Wednesday, January 26, 2011

ఒళ్ళు కొవ్వెక్కి...తలకు పొగరెక్కి...భరత్ ప్రేలాపన

సినీ హీరో రవితేజ తమ్ముళ్లలో ఒకడైన భరత్ డ్రగ్స్ కేసులో సీ.సీ.ఎస్. పోలీసు అధికారులను కలవడానికి వచ్చినప్పుడు టెలివిజన్ కెమెరామెన్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. 'మీరూ మనుషులేనా...వరస్ట్ ఫెలోస్...థూ...' అనుకుంటూ సీ.సీ.ఎస్.కార్యాలయంలోకి వెళ్ళాడు. తన దగ్గరకు వచ్చి విలేకరులు విసిగిస్తే అనుకోవచ్చు కానీ...దూరంగా నిలబడిన వారిని ఉద్దేశించి భరత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. వాడు థూ.... అని ఊస్తుంటే...ఆ జర్నలిస్టులు దద్దమ్మల్లా బైట కూర్చోవడం కూడా నాకు నచ్చలేదు. సారీ...చెప్పేదాకా వెళ్ళనివ్వకపోవడమో, వాడి మొఖాన ఉమ్మేయ్యడమో చేసి వుండాల్సిందని అబ్రకదబ్ర అన్న మాటల్లో తప్పు నాకేమీ కనిపించలేదు. బహుశా జర్నలిస్టు మిత్రులు ఆ షాక్ నుంచి కోలుకుని...కార్యాచరణ ఆలోచించే సరికి భరత్  లోపలికి వెళ్లి ఉంటాడు.

చేసింది బేవార్స్ పని...పైగా కోపం. ఏవో ఆరోపణలు వచ్చిన క్రైం అయితే...నేరం నిరూపణ కాలేదు కదా...అనుకోవచ్చు. అడ్డంగా దొరికిపోయిన కేసులో...బరితెగించి జర్నలిస్టులను తిట్టడం క్షమార్హం కాదు. ఒళ్ళు కొవ్వెక్కి...తల పొగరుతో భరత్ చేసిన వ్యాఖ్యను ఖండిస్తున్నాం. తన మీద పోలీసు కంప్లైంట్ చేయనున్నట్లు క్రైం రెపోర్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. తనపై చర్య తీసుకునే వరకూ పోరాడాలి.
-------------------------------------------
ఇంకోవిషయం: ఈ అంశాన్ని జీ.-24 గంటలు ఛానెల్ బాగా హైలైట్ చేసింది. ఆ ప్రోగ్రాం అయిపోగానే ఆ ఛానెల్ లో ఆరున్నరప్పుడు వచ్చిన ఒక వార్త నాకు ఎబ్బెట్టుగా తోచింది. ఆ ఛానెల్ ఆఫీసులో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలను చాలా సేపు చూపారు. ఇలా ప్రతిచిన్న దానికి తన పేపర్లో వేసుకునే తీట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి మెండుగా వుంది. ఈ కోవలో ఆర్.శైలేష్ రెడ్డి చేరడం బాగుండదు. ఈ సెలబ్రేషన్స్ చూడగానే ఆ ఛానెల్ లో పనిచేసే ఒక సోదరుడి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లి అసంతృప్తి తెలిపాను.

23 comments:

katta jayaprakash said...

The behaviour of Ravi Teza's brother towards the media persons is condemnable and shoul have demanded apology from hi.But who is rsponsible for this incident?I feel it is the media that is responsible for the reaction from him.The media has been giving undue importance to the individuals involved in criminal and anti social activities and the media just runs after these crooks just for sensation and take long interviews with these criminals sometimes live too.Where is the need for media to high light these criminals.The media just should mention the story , the case and the people involved in the crimes.But media fools the people by continously showing the faces of these criminals giving wide coverage to them as if they are VVIPS!. The media should change it's attitude while covering th stories on people involved in crimes etc.

JP.

Unknown said...

థూ నీ యమ్మ (లిప్ మొమెంట్ గమనించండి )అనికూడా అన్నాడు .
ఎవడన్న మూతి మీదకి మైకు తీసుకొస్తే అన్నా వురుకోవచ్చు గాని దూరం గా వుండి
వొక ఎక్యుజుడ్ ని కవర్ చేస్తుంటే , వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు గాని నీ ప్రైవసీ కి అడ్డం ఏమి రాలేదు గా ?
రాము గారు బయట వాడిని నాకే తప్పు గా అనిపించింది . మీడియా లైట్ తీసుకుంటే
రేపు భానుకిరణ్ పట్టు బడ్డాక మీడియా వాళ్ళ మీద గన్ చూపినా ఆశ్చర్య పడక్కర్లేద్దు .

పండు said...

అయితే ఎవడైనా ఎంతటి మీడియా ఉద్ధండుడినైనా బండబూతులు తిట్టి, తరువాత క్షమాపణ చెబితే సరిపోతుందన్న మాట? ఇదేదో బాగానే వున్నట్లుంది. నోటిదూల తీరుతుంది, పోతే ఓ బోడి క్షమాపణ. రోజూ sorry అని ఎంతమందికి చెప్పట్లేదు(కాలు తొక్కినోడికి, భుజంరాసుకున్నోడికి, అడ్డొచ్చినోడికి)

VENKATA SUBA RAO KAVURI said...

వాడు థూ.... అని ఊస్తుంటే...ఆ జర్నలిస్టులు దద్దమ్మల్లా బైట కూర్చోవడం కూడా నాకు నచ్చలేదు.

Angry Bird said...

Can some TV channel do a sting operation on the root cause behind Bharat's reaction ?

Angry Bird said...

Btw, @Ravi garu, I think I got your point. :)

Ramu S said...

పండు గారూ...
అంత పొగరుబోతు వెధవ 'సారీ' చెప్పడమంటే సగం చావడమే. అందుకే సారీ కోసం డిమాండ్ చేయమన్నాను తప్ప మరొకటి కాదు.
రాము

Saahitya Abhimaani said...

ప్రతి బెవార్సుగాడి వెంట పడనేల వాడు తిట్టాడని వగచనేల. జయప్రకాష్ గారు చెప్పిన విషయాలతో ఏకీభవిస్తున్నాను.

Pavani said...

Try to think from his perspective..

1. He was caught possessing drugs.Few gams of it, that is. There is no evidence so far to prove he is in the business of selling drugs. It must be for personal use, which essentially harms him. Not you or me or anybody. If you buy a cinema ticket by passing a long queue, because you know somebody at the front, in fact that effects others who faithfully stand in queue.

2. US has one of the largest concentration of prisoners per thousand population. In fact the number is much worse than Russia, China or Germany who many consider have very stringent laws. 50% of those prisoners are drug related. All but few of them (may be 5%) are consumers possessing few grams. Once caught their life is gone for good. Now many human right activists fighting these atrocious lawas as in theory it is one of the vices along with alcoholism, smoking.

Now with the above two things in the background, I personally believe it is unfair on part of the media to humiliate the drug victim. Showing them hancuffed, behind the contingent of police officers is humiliation. I call them victims because thats how we call a prostitute who charges one lakh per night.Our blind law does not differentiate between a woman who demands one lakh per night at her will and wish and an under age girl who was forced to do such things.Both are victims per law !!

Let me know how a drug victim can vent his anger towards who humiliated them.
He could be a nice gentleman but for this vice, which harms him essentially. But his generosity helps others. Did media ever venture to present a "true him" instead of a bad side of him.?

Prashant said...

@Ramu..
You have not updated about the photo you have posted few weeks ago.You have even asked to post comments about it.You announced winners will declared following week but seem to have conveniently forgot about it.hope you respond...

vkkurra said...

Siva garu cheppendi correct bevarsu gadi venta padatame oka tappu malli vadu tittadani badha padatamenduku

asalu roges ni devolop chestundi mana media vallu gadu

Vinay Datta said...

I totally agree with JP garu and Siva garu.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

This man is in dire necessitity of psychiatric treatment and psychological counselling.

Sudhakar said...

భరత్ లాంటి క్రిమినల్స్ ఆ పని చేయ్యటం పెద్ద వింతగా లేదు గాని, దానికి రోషం తెచ్చుకుని ఆ ఇష్యూని పెద్దగా హైలైట్ చేసి, మీడియానే తన తప్పుల తక్కెడ మనస్సుని బయట పెట్టుకుంది. "వార్త" మీదనే మనసు పెట్టి యుద్ధాలలో రిపోర్టింగ్ చేసేవాళ్ళకు ఇంతకంటే దారుణమైన అవమానాలు, అనుభవాలు ఎదురవుతాయి. అలా అని వాళ్ళు అన్నీ వదిలేసి బండ బూతులు, ఉమ్ములతో జవాబివ్వరు కదా..

భరత్ కేసులో కాదేమో గానీ, ప్రజల ప్రైవసీలో మీడియా వాళ్ళకు కనీసం మెదడు కూడా లేదని ఎన్నో సార్లు నిరూపితమైంది. ఆ లెక్కన ఉమ్ముకుంటూ పోతే కొంత మంది రిపోర్టర్లు ఉమ్ము కంపు కొడతారు జీవితాంతం.

DesiApps said...

రాము గారు,

మీ ఆలోచనా ధోరణికి, మీ మునుపటి పోస్ట్ లలో ఉన్న ఉదాత్తత, మానవీయత మరియు నైతికత పూర్తిగా కరువు అయినట్టు గా అనిపించింది ఈ పోస్ట్ లో . మీ మీద నాకు ఉన్న గౌరవం లో సగం తగ్గింది అని నా అంతరాత్మ అంటే అది నిజం గా నా తప్పు కాదు.

పై సంఘటన లో మీడియా తప్పు మొదలు పెట్టింది. సదరు భరత్ గారు ps లో సంతకం పెట్టడానికి వెళ్తున్నారు ఏదో గొప్ప పనికి వెళ్ళట్లేదు కాదా. ఆయన ను వీడియో తియాల్సిన అవసరం ఏమి వచ్చింది. దానికి ఆ వ్యక్తి పర్మిషన్ తీసుకున్నారా? అది ఆయన privacy కి భంగం కాదా. కొంచెం మీలో ఉన్న మీడియా మనిషిని పక్కన బెట్టి మామూలు వ్యక్తిగా ఆలోచించండి. ఏదో గుప్చుప్ గా సంతకమేదో పెట్టి రెండు నిమిషాల్లో ఉడాయిన్చాలని అనుకుంటారు ఎవరైనా ఆ సన్నివేశం లో. వాడి మీద కేమెర పెడితే ఎంత చికాకు పడుతాడు. మీడియా దే ౧౦౦% తప్పు ఈ విషయం లో. మీరు వారి పై కనీసం వేలేతి చూపక పోవడం విస్మయకరం. ఒక కాకి తప్పు చేస్తే ౧౦౦ కాకులు అరవాలి అనే భారత దేశ ప్రస్తుత సిద్ధాంతం మీలో కూడా పూర్తిగా వేల్లోనికొని ఉన్నాట్టుంది.
తప్పంతా ఎదుటి వాళ్ళదే మేము పూర్తిగా మంచి వాళ్ళం అనే అలోచన ముందు మార్చుకోవాల్సింది మీడియా వల్లే.
ఈ సంఘటన ద్వారా మీరు నేర్చుకోవాల్సిన గుణపాటం అదే. ప్రజలని, వాళ్ళ privacy ని దయ చేసి గౌరవించండి .

"వాడి మొఖాన ఉమ్మేయ్యడమో చేసి వుండాల్సిందని అబ్రకదబ్ర అన్న మాటల్లో తప్పు నాకేమీ కనిపించలేదు". ఇలాంటి వ్యాఖ్య మీ లాంటి వారి నుండి రావలసింది కాదు అని నా అభిప్రాయం

Sitaram said...

Dear DesiAppas...
First of all, I failed to understand as to what way it is related to my morality?
Since he is the family member of a film star, media had to take his visuals at CCS. What is wrong in it? If you apply this 'privacy' logic, we can't cover anything. If he/she is a rape victim, nobody is supposed to cover it. But here that is not the case.

There is a serious flaw in your argument. Please discuss with your matured friends and send me a mail. I'll answer all your questions. I am the one who blasted reporters for their over action many times. This incident is a different one. Don't try to cast aspersions against me.
Ramu

srini said...

Ramu garu,

you are totally wrong here. majority of common people have the same opninion on media people as bharat. Only difference here is He is a criminal.

Infact, biggest cancer that is plaguing our society is media. Specifically, in AP. They are worse than corrupt politiciansand babus.At least , there is some check on them. media people arethe worst lot with no accountability ,no checks

Unknown said...

రాము గారు... అంతా బాగానే ఉంది కానీ... ఆ తర్వాత జరిగిన విషయాల గురించి ఏం చర్చించలేనట్లుంది. అంటే... భరత్ క్షమాపణ చెప్పక ముందు జరిగిన పరిణామాలు... క్షమాపణ చెప్పడానికి దారి తీసిన పరిస్థితులు అని నా అర్థం. క్షమాపణ చెప్పడానికి ముందు రోజు రాత్రి మన జర్నలిస్ట్ మిత్రులు రవితేజ ఇంట్లో ఫుల్ మందు పార్టీలో ఉన్న విషయం బహుషా మీ దృష్టికి రాలేదేమో. లేక వచ్చినా జస్ట్ ఐదు లక్షల రూపాయలతో సెటిల్మెంట్ అయ్యింది కదా అని ఊరుకున్నారో తెలియదు. కానీ... ఇలాంటి వాటిపై కాస్త దృష్టి పెడతే బాగుంటుందేమో... ఇదే విషయంపై కాస్త కూపీ లాగితే అసలు సూత్రదారులు ఎవరో మీకు ఈజీగానే అర్థమవుతుంది.

Sitaram said...

రవి గారు,
నిజమే సార్, అది ఫాలో అప్ చేయాల్సింది. నేనీ మధ్యన టీ.వీ.చూడకపోవడం వాళ్ళ ఈ పరిణామం నాకు తెలియలేదు. వాడు సారీ చెప్పాడట. డబ్బులు చేతులు మారి వుంటాయి..కచ్చితంగా.
రాము

Anonymous said...

మీడియా (పత్రికా,టీ.వి) వార్తా ప్రసారాలు చేసి, స౦చలనాలను ప్రసార౦ చేయడ౦ మానుకొ౦టే అన్నీ సర్దుకు౦టాయి.కానీ టి.ఆర్.పి రేటి౦గుల్లో పడి పోతున్నారు.
లీడర్ లో ఓ డైలాగ్ అన్ని ర౦గాలకు సరిపోతు౦ది ఇప్పుడు అన్ని౦టా "కొనడ౦,అమ్మడ౦" మాత్రమే ఉ౦ది.
రాజకీయనాయకులు మీడియాకు ఇచ్చే వి౦దులకు మీడియా మేధావులు హజరవుతూ ఆ వి౦దువిశేషాల్ని,ఎన్ని రకాలవ౦టకాలు వడ్డి౦చారో కూడా రాస్తు౦టే మీడియాను అ౦దరూ పూర్తిగా సమర్ది౦చలేరు.సదరు వ్యక్తి తిరుమలలో పొగత్రాతున్నప్పుడుకూడా ఇలాగే గడవుడి చేసారు.మీడియాకు ఇప్పుడు కావల్సి౦ది విలువలతోకూడిన ప్రసారాలు కాదు,స౦చలనాలుకావాలి.అలాగే ఉ౦టే ఇలాగే ఉ౦టు౦ది

Vinay Datta said...

నేనీ మధ్యన టీ.వీ.చూడకపోవడం వాళ్ళ ఈ పరిణామం నాకు తెలియలేదు...so you are one of the most happy beings.

katta jayaprakash said...

It looks Ramu garu is an isolated among the bloggers regarding the Ravi Teja episode as every one has got unanimous negative opinion on media and journalists.Ramu has not commented on the rumours of money and liqour changing hands in the apology drama of Bharath.This culture of the journalists is nothing new and it is a a way of life of our so called intelectual journalists and Ramu knows pretty well.Why not expose this and condemn it?

JP.

Saahitya Abhimaani said...

@jAYAPRAKASH GAROO,

This kind of media behaviour is not unique to India alone. Its universal.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి