Wednesday, March 23, 2011

కారులో సరస సల్లాప కార్యక్రమాలు: పాపం పిల్లలు

ఒక వయసు వచ్చిన ప్రేమికులకు భంగం కలిగించడం పాపమే అయితే...నేనీ ఉదయాన్నే ఆ పాపం మూట కట్టుకున్నాను. సొంత టేబుల్ టెన్నిస్ అకాడమీ కోసం దొరికిన మూడు ప్రాంతాలలో ఒకటైన నవీన్ నగర్ కు ఆ పక్కనే ఉన్న ఆనంద్ నగర్ నుంచి రెండు నెల్ల కిందట మారిన సంగతి మీకు తెలిసిందే. ఈ ఇంటి దగ్గర ఒక చిక్కు వచ్చిపడింది. మా ఇంటికి దగ్గరలో ఆరిందం చౌదరి గారి ఐ.ఐ.పీ.ఎం. ఉంటుంది. ఇక్కడ చదువుకునేది డింగ్ డాంగ్ జీన్స్ జనరేషన్. పిల్లలు ముట్టుకుంటే మాసిపోయేట్లు  ఉంటారు. 

వారి ధైర్యంగా...ఆత్మవిశ్వాసంతో...తోటి మగ విద్యార్థులతో కలివిడిగా మాట్లాడుతూ....మా ఇంటిపక్కన వున్న బండి దగ్గర జూసు తాగుతుంటే....ముచ్చటేస్తుంది. వారి ఇంగ్లిష్ భాష అద్భుతంగా ఉంటుంది. వీరిని చూస్తే....భారత్ భవిత మీద అవిశ్వాసం చప్పున పోతుంది. మా వీధిలో జనం ఆ పిల్లల వంక...అదోలా చూస్తూ కాలక్షేపం చేస్తారని నాకు అర్థమయ్యింది.  

వారిలో చాలా మంది ఖరీదైన కార్లలో కాలేజికి వస్తారు. వాళ్ళ కాలేజ్ రోడ్డు మీద ఉంటుంది కాబట్టి...దర్జాగా వాటిని తెచ్చి మా ఇంటి ముందో...పక్కనో పెడతారు. చాలా సార్లు కార్లోనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. వారి అద్దాలకు నల్లటి ఫిలిం అతికించి ఉంటుంది కాబట్టి...అందులో వారేమి చేస్తారో నర మానవుడికి తెలియదు. ఈ షోకుల పిల్లలు...బాయ్ ఫ్రెండ్స్ తో వారి చనువు...చూస్తుంటే....అప్పుడప్పుడు భయమేస్తుంది కూడా. వాళ్ళ బాధ వాళ్ళు పడితే నాకేమీ ప్రాబ్లం లేదు. వారు కారులో చేసుకునే ఎవ్వారాలు మొదటి అంతస్తులో ఉన్న మాకు కళ్ళకు కట్టినట్లు కలిపిస్తాయి. మనం చూస్తే...పర్వాలేదు...ఇంట్లో పిల్లలు చూడరాని ఎవ్వారాలు చూస్తే కొంప మున్గుతుందని నా భయం. 

డు తరగతిలో ఒక చోట ఇలా చూడకూడని ఎవ్వారం చూసి నేను చాలా రోజులు కంపు కంపు అయిన విషయం గుర్తుకువస్తూ ఉంటుంది. అది చూశాక ఘోరాతి ఘోరంగా ఆడ పిల్లలను చూసే దృక్కోణంలో నాకే తేడా కనిపించి చాలా ఇబ్బంది పడ్డాను. దుర్భావాలు కలగకుండా ఉండేలా ఉండడానికి చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. ఈ కార్లలో సరస సల్లాప కార్యక్రమాలు పిల్లల కంట పడకుండా ఉండడానికి ఏమి చేయాలో నాకు బోధపడడం లేదు.
సరే....ఈ రోజు ఏదో బాంకు పని మీద వెళ్లి వచ్చాను. ఆ కార్లో వాళ్ళు కిస్సులు ఇచ్చుకుంటున్నారు...అని ఇంట్లో నుంచి ఫిర్యాదు వచ్చింది. నేను...కాస్త కళ్ళు చిట్లించి చూద్దును కదా...
కొంపలారి పోతున్నాయి. 

ఒక చూడచక్కని టీనేజ్ అమ్మాయి...డ్రైవర్ సీట్లో ఉన్న ఒక అబ్బాయి యమ తమకంతో చుబనాది కార్యక్రమాలు సాగిస్తున్నారు. ఆ కారు అద్దాల ఫిలిం ట్రాన్స్పరెంట్ గా ఉండడంతో అందులో లీలా విలాసాలు చక్కగా కనిపిస్తున్నాయి. ఇలాంటి విషయాలు ఎలా డీల్ చేయడం చెప్మా? అన్న సందేహం కలిగింది. 

పిల్లలను బైటికి రావద్దని చెప్పి....మనసు చెప్పిన ప్రకారం...వడివడిగా మెట్లు దిగి...కారు దగ్గరకు వెళ్లాను. దగ్గరకి వెళ్ళిన విషయం కాస్త ఆలస్యంగా గమనించిన మగ ధీరుడు....'ఏంటి...బే' అన్నట్లు తల ఊపాడు. డోర్ తియ్యమన్నట్లు నేను సైగ చేశాను. వాడు...సరే అంటూ....కారు రివర్స్ చేసుకుని....యమ స్పీడుగా అక్కడి నుంచి వెళ్లి పోయాడు. నాకు బాధేసింది.
'బాబూ...ఇలా చేయకు....' అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. 'బాబూ...ఇక్కడ ఇలా చేయకు...' అని మాత్రమే చెబుదామని అనుకున్నాను. 

లేకపోతే....నాయనా....కాస్త...మందపాటి ఫిలిం పెట్టించుకోవచ్చు కదా...అని సలహా ఇద్దామనుకున్నాను. పాపం..వాళ్ళిద్దరూ నన్ను దుర్మార్గుడిగా అనుకుని....తిట్టుకుని ఉంటారన్న అపరాధభావం తో దీని గురించే ఆలోచిస్తూ యూనివెర్సిటీకి వచ్చాను. నేను పాఠం చెబుతుంటే...చెప్పా పెట్టకుండా బైటికి వెళ్లి ఇకిలిస్తూ వచ్చిన ఒక  అమ్మాయి....కేరళ అబ్బాయిని చూసి...ఈ మన్మధుడ్ని మనమేమి కంట్రోల్ చేస్తాం అనిపించింది.

10 comments:

katta jayaprakash said...

Thank God you were not assaulted by the boy for diturbing the love(?sexy) birds.Even in some cases the boys just resort to firing with a pistol.Such secenes are routine in metropols as our culture is getting transformed into hybrid culture due to various social factors.This story is just warning to parents not to get their children admitted into the school.

JP.

Ramu S said...

JP sir
I am not sure whether the love birds study in IIPM.
ramu

Prashant said...

GOD...I think you are having a feast everyday....

Naagarikuda Vinu said...

రాము గారు ఇలాంటి చపలమైన వీడియోస్ కోసం పడి చచ్చే ఒక పనికిమాలిన నిరంతర బూతు స్రవంతి news channel ఉన్నది కదా . వోళ్ళని పిలిచి చెప్పుండ్రి వీడియో తీసి పది రోజులు telecast చేస్తరు, మళ్ళీ చూడండి break తర్వాత, మళ్ళీ చూడండి break తర్వాత.

DesiApps said...

I'm not sure what scenes you have seen but just public kissing is not at all a crime or some thing else. Even its not illegal according to law
http://timesofindia.indiatimes.com/city/delhi/Kissing-in-public-by-married-couple-not-obscene-HC/articleshow/4066941.cms..


In us you can kiss in public but not piss, in India you can piss but not kiss.. which do you think is more disgusting..

Vinay Datta said...

You did the right thing. The boy and girl are old enough to understand what you exactly meant.

What Naagarikuda vinu said is also right.

madhuri.

Unknown said...

When did you become a Moral Police Mr Ramu. I suggest you Organize a "Vice" squad along with some RSS goons and conduct Regular Patrols along the Streets. Many of Us Indians are Unmindful of exposed Genitals of people Shitting and Pissing on our streets, But You have some SICK Fantasies about Young couples "actions" done in the Privacy of their own Cars

phani said...

sir, meeru konthavaraku adrushtavanthule... durgam cheruvu pakkano.......anthavaraku anduku city madhyalo vunna indira park pakkano leru kaabatti devudiki gattigaa oka dandam pettukovaali.........domal guda lo vunnappudu nenu morng jogging ki vellevadni...xct gaa 8 gantalaki class ki vachinattuga vachevallu pichi premikulu......chetilo books .....jaali padevanni..andulo avaru avarni prema perutho mugguloki dinchinaa ,.sex kosam prema perutho musugesukovadamenduko naakippatiki ardham kaadu....anto verri janalu.....

Crime Reporters Association said...

పనికిమాలిన ఛానెల్ అనుకుంటూ చూడడం ఎందుకండి? పైగా తిట్టుకుంటూనే ఎక్కువగా దాన్నే చూస్తారు. నిజం చెబితే నిష్టూరంగానే ఉంటుంది కదా. అలాగే జరిగుతున్నది జరుగుతున్నట్టు చూపించినా.. నిష్టూరంగానే ఉంటుంది.

మీ ఉద్దేశం ప్రకారం ఛానెల్లలో చూపించినందుకే ఇలాంటివి జరుగుతున్నాయనా..? లేక చూపిస్తే విపరీత ధోరణులు తగ్గుతాయనా?

నాగరికా..! ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నాగరికత ఏర్పడినప్పటి (మనిషి సంఘజీవిగా మారినప్పటి నుంచి, మారకముందు) నుంచి సమాజంలో మంచి, చెడూ రెండూ ఉన్నాయి. అవెప్పుడూ ఉంటాయి. చెడు లేకపోతే మంచి విలువేంటో ఎవరికీ తేలీదు.

సో..! బూతు స్రవంతి అని తిట్టుకుంటూ ఆ ఛానెల్ ను చూడడం ఎందుకు? ఇలా సెటైర్లు వేయడం ఎందుకు? ఏదైనా అర్థవంతమైన చర్చ చేస్తే బావుంటుంది.

CH.DURGA PRASAD said...

రాము గారికి నమస్తే,

నిన్ననో మొన్ననో సరిగా గుర్తులేదుకాని నిరంతర వార్తా స్రవంతి ఒ వార్త ప్రసారం చేసింది. ఓ మహిళ తో అక్రమ సంబంధం కలిగిన ఒ కుర్రాడు అవిడ కూతుర్ని పెళ్ళి చేసుకున్న వైనం .ట్విష్ట్ ఎంటంటే ఆ మహాతల్లి ఇప్పుడు తనకు న్యాయం చేయమని ఈ చానల్ ను కోరడం.తను మేడ ఎక్కే దాకా ఆగి, గెంతేసె దాకా సీన్ తీసుకెల్లి , అప్పుడు సదరు చానల్ వారు, ఇంకా చుట్టు ఉన్నవారు అమెను ఆపడం . నాకు అర్దం కానిది ఇప్పుడు ఆ కుర్రాడు ఎవర్ని? ఎలా? న్యాయం చేస్తాడు.బహుశా ఓ మసాలా వార్త ప్రసారం కోసం ఇలాంటి బోడి సీన్లు వీళ్ళె క్రీయెట్ చేస్తున్నారేమో!


దుర్గాప్రసాద్.సి.హెచ్

శ్రీకాకుళం

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి