'ది హిందూ' ఆంగ్ల దినపత్రిక విజయవాడ బ్యూరో చీఫ్ గా సీనియర్ జర్నలిస్టు, ఆ పత్రికలో ఇప్పటికే అసిస్టెంట్ ఎడిటర్ గా ఉన్న సుసర్ల రమేష్ నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ బ్యూరో చీఫ్ గా ఉన్న కె.శ్రీమాలికి అమెరికన్ కాన్సులేట్ లో ఉన్నత పదవిలో చేరడంతో ఆ పోస్టు ఖాళీ అయ్యింది.
ఈ మధ్య కాలం వరకూ గుంటూరులో పనిచేసిన రమేష్ గారు ఇటీవలనే విశాఖపట్నం బదిలీ అయ్యారు. ఆయన మార్చ్ 24 న ఆ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. "ఫ్రెండ్స్ టు సపోర్ట్" అనే సంస్థ నిర్వహించిన రక్త సేకరణ, రక్తదాతల సమాచార సేకరణలో సుసర్ల రమేష్ కీలక భూమిక పోషించారు.
మాజీ బ్యూరో చీఫ్ శ్రీమాలి సొంత అన్నయ్య చక్రపాణి HM-TV లో అసిస్టెంట్ ఎడిటర్ కాగా, సుసర్ల రమేష్ కజిన్ సుసర్ల నగేష్ కుమార్ 'ది హిందూ' ఆంధ్ర ప్రదేశ్ బ్యూరో చీఫ్ గా సేవలు అందిస్తున్నారు. ఈ సంబంధాలతో సంబంధంలేకుండా...అటు శ్రీమాలి, ఇటు రమేష్ ఎంతో కష్టపడి జర్నలిజం లో కెరీర్ ఏర్పరుచుకున్నారు. శ్రీమాలి 'టైమ్స్ అఫ్ ఇండియా' నుంచి, రమేష్ 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' నుంచి 'ది హిందూ' లో చేరి ఉన్నత పదవులను అందుకున్నారు. ఈ పై ఫోటోలో ఉన్నది సుసర్ల రమేష్ గారు...అయన ఒక సెమినార్ లో పాల్గొన్నప్పటి దృశ్యం.
అంతకుముందు అదే గుంటూరులో పనిచేసిన సాయ శేఖర్ గారు కూడా ఆనతికాలంలోనే విజయవాడ బ్యూరో చీఫ్ గా పదోన్నతి పొందారు.
అంతకుముందు అదే గుంటూరులో పనిచేసిన సాయ శేఖర్ గారు కూడా ఆనతికాలంలోనే విజయవాడ బ్యూరో చీఫ్ గా పదోన్నతి పొందారు.
2 comments:
మాజీ బ్యూరో చీఫ్ శ్రీమాలి సొంత అన్నయ్య చక్రపాణి HM-TV లో అసిస్టెంట్ ఎడిటర్ కాగా, సుసర్ల రమేష్ కజిన్ సుసర్ల నగేష్ కుమార్ 'ది హిందూ' ఆంధ్ర ప్రదేశ్ బ్యూరో చీఫ్ గా సేవలు అందిస్తున్నారు. ఈ సంబంధాలతో సంబంధంలేకుండా...
మరలాంటప్పుడు ఈ సమాచారం ఎందుకిచ్చినట్టు మీరు?
రమేష్ బదిలీ విజయవాడ హిందూ ఎడిషన్ కు ఎంతవరకూ లాభమోకానీ,వైజాగ్ ఎడిషన్ కు మాత్రం నష్టమే.
సుసర్ల రమేష్ గారికి అభినందనలు.
_ సత్యాజీ, ప్రజాశక్తి.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి