Friday, June 29, 2012

'తులసి', 'ఇమేజ్' ఛానెల్స్ లో పరిణామాలు...

కొత్తగా రాబోతున్నదని  రెండేళ్లుగా ఊరిస్తున్న 'తులసి' ఛానెల్ లో, అతి త్వరలో రానున్న ఇమేజ్ ఛానెల్ లో పరిణామాల గురించి ఒక సీనియర్ జర్నలిస్టు ఇది రాసి పంపారు. ఇవి పూర్తిగా ఆ జర్నలిస్టు వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. 
----------------------------------------

మోస్ట్ ఆన్ వాంటెడ్ పరిణామాలకు ఇటీవలీ కాలం లో తెలుగు విజువల్ మీడియా కేంద్ర బిందువుగా మారుతోంది.... ఏదో పొడుస్తుందునకున్న ఇమేజ్ వారి చానెల్...అన్నీ ఛానెల్స్ విసర్జించిన ముసలి తొక్కులను, వెళ్ళిన ప్రతి చోట గ్రూపులు కట్టే అలవాటున్న సీనియర్ జర్నలిస్టులుగా చలామణీ అయ్యే వారినీ నెత్తి కెక్కించుకుని... అభాసు పాలైంది.... ఫేస్ వాల్యు ఉన్న ఏ.బీ.ఎన్ మూర్తి, స్వప్న కూడా చేరి, తిరిగి సొంత గూళ్ళకు వీళ్లిపోవటం...తో అసలు ఇమేజ్ కి విజన్ ఉందా? లేదా? అనే సందేహం తలెత్తుతోంది....ఇంకా రాకుండానే ..ఇంత అపకీర్తి మూట కట్టుకున్న వీరి సంగతి అలా ఉంచితే, గుంటూరు బిజినెస్ టైకూన్ తులసి రామచంద్ర ప్రభు స్టార్ట్ చేయదలచుకున్న తులసి చానెల్....కులం కంపుతో కునారిల్లుతోంది... ఇంటర్వ్యూ కి వెళ్ళిన వారిని నేరుగా మీరు `ఏమిటి అని అడగటం ద్వారా.. కేవలం ఫలానా సామాజిక వర్గానికే ఆ చానెల్ కొమ్ము కాస్తోందనే ప్రచారం బాహాటంగా నే జరుగుతోంది.
తులసి చానెల్ సీ ఈ ఓ భావన్నారాయణ వెళ్లిపోవటం..వారికి మైనస్సే....ఇంకా మొదలు కాకుండానే ఏమిటీ అపశకునం అని అందరూ వాపోతున్నారు. దీనికి తోడు...మీడియా మీద ఏ మాత్రం అవగాహన లేని ప్రభు గారి కుమారుల సామాజిక వర్గ ప్రాధాన్యాలు ఎవరినీ ఆ చానెల్ గడప తొక్కకుండా చేస్తున్నాయి...ఎవరి మీదా నమ్మకం లేకుండా ..ఒంటెత్తు పోకడలు పోయే `తులసి వారి వ్యవహారం తో సీనియర్లు ఎవరూ అటు వైపే చూడటం లేదనేది ఇప్పుడు వస్తున్న టాక్...కాంపిటెంట్ గానూ, దూకుడు గానూ ఉండే వాళ్ళు కాకుండా...కులం ప్రధానంగా జరిపే నియామకాల ద్వారా `తులసి వారు సమాజాని ఏం మెసేజ్ కన్వే చేద్దామనుకుంటున్నారో అర్ధం కావటం కాలేదు.....
రక రకాల వివాదాల్లో చిక్కుకున్న వారిని అక్కడ కూడా చేరదీసే ఒక వాతావరణం ఏర్పడినట్టుగా చెపుతున్నారు. మీడియా ప్రపంచానికిసంబంధం లేని వారిని `కుల కోణంలో అక్కున చేర్చుకుంటున్నారనే అపకీర్తిని ప్రభు మూట కట్టుకుంటున్నారని ప్రెస్ క్లబ్ సమాచారం. తాను నడిపే ఇతర వ్యాపారాల్లో ఆ కోణం చూపని ప్రభు ఇక్కడికొచ్చే సరికి చేస్తున్న ఆ తప్పు ....కచ్చితంగా చానెల్ భవితవ్యాన్ని ప్రభావితం చేస్తుందేమో ననే సందేహాలు మొదలవుతున్నాయి.... రామ్ మోహన్ నాయుడు, రమణ, హరిప్రసాద్, ఆలపాటి సురేశ్, పెద్ది రాజు లాంటి `సామాజికప్రముఖులను పరిగణనలోకి తీసుకుంటే ఎలా ఉంటుందని తులసి ప్రభు గారు, ఆయన పుత్ర రత్నాలు సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
క్వాలిటీ కన్నా....కేస్ట్ కే ప్రయారిటీ అనుకునే రీతిలో జరపాలనే నియామకాలతో........తులసి ప్రభు కు  అయ్యవారిని చేయబోతే ఏదో అయిందనుకునే పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది.....ఇప్పటికే ఎందరినో పిలిచి మాట్లాడి...తీసేసుకున్నామనే ఫీలర్ ఇచ్చిన తులసి ప్రభు, తీరా వారికి మొండి చెయ్యి చూపారనేది....ఆయన `సామాజిక శాఖ నుంచే వస్తున్న మాట. తిన్నగా నియామకాలు జరపకపోతే....`తులసి వారి వనంలో అన్నీ గంజాయి మొక్కలే ప్రత్యక్షమవుతాయి.

6 comments:

Anonymous said...

టివి లోనే కాదు ఎక్కడయినా ఎవడికి వాడు తానే పెద్ద పుడింగి అనుకుంటాడు .. ఇది రాసినాయన కూడా తనకు అవకాశం ఇవ్వడం లేదని తానో పెద్ద పుడింగిని అనుకున్తున్నయన రాసినట్టుగా ఉంది

శ్యామలీయం said...

నాకు యీ టపా కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది.
> అన్ని ఛానెల్స్ విసర్జించిన ముసలి తొక్కులను ..
> తులసి చానెల్....కులం కంపుతో కునారిల్లుతోంది.
> తులసి ప్రభు గారు, ఆయన పుత్ర రత్నాలు ..

మొదటి విషయం యీ వ్యాసం దాదాపుగా ఊహాగానం.
బాధ్యతగల రచనలో ఇంత మోతాదులో ఊహాగానం కనిపించవచ్చునా?

రెండవది పైన ఉటంకించిన కొన్ని పదబంధాలు. ఇటీవలి కాలంలో ఇటువంటి మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. ఇటువంటి ఇబ్బందికరమైన మాటలు వాడకుండా హుందాగా వ్రాయవచ్చు గదా?

మూడవది, యీ వ్యాసంలో content కన్నా intent హెచ్చుగా కనిపిస్తుండటం. ఇది కూడా అంత మంచిపరిణామం కాదు. ఎవరో బాధ్యతలేని బ్లాగరు వ్రాసిన వ్యాసంలాగా ఉంది. ఒక ఒక సీనియర్ జర్నలిస్టు నుండి విషయం గల వ్యాసాన్ని ఆశించితే చివరకు చదివించినది ఒక ఊహాగానపూరిత వ్యాఖ్యానం.

మంచి ఉద్దేశంతో నిర్వహిస్తున్న బ్లాగులో ఇటువంటి వ్యాసాలు అనవసర వివాదాలకు దారితీస్తాయి.

జర్నలిజంలో మంచిని పెంచేందుకు, పంచేందుకు యేర్పాటయిన ఒక వేదికమీద సరయిన ఆధారాలు చూపకుండా వ్రాసిన వ్యాసాలు ప్రచురించకండి.

వ్యాసకర్త చెప్పదలచుకున్నది తులసి, ఇమేజి చానెళ్ళు సరైన దిశలో యేర్పడుతున్నట్లు కనబడటం లేదన్నది. అయితే తగినంత నిడివి కల్పించటంకోసమా అన్నట్లు అనేక అనవసర, నిరాధార విషయాలతో నింపారు వ్యాసాన్ని.

దయచేసి గమనించండి. నేను వ్యాసం తీరుని తప్పుపట్టాను కాని వ్యాసకర్తకు యేమీ దురుద్దేశాలు ఆపాదించటం లేదు. అలాగా నాకు యే ఛానెల్ తోనూ యే సంబంధం లేదనీ, యెవరినీ వెనుకవేసుకురావటం నా ఉద్దేశం కాదనీ అర్థంచేసుకో గలరు.

kasi said...

నిజం , నేను వేరే దురుద్దేశ్యాలు లేవు. కాని ఆ వ్యాసం సమగ్రంగా లేదు. ఏదో దుషిస్తున్నట్టు ఉంది. వాళ్ళు ఎటువంటి వాళ్ళని తీసుకుంటున్నారో కాకుండా, వాళ్ళు చేసే పనులు ఎందుకు ఫెయిల్ అవుతున్నయో చెప్పి, వాటికి కారణాలు విశ్లేషిస్తే బాగుండేది. వ్యాసకర్త తన ఆగ్రహాన్ని వెల్లడించినట్టు తప్ప వేరే ఏమి కనపడటం లేదు.
Sorry If I am wrong.

bangarraju said...

thaks for commenting on upcoming channels, suggesting and one more thing i was really appreaciating you for free publicity

bangarraju said...

Half knowledged minds and knowledge less minds are never better than
knowledege nil brains.
This letterbelongs which type of brains no need to say specially..... Before posting a letter try to work on field.

evadaite enti said...

cvr లో విబేధాలు తారాస్తాయి కి చేరుకున్నాయి..అందరికి ఒకే రకమైన పోస్ట్లు ఇచారట..అంతకి ముందు ఔట్పుట్, ఇన్పుట్ అని విడదియగా..
ఇప్పుడు అందరికి న్యూస్ ఎడిటర్ పోస్ట్స్ గా మార్చారట ..శివప్రసాద్ అతని కి నచ్చిన వారిని abn నుంచి దిగుమతి చేసుకుని,
ఉన్నా employee లని ఏం చేతకాని వారిల చిత్రీకరించే ప్రయత్నం లో సక్సెస్ అయ్యాట్ట..ఇప్పటిదాకా
డెస్క్ లో ఇష్టారాజ్యం గా ఉన్నా ఇకపై నాదే రాజ్యం అని ప్రకటించాట్ట ..ఉండేవాళ్ళు ఉండండి..పోయేవాళ్ళు పొండి ఇది అక్కడి పెద్ద తలకాయల
స్లోగన్..ఎవరు ఎక్కడ ఏం మాట్లాడితే ఏమవుతుందో అని జైల్లో పక్షుల్ల కొలువులు చేస్తున్నారక్కడ..ఉస్సురంటు పోవడం రావడం చేస్తున్నరక్కడి
కూలీలు.
తులసి లో recruitement బెగిన్ అయింది కాకపోతే..ఇంకా ఎవరికీ confirm గా చెప్పతంలేదట..ఎవరు ఏ పోసిషన్ లో జాయిన్ అయినా
వాళ్లిచిన టీం తోనే పని చేయాలనేది వారి పాలసీ..
ఇక వామపక్షాల ఛానల్ లో resumes dropping మొదలైంది ...rtc కళ్యాణ మండపం ఎదురుగా ఈ దుకాణం తెరిచారు..
ఐ న్యూస్ లో మరో ఐరావతం జాయిన్ అయింది..ఉన్నా తలలకి మరో తోడూ..పాపం నరేంద్ర చౌదరి ఎవేరేం చెప్పిన నమ్మేస్తాడు..
టీవీ five లో స్టాఫ్ ని తిసేస్తూనే....ఉన్నారు..విజయకుమార్ దెబ్బకి మొత్తం 40 మంది టపా ...
మహా లో వికెట్స్ పడుతున్నాయ్...కానీ ఆ వికెట్లన్నీ హ్యాపీ..బయట శాలరీ ఇచే ఉద్యోగాలు వస్తున్నాయ్ కదా..న్యూస్ ఒక్కటే లైఫ్ కాదు..శాలరీ కూడా అందుకే...హ్యాపీ ....
ఇవ్వన్ని నిజాలు..కాదని చెప్తే అదో పెద్ద అబద్దం...ఈ న్యూస్ చాల ఇంకా స్పూఫ్ కావాలా?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి