Sunday, September 2, 2012

జయహో...నరేంద్రనాథ్ చౌదరి గారి దేశభక్తి-దైవభక్తి

రామోజీ రావు గారి పూర్తి ఆధీనంలో ఉన్నప్పుడు జాతక ఫలితాలు ప్రచురించడానికి కూడా 'ఈనాడు' ఆసక్తి చూపలేదు. శాస్త్రీయ దృక్కోణం తప్ప...దైవభక్తి లేని పరమ కమ్యూనిస్టు లాగా అనిపించేవారు ఆయన.ఎం.బీ.ఏ.చదువుకుని వచ్చిన ఆయన కుమారుడు కిరణ్ పగ్గాలు అందుకున్నాక...పరిస్థితి మారిపోయింది. కిరణ్ తిరుమల వేంకటేశుని భక్తుడు. ఆయన తరచూ గుండుతో కనిపించడాన్ని బట్టి తరచూ తిరుమలేశునికి నీలాలు సమర్పించుకునే అలవాటు ఉన్న వారిగా అనిపించే వారు. కిరణ్ ఎం.డీ.అయిన కొత్తల్లో...ఆ పత్రిక లో తిరుమల వార్తలు పెరిగాయన్నది ఒక పరిశీలన.
జనాల నాడి ఇట్టే పట్టేసే రామోజీ రావు గారు ఇలా జాతక ఫలితాలైనా ప్రచురించకూడదని చాదస్తంతో శాస్త్రీయ మడి కట్టుకు కూర్చుని...కృష్ణా రామా అనుకోవాల్సిన దశలో రామోజీ ఫిలిం సిటీలో కూర్చొని టీ వీ నైన్  ను ఎదుర్కోవడం ఎలా? అని జుట్టు పీక్కుంటున్న దశలో...నరేంద్ర నాథ్ చౌదరి (కింది ఫోటో) అనే రియల్టర్ దూసుకొచ్చారు....మీడియా రంగం లోకి. వచ్చీ రాగానే భక్తుల కోసం ఒక చానెల్ పెట్టారు...అదే "భక్తి  టీవీ." నారీలోక ఉద్ధరణ కోసం ఆయన 'వనిత' అనే చానెల్ ను కూడా ఆరంభించినా పెద్దగా లాభం లేకపోయింది. కాని భక్తి  అద్భుతంగా క్లిక్ అయ్యింది. నరేన్ జన్మ చరితార్థం అయ్యింది. 

రామోజీ గారికి తలలో పెద్ద మస్తిష్కం  లా పనిచేసిన వ్యక్తులను సలహాదార్లుగా పెట్టుకుని నరేంద్ర చౌదరి ఇప్పుడు మీడియా రంగంలో దూసుకుపోతున్నారు. ఆరంభంలో అంతు  చిక్కని రీతిలో టీవీ ఫైవ్ టీ  ఆర్ పీ రేటింగ్స్ లో ముందు ఉండేది. మరి ఏమయ్యిందో ఏమో కానీ..ఇప్పుడు ఎన్  టీవీ కి రేటింగ్స్ బాగా వస్తున్నాయి. దీన్ని బట్టి కేబుల్ ఆపరేటర్ల రూపంలో దేముడు నరేన్ ను కరుణించినట్లే మరి. భూములు-చానెల్స్-భక్తి -భగవత్ కటాక్షం-లాభాలు-మేళ్ళు. ఇదనుకుంటా ఫార్ములా. 

హే  భగవాన్....నేనెందుకు భక్తి  చానెల్ పెట్టలేదు? అని రామోజీ ఒక్క సారైనా బాధపడి ఉంటారని నా అంచనా. ఈ విషయంలో రామోజీ కన్నా నరేన్ జీ ఒక పది ఆకులు ఎక్కువ చదివినట్లే. భక్తి  టీవీ ఆదాయం అన్ని చానెల్స్ కన్నా మిన్నగా వున్నదని అక్కడి అంతర్గత సోర్సులు ఇచ్చిన సమాచారం. ఇప్పుడా చానెల్ ఆ గ్రూప్ నకు చెందిన ఇతర చానెల్స్ ను పోషించే పరిస్థితి కి వచ్చినట్లు చెబుతున్నారు. గరికపాటి నరసింహా రావు గారి వంటి వారి అద్భుత ప్రవచనాలు, కావ్య విశ్లేషణలతో ఈ చానెల్ జనరంజకంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి చానెల్ తో పోటీ పడి...ఒకొక్క సారి అంతకన్నా మెరుగైన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది భక్తి  చానెల్.

నా వరకు నేనైతే...నాసిరకం వార్తా కథనాలు చూడలేక కాలక్షేపానికి అటు టీ  టీ డీ వారి ఎస్.వీ.బీ.ఛానలో, భక్తి   ఛానలో చూస్తూ గడుపుతున్నాను. అది నా తల్లి దండ్రులకు కూడా ఎంతో  సంతోషం కలిగించే పని. ఎందుకంటె...ఆ చానల్సే వారూ ఆస్వాదిస్తారు. తెలుగు నేల  మీద పుట్టిన ప్రతి ఒక్కరూ....రోజుకు ఒక గంట పాటైనా ఈ రెండు చానెల్స్ చూడాలని నేను సిఫార్సు చేస్తాను. 

జీవిత పరమార్థాలను, ఆంధ్ర  సాహితీ మాధుర్యాన్ని తెలిపే ఎన్నో కార్యక్రమాలు వీటిలో వస్తున్నాయి. చాగంటి కోటేశ్వర రావు గారి ప్రసంగాలు వింటే మనసు తేలిక పడుతుంది. అటు గరికపాటి, ఇటు చాగంటి వార్లు సరస్వతీ పుత్రులు. ఆ ధారణా శక్తి, భక్తి  భావావేశం, భాషా చతురత, ఆంధ్ర సంస్కృతి పట్ల వారి అనురక్తి అనుపమానమైనవి. భక్తి  చానెల్ విజయం ఇచ్చిన కిక్కుతో ఆ మధ్యన నరేన్ చౌదరి గారు సాధు  సమ్మేళనం కూడా ఏర్పాటు చేసారు. ఇతర మతాలను కించ పరచకుండా...అన్ని మతాలనూ గౌరవిస్తూ...హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం...కులం మతం జన జీవితాలను శాసిస్తున్న ఈ లోకంలో అన్ని ప్రసార మాధ్యమాలు చేయాల్సిన పని. అదొక సత్కార్యం, తక్షణావసరం. కసి, కార్పణ్యం, చులకన భావం, ఈర్ష్య వంటి చెత్తను వదిలి మతాల మధ్య సయోధ్య సాధించడం అందరం చేయాల్సిన పని. 

అటు దైవ సేవలో తరిస్తున్న నరేన్ గారు ఇప్పుడు దేశభక్తి మీద పడ్డారు. అది కూడా శుభపరిణామమని అనుకోవడంలో తప్పులేదు.  జాతీయ గీతం పాడాలహో....అని ఊరూ వాడా ప్రచారం చేసే పనిలో పడ్డారు ఆయన. ఇది కచ్చితంగా...మా చావు తెలివితేటల రాజశేఖర్ ప్లాన్ అని నా గట్టి నమ్మకం. అన్నీ అబద్ధాలే చెబుతారు...జర్నలిజాన్ని బ్రష్టు  పట్టిస్తున్నారు...అన్న అపవాదులు ఎదుర్కుంటున్న వారంతా భక్తి  ప్రభావంతో మంచి మనుషులుగా (జర్నలిస్టులుగా) మారితే యెంత బాగుండు! Oh God, please bless them and bless their families.       

అంతా బాగానే ఉంది గానీ.... నరేన్ గారి దేశభక్తి రిపోర్టర్ల చావుకు వచ్చిందట. అయ్యా...ఈ దేశభక్తి ప్రచారం కోసం మీరు నిర్వహించే కార్యక్రమాల ఆర్ధిక భారాన్ని మీరు మీ రిపోర్టర్ల నెత్తిన పెడుతున్నట్లు  నాకు వచ్చిన సమాచారం. ఇలాంటి పాపపు పనులు మాని....చక్కగా భగవత్ సేవలో, దేశం సేవలో మీరు తరించి చరితార్ధులు కండి. పుణ్యాన్ని మూట కట్టుకోండి. దేవుడి దీవెనలతో ఒక పార్లమెంటు సీటు పొందండి, తప్పేమీ లేదు. విజయోస్తు.         

6 comments:

sarath said...

ఈనాడు ధోర్ణి గత పది సంవ్త్సర్రలుగా గాడి తప్పినా ఇప్పుడు తెలుగు వెలుగు, ఇంజనీరింగ్ కాలేజీలు మొదలైన్ అంశాలతో గత కొన్ని నెలలుగా ముదావహమైన పాత్రపోషిస్తూ ఉంది...ఇకపోతే ఈ కోణమ్లో చూసినప్పుడు ఈనాడు నిర్వహిస్తున్న పాత్రని భక్తి చనెల్ తో ముడి పెట్టడం సమంజసం కాదేమో ...రెండూ వేర్వేరు దారులు కదా ???

VENKATA SUBA RAO KAVURI said...

meeru inta chettanoo nettikettukogalarannamaata

Anonymous said...

తాము కొన్ని టాపిక్కుల్ని (అవి లౌకికంగా క్లిక్ అవ్వవు అనే ఒక వెఱ్ఱి దురభిప్రాయం మూలాన) నిర్లక్ష్యం చేసినంత మాత్రాన అవి జనరంజకం కాకుండా ఉండవు. ఇది వాళ్ళ business miscalculation మాత్రమే. ఉదాహరణకి - జ్యోతిష్కులకి బ్యాంకులు అప్పులివ్వవు. కానీ వాళ్ళ ఆదాయం ముందు సాఫ్టువేరువాళ్ళ ఆదాయం దేనికీ కొఱగానిదని చాలామందికి తెలుసు. అలాగే సంస్కృత అధ్యాపకులకు అవే బ్యాంకులు ఋణఱేకులు మంజూరు చేయవు. కానీ మన రాష్ట్రంలో గ్యారంటీ ఆదాయం ఉన్నది సంస్కృత అధ్యాపకులకేనని అందఱికీ తెలుసు. ఇదే మీడియాకీ వర్తిస్తుంది. భక్తా ? మఱొకటా ? అని కాదు. వెరైటీ గా ఎలాంటి ఛానళ్ళు పెట్టినా చూడ్డానికి జనం సిద్ధంగా ఉన్నారు. అంతమాత్రాన వాళ్ళు ఆ టాపిక్కులకి కట్టుబడిపోతారని అనుకోను.

VENKATA SUBA RAO KAVURI said...

అంతా బాగానే ఉంది గానీ.... నరేన్ గారి దేశభక్తి రిపోర్టర్ల చావుకు వచ్చిందట. అయ్యా...ఈ దేశభక్తి ప్రచారం కోసం మీరు నిర్వహించే కార్యక్రమాల ఆర్ధిక భారాన్ని మీరు మీ రిపోర్టర్ల నెత్తిన .... idee bhakti - rakti venakunna asalu sakti

యధార్ధవాది said...

టీవీ నైన్ ను ఎదుర్కోడానికి రామోజీ జుట్టు పీక్కున్నాడా? ఛ ...నిజంగా రామోజీయే తల్చుకుంటే టీవీనైన్ మట్టిగొట్టుకు పోయేది. తన పద్ధతిలోనే వార్తలు గానీ, మరేదైనాగానీ ఇచ్చి మెప్పించాలన్నది రామోజీ తత్వం.అది చాదస్తం అని కొందరు, చేతగాని తనమని కొందరు అనుకుంటే అనుకోవచ్చు గాక...ఆయన మారరు.

K V Ramana said...

Very true. SVBC and Bhakti are providing a nice break from the clutter. But, Bhakti is gradually becoming an extremely commercial channel...Less Bhakti More Money. For instance, take those 30-minute slots of those fortune tellers and colour stone sellers. I am told they pay Rs 20,000 per slot per day. I am sure the Bhakti team does not check the credentials of those Babas/Matajis as long as they pay that Rs 20,000.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి