హంస...పాలను, నీళ్ళను వేరుచేసినట్లు వార్తను, వ్యాఖ్యను వేరుచేసి చూపిస్తామని స్పష్టంగా ప్రజలకు భరోసా ఇచ్చేందుకే అనుకుంటా....హెచ్.ఎం.-టీ.వీ.కి ఆ పక్షిరాజం గుర్తును లోగోగా వాడారు. టీ.ఆర్.పీ.రేటింగు గొడవలో పడి దాదాపు అన్ని ప్రధాన ఛానెల్స్ నీతిని గాలికి వదిలేసి, రాజకీయ జెండాలు నిస్సిగ్గుగా భుజానికి ఎత్తుకుని గర్వంగా స్వైరవిహారం చేస్తున్న వేళ ఈ ఛానెల్ భిన్నంగా వ్యవహరిస్తున్నది. "హింస, అశ్లీలం మా ఛానెల్ లో చూపబోము," అని పబ్లిగ్గా ధైర్యంగా ప్రకటించి ఆ మాటకు కట్టుబడే ఒకే ఒక్క ఎడిటర్ కే.రామచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఛానల్ అందుకే అనూహ్యంగా ప్రజాభిమానం పొందింది. గత కొన్ని నెలలుగా ఛానెల్ ఆపరేషన్స్ దగ్గరి నుంచి చూస్తున్నవాడిగా నాకు అనిపించింది ఏమిటంటే...ఇప్పుడున్న ఛానెల్స్ లో ఇది చెప్పుకోదగినది, భిన్నమైనది.
అలాంటి ఛానెల్ వారి ప్రధాన కార్యాలయం దగ్గర పార్క్ చేసిన వ్యాన్ మీద కాషాయ సేన దాడిచేసిందంటే...ఆవేదన కలిగింది. ఇది దారుణం, అమానుషం. అభ్యంతరాలు ఉంటే...వచ్చి మూర్తి గారిని గానీ...మరొక సీనియర్ ఎడిటర్ ను గానే కలిసే అవకాశం ఉన్నా ఛానెల్ పై దాడికి దిగడం హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శివసేన తరహా శైలితో బెదిరించాలని చూడడం మంచిది కాదు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలి.
ఎందుకు ఈ కాషాయ సేనకు కోపం వచ్చిందో చర్చించాలి. ఈ మధ్యన మూర్తి గారు ఒక పది రోజుల పాటు కాశ్మీర్ లో పర్యటించి వచ్చి...అక్కడి ముఖ్య నేతలను ఇంటర్వ్యూ చేసి 'మండుతున్న మంచు కాశ్మీర్' అన్న శీర్షికతో గత కొన్ని రోజులుగా ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నారు. రాష్ట్ర విభజన డిమాండ్, భయం తో రాష్ట్రం అట్టుడుకుతున్నప్పుడు ఈ ఛానల్ చొరవతో అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 'దశ-దిశ' కార్యక్రమం తర్వాత...'మండుతున్న మంచు...కాశ్మీర్' మరొక గొప్ప ప్రయత్నం అనిపించింది. ప్రోగ్రాం నాణ్యత విషయంలో నాకు కొంత అభ్యంతరం వున్నా...ఒక సీనియర్ ఎడిటర్...ఇటీవల బాగా ఇబ్బందిపెట్టిన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా...ఒక ముఖ్య సమస్యను దగ్గరి నుంచి పరిశీలించి ప్రత్యేక కథనాలు ఇవ్వడం సంతోషదాయకం అనిపించింది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. మీ కోసం.....కాశ్మీర్ పర్యటన విశేషాలతో ఈ బ్లాగ్ కు ఒక పీస్ రాయాల్సిందిగా నేనీ మధ్యన మూర్తి గారికి ఒక మెయిల్ పంపాను కూడా.
మూర్తి గారు ఇంటర్వ్యూ చేసిన వారివీ, తమవీ అభిప్రాయాలు ఒకటే కాదు కాబట్టి కాషాయసేన కక్షకట్టింది. ఇదొక హాస్యాస్పదమైన విషయం. ఒక సీనియర్ ఎడిటర్ కథనాన్ని అర్థం చేసుకోకుండా కొందరు శుక్రవారం నాడు ఈ ఛానెల్ కు శ్రీనగర్ (హైదరాబాద్) కాలనీలో ఉన్న ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారట. మర్నాడు, అంటే నిన్న రాత్రి ఛానల్ వారి హెడ్ ఆఫీసు దగ్గర మెరుపు దాడి చేసి...డీ.ఎస్.ఎన్.జీ. వ్యాను ను ధ్వంసం చేసి పారిపోయారు. ఇది మంచి పద్ధతి కాదు. దాడికి దిగింది...భజరంగ్ దళ్ వారు కాదని ఆ సంస్థ ప్రకటించింది. మరెవరు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారు? వారిని గుర్తించి శిక్షించాలి.
(Note: ప్రతి దాంట్లో పెడార్థాలు, కంతలు వెతికే మితృలారా...నేనేదో ఈ ఛానెల్ వారి ఆఫీసులో వున్న జర్నలిజం స్కూల్లో పనిచేస్తున్నాను కాబట్టి...పాజిటివ్ గా రాసానని అనుకోకండి. రాగద్వేషాలకు అతీతంగా బ్లాగ్ నిర్వహించడం నా కర్తవ్యం, బాధ్యత. నా అభిప్రాయాలు ఏ మాత్రం దాచుకోకుండా రాయడమే ఉద్దేశం. ఈ అంశంపై మీ విమర్శలు, అభిప్రాయాలు జంకు లేకుండా రాయండి....చర్చ జరుపుదాం--రాము)
Sunday, December 12, 2010
Subscribe to:
Post Comments (Atom)
16 comments:
నేను రోజూ "మండుతున్న కాశ్మీరం" చూస్తుంటాను. ఆ ప్రోగ్రాం చాలా బాగుంది. అది చూసిన తర్వాత రామచంద్ర మూర్తి గారిని కలవాలని ఆయనకోసం ప్రయత్నించాను ఆయన దొరకలేదు. మీకు ఆయన మైల్ ఐ డి తెలిస్తే ఇస్తారా? కాశ్మీరం పేరెత్తితే శివసేనకి కోపం రావడం లో ఆశ్చర్యం ఏముంది? బి జె పి మాత్రం తెలంగాణా పేరెత్తవచ్చు. ఎవరూ కాశ్మీరం పేరెత్తగూడదు. ఎవరు ఎలా తగలబడిపోయినా పర్వాలేదు వీళ్ళు మాత్రం పంతం వీడరు.
అన్ని పత్రికల హెడ్ లైన్స్,సంపాదకీయాలు,స్పెషల్స్... టెలుగు బ్లాగుల టాజా పోస్టింగ్ లు ...రేడియో,టీవీ చానల్స్ ...తో నా క్రొత్త వెబ్ సైట్ ఆంధ్రావని.ఇన్ వచ్చింది... పత్రికా మిత్రులూ/ప్రియులూ దయచేసి ఒకసారి చూసి కామెంట్ చేయరూ..ప్లీజ్.. andhravani.in
nicely said
నిస్పాక్షిక జర్నలిజాన్ని చూస్తే.. దుష్టశక్తులకు ఎప్పుడూ దడే. ఇప్పుడు ఈ సత్యం మరోమారు నిరూపితమైంది. నిరసనలు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి తప్ప.. దాడులకు దారితీయరాదు. హెచ్ఎంటీవీపై ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఆ లక్ష కోట్ల పై మీ లాంటి వారు అవగాహనా బ్లాగులు ఎందుకు వ్రాయట్లేదు... మీరూకూడా ? మీ లాంటి వారు కమాన్ ఇండియా లాంటి ప్రొగ్రాం కి మద్దతు గా ఏకం చేయాలి ముందుకు రావాలి ..
@ "హింస, అశ్లీలం మా ఛానెల్ లో చూపబోము," అని పబ్లిగ్గా ధైర్యంగా ప్రకటించి ఆ మాటకు కట్టుబడే ఒకే ఒక్క ఎడిటర్ కే.రామచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఛానల్"
నిజమే. ఈ విషయంలో హెచ్.ఎం టీవీ ని అభినందించాల్సిందే.
@"ఈ ఛానెల్ వారి ఆఫీసులో వున్న జర్నలిజం స్కూల్లో పనిచేస్తున్నాను కాబట్టి...పాజిటివ్ గా రాసానని అనుకోకండి."
కొందరు మితృలు మీరు వ్రాసే విషయాలను సూటిగా విమర్శించే ధైర్యం లేక ఇలాంటి కామెంట్లు వ్రాయడం చూసాను. ఆ మద్య వేరే బ్లాగులో @( http://www.24gantalu.co.cc/2010/11/blog-post_25.html)కేసీఆర్ పై ఎవరో మరీ అమర్యాదకరంగా కామెంట్ వ్రాస్తే దాన్ని నేను ఖండించినందుకు నన్నూ, మిమ్మల్నీ, మరో ఇద్దర్నీ కలిపి మనం వన్ సైడ్ వ్రాస్తామనీ, కుల పిచ్చిగాళ్ళనీ... etc.,వ్రాయడం నాకు భలే నవ్వు తెప్పించింది. of coarse వాళ్ళ భాషలోనె రిటార్ట్ ఇచ్చేసరికి తోక ముడిచారు లెండి:)
Ramu
You have exhibited your idiocy just like Chidambaram by giving a colour to the attack . HMTV itself refrained in its scrolls from using the word 'safronsena' , but you took the liberty to showcase your idiocy.
HMTV's series on Kashmir is one of the best I've watched in recent times in vernacular media. It attempts to touch the issue at the core. Infact, Telugu (or any other defined vernacular) media never tried to emphasize some issues of national or international importance, courtesy, our non-allegiance to federal Indianism. However, the irony is about attempts to disrupt HMTV's stories on Kashmir. More appalling is trying out-of-way-fundamentalism to make their dissidence public. Damn their violent fundamentalism, damn those narrow motivators. I would still prefer watching the real story of Kashmir, first hand from the parties to discussion.
@Sirjee
Awesome post, one of the good so far. Keep going.
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
It is unfortunate that the channel, which is trying to stand out in the clutter, was attacked. But, don't you think you are also getting carried away by the newest creation of UPA called saffron terror? Attack is an attack. There is no colour to it. Why are you giving it a colour? I don't think HMTV ever gave any colour to any of the terror attacks. Still I don't mind you giving some colour to the attacks. In that case, call the attacks by other groups green attacks or something like that. Or you open up the issue for debate.
Ramana
మేధావిని అనిపించుకొవాలనే ప్రతీ వాడూ కాషాయాన్ని తిట్టడం ఒక క్వాలిఫికేషన్ అనుకుంటున్నాడు. కమ్యూనిస్టు కామెర్ల జబ్బుసోకిన జర్నలిస్టులు రాజకీయనాయకులకంటే చెత్తగా ప్రవర్తిస్తున్నారు
బ్లాస్ట్ పొయ్య గారు, కాషాయాన్ని ఇక్కడ ఎవరు తిట్టారో అర్ధం కావటం లేదు. బీజేపీ,బ.ర.ద, కాషాయం లేదా హిందూ మతం ఒకటి కావు. అవన్నీ కలిపి ఒక గాటన కట్టటం కేవలం సూడో మేధావులకే సాధ్యం. అసలు హిందూ మతాన్ని ఈ దేశంలో ఎవరూ రిప్రెసెంట్ చెయ్యటం లేదు. అది మీరు తెల్సుకోవటం మంచిది. అలా చేస్తున్నాం అనుకుంటోళ్ళంతా హిందూ మాట ఔన్నత్యం, మంచి అర్ధం కానీ వారే. అలాంటి వాళ్ళే ఇల్లాంటి పనులు చేస్తారు..కాబట్టి మీరు భుజాలు తడుముకోకండి.
and watch this video till the end...that's the perspective of a common man in india and pakistan.
రాము గారు, నమస్కారం
ఓ నిజాయితీ జర్నలిస్టు చేసిన ప్రయత్నంపై రాళ్ళురువ్వటాన్ని ఖండించాల్సిందే..
కానీ మీరు కాషాయసేన అనే పదం వాడి రాహుల్ గాంధీని మించిపోదామని చేసే ప్రయత్నం బాగోలేదు.
బంజరంగ్ దళ్ పేరు వాడొద్దు, వారే దాడిచేశారని పూర్తి ఆధారాల్లేవు అని ఎండీగారే స్వయంగా కాపీ ఎడిటర్లకు చెప్పినా... మీరు మాత్రం కాషాయం అనే పదాన్ని వాడటం ద్వారా మీలోని కమ్యూనిజాన్ని, హీరోయిజాన్ని బయటపెట్టారు.
నేను రెగ్యులర్ గా మీ బ్లాగ్ ను ఫాలో అవుతుంటాను. కానీ ఈ మధ్యకాలంలో.. మీ రాతలు కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి.
దయచేసి ఇంకోసారి కాషాయ ఉగ్రవాదం అనేపదం వాడరని ఆశిస్తూ...
మీ బ్లాగ్అభిమాని
దశ-దిశ తర్వాత... hmtv కి మరో ఎస్సెట్ మండుతున్నకాశ్మీరం ... జర్నలిజం అంటే జేబులునింపుకోవడంమే అన్న్నంతగా మరిన ఇప్పటి మీడియా ప్రపంచంలో విలువలకు కట్టుబడే వ్యక్తిగా మూర్తిగారు, వారి ఆధ్వర్యంలో hmtv మరిన్ని విజయాలు సాధించాలి. నిజమెప్పుడూ నిష్టూరంమే... అందుకే పాపం కాషాయగ్యాంగ్ కు అంత ఉలికిపాటు
ramu sir,
there is no doubt in anyone's mind whosever is watching news channels that hmtv is not after trps. most of its content in media parlance is high taste which means every story dealt with journalistic ethics.
నాయనా నేను చెప్పింది సరిగ్గా నీలాంటి వాళ్ళగురించే.బీజేపీ వాడో,భజరంగ్ దళ్ వాడో హిందూమతానికి ప్రతినిధులు కానప్పుడు కాషాయదళం అనే పదం వాడడం ఎందుకు?.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి