Thursday, May 26, 2011

"సాక్షి" అన్నయ్య ప్రియదర్శని రామ్ కు షాక్


ఏడబోతవ్...రాజన్నా...నువ్వు లేరంటారేమిటి రాజన్నా...అంటూ నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి కి నివాళులు అర్పిస్తూ...తన కామెంటరీతో ఇన్నాళ్లూ నిజంగానే జనాలను ఏడిపించిన రామ్ (రెడ్డి) మనకిక సాక్షిలో కనిపించే, వినిపించే అవకాశం లేదు. వై.ఎస్.ఆర్.
 ముందుచూపుతో నిర్మించిన మీడియా సామ్రాజ్యానికి దాదాపుగా అధినేతగా చెలామణి అవుతున్న"సాక్షి" సీ.ఈ.ఓ. ప్రియదర్శని రామ్ పై వేటు పడింది. పూర్తిగా తన చలవ వల్లనే "సాక్షి" ఇంతలా ఎదిగిందని, ఇటీవలి ఉప ఎన్నికలలో జగన్ భారీ మెజారిటీ కూడా తన ప్లానింగ్ మహిమేనని రామ్ భయంకరంగా కలర్ ఇవ్వడం జగన్ కుటుంబానికి, ముఖ్యంగా ఆయన భార్య భారతికి, నచ్చలేదని సమాచారం. రామ్ సోదరుడిగా భావిస్తున్న ఒక వ్యక్తి నడుపుతున్న పోర్టల్ లో రామ్ ను ఆకాశానికి ఎత్తడం, అందులో ఈ మధ్యన "Image Maker Ram Transformed Jagan Into Biggest Ever Mass Leader of Andhra" అనే శీర్షికతో వచ్చిన పెద్ద వ్యాసం సమస్యకు కారణమని చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాల్సి వుంది. 

'సలాం సాక్షి' వంటి ప్రోగ్రాంలతో ఛానల్ లో, 'లవ్ డాక్టర్' వంటి కాలంతో సాక్షి పేపర్లో రామ్ పేరు తెచ్చుకున్నారు. నాకైతే లవ్ డాక్టర్ కాలమ్, నీలాంబరి, అరటిపండు...పరమ వెగటు కలిగిస్తాయి. ఆరు పదులు దగ్గరపడుతున్నా....క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తూ ఒంటిని, మీసాలను ప్రత్యేక శ్రద్ధతో పెంచిపోషిస్తున్న రామ్ గతంలో ప్రియదర్శిని పేరిట advt కంపెనీ నడిపారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు దగ్గర ఉన్న తన ఆఫీసులో దాదాపు ఒక పదిహేడేళ్ల కిందట నేను ఆయన్ను కలిశాను. ఆయన ఆలోచనల వేగానికి, చొరవకు, ఎనర్జీకి నేను ఆశ్చర్యపడ్డాను.
అప్పుడు తెలుగుదేశంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. కొన్ని సినిమాలలో నటించిన రామ్ అన్నయ్య మీడియాలో అనుభవం లేకపోయినా అనతికాలంలోనే సాక్షిలో వినుతికి ఎక్కారు. ఆయన ఆధ్వర్యంలో వస్తున్న ఫ్యామిలీ పేజీ లో నూతనత్వం కనిపిస్తుంది. ఆఫీసులో కనిపించిన ప్రతివాడినీ అన్నయ్యా....అంటూనే నోటికి వచ్చింది మాట్లాడి జర్నలిస్టులను రాం ఇబ్బంది పెట్టేవాడన్న అభియోగం వుంది.వటవృక్షంలా ఎదిగిన మీడియాలో రామ్ కు చోటు దొరకటం కష్టం కానేకాదు. ఎవరైనా రెడ్డిరాజు ముందుకొచ్చి రామ్ కు అవకాశం ఇస్తే...దున్నేసే దమ్మున్న వాడు తను. కంచుకంఠంతో, కొంగొత్త ఐడియాలతో దూసుకుపోయే రామ్ కు మేలు జరగాలని ఆశిద్దాం.

"అవును...రామ్ పైన  వేటు పడింది. ఆయన సేవలను పార్టీకి వాడుకోవాలని జగన్ భావిస్తున్నారు," అని ఆ శిబిరానికి చెందిన ఒక బాధ్యుడైన వ్యక్తి ఈ బ్లాగరుకు చెప్పారు. వివాదాస్పదమైన ఆ వ్యాసం లో చివరి పేరా ఇలావుంది.

Finish Line
If anyone wants to defeat the most adverse circumstances to emerge as the "Mass Leader" then there is ONLY One method:
Say Hello to the World's Greatest "Mass-Leader" Maker, Pryadarshini Ram.

You my read the full story at:

15 comments:

ప్రేమిక said...

raam annaya cinemalu kuda chesadanukunta.. annaya gonthu matram keka.. sakshi... ee stage lo undante karanam raam /...

Thirmal Reddy said...

Sirjee,

The link you published at the end of the post is not a valid URL but a path to the local drive of the computer used by that blogger, Mr.Sidhartha. You might want to remove that from the post. Below is the correct link to the article he has published which is said to be the reason behind Ram's expulsion.

http://politicsparty.com/MASS_LEADER_MAKER.php

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Bhamidipati, said...

Below is the link
http://www.politicsparty.com/MASS_LEADER_MAKER.php

GuppeduManasu said...

డియర్ రాం గారు..
ప్రియదర్శిని రామ్ గారిని సాక్షి నుంచి పంపారో.. లేక తనకు తానే వెళ్ళారో.. అనే విషయంపై వ్యక్తిగతంగా పెద్దగా ఆసక్తి లేదుగానీ.. సుమారు రెండున్నర ఏళ్ళపాటు ఆయన దగ్గర (ఫ్యామిలీలో స్టేట్‌బ్యూరో సీనియర్ రిపోర్టర్‌గా) పనిచేసిన అనుభవంతో చెప్తున్నా.. మీరన్నట్టు కనిపించిన ప్రతి ఒక్కరినీ అన్నయ్య అనడం మాత్రం నిజమే.. కానీ జర్నలిస్టులను నోటికొచ్చినట్లు మాట్లాడే స్వభావం అయితే ఆయనకు లేదని నేను చెప్పగలను. రెండున్నర ఏళ్ళపాటు ప్రతిరోజూ.. కొన్నిగంటల పాటు ఆయన్ని దగ్గర నుంచి చూసినవాడ్ని అలాంటి వ్యక్తికాదు. అన్నిటికంటే ముఖ్యంగా వాడి గురించి వీడి గురించి లేని పోని సొల్లు కబుర్లు చెప్పుకునేంత తీరుబడి లేకుండా ఆయన గడిపేవారు.. గడుపుతున్నారు కూడా. సాక్షి‌ని పాఠకలోకానికి దగ్గర చేయడానికి రాత్రి మూడుగంటలకే ప్రతి పాయింట్‌కు వెళ్లి హాకర్స్ సప్లై సజావుగా ఉందో లేదో అని చెక్ చేసేవారు. అటు ఛానల్‌ ఇటు ఫ్యామిలీలోని సినిమా, ఫీచర్స్, ఫండే అన్నిటిపైనా క్షణం తీరిక లేకుండా ఆయన శ్రద్ధపెట్టేవారు.
నేనైతే సాక్షిలో మానేసి వచ్చినవాడ్నే. అయినా ఆయన గురించి తక్కువుగా చెప్పాల్సిన పరిస్థితులు లేవు. రూమర్స్ ఏవైనా ఉన్నా.. అవి ప్రతి ఆర్గనైజేషన్లో డిప్లమోటిక్ వ్యక్తులుగా చెలామణి అవుతున్న ప్రతి వ్యక్తుల మీద ఉన్నాయ్. కొంతమందిపై ఉన్న రూమర్స్‌కి సాక్ష్యాలుు కూడా ఉన్నాయ్. కానీ రాంగారి విషయంలో వేలెత్తి చూపించే తప్పులు ఎవ్వరూ చూసిన దాఖలాలు లేవు... సంచలనాలకు మారుపేరుగా నిలిచిన సాక్షిని ఆ స్థాయికి రావడానికి కారణమయిన వాళ్ళలో ప్రియదర్శిని రామ్ కూడా ఒకరు... ఎవరు కాదన్నా అవునన్నా..హి ఈజీయే క్రియేటర్... జర్నలిస్టులుగా చెలామణి అయ్యే చాలామందికంటే మానవతావాది..
ధాంక్యూ...
మీ గంగాధర్

Srinivas said...

అవును ఆ కాలం చెత్తగా ఉంటుంది. ఈ వయసులోనూ తన శరీర దారుఢ్యాన్ని కాపాడుకుంటున్నందుకు మాత్రం మెచ్చుకోవాలి.
రాజుల కొలువుమీద ఏదో పద్యం ఉంది - అది గుర్తుంచుకుని మెలగాలి పెద్దవాళ్ల వద్ద పనిచేసేప్పుడు.

srikanth said...

annayya (ram style lo) aa portal perento cheputara konchem?

Sasidhar said...

Ram garu,

The link is not working. I think, you gave the path from your computer desktop. Please post valid URL.

Thanks
Sasidhar Sangaraju
www.sasidharsangaraju.blogspot.com

Praveen Thota said...

అన్నయ్యా నువ్విచ్చిన లింక్ తగలట్లా:)
అన్నట్లు బుర్రలేని నియంత దగ్గర బుర్రున్న మేధావి పనిచేయలేడని మీకూ గతంలో అనుభవమయ్యిందిగా?

Anonymous said...

అన్నయ్యా నువ్విచ్చిన లింక్ తగలట్లా:)
అన్నట్లు బుర్రలేని నియంత దగ్గర బుర్రున్న మేధావి పనిచేయలేడని మీకూ గతంలో అనుభవమయ్యిందిగా?

Prashant said...

Ram seems to have taken a big bite than he can chew,forcing the management to pull the plug.Well,I confer due credit to Ram for his dedication to the newspaper,is it not the money power of the promoter which has made the publication sustainable even though running under deep losses..?First of all,projecting a news paper in all colour pages is simply not a financially viable idea.Moreover,bringing the paper with such a huge fanfare and publicising from different locations right from start definitely costs a bomb. The promoter might have pumped tons of money into the paper irrespective of whether the capital will be recovered or not which draining the coffers.
So it is just not Ram's contribution...

Raja said...

Love Doctor gari column missing ee roju edition lo...annaya exit ki ede sakshi

జైభారత్ said...

ఏంటండి..ఈ పోస్ట్ నైతిక జర్నలిజమే ద్యేయంగా అని పెట్టుకున్న బ్లాగ్ లో ఇలా వ్రాయడం..ఆరు పదులు దగ్గరపడుతున్నా....క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తూ ఒంటిని, మీసాలను ప్రత్యేక శ్రద్ధతో పెంచిపోషిస్తున్న రామ్....అంటే అరవై దాటాక జిమ్ముకు వెళ్ళడం మీసాల మిద శ్రద్ద చూపడం గతంలో టి.డి.పీ. తో పరిచయాలు ఉండటం అన్నయ్య అని సంబోదించటం ( ఆమాటకొస్తే సాక్షి టి.వి. న్యూస్ రీడర్ సతీష్ కూడా అన్నయ్య అన్నయ్య అనే పిలుస్తాడు అందర్నీ) అంత నేరాలన? మీ ఉద్దేశం . రెడ్డి అని మీరు వత్తి మరి చెప్పడం తను దాచుకున్నాడనేన "ప్రియ దర్శిని రామ్" అనే తను చెప్పుకుంటుంటే మీకు ఏమైన ఇబ్బందా? ఇనా ఛానెల్ ని వదిలి పార్టీ వైపు రమ్మని జగన్ అంటే అది రామ్ కి మైనేస్ ఎలా అవతుందండి?

సుజాత వేల్పూరి said...

సాక్షి ని చాలామంది కేవలం ఫామిలీ పేజీ కోసం తెప్పిస్తారనే సంగతి కాదనలేని సత్యం! మిగతా విషయాలెలా ఆయన లేకపోవడం ఫామిలీ పేజీకి నష్టమేనేమో!

jeevan reddy said...

kulam gurinchi raasthunaaru mee nathikantha anathikamainadi kadaa....

mutyalu said...

family page valle sakshi nilabadindhi, meeru annatlu lovedocter, neelambari naku nachaledhu kani andhari lonu anni nache amshalu unadav'

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి