తెలుగులో బ్లాగు ఒకటి ఉంటే....మీడియాలో కుళ్ళును, కంపును కడిగిపారేయవచ్చు. మంచోళ్ళ గురించి రాయవచ్చు, మన అభిప్రాయాలు నలుగురితో పంచుకోవచ్చు. మనసును కదిలించిన, గాయపరిచిన అంశాలకు అక్షరరూపం ఇవ్వవచ్చు. 'ఇది అన్యాయం మొర్రో...' అని మొత్తుకున్నా ఎవడూ పట్టించుకోని విషయాలు రాసి గుండె మంటలార్పుకోవచ్చు.
----నేనీ బ్లాగు మొదలెట్టినప్పుడు ఇలా అనుకున్నాను. కానీ...బ్లాగులతో జనాలను ఆడుకోవచ్చని అవగతమయ్యిందీ మధ్యన. తెలుగు బ్లాగు లోకంలో ఇటీవల జరిగిన ఒక రెండు పరిణామాల గురించి తెలుసుకుని విస్తుపోయాను. ఈ పరిణామాలు తెలియని నా లాంటి పిచ్చి మారాజులు, మహారాణుల కోసం ఈ ఆదివారం ఈ అంశం మీద రాస్తున్నాను. కావాలనే పేర్లు చెప్పకుండా కథనం సాగిస్తున్నా...ఏమీ అనుకోకండి.
అంతా...కృష్ణ మాయ...
గుంటూరు కేంద్రంగా ఉంటున్న ఒక బ్లాగరు కొందరు బ్లాగర్లను 'మోసం' చేయడం గురించి మనం అంతా తెలుసుకోవాలి. నిజానికి అదొక గుణపాఠం. ఒక సీనియర్ బ్లాగర్ తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ బ్లాగర్ పేరు కృష్ణయ్య అనుకుందాం. బ్లాగులో రాతలతో కృష్ణయ్య పలువురికి దగ్గరయ్యాడు. ఒకప్పుడు లెక్చరర్ గా పనిచేసిన ఈ కృష్ణయ్య ఒక ముగ్గురు అమ్మాయిలను మిగిలిన బ్లాగర్లకు పరిచయం చేసాడట....ఆన్ లైన్ లో. అందులో ఒకరు తన ప్రియురాలు, ఇంకొకామె, తన స్టూడెంట్ చెల్లెలు. కొందరు సోదరీమణులు తీరికచేసుకుని మరీ వీరితో ప్రేమగా దోస్తానా చేసారట. కొందరు చాటింగ్ కూడా సాగించారట.
స్టూడెంట్ చెల్లెలు యూ.కే.లో ఉందని, ఆమె బ్లాగు నిర్వహిస్తున్నదని కూడా చెప్పాడు. ఆ బ్లాగును మన బ్లాగర్లు ఫాలో కావడం ఆరంభించారు. ఆమెతో కూడా చాట్ చేశారు.
ఇలా రోజులు ప్రశాంతంగా సాగుతుండగా....'యూ.కే.లో చదువుతున్న నా స్టూడెంట్ చెల్లెలు ఏదో ఆపరేషన్ అయ్యాక పోయింది (మరణించింది)' అని మన కృష్ణయ్య బాంబులాంటి వార్తను యావన్మందికీ తెలియజేసాడట. ఇంక విషాద గీతములకే మిగిలెన్...రసహీనమైన ఈ బ్లాగ్ లోకం...అనుకుని గుండెచెదిరిన కొందరు సోదరీమణులు ఆమెకు, ఆమె బ్లాగుకు నివాళి కూడా అర్పించారట. ఒక బ్లాగర్ గారు ఆ అమ్మాయి ఫోటో కూడా పెట్టి హోమేజ్ తెలిపారట...ఎంతో ఆవేదనతో.
కొందరు రంద్రాన్వేషకుల వల్ల తీరా తేలింది ఏమిటంటే....కృష్ణయ్య కపటనాటక సూత్రధారి అని. మనోడు కొన్ని పాత్రలు సృష్టించి...తానే ఆ పాత్రలు ధరించి...వివిధ మెయిల్ ఐ.డీ.లతో యవ్వారం నడిపాడని, ఆ బ్లాగులు కూడా మనోడే నిర్వహిస్తూ జనాలను వెర్రిపప్పలను చేసాడని ఒకరిద్దరు బ్లాగర్లు చేసిన పరిశోధనలో వెల్లడైంది. ఒకే ఐ.పీ. అడ్రస్ నుంచి ఆ మంత్రాంగం సాగిందని కూడా కనిపెట్టారట ....కొందరు.
'ఓరి దొంగ కృష్ణయ్య...నీకిదేమి పోయే కాలం?' అని ఒకరిద్దరు ధైర్యంగా అడిగితే...నిజం నిలకడ మీద మీకే తెలుస్తుందని ఒక సారి, సమాజంలో ఇతరులు మిమ్మల్ని మోసం చేస్తే మాట్లాడరు కానీ...నన్ను మాత్రం అడుగుతున్నారే...అని మరొకసారి అంటున్నాడట మన కృష్ణయ్య. "ఇది నాకు ఒక పెద్ద షాక్. నిండా ముప్పై ఏళ్ళయినా లేని అబ్బాయి (కృష్ణయ్య) ఇలా డబల్ రోల్, ట్రిపుల్ రోల్ పోషించి మమ్మల్ని మోసం చేయడం విషాదం," అని ఒక గౌరవనీయురాలైన బ్లాగర్ నాతో చెప్పారు. మన కృష్ణుడి త్రిపాత్రాభినయం గురించి ఆమె కూలంకషంగా చెబితే విని అవాక్కవడం నా వంతు అయింది.
హన్నా....ఎంత మాట?
ఇక రెండో కేసు...ఒక జర్నలిస్టు మిత్రుడికి సంబంధించింది. ఒక ఛానెల్ లో పనిచేస్తున్న ఈ మిత్రుడు ఒకటి రెండు బ్లాగులు నిర్వహిస్తారు. అందులో తన కవితలు, తనకు నచ్చిన కవితలు కూడా ఉంటాయి. అయితే...ఒక మహిళా బ్లాగరు తన కవితను పోలిన కవితను సదరు జర్నలిస్టు బ్లాగులో చూసి...ఆశ్చర్యపోయారు. 'అయ్యా...కనీసం నా పేరైనా లోకానికి చెప్పకుండా కవిత ఎత్తేసారే?' అని మెయిల్స్ పంపారట ఆయనకు ఆమె. కావాలనో, వృత్తి హడావుడి లోనో పడి జర్నలిస్టు మిత్రుడు ఆ రెండు మెయిల్స్ కు రిప్లయ్ ఇవ్వలేదు. దీంతో ఒళ్ళుమండి ఆమె గారు తన బ్లాగులో ఒక పోస్టు రాసారు...భారమైన హృదయంతో.
ఆ కవయిత్రి గారు తన బ్లాగులో రాసిన ఈ పోస్టు చూసి...'మీ కవితే కాదండీ...మా కవితలనూ మనోడు లిఫ్టు చేసి తన బ్లాగులో పెడుతున్నాడు' అంటూ కొందరు బాధితులు ఆమె బ్లాగుకు కామెంట్స్ రూపంలో పంపారు. అంతే కాక...సదరు జర్నలిస్టును దూషిస్తూ....ప్రూఫుగా ఆ లింక్స్, ఈ లింక్స్ అందించి...తమకు జరిగిన అన్యాయాన్ని లోకం దృష్టికి తెచ్చారు.
అసలే జర్నలిస్టు...ఇలాంటి పనిచేస్తే మరి ఒళ్ళు మండదా? అంతకు ముందు రెండు మెయిల్స్ కు స్పందించని మన మిత్రుడు...బ్లాగులో తన గురించి రాసిన మహిళా బ్లాగర్ కు ఒక హెచ్చరిక మెయిల్ పంపారట. సైబర్ చట్టం కింద బుక్ చేయిస్తానని మన మిత్రుడు ఝలక్ ఇవ్వడంతో మహిళా బ్లాగర్ హడలిపోయి తన మిత్రురాళ్ళతో ఈ విషయం పంచుకున్నారు. అది ఆ నోటా ఈ నోటా నాకు తెలిసి....మన జర్నలిస్టు మిత్రుడి ఫోన్ నంబర్ సాధించి మాట్లాడాను. నిజానికి అతనికి ఉత్సాహవంతుడైన రిపోర్టర్ గా పేరుంది.
'అదేంటి బాస్....మరీ కేసు బుక్ చేస్తే ఎలా?' అని నేను అతన్ని అడిగాను. 'తప్పు ఒప్పుకున్నా...వృత్తిని కించపరిచే కామెంట్స్ ప్రచురించినందుకు కోపంవచ్చింది....అంతే తప్ప మరొకటి కాదు,' అని సాత్వికంగా చెప్పాడు. తాను తన కవితలలో ఎవరి కవితల నుంచైనా నచ్చిన పదాలు వాడుకుంటే....క్రెడిట్ ఇస్తుంటా అనీ...ఈ మహిళ కవిత విషయంలో పేరు రాయడం మరిచిపోయేసరికి ఆమెకు కోపం వచ్చిందని వివరించాడు. ఈ గొడవ ఇంతటితో వదిలేయ కూడదూ...? అంటే మిత్రుడు అంగీకరించాడు. దాంతో కథ ముగిసింది.
(cartoon courtesy: blog.eyesforlies.com)

15 comments:
hahahaha... :))))
లైట్ తీసుకోండి సర్.. హోతాహై.. యహీ హై జిందగీ..
అన్నీ పదనిసలే రాసారు, మరి సరిగమలు ? ;-)
మీరు రాసిన టపా మంచి ముందస్తు హెచ్చరిక . ధన్యవాదాలు. పాత్రికేయుల పట్ల జాగ్రత్తగా ఉండమని నేనొక పాత్రికేయుడిగా ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పక తప్పటం లేదు.
ఏంటీ వృత్తిని కించపరిచే కామెంట్లు చూసి అతగాడికి కోపమొచ్చిందా?
మరి తమ రచనల్ని ఊరూ పేరూ లేకుండా వోలుమొత్తంగా ఎత్తుకెళ్ళి తన బ్లాగులో వేసుకోడం చూసినప్పుడు సదరు రచయితలకి ఎంత కోపం రావాలి?
ఆ దొంగని పట్టుకుని ఏంటయ్యా ఈ వెధవపని అని అడగాల్సింది పోయి తగుదునమ్మా అని మీరు "మరీ కేసు పెడతానంటే ఎలాగయ్యా, పాపం వొదిలెయ్యి" అని పెద్ద తరహాగా మధ్యవర్తిత్వం చెయ్యబోయారా?
అతగాడు ఇతరంగా మంచోడైతే కావచ్చు, వృత్తిలో మంచి పేరు తెచ్చుకున్నోడైతే కావచ్చు - but he needs to understand he can not do things like this! Being a journalist does not give him carte blanche to lift other people's writings without acknowledgment.
while first case (death in UK etc etc ) is ok,simple answer of being busy to reply /respond reflects his carelessness to accept value to others works. Actually she should have threated him by suing for plagiarism
చేసిన పనికి సిగ్గుపడకుండా ఇంకా కేసేస్తాననడం, దానికి మీ మహా గొప్ప మధ్యవర్తిత్వం బాగానే వుంది. జర్నలిస్టు వృత్తికే కళంకం ఈ సంఘటణ. జర్నలిస్టు అయితే ఎ రెండు కొమ్ములు నెత్తిన వుంటాయా? తప్పు ఎవరు చేసినా తప్పే.
I agree with Kothapali gaaru.
===
కావాలనో, వృత్తి హడావుడిలో పడో రిప్లయి ఇవ్వని ఆ జర్నలిస్టు సైబర్ నేరంకింద ఆ బ్లాగురుకు హెచ్చరిక మెయిల్ పంపటం హాస్యాస్పదం. ఆ బ్లాగురు వ్రాతలు పర్మిషన్ లేకుండా పెట్టుకోవటమే కాకుండా, బెదిరింపులొకటా?
అయ్యా..మిత్రులారా...
నేనేమో ఆ జర్నలిస్టును హెచ్చరించటమో లేక హెచ్చరిస్తూ రాయడమో చేయాలా? మేరీమో దాన్ని హర్షిస్తారా? నేను ఫ్రాంక్ గా జర్నలిస్టుల గురించి రాసినప్పుడు నా మీద దొంగ నాయాళ్ళు దుష్ప్రచారం చేస్తుంటే....కామ్ గా ఉండడం, లేదా 'ఏమి జరుగుతుందో...నాకు తెలియాలి...తెలియాలంతే" అని కామెంట్లు రాసేవాళ్ళు ఇప్పుడు భలేగా రాస్తున్నారే!
చీర్స్
రాము
@"నేనేమో ఆ జర్నలిస్టును హెచ్చరించటమో లేక హెచ్చరిస్తూ రాయడమో చేయాలా?" - తప్పును ఎత్తిచూపడం, ఖండించడం మీ బ్లాగుకు, ప్రొఫెషన్కూ మూల సిద్ధాంతం కాదా? అలా చేయలేనప్పుడు మనం చెప్పేవన్నీ సొల్లు కబుర్లే అని జనాలనుకోరా? మీ ప్లేసులో నేనుంటే వాడికి నీతులు చెప్పటం కాదు, ఆ కేసేదో నేనే పెట్టేవాణ్ణి వాడిపై.
I agree with కొత్త పాళీ
వృత్తిని వేరొకరు కించపరిస్తే జర్నలిస్టు గారికి కోపం రావడం సహజమే కానీ, వేరొకరి కవితలని ఎత్తుకొచ్చి తన బ్లాగులో పేస్ట్ చేయడం తానే తన వృత్తిని తానే కించపరచడం అవుతుందని ఆయనకు తట్టకపోవడం ఆశ్చర్యం
ఆన్ లైన్లో మోసాల౦టే టెక్నికల్ మోసలని చదివాను ఇవా!
1)ఇప్పటికీ ఆన్ లైన్లో మొఖాలు చూసి నమ్మే వాళ్ళున్నారా ! వాళ్ళఖర్మ.
2)అసలు ఎవరు ఎవర్ని బెదిరిస్తున్నారు. కవయిత్రిగారు ఏమైనా మితిమీరిన పదాలతోదూషి౦చారా (నాకు తెలియదు కదా!).ఐనా సదరు వ్యక్తి కేస్ పెదతాను అనట౦ చాలా తప్పు. అసలు ఆవిడ కవితలు వాడుకోవడ౦ తప్పుకదా.అసలు తప్పు మొదలెట్టి౦దెవరు? సర్దుబాటు చేసిన విధాన౦ బాలేదు. మేమేమి అన్నా౦ అని కాదు ఈ స౦ధర్బ౦లో మీ మనసు ఎలా చేయమని చెప్పి౦ది రామూ గారూ!
గూగుల్లో దేవులాడితే ఎన్నో ఆన్ లైన్ మోసాలు తెలుస్తాయి.వీటిని మి౦చినవి !
I totally agree with the comment by కొత్త పాళీ.
It would be honorable if you respond to his comment directly..
Oh, should be careful with bloggers, too.
Hello Sir
I have also followed a little bit of this blog-theft of poetry. In fact I have earlier saw the said reporter's blog and read a few poems with natural interest.
However, what is a little bit strange to me is that the said reporter claiming his giving credit to the original writers, whose words he lifted.
I don't remember any such credentials being given by that blogger to any other person.
After reading your post, I again tried to visit his blog. But now he is uttering "This blog is open to invited readers only".
As I forgot my gmail password, I am right now unable to enter into his blog.
But does not all this indicating the crime reporter's embarrassing
situation, if alleging him of malafide intention is too much?
Mee article lone aakhari rendu paragraphs lo konchem confusion anipinchindi. Last but first para lo satire vesaremo anukunnaa. Kani, last paragraph lo malli positive attitude lo rasinattu kanipinchindi. Okinta mitrutvam unnanduna sadaru plagiaristni meeru support chestunna feeling kaligindi.
Ika aa vivaadanni meeru mugunchadamuu odd ga anipinchindi.
Any way... too lazy aina nenu, naa blog lo naa sonta kavitalani pettalani anukuntuu eppati nuncho vayida vestunnanu. Ippudee episode to asalu aa pani cheyyadam manchida kada anna alochanalo paddanu. Hha Hha Hha.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి