Tuesday, January 10, 2012

ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లిషు పేపర్లకు... బైటి ఎడిటర్లే ముద్దు...

మనకదేమి దౌర్భాగ్యమోగానీ ఎంత మంచి జర్నలిస్టులున్నా....ఎడిటర్ల స్థాయికి వెళ్లలేకపోతున్నారు. తెలుగు లో అయితే 'ఈనాడు' లాంటి పేపర్ ఎడిటర్ లేకుండానే బండి లాగిస్తున్నది. జర్నలిస్టులకు అవకాశం ఇస్తేనే కదా...వారు కొంత ఎత్తుకు ఎదిగి ఆ ధైర్యంతో జర్నలిజానికి కొంత పాజిటివ్ కంట్రిబ్యూషన్ చేయగలిగేది. సరే...తెలుగు పత్రికల ఏడుపు ఎలా ఉన్నా...ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఇంగ్లిషు పత్రికలకు మనోళ్లు అని చెప్పుకోదగ్గ ఎడిటర్లు లేరు. డెక్కన్ క్రానికల్ లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఒక సీనియర్ మోస్టు జర్నలిస్టు మాటల మధ్యలో నాకీ మాట చెబితే నిజంగానే ఆశ్చర్యమేసింది. 

మనోళ్లకు పొరుగింటి పుల్లకూరే రుచో...అంత సీనున్న ఎడిటర్లు మన దగ్గర లేకపోవడమో ఇందుకు కారణమై ఉండవచ్చు. ఒక్క ఇండియన్ ఎక్స్ ప్రెస్ ను మినహాయిస్తే...ఎడిటర్లు...చాలా వరకు న్యూస్ ఎడిటర్లు ఇతర రాష్ట్రాల వారే కావడం గమనార్హం. స్పోర్ట్స్ ఎడిటర్లు కూడా ఇతర రాష్ట్రాల వారే ఉన్నారు. బైటి వారిని అనడం కాదు గానీ మనం మంచి ఎడిటర్లను ఎందుకు తయారుచేసుకోలేకపోతున్నామన్నదే నా బాధ.

Name of the newspaper----Editor/News Editor's name (state)

1) Times of India----కింగ్ షుక్ నాగ్, ఎడిటర్ (బెంగాల్)
2) Deccan Chronicle----జయంతి, ఎడిటర్ (తమిళనాడు)
3) The Hindu----శ్రీవత్సన్, న్యూస్ ఎడిటర్ (కేరళ)

4) Indian Express---వాసు, ఎడిటర్ (ఆంధ్రప్రదేశ్)
5) The Hans India---పీ.ఎన్.వీ.నాయర్, ఎడిటర్ (కేరళ)
6) Postnoon--విలయమ్స్, ఎడిటర్ (ఆంగ్లో ఇండియన్)


ఇక్కడ ఇంగ్లిషు పేపర్లలో పనిచేస్తున్న వారిలో చాలా మంది బైటి రాష్ట్రాల వారు ఉన్నారు. వారిలో కేరళ రాష్ట్రానికి చెందిన వారి సంఖ్యను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పైన పేర్కొన్న వారిలో కొందరి కన్నా అద్భుతమైన ఎడిటర్ లక్షణాలు, సామర్ధ్యం ఉన్న వారిలో ప్రముఖులు రాం కరణ్ గారు. ఆయన ప్రస్తుతం ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఉన్నారు. ఎడిటింగ్ లో అద్భుతమైన హ్యాండు ఆయనది. ముంబాయి భామలను మన తెలుగు సినిమా పరిశ్రమ వాళ్లు పట్టుకు వేళాడినట్లు మన మంచి జర్నలిస్టులను వదిలి...బైటి  వారివైపు యాజమాన్యాలు చూడటం మన దౌర్భాగ్యం అని అబ్రకదబ్ర అంటున్నాడు. మీరేమంటారు?

6 comments:

Praveen Mandangi said...

మన రాష్ట్రం వాళ్ళకి ఇంగ్లిష్ సరిగా రాక ఏమో. యూట్యూబ్‌లో ఒకామె వీడియో పెట్టి "Animals are being killed cruelly" అని కాకుండా "Animals are killing crucially" అని హెడ్డింగ్ పెట్టింది. బట్లర్‌కి కూడా రాని ఈ రకం ఇంగ్లిష్ వచ్చినవాళ్ళకి ఇంగ్లిష్ పేపర్లలో ఉద్యోగం ఎలా దొరుకుతుంది? నేనే ట్రైన్‌లో ఇంగ్లిష్ పూర్తిగా మాట్లాడలేక కొన్ని వాక్యాలు హిందీలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ cruelకీ, crucialకీ తేడా తెలియనంత బట్లర్ ఇంగ్లిష్ ఎన్నడూ మాట్లాడలేదు. కేరళలో 90% పైగా అక్షరాస్యత ఉంది కాబట్టి అక్కడివాళ్ళకి ఇంగ్లిష్ బాగానే వస్తుంది. అందుకే వాళ్ళకి ఇంగ్లిష్ పత్రికలలో ఉద్యోగాలు సులభంగా దొరుకుతాయి.

astrojoyd said...

మనకున్న వారిలో శ్రీ సూర్యమోహన్ గారు కూడా మంచి ఇంగ్లీష ఎడిటర్ కాని ఆయన్ని ఆ స్థాయికి ఎదగా
నివ్వకుండా చేస్తున్నారు..

aha oho said...

vaarneeyamma ee chalama gaadu ikkada kooda chachhada? eedu prati bokkalo veledetaade?!?!?!?!?

Ramu S said...

Dear Aha oho...
What is the meaning of this comment? I couldn't understand a bit. Are you targeting someone? Whats your problem?
Ramu

విష్వక్సేనుడు said...

/* నేనే ట్రైన్‌లో ఇంగ్లిష్ పూర్తిగా మాట్లాడలేక కొన్ని వాక్యాలు హిందీలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. */
@Praveen sharma
.
.
.
.
నువ్వు మాట్లాడలేకపోతే ఇంకెవరికీ రాదా?

చిలమకూరు విజయమోహన్ said...

రామూగారూ!aha ohoగారి వ్యాఖ్య ప్రవీణ్ శర్మగారి గురించిలెండి.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి