తెలుగు నేల మీద పెను సంచలనం సృష్టిస్తున్న TV-9 లో ఒక అజ్ఞాత లేఖ సంచలనానికి కారణమయినట్లు తెలుస్తున్నది. "టీ వీ 9 సిఈఓ రవిబాబుకి బహిరంగ లేఖ" అన్న శీర్షికతో ఉన్న ఆ లేఖను ఆ అజ్ఞాత రచయిత నాకు కూడా పోస్టు చేసారు. అందుకు ఆయన/ఆమెకు కృతజ్ఞత తెలియజేయకుండా ఉండలేను. "కామ్రేడ్ రవిబాబు అలియాస్ రవిప్రకాష్ కి...." అన్న సంబోధనతో అది ఆరంభమయ్యింది. ఆ చానెల్ లో పనిచేస్తున్నా...తన ఎదుట పడి వాదించే ఓపికలేక ఇలా లేఖ రాస్తున్నట్లు రచయిత స్పష్టంచేసారు. కొందరు వ్యక్తుల గురించి ఉన్నందున...ఆ లేఖను యథాతథంగా ఇవ్వలేకపోతున్నప్పటికీ....అందుకో విషయాలు మీకు తెలియజేస్తాను.
సతీష్ బాబు...అనే జర్నలిస్టును జర్నలిస్టు డైరీ కోసం రవి తీసుకోవడం లేఖకుడికి ఏమాత్రం నచ్చలేదు. అరుణ్ సాగర్ ను 'టార్గెట్' చేసుకుని అవినీతిపరుడైన సతీష్ బాబు ను సంస్థలో చేర్చుకున్నట్లు ఆరోపించారు. సతీష్ బాబు చరిత్రను ఈ లేఖలో ఆవిష్కరించారు. డబ్బు వసూళ్లు, లైంగిక వేధింపులు వంటి విషయాలు రాసారు. రవి డ్రీం టీం ను ప్రస్తావిస్తూ కరీం, ఆలపాటి సురేష్, ఆకుల దినేష్, శ్రీనివాస రెడ్డి, శశాంక మోహన్, జాఫర్ ల గురించి ఆరోపణలు చేసారు. మురళి (ప్రస్తుతం సాక్షి), సాయి (జెమిని) ఎందుకు ఈ చానెల్ నుంచి వెళ్లి పోయారని ప్రశ్నించారు. "మన సంస్థ నుంచి మంచి వాళ్ళు వెళ్లి పోయారు" అని బాధపడుతూ లేఖకుడు ఒక జాబితా ఇచ్చారు.
అరుణ్ సాగర్ ను వెళ్ళగొట్టడానికి రవి రెండు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నట్లు రాసుకొచ్చారు. సాగర్ వెళ్లిపోతాడని....రవి మనుషులే ప్రతి నెలా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎంతమంది సతీష్ బాబులు వచ్చినా...సాగర్ కు సాటి రారని స్పష్టంచేసారు.
సతీష్ బాబు ను ఈ లేఖలో ఎక్కడా అలా రాయకుండా...'చతీచ్ బాబు' అని రాయడాన్ని బట్టిచూస్తే...గతంలో రవి ఛానల్ లో పనిచేసి ఇప్పుడే చెన్నై వాళ్ళ చానెల్ ఒక దాంట్లో పనిచేస్తున్న ఒక మాజీ "ఈనాడు" సీనియర్ జర్నలిస్టు హస్తం ఈ లేఖ వెనుక వున్నదని నాకు ఎందుకో అనిపించింది. నా అభిప్రాయం తప్పయినా కావచ్చు.
"ఒక ఆదర్శవాది అవినీతిపరుడిగా మారితే అరాచకం ఏ స్థాయిలో వుంటుందో అర్థమవుతోంది. ఇకనైనా..మెరుగైన మనిషిగా మారి మెరుగైన సమాజమన్న నీ పగటి కల సాధ్యం చేసుకుంటావన్న ఆశతో....పేరు కూడా ధైర్యంగా రాయలేని...ఇన్ సైడర్..." తో లేఖ ముగిసింది.
చివర్లో ఒక గమనిక ఇలా వుంది. "రవిబాబు మారాలన్న ఆశతో మాత్రమే ఈ లేఖ"
ఈ లేఖ ప్రతులు ఆ చానెల్ లోని పలువురు జర్నలిస్టులకు అందాయని ఒక మిత్రుడు చెప్పాడు. మొత్తంమీద...ఈ లేఖ రవి కో, అరుణ్ సాగర్ కో ఉపకరిస్తే మంచిదే. నిజంగానే....ఉద్యోగానికి వచ్చే ఆడ పిల్లలను ఉద్యోగం, హోదా అడ్డం పెట్టుకుని శారీరక సుఖం అనుభవించే గజ్జి కుక్కలకు దరిచేరనివ్వడం రవి కే కాదు...ఎవ్వరికైనా...తగనిపని.
9 comments:
This is not the first and last time to receive such letters against the MDs of electronic media.TV reporting TV channel re the most proftable business areas.One can earn and enjoy life with glamouroous environment if he is not sincere and duty oriented.
JP.
మొత్తానికి సమాజంలోని అవతవకలకు ప్రతిబింబాలు మీ మీడియా చానెల్స్ కూడ..అని నిరూపిస్తున్నారు. నిజమే కదా..?? సమాజాన్ని బట్టే రాజకీయనాయకులు..మీడియా ఉంటుంది...! మీడియా అనగానే ఏమి పైనుండి ఊడిపడలేదు కదా..? మీడియా అయినా, రాజకీయనాయకులైనా.. సమాజం అయినా మనుషులే కదా..!! ఎక్కడికి పోతాయి మానవ సహజ లక్షణాలు..!!
రాము గారు,
స్టింగ్ ఆపరేషన్ల పేరుమీద వ్యక్తుల పర్సనల్ లైఫ్ తో ఆటలుఆడుకునే ఛానల్ సీఈఓ కి అందులోనే పనిచేసే/చేసిన వ్యక్తి లేఖ రాస్తే దాన్ని వున్నది వున్నట్లు చదివే అర్హత సామాన్య ప్రజానీకానికి లేదని మీరు అనుకుంటున్నారా? లేఖ రాసిన వ్యక్తే బహిరంగంగా ప్రచురించవద్దని request చేస్తే, its OK.
యజ్ఞ గారూ...
వ్యక్తుల మీద ఇష్టం వచ్చిన ఆరోపణలతో ఎవరో అజ్జ్ఞాత వ్యక్తి లేఖ రాస్తే దాన్ని యథాతథంగా ప్రచురించడం అనైతికం. ఆ ఆరోపణలు నేను దృవపరచలేను కాబట్టి...ఈ జాగ్రత్త తీసుకున్నాను.
రాము
ram garu.. off topic... raj news lo flavour marindenti ee madhya? I mean basha/yasa...
ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుపోవడం తమహక్కుగా భావిస్తూ, ఎవరిమీదైనా సరే, ఆధారాలున్నాలేకున్నా, జస్ట్ అదుగో తోక అంటే చాలు అక్కడ వాలిపోయి జనాల జీవితాలతో ఆడుకుంటున్నారు కదా సార్ వీళ్ళు. మరి వాళ్ళు చల్లేది బురదే కదా.... నేరుగా ప్రశ్నించే అవకాశం లేకనే కదా వాళ్ళలా చేస్తున్నా మేమేం చెయ్యలేక పోతున్నాం. ఆ వ్యవస్థలో ఒకవ్యక్తి తనకు తెలిసిన విషయాలు వ్రాస్తే, quote చేస్తూ మీ అభిప్రాయాలు కాదు అని ప్రచురించండి. మీరేమీ వార్త లాగా రెపోర్ట్ చెయ్యట్లేదు కదా.
ramu anna..
u r doing a good job.. keep it up
amar nellore
బాబాపై మీరు రాసిన విషయాలు నూటికి నూరుపాళ్లు వాస్తవం.....
www.guppedumanasu.blogspot.com
merugaina media samajam sadhyama ramu garu
sriraam
Zee
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి