Saturday, December 4, 2010

'రాడియా గేటు' పై టీవీ చర్చల్లో లాబీయిస్టులకు పెద్దపీట

వైష్ణవి కమ్యూనికేషన్స్ అధినేత్రి, కార్పోరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా...ప్రసిద్ధ జర్నలిస్టులు బర్ఖాదత్, వీర్ సంఘ్వి లతో తెరవెనుక నడిపిన మంత్రాంగం విషయంలో తెలుగు టెలివిజన్ చానెళ్ళు చేస్తున్న చర్చలు చూస్తే బాధ కలుగుతున్నది. 

తెలుగు జర్నలిజాన్ని బాహాటంగా అమ్ముకుని బాగా సంపాదించిన వారిని, యూనియన్ను అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా పదవులు, ఆస్తులు సంపాదించిన వారిని, జర్నలిజంలో నైతిక విలువలు పూర్తిగా నాశనం కావడానికి కారణమైన వారిని చర్చలకు పిలుస్తున్నారు. ఇది అభ్యంతరకరం, దారుణం, ప్రజలను మోసం చేయడం. పొట్టకోస్తే అక్షరం ముక్క బైటపడని ఈ పండితులు...టీ.వీ.స్టూడియోలలో కూర్చుని జర్నలిజం విలువల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నో చిలకపలుకులు పలుకుతున్నారు. 

అధికారంలో ఎవరుంటే...వారి భజన చేసి నాలుగు రాళ్ళు వెనుక వేసుకుని, తమ్ములకు అన్నలకు అత్తమామలకు మేళ్ళు చేసే ఈ బ్యాచు రాడియా ఉదంతం పై తీర్పులు చెబుతుంటే...అసహ్యం వేస్తోంది. ఈ బాపతు గాళ్ళు సచివాలయంలోపల, వెలుపల ఎలాంటి లాబీయింగ్ చేసి ఎంత సంపాదిస్తారో సీనియర్ జర్నలిస్టులను ఎవరిని అడిగినా చెబుతారు. సీనియర్ ఎడిటర్లు...దయచేసి చర్చలకైనా నికార్సైన నిజాయితీపరులైన జర్నలిస్టులను పిలిస్తే బాగుంటుంది. 

4 comments:

Anonymous said...

రామన్నయ్యా!
మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ 'మనలాంటి' ఎంతోకొంత నిఖార్సైన జర్నోలు "ఆః ఇలాంటి సొల్లు చర్చల్లో, స్టూడిఓళ్ళో కూర్చొని ఏదో చెప్పేస్తే ఒరిగేదేముంది?" లాంటి వేదాంత ధోరణిలో పోతుండబట్టే అలాంటి 'గరీబు' గాళ్ళతో లాగించేస్తున్నారేమో?
(Note:నా ఈ వ్యాఖ్య వెనక మీరెప్పుడో దేవుని పోస్ట్‌లో బాబు గోగినేని గారి గురించి వేసిన సెటైర్ ఉందని గమనించ ప్రార్ధన:))

kvramana said...

annayya
Even I felt very bad to see that discussion on one of the leading channels. In fact, I respect the editor of that channel though I never met him. I felt the programming of that particular channel is perfect and relates to the current developments than focusing on illicit relationships, etc. I realised that that particularr union leader aka journalist was just translating what appeared in Outlook into Telugu. I don't think he ever met Radia or for that matter any corporate lobbyist. But, definitelyy he must have met some small time political lobbyists focusing on constables and sub-inspector transfers. That discussion on HMTV was atrocious and the panel was dubious. I am still not able to understand how the editor of that channel Mr Murthy ever thought of inviting that particular journalist to talk about such an important topic called Ethics, media and lobbyists. Hope Mr Murthy takes our protest and objections into account before inviting that 'expert' from media for any future discussions. I don't mind he talking about Jagan or Kiran Kumar Reddy. In my view what these experts talk on TV shows about politics is like we commenting on how good or bad Sachin played in a particular match. It is easy to comment on any issue sitting on the sidelines. Please Mr Murthy at least for our sake and for the sake of all those journalist who are still interested in some profesional principles, stop inviting them for discussions. You are making them celebrities and you are also bringing down the valuations of your channel.
Ramana

Ramu S said...

ఒక మంచి జర్నలిస్టు మెయిల్ లో పంపిన సరదా మాటలివి--రాము
----------------------------
వోరి సత్తే కాలపు సత్తయ్యా...
మొన్నటికి మొన్న యేటి అయినాది...
యిట్టాంటి దగులుబాజికా అట్టాంటి పదవి కట్టబెట్టేది అని అంటే.. అదేనయ్యా మన పెజాసామ్యంలోని అత్యున్నత నేయస్తానము థామస్ గాడి చరిత్ర సూసి.. యీ నీతిమాలినోడికా అవినీతిని అరికట్టే బాధ్యత అప్పగించేదీ.. అని ఆవేసంతో వూగిపోతే.. మానమే లేని మన మన్మోహన్ సర్కారు యేమని సెలవిచ్చినాది?
ఫో ఫోవయ్యా.. మా బాగా చెప్పొచ్చావ్ గాని.. అసలు మచ్చే లేని సచ్చీలుడు కావాలంటే ఎట్ట కుదురిద్దీ.. అట్టా మడి కట్టుకొని కూకుంటే.. సగం పదవులు భర్తీ కాకుండా ఖాళీగా మిగిలిపోతాయి, అందుకే ఉన్న ఎదవల్లో కాస్త మంచి ఎదవను ఎతికి తెచ్చినాము.. అర్థం చేసుకోండి యువరు ఆనరూ.. .. అని కదా అన్నారు....
యిప్పుడూ మన టీవీ వాళ్ళు కూడా అదే బాణీలో ... పట్టి పట్టి చూసినా పతితులు కాని పాత్రికేయుల జాడే కరవాయే.. నానేటి సేసేది అని అంటే.. నువ్వు చేసేది ఏంది అంటా... పాళి ముడుసుకోవడం తప్ప...

Anonymous said...

@Ramu S
మరంతే గాదేంటి? వారికి ఆయనతో (థామస్ తో), ఆయనకు వీరితో పనుందిగాదేంటి? ఆయన్ పామాయిల్ జిడ్డును వీరు కవర్ చెయ్యాల, వీరి స్పెక్ట్రం పందేరాలనును ఆయన కడుపులో దాచుకోవాలాయె:) ఎవడి ప్రయోజనాలు వాడివి. ప్రజల బాగోగులు వీళ్ళకెందుకు?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి