'ఈనాడు' లో ఇవ్వాళ ఈ పక్కన ఉన్న కార్టూన్ ప్రచురితమయ్యింది. "కావ్...కావ్...నేను బడ్జెట్ తయారీకి వెళుతున్నా...రెండు రోజుల్లో తిరిగి వస్తాలే. బై బై.." అని ఒక కాకి... తొర్రలో ఉన్న ఇంకొక కాకితో అంటున్నది ఇక్కడ.
శ్రీధర్ గారు వేసే ఈ కార్టూన్ (పాకెట్ కార్టూన్ అంటారు) పైన ఒక లుక్ వేయకుండా ఉండడం తెలుగు రీడర్స్ కు చాలా కష్టం. పొద్దున్నే దీన్ని చూసి...'ఇందేంటిరా...కాకి బడ్జెట్ తయారీకి వెళతా అంటోది....మన మట్టి బుర్రకు ఇది అర్థం కాలేదేమోలే. తర్వాత తీరిగ్గా చూద్దాం...' అని వదిలేసాను. ఆఫీసుకు వచ్చాక ఒక 'ఈనాడు' సోదరుడు ఫోన్ చేసి...కోపంగా 'కార్టూన్ చూసావా?' అని అడిగితే...మరొక లుక్ వేస్తేగానీ అర్థం కాలేదు....'కాకిలెక్కలు' అనే సామెత ఆధారంగా శ్రీధర్ ఆ కార్టూన్ వేసారని. అంటే...బడ్జెట్ లెక్కలు కాకి లెక్కల్లా వుంటాయనే అర్థంలో ...సింబాలిక్ గా ఆ కార్టూన్ వేసి ఉంటారు ఆయన.
'కాకిలెక్కలు' అనే సామెతకు అసలు అర్థం గురువు గారు బూదరాజు గారు ఒకసారి చెప్పిన విషయాన్ని మన సోదరుడు గుర్తుచేసాడు. కాకులు ఒక చోట గుంపుగా వాలాయనుకోండి. వాటిని లెక్కించమని ఎవరైనా చెబితే...మనం ఆ పనిచేయలేము. ఎందుకంటే...కాకులు ఒకేచోట ఉండకుండా....అటూ ఇటూ పోతుంటాయి. ఇలా లెక్కతేలని వ్యవహారాన్ని చెప్పుకోడానికి పుట్టుకొచ్చిందట ఆ సామెత. 'తప్పుడు లెక్కలకు' కాకి లెక్కలు అనే అర్థంలో మనం వాడుతున్నాం. ఈ విషయం తెలీకుండా కార్టూన్ వేసే కార్టూనిస్టు కాదు...శ్రీధర్ గారు.
(Cartoon courtesy: Eenadu Telugu Daily)
(Cartoon courtesy: Eenadu Telugu Daily)
8 comments:
మీరు అన్నాది నిజమె కాని నాకు ఒక సందేహం
శ్రీధరు గారి అభిమతం అది కాదేమొ.
అయన అభిమతం నా ఉద్దెశం లొ లెక్కలు రాని వాళ్ళు వెళ్ళి మన Budget Decide చేస్తున్నారు అని..
అయినా కాకిలెక్కలు అంటె కాకిలను లెక్కపెట్టడం అని బూదరాజు నిరూపించారా ?
నాకూ ఈ కార్టూను చూసిన వెంటనే వెలగలేదు. తర్వాత రెండో కాఫీ తీగుతూ తీరిగ్గా పేపరు చూస్తుంటే అప్పుడు తట్టింది "కాకి లెక్కలు" ఆధారంగా ఈ కార్టూను వేశారని.
కానీ ఇది అర్థం కాని వారు కూడా ఎక్కువమందే ఉంటారని అనుకుంటున్నా నేను
naa matti burraku kuda ardamavaledu.. :( ee post chusaka ardamaindi :)
Good one.
That is Sridhar:)
Thanx for Explaining...i tried to understand...but didnt get.
----------------
మరొక లుక్ వేస్తేగానీ అర్థం కాలేదు....'కాకిలెక్కలు' అనే సామెత ఆధారంగా శ్రీధర్ ఆ కార్టూన్ వేసారని. అంటే...బడ్జెట్ లెక్కలు కాకి లెక్కల్లా
---------------------
ఎట్టకేలకు అలా కనుగోన్నారన్నమాట . అభినందనలు
I could 'read' it immediately.
కాకిలెక్కలుకు అర్ధ౦ తప్పులతడిక/మోసపూరిత
లెక్కలు అనుకొన్నది నిజమే అన్నమాట! కాకపోతే ఎలా వచ్చి౦దోతెలియదు,Thanks . 2003 టై౦లో సూళ్ళూరుపేట రైల్వేష్టేషన్లో ప్లాట్ ఫా౦పై కాకులను చూసి అది ఫోటోతీసి రైల్వేబడ్జెట్ టై౦లో వేస్తే బాగు౦టు౦దనుకొన్నాను(నాకు గీత రాదు మరి !)ఆ కోర్కెను మా(మన) శ్రీధర్ గారు తీర్చారు.
కొ:మీకు వె౦టనే స్పురి౦చకపోవడ౦ హాస్చర్యమే!
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి