ఇదేదో ఘనకార్యం అని నాకు అనిపించలేదు. అవార్డు వచ్చిందని మనసులో ఆనందం పొంగిపొర్లలేదు. నాలాంటి వాళ్ళను ఇంకా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో 'భూమిక' వారే ఈ అవార్డు ఇప్పించి ఉంటారు. నిజానికి...బ్లాగర్లు అంతా ఈ అవార్డుకు ఎంట్రీలు పంపాలని నేను '...ఎంట్రీలకు ఆహ్వానం' అన్న పోస్ట్ అక్టోబర్ ఏడున పెట్టాను. బ్లాగర్స్ లో ఎందరు ఎంట్రీలు పంపారో నాకు తెలియదు.
UNPF వారి సౌజన్యం ఉన్న ఈ అవార్డుకు ఈ బ్లాగుకు అర్హత వుందో లేదో నాకైతే తెలియదు కానీ...ఎంట్రీ పంపడానికి సహకరించిన అందరికీ కృతఙ్ఞతలు చెప్పడం నా విధి. ఇప్పుడు అవార్డు పొందిన ఈ వ్యాసాన్ని ఇప్పటికే 'భూమిక' లో ప్రచురించడమే కాకుండా....ఎంట్రీ పంపమని ప్రోత్సహించిన సత్యవతి గారికి, వారి బృందానికి థాంక్స్. నా హేమ, మైత్రేయిలకు ఈ అవార్డు అంకితం.
'మా గోదావరి' అనే సత్యవతి గారి బ్లాగు నుంచి ఈ కింది బిట్ లిఫ్ట్ చేశాను....మీ కోసం....
పాప్యులేషన్ ఫస్ట్, భూమిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన లాడ్లి మీడియా అవార్డుల విజేతల వివరాలు.
ప్రింట్ తెలుగు
1 యిప్ప శోభారాణి వార్త
2 కొండేపూడి నిర్మల భూమిక కాలం
తెలుగు టివి
1 హెచ్ ఎం టివి బెస్ట్ డాక్యుమెంటరి
2 ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి బెస్ట్ ప్రోమో ఆన్ గర్ల్ చైల్డ్
3 వనితా టివి బెస్ట్ న్యూస్ సీరీస్
ఉర్దు
1 ఫరిదా రాజ్ సియాసత్
వెబ్ కాటగిరి
1 రాము.ఎస్ www.apmediakaburlu.blogspot.com (Best blog)
15 comments:
Congratulations.
Congrats Ramuji.
abhinandanalu
ఉత్తమ న్యూస్ రీడరు, ఉత్తమ యాంకర్ అంటూ అవార్డులు ఈ బ్లాగు ద్వారా ప్రకటించి స్వయంగా అందజేసిన మీకే ఒక మంచి అవార్డు వచ్చిందన్నమాట!
బ్లాగర్లలో అవార్డు వచ్చింది మీకొక్కరికే! కొండేపూడి నిర్మల గారికి అవార్డ్ వచ్చ్చింది. ఆమెకు బ్లాగుంది కానీ అది యాక్టివ్ గా లేదు.
మనఃపూర్వక అభినందనలు! మీకూ , సత్యవతి గారికీనూ
రామూ..
లాడ్లీ అవార్డు లభించినందుకు అభినందనలు. ఈ బ్లాగు.. అందులోని రచనలు లాడ్లీ అవార్డుకు నూరొంతులూ అర్హమైనవే. ఈ అవార్డు, మంచి మంచి రచనలు చేసేలా బ్లాగర్లందరికీ స్ఫూర్తి నిస్తుంది. once again i congratulate you my friend.
విజయ్
రామూ గారు,
మీ పోస్ట్ కు అవార్డు వచ్చినందుకు హార్ధిక శుభాకాంక్షలు. మీ పోస్ట్ గతంలో నేను చదవలేదు. మీరు ఇచ్చిన లింక్ ద్వారా చదివే అవకాశం కలిగింది.
చక్కటి పోస్ట్ . మరొక్కసారి, మీకు, మీ కుటుంబసభ్యులకు అభినందనలు.
~ sasidhar sangaraju
www.sasidharsangaraju.blogspot.com
C O N G R A T U L A T I O N S !
You deserve it.
annyya congrats
congrats...
డియర్ రామూగారూ,
సామాజిక అంశాన్ని రాయడంద్వారా అవార్డు పొందినందుకు అభినందనలు... ఇలాంటి సామాజిక రుగ్మతల మీద పరిష్కారాలు సూచిస్తూ మరిన్ని పోస్టులు రావాలని ఆశిస్తున్నా...నిజంగా అవార్డు స్తాయిలోనే ఉన్న మీ వ్యాసాన్ని మళ్లీ అభినందించనక్కరలేదనుకుంటాను...
Excellent. Sir jee, atlast a formal recognition for the blog. Wishing many more in the future.
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
Hearty congrats.Your efforts and hard work without any monetary benefit for the blog has paid good dividents in the form of an award.This award definetely gives you moral booster and encouragement to come out with good subjects in the interests of values of the proffession of journalism in AP and the people at large.Hope the news of the award will be covered by print media and TV channels.Hope Hema garu too has got good share in the ward and congrsts to both of you.
JP.
Vijayakrishna (విజయ్) Griddaluru
to me
14:26 (16 hours ago)
మీ బ్లాగ్ చాలా బాగుంది, కానీ ఒక్క చిన్న suggestion.
ళ సరిగ్గా పలకలేదని కాలమ్ రాసిన మీ బ్లాగ్ లో 'శ'/'స' విషయంలో తప్పులు దొర్లటం నాకు నచ్చలేదు, ఇది కొంచెం గమనించమని మనవి.
ఉదాహరణకి "తెలుగును ఎలా సంకరం చేసాయో మీ దృష్టికి తేదలచాను." అని రాయటం లో 'చేశాయో' అని ఉంటే బాగుండేది.
http://apmediakaburlu.blogspot.com/2010/11/blog-post_13.html
"'ఈనాడు' సోదరుడైతే మరీ ఘోరంగా జిల్లా పేజీలో ఈ క్రీడా వార్త వేశాడు" అని రాసిన పోస్ట్ లోనే "డెంగ్ కు హిందీ నేర్పే ప్రయత్నం మన పిల్ల ఆటగాళ్ళు చేసారట." అని రాశారు. (వేశాడు vs చేసారట).
ఈ పోస్ట్ లో "నడుపుతూ" బదులు "నడిపుతూ" అని కూడా ఉంది.
http://apmediakaburlu.blogspot.com/2010/11/blog-post_09.html
"క్రీడాబరి" అని వాడారు http://apmediakaburlu.blogspot.com/2010/11/blog-post_25.html లో.
"చూడబుల్" అనే ప్రయోగం తెలుగును సంకరం చేసిందని రాసి "క్రీడాబరి" లాంటి సంకరసమాసం వాడటం కూడా నాకు నచ్చలేదు.
Journalistic integrity ధ్యేయం గా పెట్టుకున్న మీ బ్లాగ్ లో ఇలాంటి తప్పులు దొర్లకుండా ఉంటే ఇంకా బాగుంటుంది.
All the best!
Vijay
డియర్ రామూగారూ,
మీకు అవార్డు వచ్చినందుకు హార్ధిక శుభాకాంక్షలు.
నీహారిక గారు...
మీ కామెంట్ అందింది కానీ...నాకు ఒక అభ్యంతరం ఉండడం వల్ల అది పబ్లిష్ చేయలేదు. మీ మెయిల్ అడ్రెస్ నాకు (srsethicalmedia@gmail.com) పంపండి. మాట్లాడుకుందాం. పైగా...నాకు మీరు ఒక సలహా కూడా పారేశారు. ఇలాంటివి నాకు నచ్చవు. మీ అభ్యంతరం ఎవరికి పంపాలో తెలియక నా మీద ఆగ్రహం వెలి బుచ్చుతున్నట్లు ఉంది.
రాము
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి