పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న తెలుగు టెలివిజన్ చానళ్ళలో రోజుకొక పరిణామం జరుగుతున్నది. ఈ రోజు ఒక ఛానెల్ లో వున్న సీనియర్ జర్నలిస్టు మర్నాటికి మరొక ఛానెల్ లో దర్శనమిస్తున్నారు. అది కాక ఇంకొన్ని ఆసక్తి కరమైన విషయాలు జరుగుతున్నాయి. ఆ పరిణామాల సమాహారమే ఇది...
ఇమేజ్ లో చేరిన జకీర్, కందుల:
మళ్ళా ఏ.బీ.ఎన్.గూటికి మూర్తి
స్వప్న, మూర్తి, వాసుదేవన్, సురేష్ వంటి వారు చేరడంతో ఇమేజ్ వారి ఛానెల్స్ (సీ.వీ.ఆర్.) ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిందనిపించింది. ఆరంభంలోనే..ఇమేజ్ లో చేరినట్టే చేరిన స్వప్న తాను గతంలో పనిచేసిన 'సాక్షి' ఛానెల్ కు వెళ్ళిపోయారు. అక్కడి కొన్ని నియామకాలు నచ్చక కాబోలు మూర్తి తాను వదిలి వచ్చిన 'ఏ.బీ.ఎన్. ఆంధ్రజ్యోతి' ఛానెల్ కు వెళ్ళారు నాలుగు రోజుల కిందట. వీళ్ళను ఇమేజ్ లోకి తెచ్చిన నరసింహారావు గారు చూస్తూ చూస్తూ ఉండగానే...ఏ.బీ.ఎన్. నుంచి శివప్రసాద్ వచ్చి అవుట్ పుట్ ఎడిటర్ గా, కందుల రమేష్ ఇన్ పుట్ ఎడిటర్ గా జాయిన్ అయ్యారు. టీ.వీ. ఫైవ్ లో అద్భుతంగా పనిచేసిన రమేష్ గారు, ఐ-న్యూస్ లో, స్టూడియో ఎన్ లో పనిచేసి మానేసి తర్వాత ఐ-న్యూస్ లో చర్చలకు పరిమితమయ్యారు. శివప్రసాద్, రమేష్ ల నియామకాలు జరిగిన కొన్ని రోజుల్లోనే మూర్తి మళ్ళీ రాధాకృష్ణ గారి ఛానెల్ కు వెళ్ళిపోయారు. టీ.వీ.-నైన్ లో, తెలంగాణా ఛానెల్ లో, ఏ.బీ.ఎన్. లో పనిచేసిన జకీర్ కూడా సీ.వీ.ఆర్.ఛానెల్ లో చేరినట్లు సమాచారం. మరి వాసుదేవన్ అయినా...అక్కడ ఉంటారో...ఉండరో వేచి చూడాలి.
త్వరలో తులసి ఛానెల్ ప్రసారాలు
తులసి సీడ్స్ వారి ప్రసారాలు త్వరలోనే ప్రారంభమవుతాయని అంటున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నట్లు సమాచారం. అక్కడ భావనారాయణ అనే సీనియర్ జర్నలిస్టు ఉండే వారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారనీ...ఆ స్థానంలో మాజీ 'ఈనాడు' పెద్దిరాజు చేరారని తెలిసింది. దీనికి సంబంధించి సమాచారం ఉంటే పంచుకోవాలని జర్నలిస్టు మిత్రులకు విజ్ఞప్తి.
ఇంతకూ...రవిప్రకాష్ తెర మీదకు రావడం లేదేమి?
తెలుగు టీ.వీ.జర్నలిజం లో వినూత్న పోకడలతో తనకంటూ ఒక చాప్టర్ ఏర్పాటు చేసుకున్న రవిప్రకాష్ టీ.వీ.-నైన్ తెర మీద చాలా రోజులుగా కనిపించక పోవడం జర్నలిస్టు సర్కిల్స్ లోనే కాదు...సాధారణ పబ్లిక్ లోనూ చర్చనియాంశమయ్యింది. మొదట్లో నిండైన విగ్రహంతో నవ్వు మొహంతో చీటికీ మాటికీ లైవ్ లో కనిపించిన రవి ఆ తర్వాత కొద్దిగా పెద్ద పరిణామాలు ఉన్నప్పుడు దర్శనమిచ్చేవారు. ఇప్పుడు అదీ లేదు. చాలా నెలల కిందట జగన్ మనుషులు తన మీద దాడి చేసారని నాకు సమాచారం వస్తే...రవి కి మెయిల్ ఇచ్చాను...అది నిజమేనా అని. అలాంటిదేమీ లేదని ఆయన సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి వార్తలే వస్తున్నాయి. మా సారు...ఛానెల్ విస్తరణ పనుల్లో ముంబాయిలో బిజీగా వున్నారని కొందరు ఉద్యోగులు చెబుతుండగా...రవికి ఏదో కాబట్టీ తెర మీదకు రావడం లేడని కొందరు అంటున్నారు. బ్రదర్...ఒక సారి తెర మీద కనిపించ కూడదూ...చాలా రోజులైంది మిమ్మల్ని చూసి.
రాధాకృష్ణ కు పెరిగిన బెదిరింపు కాల్స్?
జగన్ పార్టీ మీద, ఆయన పత్రిక, ఛానెల్ మీద చంద్రబాబు కన్నా పరమ కోపం గా ఉన్నది ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ. రూపాయి దారుణంగా పతనమైనా...రాష్ట్రపతి ఎన్నిక విషయంలో పసందైన రాజకీయం జరుగుతున్నా...ప్రపంచం కొట్టుకు పోతున్నా...పట్టించుకోకుండా రా.కృ.రెచ్చిపోయి జగన్ మీద అక్షర దాడి చేస్తున్నారు. ప్రతి రోజు లాగానే ఈ రోజు జగన్ మీద దాడి చేస్తూ...సంతకంతో కూడిన సంపాదకీయం రాసారు. రా. కృ. ఏమి రాసాడా...అని భయపడి హడావుడిగా చదివితే...చెప్పిందే పదిసార్లు చెప్పి కొండవీటి చాంతాడంత వ్యాసాన్ని సృష్టించాడని తేలింది. రా.కృ.కు కోపం వస్తే అంతే. చంద్రబాల గారి గురించి వివరణ ఇవ్వడం మంచిదే. సంఘసేవిక అయిన ఆమె ఒక్క రా.కృ. గారితోనే ప్రెస్ కవరేజ్ గురించి అంత చేటు మాట్లాడారా? లేక అందరు ఎడిటర్లనూ ఇట్లానే సతాయిస్తున్నారా? అన్నది తేలాలి. అయితే...ఈ వ్యాసంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు రా.కృ.రాసుకున్నారు...చాలా చోట్ల. తనకు ప్రాణహాని ఉన్నట్లు చెప్పారు. ఎవరు, ఏమని బెదిరిస్తున్నారో కూడా...ఆయన వెల్లడించాలి. రా.కృ.లాంటి 'దమ్మున్న' జర్నలిస్టు...'దమ్మున్న' యజమానికి ఏమి జరిగినా....అది ముమ్మాటికీ పత్రికా స్వేచ్చకు గొడ్డలి పెట్టే. కాకపోతే...బ్రదర్ రా.కృ.మీ కాపీ లను ఆ డెస్క్ లో వున్న ఎవరితోనైనా...ఎడిట్ చేయించి ప్రచురించుకోండి. ప్లీస్.

10 comments:
Nice Review Sir.
ఎన్ని దుకాణాలు పోటీ పడితే వినియోగదారునికి అంత మేలు అన్నట్లుగా ఎన్ని చానల్స్ పెరిగితే అంత మంచిదే. ఎవడో ఒక్కడి కబంధ హస్తాలలో మీడియా గిల గిల లాడకుండా ఉంటుంది. జగన్ పై మాత్రమే కక్ష కట్టడమే రాధాకృష్ణ దమ్ము అనుకుంటే కుదరదు. సాక్షి - ఈ.టీ.వీ - ఏ.బీ.ఎన్ ఇవి మూడూ సెలెక్టెడ్ వీక్షకులు మాత్రమే చూస్తున్నారు.
గురువు గారు, check your facts first. ఆమె 'అంతచేటు ' మాట్లాడారా అని వాడారు. కాని ఆమే స్వయంగా నిన్న ఇంటర్వ్యూ లో చెప్పిన దాన్ని బట్టి, తను రెండు సార్లే ఫోన్ చేసినట్లు చెప్పింది. పోని 'అంతచేటు ' అని అనుకున్నా ఆమె అందుకు వివరణ కూడా ఇచ్చింది. ఏబీఎన్ లో ప్రసారమయ్యే యంగిస్థాన్ వంటి కార్యక్రమాలు భావసారుప్యత కలిగి ఉండటం, అందులో రాధాకృష్ణే స్వయంగా పాల్గోవటం వల్లే ఆమె మరింత ఎక్కువగా 'సతాయించిందేమో'.. Because she thought of publicize their program to a bigger level... మిగతా చానల్స్ గురించి అడిగారు.. వాటిల్లో MD, చైర్మన్ లాంటి వ్యక్తులు ఎవరు అందుబాటులో ఉంటారు చెప్పండి? టీవీ9 చస్తే అలాంటివి చెయ్యదు.. ఈనాడులో రామోజీని కలవటం, కిరణ్ ని ఒప్పించటం అంత తేలిక కాదు.. జేడీ ని సన్మానించారంటేనే ఇంక సాక్షి ఎందుకు ప్రసారం చేస్తుంది? ఎన్టీవీ/కొమ్మినేని గారు పూర్తిగా రాజకీయాలకు, సినీమసాలా కి పరిమితమైంది. ఇంక కాస్త పేరుండి, అప్రోచబిలిటి ఉన్నది ఆంధ్రజ్యొతి ఒక్కటి.. అంతేకాకుండా ఒకేసారి అన్ని చానల్స్ కలిసే అవకాశం, తీరికా కూడా ఉండాలి కదా.. ముందుగా ఒక దాంట్లొ ఫొకస్ అయితే మిగిలిన వాటిల్లో అంత శ్రమ పడకుండానే ప్రచారం వస్తుందని కూడా భావించి ఉండొచ్చు..
Thananu janam baga nammutharani R.K. apoha... papam poor fellow. 'Nenu na aksharam' ani raasukogaane janam nammaru babu. Mana cheshtalanu batte mana meeda jananiki oka avagahana vachedi. Nuvvu entha buildup ichina nee vudyogule ninnu nammaru. kavalante thala koti rupayalu ichi... nishpakshikanga cheppamanu nee vudyogulni 80% neeku vyathirekule.
మీరన్నది నిజమే..ఇవాళ కన్పించిన వాళ్ళు రేపు కన్పించరు..ఎవరి తిప్పలు వారివి.
ఇమేజ్ లో కందుల రమేష్ ఇన్పుట్ కాదు ...consultant ఎడిటర్..స్వప్న,సత్యమూర్తి ఇద్దరు వాళ్ళ గ్యాప్ ని
పుడ్చుకునేందుకు అక్కడ జాయిన్ అయి..హ్యాండ్ ఇచి వెళ్ళిపోయారు..interesting ఫ్యాక్ట్ ..ఏమిటంటే..output , input గా
ఇద్దరు కుర్రాళ్ళని cvr management తీసుకుంది..ఇప్పుడు వీళ్ళ రాకతో వాళ్ళు డంగై పోయారు.. తిరిగి వెనక్కి వెళ్ళలేక
కవర్ లో కంటిన్యూ అవలేక నానా తిప్పలు పడుతున్నారు ఆ పిల్లలు ..దీనికి మనజ్మేంట్ ని తప్పు పట్టాల్సిందే ...మొత్తం నాలుగు
చానల్స్ తో వస్తుందని తెగ ప్రచారం జరుగుతుంది..కానీ ఇంత వరకు అక్కడ సరుకు తక్కువ హడావుడి ఎక్కువ గా ఉంది..
vedio editors చాల స్లో..డెస్క్ లో n టీవీ batch హవా సాగాలని షో చేస్తుందట.. వాళ్ళలో విషయం తక్కువ హడావుడి ఎక్కువ..
శివప్రసాద్ జాయిన్ అయ్యి అవ్వగానే వాళ్ళని వీళ్ళని కాదని , abn ఛానల్ లో ని కత్తులు , పిడిబాకులు,చురకతులని తిసుకోస్తానంటున్నాడట
ఎవడి గ్రూప్ వాడిది మరి ..వీళ్ళంతా పాత ఛానల్ లో ఏమి ఉడబోడి చారని ఇక్కడ wonders ఆశిస్తారు ఎవరైఅన?
మిస్టర్ రామ్ ..యు కెన్ పోస్ట్ థిస్ ..నో ప్రాబ్లం ..మై ఫ్రెండ్ ఇస్ doing జాబ్ there .. ఎక్కడకి వచ్చైన ఈ విషయం prove చేయగలం..
ప్రోగ్రాంస హెడ్- ఒకే గాని అయన టీం అంత బావుందలేధత...ఇక అక్కడి రూల్స్ చెప్తాం వినండి..బ్యాంకు accounts ఉండవు..ఆంటే eppudiana
employees ని పికేయవచ్చాన్నమాట..id కార్డ్స్ లేవు. 9 గంటల షిఫ్ట్..ఒక్క రోజూ లీవ్ ఉండదు.. మీకు ఆఫర్ లెటర్స్ కాదు , అప్పాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వరు..ఇది ఆ ఛానల్ గొప్పతనం..త్వరలోనే ..launching అని చెప్తున్నారు ...ఏ ఒక్క రోజూ labour ఆఫీసర్ వచ్చిన వీళ్ళ బండారం ఈజీ గా బయట పడుది.
ఇక తులసి లో భావన్నరయన్ గారు మానసిక వేదన తో మాని వేసారు ..మొదటి నుంచి చైర్మన్ తో ఉండి..liscence తెచుకోవడం లో సాయపడి
చివరకు. .ఎవరెవరో వచ్చి చేరుతుంటే..ప్రేక్షక పాత్ర పోషించలేక మానేసారు..ఈ ఛానల్ కి బాగా కులపిచ్చి రంగు అద్డుతున్నారు ...
నిజమెంతో తెలిదు కానీ..కాపులకే..ఇక్కడ జాబులట ..successful businesmen ఎవరు కూడా caste based organization రన్ చేయరు
మరి..కాపు journalists - మిగిలిన వాళ్ళు ఇక్కడ ట్రై చేయకుండా ఇలాంటి ప్రచారం చేపట్టరేమో మరి..చూడాలి...బహుశా పెద్దిరాజు కూడా ఆ angle
లో జాయిన్ ayyademo ...ఇదేవరిని కించపరచడానికి కాదు ..టాక్ అలా నడుస్తుంది మరి
మా ఉద్దేశాలను కరెక్ట్ గా వ్రాసారు సార్,కాని చంద్రబాలకు వచ్చిన ఇన్ని వందల కాల్స్ ఈ 2-3, నెలల నుండే వచ్చాయా లేక 2009 నుంచీ calls అలానే వస్తున్నాయా అనేది కూడ తేలాల్సి ఉంది సార్ దయచేసి తెలుసుకొనే ప్రయత్నం చేయమనండి please
It is a routine practice for reporters and photographers who attend press meets either in the press club or anywhere demand money in addition to prescribed fees to the club for covering the news the next day.Is it not possible to the various associations of Journalists and the managements of media to prevent this corrupt practice of our fourth pillars of democracy? If not why cry about corruption in the media by them? Let them be corrupt by keeping a blind eye towards corruption in the society.
JP,
jakir and batch want to show their ability in cvr..which is a incapable channel..the management is just insulting journalists there by keeping doors close all the day...such a way that they r working in a spy company..or in a slave yard..shame on their part...ippatidaka image akramalu bayataki raledu..ippudu channel pettaruga..anni bayataki vastay...
సోషల్ ప్రోగ్రాంస్ ని కవర్ చేయడంలో ఆంద్రజ్యోతి ని మించిన పేపరు/చానల్ లేదు.... దీని వెనక వారి స్వార్థం ఉందో లేదో నాకు తెలీదు కాని వారు సోషల్ రెస్పాన్సిబుల్ ప్రోగ్రాంస్ ప్రమోషన్లో ముందున్నారు.... ఇది నా పర్సనల్ ఎక్ష్ పీరియెన్స్ .... మేము చేసిన ఒక ప్రోగ్రాం కి TV9 తో సహ అన్ని చానల్స్ ని సంప్రదించాం..., అన్ని చనల్స్ కూద పెయిడ్ న్యూస్ కి చూపినంత ఇంట్రెస్టు మాకివ్వలెదు except andhrajyothi
తులసి లొ పెద్దిరాజు సి ఈ ఒ గా చెరడం నిజంగ నమ్మబుద్ది కావదం లెదు..ఎల అతన్ని తిసుకున్నరొ తెలియదు అతను కరెక్టు కాదని అందరికి తెలుసు.ఈనాడు లొ అవినీతి ఆరొపనలపై పెద్దిరాజు ని తిసారన్న సంగత్తి అందరికి తెలిసిందె...అయినా అంత జూనియర్ ని సిఈఒ గా తిసుకుంటరా.. చానల్ ని తెచ్చె సత్త పెద్దిరాజు కి వుందా ..? ఇక ఇమెజ్ లొ రాజకీయలు మొదలయ్యయి..పరకాల మురలి పై చైర్మన్ సిరియస్ గా వున్నడని తెలిసింది
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి