వెధవ ఆ విషయాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవాలనుకుంటే తప్పుకాదా? పాపం ఆ పిచ్చితల్లిని ఏమీ చెయ్యకుండా కూడా సాయం చెయ్యొచ్చేమో?

Anonymous said...

పండిట్ జీ....మీరు ఒక స్థిరాభిప్రాయంతోనే జగన్కు అనుకూలంగా రాశారన్న విషయం అర్ధమవుతోంది. జగన్ ముఖ్యమంత్రి కావడానికి నూటికి నూరు శాతం అర్హత ఉంది. కాకపోతే...ఆయన చరిత్ర, ఆయన తండ్రిగారి చరిత్ర, ఆయన తండ్రిగారి స్నేహితుల చరిత్ర( అనగా గాలి జనార్దన్ రెడ్డి అనబడు రాజకీయ వ్యాపారి) చూసినప్పుడు...కాస్త బుర్రపెట్టి
ఆలోచించే వాడెవడికైనా...జగన్ ప్రయత్నాలు చూసినప్పుడు భయం వేస్తుంది. అయినా ముఖ్యమంత్రి కావాలంటే....రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టి పరిపాలన నడవకుండా అధికార పక్షాన్ని ముప్పు తిప్పలు పెట్టడం..ఏ ప్రజల మేలు కోరి చేస్తున్నాడో అర్ధం కాని పరిస్థితి. నిజంగానే ప్రజలపై ప్రేమ ఉండి, జన క్షేమం కోరేవాడే అయితే...ప్రజల్లోకి వెళ్లి ఆందోళనలు చేయాలిగాని, ఓదార్పు యాత్రలు పేరుతో రాజకీయ కుట్రలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టి తాను ఆ సీటులో ఆసీనులైపోవాలని తపన పడతారా ? మీరు చాలా అమాయకంగా డిపార్ట్ మెంటల్ దాడులు సచ్చరిత్ర గురించి చెప్పబోయారుగానీ...దేశంలోనే అతి పెద్ద కుంభకోణాన్ని విచారించే అధికారిగా ఆ కుంభకోణానికి పాల్పడిన వ్యక్తినే నియమించిన ఘన చరిత్ర ఉన్న దేశంలో డిపార్టుమెంటల్ దాడులకు దొరికే పిచ్చి రాజకీయ నాయకులుంటారని నమ్మడమంటే...ఎంతమాత్రం తెలివైనదో మీరే చెప్పాలి. రాత్రి సాక్షి చూస్తుంటే (పొరపాటున ) అందులో వస్తున్న వార్తలేమిటో తెలుసా.... ఓ వైపు పదవుల విషయంలో కాంగ్రెస్ నేతలు అలిగి తిరుగుబాటుకు సిద్ధమవుతుంటే...ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం మర్రి చెన్నారెడ్డి స్మారక కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత ఉద్యోగసంఘాలతో చర్చలు జరపుతూ ఈ రాజకీయ వ్యవహారాన్ని పట్టించుకోకుండా గడిపాడన్నది ఓ వార్త సారాంశం. అంటే ముఖ్యమంత్రిగారు పరిపాలన వదిలేసి...అధికార దాహంతో రగిలిపోతున్న వారిని సముదాయిస్తూ( ఓదార్పు అనాలేమో ) కూర్చోవాలంట. సాక్షి వార్తలకు, జగన్ ఆలోచనా విధానానికి తేడా ఉంటుందంటే నేను కాదు చాలామంది నమ్మలేరు. జనక్షేమం కాదు...తనక్షేమం చూసుకుంటు, తనకు రావలసిన పదవులు, తద్వారా వచ్చే సంపాదనల గురించి ఆలోచిస్తున్న అందరు నాయకులకంటే..జగన్ ఇంకా చాలా ఎక్కువే. ఇప్పుడాయన ( తొందర పాటో, మిడిసిపాటో ) కారణంగా...ఒక లోక్ సభ, ఒక శాసనసభ స్థానానికి అనివార్యంగా ఎన్నిక తప్పదు. అంటే కోట్లలో ఖర్చు. హింస, అలజడి. ఇప్పుడీ రాష్ట్రానికి ఇవన్నీ అవసరమా. ఒక మనిషి పదవికాంక్ష కారణంగా రాష్ట్రంలో ఎంత అలజడి, ఎంత అస్తవ్యస్త పరిస్థితులు. వీటన్నిటీ సమర్ధించి...వంశపారంపర్య హక్కుగా భావించి జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తేగాని...రాష్ట్రంలో వేడి చల్లారదన్నమాట. అసమ్మతి లేవదీసి...పాతబస్తీలో అల్లర్లను ఎగదోశాడని చెడ్డ పేరు తెచ్చుకున్న వై.ఎస్.కు ఆయన కుమారుడికి నాకు పెద్దగా తేడా కనిపించడం లేదు. జగన్ కు టెక్నికల్ ముఖ్యమంత్రి అయ్యే హక్కు ఉండవచ్చు. కానీ....ఆయన అధికార దాహం, దాన్ని తీర్చుకోడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే....రాజకీయాలను పెద్దగా అర్ధం చేసుకో్లేని నాలాంటి అమాయకులకు నిజంగానే భయమేస్తోంది. తప్పంటారా పండిట్ జీ....

Anonymous said...

పండిట్ జీ....మీరు ఒక స్థిరాభిప్రాయంతోనే జగన్కు అనుకూలంగా రాశారన్న విషయం అర్ధమవుతోంది. జగన్ ముఖ్యమంత్రి కావడానికి నూటికి నూరు శాతం అర్హత ఉంది. కాకపోతే...ఆయన చరిత్ర, ఆయన తండ్రిగారి చరిత్ర, ఆయన తండ్రిగారి స్నేహితుల చరిత్ర( అనగా గాలి జనార్దన్ రెడ్డి అనబడు రాజకీయ వ్యాపారి) చూసినప్పుడు...కాస్త బుర్రపెట్టి
ఆలోచించే వాడెవడికైనా...జగన్ ప్రయత్నాలు చూసినప్పుడు భయం వేస్తుంది. అయినా ముఖ్యమంత్రి కావాలంటే....రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టి పరిపాలన నడవకుండా అధికార పక్షాన్ని ముప్పు తిప్పలు పెట్టడం..ఏ ప్రజల మేలు కోరి చేస్తున్నాడో అర్ధం కాని పరిస్థితి. నిజంగానే ప్రజలపై ప్రేమ ఉండి, జన క్షేమం కోరేవాడే అయితే...ప్రజల్లోకి వెళ్లి ఆందోళనలు చేయాలిగాని, ఓదార్పు యాత్రలు పేరుతో రాజకీయ కుట్రలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టి తాను ఆ సీటులో ఆసీనులైపోవాలని తపన పడతారా ? మీరు చాలా అమాయకంగా డిపార్ట్ మెంటల్ దాడులు సచ్చరిత్ర గురించి చెప్పబోయారుగానీ...దేశంలోనే అతి పెద్ద కుంభకోణాన్ని విచారించే అధికారిగా ఆ కుంభకోణానికి పాల్పడిన వ్యక్తినే నియమించిన ఘన చరిత్ర ఉన్న దేశంలో డిపార్టుమెంటల్ దాడులకు దొరికే పిచ్చి రాజకీయ నాయకులుంటారని నమ్మడమంటే...ఎంతమాత్రం తెలివైనదో మీరే చెప్పాలి. రాత్రి సాక్షి చూస్తుంటే (పొరపాటున ) అందులో వస్తున్న వార్తలేమిటో తెలుసా.... ఓ వైపు పదవుల విషయంలో కాంగ్రెస్ నేతలు అలిగి తిరుగుబాటుకు సిద్ధమవుతుంటే...ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం మర్రి చెన్నారెడ్డి స్మారక కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత ఉద్యోగసంఘాలతో చర్చలు జరపుతూ ఈ రాజకీయ వ్యవహారాన్ని పట్టించుకోకుండా గడిపాడన్నది ఓ వార్త సారాంశం. అంటే ముఖ్యమంత్రిగారు పరిపాలన వదిలేసి...అధికార దాహంతో రగిలిపోతున్న వారిని సముదాయిస్తూ( ఓదార్పు అనాలేమో ) కూర్చోవాలంట.

Unknown said...

సుజాత గారి తో ఏకీభవిస్తున్నాను. అతగాడికి బుర్రలో కొంచెమైనా ఆలోచనలు లేవు, ఒంటినిండా అధికార దాహం తప్ప!

ముఖ్యమంత్రి సీటేదో వాళ్ళ నాన్న ఆస్థి అయినట్లు గొడవ చేస్తున్నాడు.వాళ్ళ నాన్న లాగే అతడూ కోపం నరం తెంపేసుకుంటే మంచిది.

సోనియా తెలివిగానే అతడిని తప్పించింది. రాశేరె రాష్ట్రంలో ఎదురు లేని శక్తిగా ఎదుగుతున్నాడని, తన పేరును వాడుకోవడమే తప్ప రాష్ట్రంలో తనకు సీన్ లేదని సోనియా గ్రహించింది కానీ రాశేరెని ఎలా అదుపులో పెట్టాలో తెలీలేదు. ఇంతలో అతను కాస్తా పోయాడు. ఇప్పుడు జగన్ ని ఎక్కించినా అదే జరుగుతుంది. అందుకే అతడిని అనుభవం లేదన్న సాకుతో పక్కకు పెట్టింది.

రాహుల్ గాంధీ ఈ విషయంలో నయం! తన దగ్గర సరుకు లేదని తెలుసు కాబట్టి పదవుల కోసం పోకుండా ఊరికే అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. భవిష్యత్తులో కూడా అతడు ప్రధాని కాలేడు, కాడు!

ఇహ అప్పి బొప్పి సంగతంటారా? వాళ్ళు పట్టించుకోదగ్గ జీవులు కాదు. కెలుకుడు బాచ్ కి భయపడి బ్లాగ్లోకం నుంచి గెంటించుకుని బ్లాగు మూసుక్కూచున్నారు. జగన్ లాంటిదే వాళ్ళ పరిస్థితి కూడా!అందుకే అక్కడా ఇక్కడా వచ్చి ఏదో మాట్లాడతారు.

అప్పి బొప్పి,
సరే, చూస్తా ఉండండి, త్వరలో జగన్ పూర్తిగా కనుమరుగవడం ఖాయం! లేదా చెంపలు వాయించుకుని మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయం! ఇదే జరిగేది.

Anonymous said...

@ధీరజ్
/*అతగాడికి బుర్రలో కొంచెమైనా ఆలోచనలు లేవు*/
ఇది కేక.
/*తన దగ్గర సరుకు లేదని తెలుసు కాబట్టి పదవుల కోసం పోకుండా ఊరికే అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. భవిష్యత్తులో కూడా అతడు ప్రధాని కాలేడు, కాడు*/
ఇది కేకో కేక.
/*సరే, చూస్తా ఉండండి, త్వరలో జగన్ పూర్తిగా కనుమరుగవడం ఖాయం*/
ఇది కేకలకే కేక. సరే గాని ధీరజ్ గారు,మీరు పూర్వాశ్రంలో చిలక జోస్యం,హస్త సాముద్రికం లాంటివి ఎమన్నా చెప్పేవాళ్ల? జరిగిన విషయాల్ని,జరగబోయే విషయాల్ని పూస గుచ్చినట్లు చెప్తున్నారు.
మావుర్లో మా చిన్నప్పుడు కాటి శీను అని ఒక అతను మీలాగే చెప్తుండే వాడు.మేము చిన్న పిల్లలం కదా,అన్నీ నిజమే కామోసు అనుకునే వాళ్ళం. ప్రస్తుతం అతన్ని కనీసం నాలుగు గొలుసులతో కట్టేసి ఉంచుతున్నారు.

శరత్ కాలమ్ said...

@ బొప్పి
:))

premade jayam said...

జగన్ కు గైడెన్స్ ప్రాబ్లెం. తండ్రి పోయిన నాడే జెండా తిరగేసి ఉంటే ఇప్పటికి ఏడాది పాలనా పూర్తి అయ్యేది. కేవీపీ సహా అందరు ముంచేశారు. ఏడాదిలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంతా డిల్లీ కి అలవాటు పడ్డారు. ఐ పిటీ యు జగన్. టైం అయిపొయింది.

ఈ గొడవలో వరకు నా ఓటు జగన్ కే. దిల్లి పెత్తనాన్ని వ్యతిరేకించే వాడు ఎవడైనా హీరో నే.

దిల్లి సంక నాకే వాడు నా తెలంగాణా వాడైనా జీరోనే.

Anonymous said...

ఢిల్లీని ఎదిరించడం మొనగాడి తనమే. కానీ...పదవి ఇస్తే....సంకనాకడం, ఇవ్వకపోతే...వీరంగాలు వేయడం, ఆత్మగౌరవాలు, తాకట్లు అనడం...అసలే బాగా లేదు. సంవత్సరం కిందటి వరకు ఆయన కూడా రాహుల్ ను ప్రధానిని చేయడమే లక్ష్యమన్నట్లు నాకు గుర్తు. అందితే కాళ్లు, అందకపోతే జుట్టు( జగన్ లాగే ఈ సామెత కూడా రివర్స్ గేర్ లో వస్తేనే సరిపోతున్నది )లాంటి వ్యవహారాలు పదవులు తెచ్చిపెడతాయి. ఇలాంటి వ్యక్తులు ఆత్మగౌరవం, కీలుబొమ్మలు అంటూ వాగ కూడదు, చిందులు తొక్కకూడదు. తాము పదవి కోసమే పోరాడుతున్నమని స్పష్టంగా ప్రకటించుకుంటే...కనీసం వీడు ముక్కుసూటి మనిషన్న పేరైనా దక్కుతుంది. జగనన్నను ఏ కేటగిరీలో చేర్చాలో అర్ధమైపోయిందనుకుంటా...?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి