Sunday, January 9, 2011

రాయబుద్ధి కాక...ఈ బీచు ఫోటో...(Sunday Special)

రాయడానికి చాలా ఉన్నాయి...కానీ...ఎందుకో రాయలేకపోయానీ ఆదివారం నాడు. ఆటలపోటీలకని పది రోజుల కిందట ఇండోర్ (మధ్యప్రదేశ్) వెళ్లిన భార్యా బిడ్డలపై బెంగ వల్లనో, ఉత్తరాదిన ఆలస్యంగా నడుస్తున్న రైళ్ళు వారికి కలిగించిన ఇబ్బంది వల్లనో...అక్షరాలు కదలడం లేదు. 
శ్రీకృష్ణ కమిటీ గందరగోళం, ఉస్మానియాలో ఉద్రిక్తత, మీడియా గొంతు నొక్కిన వైనం, టీవీ చానళ్ళ ఎడిటర్లు అంతా జమకావడం, కేంద్రం మనతో ఆడుకుంటున్న తీరు...వంటివి చాలా ఉన్నా...ఏమీ టైపు చేయబుద్ధి కాలేదు.

'ద సండే ఇండియన్' అనే పత్రికలో నేను రాసిన మొదటి కాలం (రామ్ బాణం) పై ఒక పోస్టు రాసాను కానీ...దాని తాలూకు పీ.డీ.ఎఫ్. అప్లోడ్ కాలేదు. రేపు దాని సంగతి చూద్దామని సరదాకు...ఇక్కడ ఒకాయన ఆ మధ్యన మయామీ బీచులో దిగిన ఫోటో పోస్ట్ చేస్తున్నాను. ఈ హీరో లేదా హీరో లా వున్న ఈయన్ను గుర్తుపడితే...ఆయన ఎందుకు అలా ఉరుకుతున్నాడో...ఒక మంచి ఫోటో వ్యాఖ్య రాసి పంపితే....ఖైరతాబాద్ చౌరస్తా దగ్గర ఇరానీ కఫే లో టీ, ఉస్మానియా బిస్కట్లు.....All the best

24 comments:

Chari Dingari said...

ఏ మహా భాగ్యానికి ఈ ఉరుకు,
ఆరోగ్యానికేనా ఈ పరుగు?

-- మరి నాకు బిర్యాని కావాలి, ఆ తర్వాత చాయ్

Indian Minerva said...

ఇది కొంపదీసి మీరే కాదుగదా :)

Pathoisms said...

ముసలాడికి దసరా పండగ..........

సుజాత వేల్పూరి said...

ఇంతకీ మీరు మయామీ ఎప్పుడు వెళ్లారండోయ్?

SHANKAR.S said...

ఏముంది ఆ వెనకున్న అమ్మాయిలు మిమ్మల్ని "అంకుల్" అనుంటారు. మీరు అక్కడినుంచి పరుగు అందుకున్నారు. :)
అయ్యబాబోయ్...సీరియస్ అవకండి సర్ మీరు చెప్పినదే చెప్పాను. ఇందులో ఫస్ట్ రెండు పేరాలు గుర్తొచ్చాయి అంతే !!!!!!
http://apmediakaburlu.blogspot.com/2010/12/sunday-special_26.html

VENKATA SUBA RAO KAVURI said...

నగ్నత్వం నగ్నంగా బయటపడింది
బట్టలు తొడుక్కున్న మనస్సు పరుగో పరుగో అంది

Unknown said...

కలర్స్ మద్య కొచ్చినప్పుడు కూడా కలర్ వేసుకోకపోతే ఎలా ?
అని గుర్తుకొచ్చి రామ్ బాణం లా దూసుకు పోతున్న యంగ్ అంకుల్

Sitaram said...

ఎవ్వరికీ....చాయ్..బిస్కట్స్ ప్రాప్తం లేవు. ప్చ్...
రాము

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

హాలీవుడ్ సినిమాల్లో హీరోలూ ఇలానే ఉంటార్లెండి.ఇంతే వయస్సు, బట్టతలా గట్రా. డోంట్ వర్రీ, హీరోలెక్కనే ఉన్నారు.

Pavani said...

I saw many bloggers here requesting media curbs. there is no reason to feel bad now. We got what we want. Avergae citizen in AP is pretty happy.

There is no confusion in the SKC report. Confusion is only there in the minds of who can't digest the truth.

Real problem in psuedo intelligentia of India is..we simply don't really respect or believe anybody or any institution unless it supports our views and interests.

That leaves no insentive for a person of integrity vis a vis a thug. In our mind both are same if they don't tow in our footsteps.
You are doing the right thing enjoying in beach. Best.

శరత్ కాలమ్ said...

ఫోటో తీసినవారెవరో కానీ పరుగెత్తుకు వస్తున్న రామసింహాన్ని(?!) ఫోటో తీసేరు కానీ ఆ వెనుకనే ఉరికివస్తున్న గ్రామసింహాన్ని ఫోటో తియ్యలేదు ఎందుకంట?

Sasidhar said...

కామెంట్స్ సంగతి తర్వాత...బీచ్ కెళ్ళినప్పుడు ఆ డ్రస్ కోడ్ ఏంటండి. వెనకాల పెద్దాయన్ను చూడండి..అర్థ నగ్నంగా ప్రకృతిని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో.. వెనకటికొకావిడ పొలంపనులకు పట్టుచీర కట్టుకెళ్ళిందిట.
(జస్ట్...జోకా..అంతే)

~శశిధర్ సంగరాజు.

www.sasidharsangaraju.blogspot.com

Malakpet Rowdy said...

"అబ్బా! పొద్దున్నే ఆ జ్యోతిబ్లాగులో వంట తినకపోయినా బాగుండేది. ఇప్పుడెంత పరిగెత్తినా restroom కనబడటంలేదు"

సుజాత వేల్పూరి said...

బ్లాగర్ల కవితా హృదయాన్ని బయట పెట్టించారన్నమాట మొత్తానికి. రవి గారికి,శరత్ గారికి బిస్కట్లు కొనిపెట్టొచ్చు! ఏమంటారు?

Prashant said...

He is the blogger..Mr.Ram.His gleaming bald head is his trade mark identity.
He is a quintessential media man who is running to explode breaking news...

Anonymous said...

@Pavani
It would be better respond after Ramu writes something, isn't it?
@"That leaves no insentive for a person of integrity vis a vis a thug. In our mind both are same if they don't tow in our footsteps."
I think this only shows ur unwarranted anxiety on what Ramu may write against the pseudo integrity w.r.t Samaikhyandhra.

Pavani said...

You have the right to say like that. I should have waited. Soryy...

శరత్ కాలమ్ said...

లేకపోతే పైన ప్రశాంత్ అన్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ బ్రద్దలు కొట్టడానికి పరుగెత్తుకువస్తున్నారు అనుకుంటాను.

Ramu S said...

Winners will be declared on next Sunday. For your information
Ramu

nareshnunna said...

అపరిచితోరువుల బోదెలపై నుంచి జారే తుంటరి ఈగ కావడానికి వీల్లేకుండా, ఈ దిక్కుమాలిన ఏకపత్నీవ్రతం మెడకు కట్టుకున్నానేమిటి భగవంతుడా........

Pavani said...

ఇప్పుడే ఆయనకి ఇంకో రెండు మిమిషాల్లో అక్కడొ పెద్ద సునామి రాబోతోందని తెల్సింది. మామూలు వాళ్ళైతే వెనక్కి తిరిగి అందర్నీ అలర్ట్ చేసేవారు. ఎంతైనా జర్నలిస్ట్ కదా TV9 వేపు పరిగెత్తుతున్నారు.

premade jayam said...

ఇంత కలర్ ఫుల్ గా ఉందని తెలీక ఎసి మోడ్ లో వచ్చా. వాళ్ళంతా వెళ్లి పోకముందే బొందుల లాగు తగిలించుకొని రావాలి.

ఓరుగల్లు పిల్లాడు said...

అమ్మాయిలు వెళ్ళి పొథునారు ....త్వరగ నేను కుడా చిన్న నిక్కరు వెసుకొని వస్థ అని పరుగెథున్నాడు కదా.....

NARNE INFOTECH said...

Good morning Ramu garu, nice postings

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి