Sunday, June 5, 2011

అవినీతిపై జనాలు చేస్తున్నది....పెద్ద బూటకపు డ్రామా

ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజాన్ని పీల్చిపిప్పిచేస్తున్న అవినీతిపై యోగా గురు రామ్ దేవ్ బాబా తలపెట్టిన సత్యాగ్రహాన్ని ప్రభుత్వం బలప్రయోగంతో అణచివేయడం దారుణం. అర్ధరాత్రి వందల మంది పోలీసులు రామ్ లీలా మైదానంలో భయోత్పాతం సృష్టించి బాబాను హరిద్వార్ తరలించడాన్ని సంఘ్ పరివార్ మాత్రమే కాకుండా అంతా ముక్తకంఠంతో ఖండించి తీరాలి. ఇది ప్రజాస్వామ్యమా? లేక...నియంతృత్వమా?

నిజానికి అవినీతిపై ఎంత ఎక్కువ ప్రజా చైతన్యం వస్తే ఈ దేశానికి అంత మంచిది. అది ఎంత తొందరగా వస్తే అంత మంచిది. లేకపోతే...మన భావి తరాలు అవినీతి బారిన పడి కుక్కచావు చావబోతున్నాయి. భారత్ కూడా కుక్కలు చింపిన విస్తరిలా ఏదో ఒక ఆఫ్రికా దేశంలా కాబోతున్నది. ఇప్పటికే అవినీతిపరులు జనం నుంచి మంగళహారతులు అందుకుంటూ...తరాలకు సరిపడా సంపాయిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి దేశాన్ని కుదవపెట్టడానికైనా వెనుకాడని దేశద్రోహుల గురించి చర్చ జరగడానికి, బాధ్యతారహితమైన జనం ఎన్నటికైనా వారి భరతం పట్టడానికి ఇలాంటి నిరశనలు ఎంతో ఉపకరిస్తాయి. 

అయితే...మొన్నామధ్యన అన్నా హజారే అవినీతిపై సమరంపై చేసిన శంఖారావం తాలూకు ప్రకంపనలు సద్దుమణగకముందే...విశేష జనాదరణ ఉన్న యోగా గురు నిరశనకు కూర్చోవడంతో చవట ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి చమటలు పట్టాయి. బాగా చదువుకున్నాడు...కదాని అనుకుంటుంటే...ఈ దద్దమ్మ ప్రధానికి అవినీతి ఒక సమస్యగా కనిపించకపోవడం, దానిపై పోరాడే వారు విలన్లుగా అనిపించడం మన దురదృష్టం. Mr.Prime Minister, its shame on you. కుంభకోణాల మీద కుంభకోణాలు బద్దలవుతున్నా సిగ్గూ ఎగ్గూ లేకుండా పదవిని అంటిపెట్టుకుని దేశాన్ని నగుబాటు చేస్తున్న మన్మోహన్...ఆయన్ను సన్నాసిని చేసి ఆడిస్తున్న సోనియాగాంధీలను క్షమించకూడదు. 
 అప్పుడు హజారే దీక్ష అపుడుగానీ, ఇప్పుడు రామ్ దేవ్ నిరశన అప్పడుగానీ జనసామాన్యం స్పందన చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్ధంకావడంలేదు. దేశంలో అవినీతి, అరాచకం పెరగడానికి తెలివితక్కువగా కారణమైన వారే ఇలాంటి ధర్నాలకు ఇమోషనల్ గా తెగ స్పందిస్తారు. ఎన్నికలను ఒక పనికిరాని కసరత్తుగా భావిస్తున్న విద్యావంతులు, మన బొజ్జనిండితే చాలు...కూచొని దొరికిన ప్రతి చెత్త పుస్తకమూ చదువుకుంటూ అదను దొరికినప్పుడల్లా లెక్చర్లు దంచుదామని అనుకునే సో కాల్డ్ మేధావులు, తమ జీతాలు బత్తేలు పెరిగితే చాలు...బల్లకింద దొరికే బోనసు నోట్లతో బతుకీడ్చవచ్చని తీర్మానించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, యజమానికి లాభాలు తేవడానికి...తద్వారా ప్రమోషన్లు కొట్టడానికి మాత్రమే పుట్టినట్లు ప్రవర్తిస్తున్న ప్రైవేటు ఎంప్లాయీస్--వీరు కాదా ప్రస్తుత దుస్థికి ప్రధాన కారణం? దేశభక్తిలేని ఈ తుక్కుబ్యాచు...ఎవడైనా అవినీతిపై గళమెత్తితే చాలు...మనస్ఫూర్తిగా స్పందిస్తారు, నానా హడావుడి చేస్తారు.అయ్యో...అయ్యో..కొంపలారుతున్నాయని మొత్తుకుంటారు. కులం, ప్రాంతం వంటి తీటలను వీరు వదిలి నీతిగా బతికితే, దేశం కోసం ఆలోచిస్తే సమస్య ఇంతదాకా ఎందుకు వస్తుంది?

సారా పాకెట్టుకు, బిర్యానీకి అమ్ముడుపోతున్న జనం మన దేశాన్ని శాసిస్తున్నారు. మురికి కాల్వల వెంట ఓటు బ్యాంకును పంటలా వేసి కాపాడుకుంటూ....కులమనే యూరియాతో కలుపుమొక్కలను పెంచుతూ...ఒకపక్క రాజకీయ నేత ఎదుగుతున్నాడు. వాడు విశ్వరూపం చూపిస్తూ...మనలను అపహాస్యం చేస్తుంటే....ఈ పైన పేర్కొన్న నాలుగు రకాల జనం ఇళ్లలో సుఖంగా తినితొంగుంటున్నారు. మనదాకా వస్తే దాకా స్పందించబోమన్న తిక్క లెక్క వల్ల సమస్య వస్తున్నది. ఈ జనం తమ పనుల కోసం డబ్బు పెట్టడానికి వెనకాడరు, వీలున్నప్పుడు డబ్బునొక్కడానికి సిద్ధంగానే ఉంటారు. ఎన్నికలప్పుడు స్పందించకుండా, మంచి అభ్యర్థులకు మద్దతివ్వకుండా రోజూ అవినీతి గురించి మాట్లాడుతుంటారు. లంచం బాధితులను ఆదుకోవడానికి, వారికి అండగా నిలవడానికి ఈ జనాలకు తీరిక, ఓపిక లేవు. నాలుగు డబ్బులతో వీళ్ల నోళ్లు మూయించడం చాలా సులభం.  ప్రస్తుతం దేశానికి పట్టిన దౌర్భాగ్యానికి నకలు, నమూనా, ప్రత్యక్ష సాక్ష్యం...మన్మోహన్ సింగ్. ఇదే conspiracy of silence అంటే. ఇదే నయవంచకత్వం అంటే.

సదాలోచనపరులు స్పందించకుండా...చోద్యం చూస్తూ ఉన్నంతకాలం...తమాషాను ఆస్వాదిస్తున్నంత కాలం...హజార్ మంది హజారేలు వచ్చినా...రామ్ దేవ్ లు వచ్చినా అవినీతి రక్కసిని ఏమీ పీకలేరు. జనం నిజానిజాలను, పొంచివున్న ప్రమాదాలను గుర్తెరిగి బూటకపు డ్రామాను ఆపనంతకాలం...దేశభక్తితో మెలగనంతకాలం ఆ రాక్షసి కరాళనృత్యం కొనసాగుతూనే ఉంటుంది.

24 comments:

Anonymous said...

మీరన్నదాంతో ఏకీభవిస్తున్నా. కపిల్ సైబాల్, దిగ్విజయ్ సింగ్ లాంటి వూరకుక్కల్లా తమ అవినీతి పార్టీని రక్షించుకోవడం చూస్తే కాంగ్రెస్ అవినీతి లేకుండా నెల ఐనా మనుగడ సాగించలేదన్నది తెలుస్తోంది.

sri said...

i agree ur towars corruption ,but i dont accept ur support to ramdev.
he want to encash the situation sorrounded as he wanna start political party.

sri said...

ramdev starting political party,so he wanna encash " fight aganst cirruption""

Vinay Datta said...

I completely accept with you.

madhuri.

Raj Karsewak said...

My Take on Baba Ramdev Satyagraha @
www.karsewak.blogspot.com

Apparao said...

ఇంకోసారి కాంగీలకి ఓటు వెయ్యకుండా ఉంటె సరి
తమిళ నాడులో ఎన్నికలు అయ్యాక పెట్రోలు వడ్డన , ఎవరు ఎవరిని అడుగుతారు ?
మనమే నోరు మూసుకుని భరించాలి
లేకపోతె ఇలా బ్లాగులు రాసుకోవాలి
అంతా మన ఖర్మ
మీ పోస్ట్ బాగుంది , కొంచెం ఆవేశం గా , ఆలోచించే విధం గా

Neninthe said...

అవినీతి విషయంలో మీ అభిప్రాయాలు సరైనవే. కానీ, రాందేవ్ లాంటి వ్యక్తి అవినీతిపై దీక్ష చేయడం సరికాదు. ప్రజలకు యోగా నేర్పేందుకు వేలకు వేలు తీసుకునే రాందేవ్... తన యోగపీఠం పరిధిలోని ఆస్పత్రుల్లో ప్రజలకు ఉచితంగా వైద్యం కుదరదని స్పష్టంగా చెప్పే ఈ బాబా... అవినీతిపై పోరాడతానడం హాస్యాస్పదం. ఆయన ఒక మతతత్వ పార్టీ అండతోనే ఇదంతా చేస్తున్నారని నా అనుమానం. అవినీతిపై పోరును సమర్థిస్తాను... కానీ, రాందేవ్ దీక్షను నేను సమర్థించను.

NEWS ARTICLES said...

అవినీతిపై పోరాడటం, మన దేశం నుంచి తరలిపోయిన నల్లధనాన్ని ఇక్కడ రప్పించాలని పోరాటం చేయడం సరైందే. అయితే ఇలాంటి పో్రాటాన్ని బాబా రాందేవ్ లాంటి వ్యక్తి చేయడమే అనుమానాన్ని కలిగిస్తోంది. యోగా నేర్పేందుకు వేలకవేలు తీసుకునే రాందేవ్... తన యోగపీఠం పరిధిలోని ఆస్పత్రుల్లో ప్రజలకు ఉచితంగా వైద్యం చేయడం కుదరదని తేల్చిచెప్పే రాందేవ్... ఇప్పుడు అవినీతిపై పోరాటానికి దిగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక మతతత్వ పార్టీ ప్రయోజనాల కోసమే రాందేవ్ దీక్షకు దిగినట్లు నా అనుమానం. అవినీతి నిర్మూలన కోసం చేస్తున్న పోరాటాన్ని సమర్థించాల్సిందే... కానీ, రాందేవ్ లాంటి వ్యక్తి దీక్షకు మద్దతు తెలపడానికి నా మనసు ఎందుకో ఒప్పుకోలేకపోతోంది.

Pavani said...

రామూ గారు.మీ రాతలు రాను రాను ఏ మత్రం సమ్యమనం లెకుండా వుంటున్నయి. రాం దేవ్ చేసే ది నిజంగా "protest against corruption" కిందకే వస్తుందా. He is sabotaging elected parliament at gun point. అవినీతి, నల్లడబ్బు ఈ రోజు కొత్తగా వచ్చిందా. ప్రజల్లో చైతన్యం తీసుకోరావటానికి ఉద్యమించడం వేరు. దానినెవరూ తప్పు పట్టరు. చస్తానని బెదిరింపేమిటి.
అన్నా హజారే దీక్ష కూడా నాకు నచ్చలేదు. ఎంత నిజాయితీ పరుడైనా కావొచ్చు గాక,ఇస్తావా..చావనా అంటం మాత్ర democracy సరికాదు. వాళ్ళనెన్నుకున్న ప్రజల బుద్ధేమంది. చాతనైతే ప్రజల్లో చైతన్యం తెచ్చి మంచి వాళ్ళని గెల్పించండి. దానికి టైం పడ్తుంది. కానీ అదే దారి..అదొక్కటే దారి.

ప్రతి దానికి గాంధీ పేరు తెచ్చుకునేముందు, ఆయనెందుకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి పోవాలని నిరాహార దీక్ష చెయ్యలేదు, అని ఆలోచించరే. అంతకన్న ఎక్కువా ఇవన్నీ.

ఇలాంటి వాటిని ప్రభుత్వం మన్నిస్తూ పోతే, వాళ్ళకు కావల్సిందాని కోసం దీక్షలేం ఖర్మ కాల్చుకోని చావటానికి కూడా చాలా మంది అతి వాదులు సిధం. ఒప్పెసుకుందామా? ఈ మాత్రానికి ఎన్నికలెందుకు, ఆ తర్వతెలాగు ఎవడు చస్తానని బెదిరిస్తే వాడి మాటే విఎటప్పుడు.

Pavani said...

The more I read this article more immature it is in thinking, perspective and content. If solutions to such major issues is so easy, swiss bank would have gone bankrupt long back.
Instead of venting frustation, why can't you provide one good idea that is practicable that will reduce corruption by 20% in 5 years.
Please do not say, hang them, burn them, ban them kind of stuff.
I can give few ideas..1)technology..Effective use of technology can reduce corruption 2) Electoral reforms 3) Education 4) Decentralization.
But all these take time. Things do not change overnight.
If pushed to the corner govt. may enact attrocious laws like 498A , but such laws will be misused to an extent people loath them pretty soon.
We have such terrorist laws already BTW.

Anonymous said...

@ పావని గారూ,
కాషాయం కట్టినంత మాత్రాన వ్యాపారం చెయ్యకూడదా? బాబా ఏమి అధర్మ మార్గములో సంపాదించటములేదే! నా వరకు ఆయనో మంచి వ్యాపారవేత్త. సమాజానికి కనపడినంత వరకు ఆయన చేస్తున్నది చట్టబద్ధ వ్యాపారమే. మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటో నాకు అర్థంకాలేదు.

నిరాహారదీక్ష చేస్తానని (చేసిన) గాంధీగారే స్వయంగా హెచ్చరించిన (బెదిరించిన) సందర్భాలున్నాయి. ఏదైన ఉద్యమం సందర్చంగా నాయకత్వం లేకుండా పోతే ఉద్యమం ఒకోసారి అర్థంతరంగా ఆగిపోవచ్చు. ఇదీ ఒక కారణం ఆనాడాయన ఆంగ్లేయులు వెళ్ళాలని దీక్ష చెయ్యకపోవటానికి.

దీక్ష ప్రభావం అనేది పలురకాలుగా ఉండొచ్చు. బాబా దీక్ష ఫలితాలు సాధించకపోయినా ఆ దిశగా ప్రజలను అలోచింపజేయవచ్చు. అదీ పెద్ద ముందడుగే.

'ఇంకా సమయం పడుతుంది' అనేది ఓ మూస బద్ధకస్తులు చేసే వాదనలా కనపడుతుంది నాకు. మనకన్నా వెనుక స్వాతంత్ర్యం పొందిన చైనా నేడు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన స్థితికి వచ్చింది. మనకున్న సమస్యల్లాంటివే అక్కడా ఉన్నాయి మరి! రాత్రికి రాత్రి ఫలితాలను ఆశించటం ఎంత తప్పో చెయ్యాల్సినంత వేగిరంగా పనులు చెయ్యకపోవటమూ అంతే తప్పు.

ఒక్క విషయం గమనించండి ఒక్క ఐ.టి రంగాన్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించలేదు. ఐ.టి మరియు దాని అనుబంధ పరిశ్రమల ప్రగతే భారత ప్రగతిగా రూపాంతరం చెందింది. అందువల్ల ఇది వేగవంతమైన చర్యలకు సమయం అని గుర్తించాలి.

SREEDHEESSPACE said...

@Pavani Arguments put forward by you hold water.

Anonymous said...

/ఇలాంటి వాటిని ప్రభుత్వం మన్నిస్తూ పోతే, /
ఏమంత నీచమైన, హేయమైన, నికృష్టమైన కోర్కెలు కోరాడని మీకు అనిపించిందా? అవినీతిని అరికట్టమని అడగడమే అతిహేయమైన చర్యలా మీకనిపించిందా?!! అవినీతిని రాజ్యాంగబద్ధమైన హక్కుగా సవరణ చేసేసుకుంటే పోలా? హజారెని, రాందేవ్, కిరణ్, కేజివాలాలను మక్కెలిరిచి తిహార్ జైల్లో తొంగోపెట్టాలి, కని మొళి, రాజా, కల్మాడీలకు భారత రత్న ఇచ్చి సత్కరించాలి. 60ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వముంటోంది, అవును మరి ఇప్పటికప్పుడు అవినీతి మీద చర్యలు తీసుకోండి అనడం అతి హేయమైన తప్పు. శిక్షించాల్సిందే!
---
ఆచంగ గారు, మీరు మరీ అలా ప్రశ్నిస్తే ఎలా?కాషాయం కట్టుకుంటే ఆ పైన ఎవరికో కార్పొరేట్ ఆసుపత్రిలో ఫ్రీగా ట్రీట్మెంట్ అందివ్వాలట! ఫ్రీగా ఎవడన్నా పెట్టకుంటే వారికి అవినీతిపరుల్ని ప్రశ్నించే హక్కు ఆటోమేటీక్‌గా రద్దయిపోవాల్సిందే మరి! :))
ఓవైసీ ఆసుపత్రిలో ఫ్రీగా కనీసం వాడేసిన బాండేజీ గుడ్డైనా వీళ్ళకి ఇస్తారేమో కనుక్కోవాలి వీళ్ళకి. ఫ్రీ మేతకు అలవాటుపడిన బ్రతుకులు.

Anonymous said...

@ Snkr గారూ,
మీ భావ ప్రకటనా విధానం మినహాయిస్తే నాదీ మీ అభిప్రాయమే.
కాషాయం అంటే మతోన్మాదం, మిగిలినవన్నీ లౌకికవాదమూనూ ఈ స్వతంత్ర లౌకిక భారతావనిలో! అందులో వింతేముందిలెండి.

Pavani said...

అచంగ గారు, రాందేవ్ గారి వ్యాపారాల గురించి నేనొక్క ముక్క రాయలేదు. I never once argued about his eligibility to protest.నా పేరు పెట్టి మీరు ఇంకెవరికో సమాధానాలిస్తున్నారు.

Snkr గారు, నేను రాందేవ్ గారు అడిగిన వాటి గురించి కామెంట్ చెయ్యలేదు..అడిగే తీరు గురించి మాత్రమే. మీకా మాత్రం తేడా తెలుస్తుందంకుంటున్నాను. context తీసేసి ఒక ముక్కని లాగి దాన్ని చిత్రవధ చెయ్యకండి. Lol!

ఈ పార్లమెంట్ మనం గెలిపించిన వాళ్ళతో నిండి వుంది. మనమెలాంటి వాళ్ళమో అల్లాంటి వారే అక్కడున్నారు. మార్చే శక్తి కూడా మనకే వుంది. వోటుతో. చైతన్యంతో.
ఎవరు సమస్యల గురించి ఉద్యమించినా తప్పులేదు. కానీ చస్తానని బెదిరించి పన్లు సాధించు కోవటం , అదీ ప్రముఖ వ్యకులు..I do not agree with that. ఏదో ఒక చోట ఇలాంటి వాటికి బ్రేక్ వెయ్యక తప్పదు. రేపు, కులం కార్డుతో ఒకడు, మతం పేరు చెప్పి ఇంకొకడు,ప్రాంతం పేరు చెప్పి మరొకడు..దీనికి అంతేముంది. ఇంత జనాభాలో ఒట్టి బెదిరింపేమి ఖర్మ..నిజంగానే కాల్చుకు చచ్చే ఉన్మాదులు బోలెడంత మంది ఉన్నారు.
Think again.These types of protests do not work for long. Already many feel two is too much.

Anonymous said...

@ పావని గారూ,
నేను రాసిన వ్యాఖ్య అక్షరాలా మీ వ్యాఖ్య(ల)కు స్పందనగా వ్రాసినదే. ఇబ్బంది కలిగితే క్షమాపణలు. అమర్యాద లేదని, సైద్ధాంతిక విభేదం మాత్రమేననీ మనవి. మీ వాదనలో నేను వ్యతిరేకించే అంశాలు రెండే ప్రధానంగా.
1. నిరాహారదీక్షలపై మీ అభిప్రాయం.
2. మీ ఆంగ్ల వ్యాఖ్యలో 'పోయిందేదో పోయింది' అన్న భావం ధ్వనించింది నాకు. మీరు సూచించిన సూచనలు పాటిస్తూనే మింగింది కక్కించాల్సిందే అనేది నా వాదన.

Pavani said...

Achanga gaaru, Can you read the below coment of yours and let me know where did I say anything about his business or what he wears? Let me make a point clear here..
I care a damn about what he wears or what business he is in.
My arguement is only about..his fast on to death. To me it is akin to holding an elected governament at gun point. Which I do not accept because such acts will be used, misused and abused over and over again if a precedent of appeasement is created. That said I totally understand you are only voicing your opinion on my opinion but not on me per se. Me too. Thanks.

"@ పావని గారూ,
కాషాయం కట్టినంత మాత్రాన వ్యాపారం చెయ్యకూడదా? బాబా ఏమి అధర్మ మార్గములో సంపాదించటములేదే! నా వరకు ఆయనో మంచి వ్యాపారవేత్త. సమాజానికి కనపడినంత వరకు ఆయన చేస్తున్నది చట్టబద్ధ వ్యాపారమే. మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటో నాకు అర్థంకాలేదు."

Anonymous said...

పావని గారు,
ప్రజాస్వామ్యంలో నిరాహార దీక్ష చేసి నల్లడబ్బును జాతీయం చేసి స్వాధీన పరుచుకొమ్మనడం సరైన తీరు ఎందుకు కాదు?!! ఆయనేమి చొక్కాపట్టుకుని అడగలేదే! మరొకరు రాందేవ్ బాబా బిజినెస్ చేస్తారని, ఫ్రీగా వైద్యం ఇప్పించరని కాబట్టి అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు లేదని, తీరుతెన్నులు బాగాలేవని చెప్పడం ... :)) సమస్యను చులకన చేసి పక్కదారి పట్టించడమే. కాంగ్రెస్ వాళ్ళు చేస్తోంది అదే. ఎవరు మాట్లాడారో ముఖ్యం కాదు, ఏమి మాట్లాడారో ముఖ్యం. అతనేమి రాజకీయాల్లో వేలకోట్లు వెనకేసుకోలేదే! ఇలాంటి సమస్యను ఏ మావోయిస్టులు, మత చాందసులు, ఆఖరుకు ఏ పాకిస్థాన్ పౌరుడు మనదేశంలో లేవనెత్తినా మద్దతివ్వాల్సిన అవసరముంది.

Malakpet Rowdy said...

To me it is akin to holding an elected governament at gun point.
____________________________________________________

Even the Naxals with guns can't hold the Govt at the gun-point.What makes you think a man like Ramdev can do it?

What he is trying to do is simple - mobilize public opinion and use the fast as a means of publicizing it and he has been using it in style. There is nothing wrong in mobilizing public opinion right?

Naagarikuda Vinu said...

@ Neninthe
@ Chaakirevu

I am not happy with your opinions and in particular the mentality of us Indians. We are highly obsessed with the word "FREE" if someone give away free goodies to us, we start praising and singing glories to that person. Why should Ramdev baba give any thing for free? My opinion is that everything should be made affordable, not free. Do you know the dangerous effects of these freebies on economy of our country?
And coming to participation of a Yoga guru in politics.
When students participate in politics, you say they should concentrate on studies and stay away from politics.
When professionals show interest in politics, you say why don't they concentrate on jobs. Same is the case with every one else? Then who is qualified to enter politics? "The idiots, thugs, rogues who are ruling now"

shaileshreddy said...

Yes! the fight against corruption is a drama. People are not serious in their fight against corruption. People lack discipline. People lack self regulation. All the slogans you hear on television...all the sound bytes you listen do not come straight from the heart. There are several examples that prove this. Every morning I take the Patny fly-over to reach office. Invariably I find traffic snarl on the fly over. There is a white line that separates the two-opposite lane traffic. All the 'common man' who clamour against corruption do not hesitate to jump the line and block the traffic in the opposite direction. Example two, all those who raise their voice against corruption at the drop of a hat, do not hesitate to jump signals if they dont find a traffic policeman. We do not find time to go to the passport office or RTA office to complete the documentation, but conveniently approach 'a broker' and authorise him to corrupt the officials. All that we expect is our job is done with minimum effort. Remember, healthy democracy is not possible with 'minimum effort'. We find it tidious to go to the polling station but want an active democracy. Mind you, the fight against corruption starts with you. Try to be disciplined, try to regulate yourself. Try not to 'adjust' with things that contribute to corruption, in a surrogate manner. To win the battle over corruption, we have to first simplify the deliberately complicated, otherwise simple behaviour of individuals. We have to flush out the 'typical indian jugad (hindi word)' mindset.

Andhra Pradesh Live said...

అవినీతిని నిర్మూలించలేము.

మనమీద పెత్తనం చేయనంత వరకు అవినీతి ప్రమాదకారి కాదు.

అవినీతి సొమ్ము మనమీద పెత్తనం చేయకుండా చేయగలము. అందుకు మార్గాలున్నాయి.

1) పన్నులు చక్కగా చెల్లించ రాదు. చెల్లిస్తే.... ఖజానా బలపడుతుంది. గద్దె మీద కూర్చున్న వాడికి తనేదో దైవాంశ సంభూతుడు అయినట్లు ఫీలింగ్ మొదలవుతుంది. అడ్డగోలుగా ఖర్చు పెట్టి కొన్ని వర్గాల్లో సోమరితనం పెంచుతారు.

౨) బాబు, వైఎస్, కేసీయార్, చిరంజీవి లాంటి వాళ్ళంతా వేర్వేరు ముసుగులు వేసుకున్న పాలక పక్షం. ఇప్పుడు ఉన్న పాలక పక్షాన్ని ఓడిస్తే దాన్ని కుకటి వేళ్ళతో పెకలిస్తామని నమ్మించే నేతకు ప్రజలు వోటు వేయాలి. అప్పడే మార్పు కోసం ప్రయత్నాలు చిత్తశుద్ధి తో జరుగుతాయి.

Pavani said...

రావిశాస్త్రి గార్ననుకుంటా ఒకసారెవరో అడిగారు.."మీర్రాసిన ఫలానా నవల గురించి మీ అభిప్రాయమేంటని..".

దానికాయన సమాధానం నాకు నచ్చింది (సరిగ్గా ముక్కకి ముక్క ఇలాగే చెప్పాడని కాదు).."ఏదైనా రాసి పాఠకుల ముందు పెట్టింతర్వాత ఇక దాని మానాన దాన్ని చావనివ్వక..లేదా బతకనివ్వక ఆ నవల గొప్పితనాన్ని చెప్పి ఊరేగటం నాకు నచ్చదు. నలుగురికీ నచ్చితే నాలుగు రోజులపాటు నిలుస్తుంది..లేదా పోతుంది".

ఆమరణ నిరాహార దీక్షలమీద నా అభిప్రాయం(RIP) గురించి నా అభిప్రాయం కూడా ప్రస్తుతానికదే.

NEWS ARTICLES said...

లక్షలాది పీడితుల గుండెల్లో నిలిచిన వ్యక్తి... మానవ హక్కుల్ని ప్రజల వద్దకు చేర్చిన నేత. ప్రతి పౌరుడికి హక్కుల గురించి తెలియాలని... ఎవరికే వారే హక్కుల కోసం పోరాడేలా చేయాలని నిరంతరం శ్రమించిన వ్యక్తి... హక్కుల ఉద్యమాన్ని ప్రజలకు చెప్పడమే లక్ష్యంగా జీవితాంతం పనిచేసిన మహా మనిషి బాలగోపాల్. ప్రజాహక్కుల పరిరక్షణ కోసం తన జీవితాన్నే వినియోగించిన బాలగోపాల్ తొలి జయంతి సందర్భంగా...
**********
అందరిలో కొందరిగా కాకుండా... కొందరిలో ఒకడిగా మెలగడం ఓ విశిష్ఠత. అయితే కొందరిలో ఒకడిగా తన ప్రత్యేకత నిలుపుకుంటూనే... అందరిలో ఒకడిగా కలిసిపోయి మెలగడం బాలగోపాల్ ప్రత్యేకత. నిరాడంబరతకు నిలువుటద్దం... నిర్భాగ్యుల పాలిట ఆపన్నహస్తమైన బాలగోపాల్ 1952వ సంవత్సరం, జూన్‌ 11న బళ్లారిలో జన్మించారు. తల్లిదండ్రులు కందాళ్ల పార్ధనాథశర్మ, నాగమణి దంపతులకు ఐదో సంతానం. గణితంలో మంచి ప్రావీణ్యుడు. చిన్ననాటి నుంచే చిత్రలేఖనం, కవితలు రాయడం, కార్టూన్లు గీయడం, ఈలతో త్యాగరాయ కీర్తనలను అలవాటు చేసుకున్నారు. అయితే పెద్దయ్యాక వీటన్నింటికీ ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం ప్రజాహక్కుల ఉద్యమానికే జీవితాన్ని అంకితం చేశారు. బాలగోపాల్ జీవితంలో వరంగల్ ఓ మలుపు. అక్కడే ఆయనకు విప్లవ విద్యార్థి ఉద్యమాలతో పరిచయం ఏర్పడింది. వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలలో మ్యాథమెటిక్స్‌లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన బాలగోపాల్... ఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్‌ కోసం వెళ్లారు. 1981లో కాకతీయ యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం రావడంతో మళ్లీ వరంగల్ వచ్చి... ఉద్యోగం చేస్తూనే పౌరహక్కుల ఉద్యమంతో మమేక మయ్యారు. విప్లవ విద్యార్థి సంఘాలతో సన్నిహితంగా మెలిగారు. ఆ సమయంలో వరంగల్ జిల్లాలో నక్సల్ ఉద్యమం ఉధృతంగా ఉంది. ఉద్యమకారులు, సానుభూతిపరుల అణచివేతపై గొంతువిప్పిన బాలగోపాల్... అనేక బూటకపు ఎన్‌కౌంటర్లను వెలుగులోకి తెచ్చారు. దీంతో ఆయనపైనా నక్సలైట్ అనే ముద్రను వేశారు పోలీసులు. ఓసారి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆయనపై దాడి చేసి... తీవ్రంగా కొట్టి చనిపోయాడనుకుని మురికి కాల్వలో పడేసి వెళ్లిపోయారు. 1985లో ఉద్యోగం త్యజించిన బాలగోపాల్... పూర్తిగా ఉద్యమానికి అంకితమయ్యారు. 1983లో పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై... 1998 వరకూ ఆ హోదాలో కొనసాగారు. 1985లో వరంగల్ వదిలి హైదరాబాద్‌కు బాలగోపాల్ మకాం మార్చారు. 1994లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఒక్క పైసా తీసుకోకుండా పేదల తరఫున అనేక కేసులు వాదించారు. రాజ్యహింసను వ్యతిరేకించిన పౌరహక్కుల ఉద్యమం... నకల్స్ హింసను సమర్థించడంపై బాలగోపాల్ నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆయన రాసిన 'నక్సల్బరీ ఉద్యమం- గమ్యం, గమనం', చీకటికోణం' పుస్తకాలు సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే అభిప్రాయ భేదాలతో పౌరహక్కుల సంఘాన్ని వదిలిపెట్టిన బాలగోపాల్... మానవ హక్కుల వేదికను ప్రారంభించారు. బాలగోపాల్ ఎంచుకున్న దారే ముళ్లబాట. ఉద్యమ జీవితమంతా బెదిరింపులు, దాడుల మధ్య రాజీలేకుండా సాగించారు. బాలగోపాల్ కిడ్నాప్ దేశవ్యాప్తంగా కలవరం సృష్టించింది. పోలీసుల ప్రేరణతో జరిగినట్లు భావించిన ఆ ఘటనలో ఆయన మూడు రోజులపాటు కిడ్నాపర్ల చెరలో గడిపారు. మరణం అంచుల దాకా వెళ్లివచ్చిన తర్వాత కూడా బాలగోపాల్ నిబ్బరం, నిబద్ధత అణువంత కూడా సడలలేదు. రాయలసీమలో ఏనుగుల బీభత్సానికి సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్న ప్రాంతాలు తిరిగి అక్కడి పరిస్థితిని చాటారు. కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతానికి వెళ్లి మందుపాతరల మధ్య దినదిన గండంగా బతుకుతున్న ప్రజల పరిస్థితినీ వివరించారు. ఛత్తీస్‌గఢ్ వెళ్లి సల్వాజుడం పేరుతో సాగుతున్న ఘోరాన్నీ కళ్లకు కట్టారు. మైనారిటీలపై ఉగ్రవాద అభియోగాలు మోపినప్పుడు... నిందితులకు న్యాయసహాయం అందించారు. కాలుష్యం, విద్యావ్యాపారం, సెజ్‌లు, నిర్వాసితులు, మురికివాడలు, మహిళా హక్కులు, విద్యార్థి హక్కులు, సంప్రదాయ వృత్తులు, అణుపరిజ్ఞానం, గిరిజనుల అనారోగ్యం... ఇలా ఏ సమస్యపైన అయినా ఆయన కొత్తకోణాన్ని ఆవిష్కరించేవారు. ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపైన హత్యా నేరం నమోదు చేయాలని ఆయన గట్టిగా వాదించి విజయం సాధించారు. దాదాపు మూడు దశాబ్దాల ఉద్యమ జీవితంలో సాధారణ ప్రజల్లో అసాధారణ స్థాయిలో మానవ హక్కుల స్పృహ కల్పించడమే కాకుండా... మధ్య తరగతి మేధావి వర్గాన్నీ ఈ ఉద్యమంలో భాగస్వాములను చేసిన బాలగోపాల్ చిరస్మరణీయుడు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి